pure drinking water
-
మీ పాలనకై వేచి చూస్తున్నం..
సాక్షి, గుంటూరు : గుప్పెడు మెతుకుల కోసం ఏ రోజుకారోజు కండలు కరిగించే పేదోడి గుండెకు జబ్బు చేస్తే నువ్వెందుకయ్యా విలవిలలాడిపోయావు. బక్కచిక్కినోళ్ల ఇళ్లలో భవిష్యత్ వెలుగు దీపమై ప్రకాశించాల్సిన బిడ్డల చదువులు మధ్యలో ఆగిపోతుంటే నువ్వెందుకయ్యా దిగులు పడ్డావుఅవ్వాతాతల ఆవేదనలు ఓ మూలన దీనంగా వినిపిస్తుంటే .. నీ గుండెపై ఎందుకయ్యా కన్నీటి తడి తెచ్చుకున్నావు. పాదయాత్ర ఆసాంతం.. ప్రతి అడుగులో బడుగుల ఆరని కన్నీళ్లు నిన్ను కదిలించాయా.. అప్పటి చంద్రబాబు పాలనలో దుర్భిక్ష పరిస్థితులు నిన్ను చలింపచేశాయా.. అందుకేనా.. ఆరోగ్యశ్రీ పథకంలో మనసున్న వైద్యుడిగా మారావు.. ఫీజు రీయింబర్స్మెంట్తో బిడ్డల జీవితాలకు ఉజ్వల దారులు పరిచావు. పింఛన్లతో అవ్వాతాతల బోసినవ్వులను దోసిటపట్టావు. సంక్షేమాన్ని పేదోళ్ల గుమ్మానికి తోరణంగా కట్టావు.. ఇన్ని చేసిన నిన్ను ఎవరూ మరిచిపోలేదయ్యా. ప్రజల నుంచి దూరమై ఏళ్లు గడుస్తున్నా ప్రతి గుండెచప్పుడులోనూ నిత్యం వినిపిస్తూనే ఉన్నావు. పేదోళ్ల ప్రతి మాటలోననూ కనిపిస్తూనే ఉన్నావు. నిర్మలమైన నీ రూపంతో ప్రతి గుండె గుడిలో దేవుడిలా కొలువై నిలిచిపోయావు. అందుకే గుంటూరు గుండె చప్పుడు ఎదురు చూస్తోంది మళ్లీ సంక్షేమ సారథివై వస్తావని.. జిల్లావాసుల సుదీర్ఘ స్వప్నమైన పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం వైఎస్ హయాంలో ప్రారంభమైంది. 2004లో జలయజ్ఞంలో భాగంగా జిల్లా పరిధిలోని బెల్లంకొండ మండలం పులిచింతల గ్రామం, నల్గొండ జిల్లాలోని మేళ్ళచెరువు గ్రామాల మధ్య పులిచింతల నిర్మాణ పనులు చేపట్టారు. 13.08 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించే ఉద్దేశంతో రూ.682 కోట్లతో ప్రాజెక్టు మంజూరైంది. ప్రాజెక్టు నిర్మాణం రూ.483.33 కోట్లతో పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణం పూర్తితో హెక్టారుకు 3.4 టన్నుల ఆహార ధాన్యాల అధిక ఉత్పత్తి అవుతుందని, తద్వారా రూ.808 కోట్ల నికర ఆదాయం పొందవచ్చని అంచనా. నాగార్జునసాగర్ కుడి కాల్వ పరిధిలో రూ.7.46 కోట్లతో కాల్వ ఆధునికీకరణ పనులు చేపట్టారు. కృష్ణా పశ్చిమ డెల్టాలకు దివంగత వైఎస్ఆర్ హయాంలో మహర్దశ పట్టింది. రెండు డెల్టాలకు రూ.4,444.41 కోట్లతో 604 కిలోమీటర్ల పొడవునా కాల్వల ఆధునీకరణ, 848 కొత్త బ్రిడ్జిల మంజూరయ్యాయి. జిల్లాలో 1,59,489 ఎకరాల ఆయకట్టుకు నీరందించటానికి 234 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు 483.27 కోట్లతో మంజూరైనా .. డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణంతో వాటిని పట్టించుకునే నాథుడు లేక నిలిచిపోయాయి. అడిగిన వెంటనే ఎత్తిపోతల వరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వినుకొండ ప్రాంతం అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. 2004లో తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వినుకొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో నూజెండ్ల మండలం ఉప్పలపాడు గ్రామస్తులు ముఖ్యమంత్రిని కలసి తమ గ్రామం గుండ్లకమ్మ నది ఒడ్డున ఉన్నప్పటికీ సాగు నీరు అందడం లేదని తెలిపారు. వైఎస్ వెంటనే స్పందించి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రూ.4.80 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు సభాస్థలిలోనే ప్రకటించారు. దీంతో చకచకా పథకం నిర్మాణం పూర్తయింది. 1050 ఎకరాలు మెట్ట భూములకు సాగు నీరు వచ్చింది. గతంలో రూ.50 వేలు ధర కూడాలేని భూములు ఇప్పుడు లక్షల రూపాయలు పలుకుతున్నాయి. ఆయన జ్ఞాపకార్థంగా గ్రామంలో వైఎస్ విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. గొంతు తడిపిన మహనీయుడు గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల, – గురజాల పట్టణ ప్రజల మంచినీటి కష్టాలను చూసి వైఎస్ చలించిపోయారు. గోవిందాపురం కృష్ణానది నుంచి రూ.36 కోట్ల వ్యయంతో పిడుగురాళ్ల పట్టణానికి మంచినీటిని అందించే రక్షిత మంచినీటి పథకాన్ని పూర్తి చేశారు. గురజాలకు సైతం బుగ్గవాగు నుంచి రూ.12 కోట్ల వ్యయంతో మంచినీటిని అందించారు.సత్తెనపల్లి పట్టణంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.14.5 కోట్లతో 120 ఎకరాల మంచినీటి చెరువును కొనుగోలు చేసి బాగు చేయించారు. మరో రూ.20 కోట్లతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు, ఓవర్హెడ్ ట్యాంకులను నిర్మించి రెండు పూటలా మంచినీరు అందించారు. -
మంచినీరే మహాభాగ్యం
విశ్లేషణ తెలంగాణలో పరిశుభ్రమైన మంచి నీటి వనరులు లేవు. భూగర్భ జలాలే ప్రధాన వనరు కావడం ఇందుకు కారణం. చాలా ప్రాంతాలలో చెరువుల ద్వారా లభించే ఉపరితల నీటి వనరులే ఇప్పటికి మంచివని తేలింది. ఫ్లోరైడ్ విషయం వరకు ఇది నిజమే. కానీ ఇలాంటి నీటిలో బాక్టీరియా సంబంధిత కాలుష్యం కలవర పరిచే స్థాయిలో ఉంది. నిజామాబాద్ జిల్లా జంగమపల్లె గ్రామంలో చేసిన ప్రయోగాల వల్ల ఇదే అంశం తేటతెల్లమైంది. నిజానికి బోర్వెల్ నీటితో ప్రజలు పెద్ద బెడదనే ఎదుర్కొంటున్నారు. మానవ మనుగడకు నీరు అత్యంతావశ్యకమని అందరికీ తెలుసు. కానీ మంచి ఆరోగ్యానికి పరిశుభ్రమైన తాగునీరు కూడా అంతే ఆవశ్యకమన్న వాస్త వాన్ని గుర్తించవలసి ఉంది. ఆ వాస్తవాన్ని ఆచరణలో పెట్టవలసిన తరుణ మిది. తాగునీరు బాక్టీరియా సంబంధిత కాలుష్యం లేనిదై ఉండాలి. తాగు నీటిలో ఫ్లోరైడ్, ఆర్సెనిక్ (పాషాణ సంబంధమైనవి) వంటి రసాయనాల శాతం తగుమాత్రంగానే ఉండాలి. తెలంగాణ జిల్లాల వరకు మంచినీటి సమ స్యకు అనేక కోణాలు ఉన్నాయి. కానీ ఆర్సెనిక్ ఇక్కడ తీవ్రమైన సమస్య కాక పోవచ్చు. కానీ ఫ్లోరైడ్ రాష్ట్రానికి గడ్డు సమస్యగానే పరిగణించాలి. కలవరా నికి గురి చేసే స్థాయిలో ఇక్కడి నీటిలో ఫ్లోరైడ్ కనిపిస్తున్నది. తేనీరు, వంటకు ఉపయోగించే నీరు, ఇతర పానీయాల ద్వారా; తాగునీటి కారణంగా అధిక శాతం ఫ్లోరైడ్ దేహంలో ప్రవేశించడం వల్ల మనుషులను జీవచ్ఛవాలను చేసే ఆ వ్యాధి సంక్రమిస్తుంది. పోషకాహార లోపం కూడా తన వంతు పాత్రను నిర్వహించి, ఫ్లోరోసిస్ విజృంభించడానికి ఆస్కారం కల్పిస్తున్నది. నిజానికి పశుపక్ష్యాదులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. భారతగడ్డ మీద ఫ్లోరోసిస్ తన విషపు గోళ్లను ఇప్పటికే ఎంత లోతుకు దింపేసిందో గణాంకాల ద్వారా చూస్తే గగుర్పాటు కలుగుతుంది. 21 రాష్ట్రాలకు చెందిన ఆరుకోట్ల అరవై లక్షల మంది భారతీయులు దీని కోరలకు అతి సమీపంగా ఉన్నారు. అరవై లక్షల మంది ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడి శరీరం శిథిలమై, ఎముకలు బలహీనమై మంచమెక్కారు. కాబట్టి భారతదేశానికి సంబంధించి ఫ్లోరోసిస్ వ్యాధి ప్రజారోగ్యానికి అతి పెద్ద బెడదలలో ఒకటిగా మారిపోయిందన్న మాట తిరుగులేని వాస్తవం. అలాగే తెలంగాణలో కూడా. ఫ్లోరోసిస్ గ్రామీణ తెలంగాణ పాలిట శాపంగా మారింది. అక్కడ పోషకాహార లోపం చాలా ఎక్కువ. అందుకే ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడుతున్న వారు ఎక్కువగా ఉంటున్నారు. రక్షిత మంచినీటి సరఫరా లేకపోవడం వల్ల బాక్టీరియా సంబంధిత కాలుష్యం ఉన్న నీటి వినియోగం కూడా అక్కడ ఎక్కువే. ఇది కూడా ప్రజారోగ్యానికి సమస్యగా పరిణమించింది. సురక్షితం కాని నీరు వినియోగించడం వల్ల ప్రజలు అతిసారం లేదా విరేచనాల బారిన పడుతున్నారు. ఈ బాధతో మృత్యువాత పడుతున్నవారు దేశంలో 8.1 శాతం ఉన్నారు. అంటే వ్యాధులతో మరణిస్తున్న భారతీయులలో దీని కారణంగా మరణిస్తున్నవారు మూడో స్థానంలో ఉన్నారు. ఇ. కొయిలీ గణన విధానం ద్వారా నీటి వనరులలో బాక్టీరియా సంబంధిత కాలుష్యాన్ని అంచనా వేయవచ్చు. నీటిలో ఫ్లోరైడ్ స్థాయిని గమనించడానికి కేంద్ర ప్రభుత్వం అందించిన ఒక విధానం ఉంది. ఇది నెట్లో దొరుకుతుంది. కొన్ని కొత్త సంగతులు తెలంగాణలో లభ్యమవుతున్న నీటి గురించిన కొన్ని మౌలిక సత్యాలను చర్చించుకోవాలి. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలలో వినియోగంలో ఉన్న నీరం తటా- ఎక్కువో, తక్కువో ఫ్లోరైడ్ ఉంది. జిల్లాలలో ప్రజలు ప్రస్తుతం వినియోగిస్తున్న నీటి నమూనాలు తీసుకుని అందులో ఫ్లోరైడ్ స్థాయిని ఇటీవల లెక్కించడం జరిగింది. ఇందుకోసం 10,368 నమూనాలు సేకరిం చారు. ఆదిలాబాద్ (297), కరీంనగర్ (1,322), ఖమ్మం (914), మహబూ బ్నగర్ (872), మెదక్ (616), నల్లగొండ (3,178), నిజామాబాద్ (203), రంగారెడ్డి (1,219), వరంగల్ (1,747) జిల్లాలలో అవసరం మేరకు వీటిని సేకరించారు. మంజీర, కృష్ణ, గోదావరి జలాలు నగరానికి అందుబాటులో ఉండడం వల్ల, వాన నీటి జలాశయాలు ఉన్నందువల్ల హైదరాబాద్ నగర పరిస్థితిని ఈ అధ్యయనంలో కలపలేదు. వీటిలో ఫ్లోరోసిస్ శాతాన్ని పార్ట్స్ పెర్ మిలియన్ (పీపీఎం) ప్రమాణంతో చూస్తారు. ఇది కనిష్టంగా 0.5 మించరాదు. కానీ ఈ పదివేల పైబడిన నమూనాలు వేటిలోనూ ఈ పీపీఎం 0.5 దగ్గర లేనేలేదు. అన్ని నమూనాలలోను కనిష్టంగా 1.51గా పీపీఎం నమోదైంది. ఆదిలాబాద్లో కనిష్టంగా 297 నమూనాలనే తీసుకున్నారు. ఆ సమస్యతో తీవ్రంగా బాధ పడుతున్న నల్లగొండ జిల్లా నుంచి సహజంగానే ఎక్కువ నమూనాలను సేకరించారు. అయితే విచిత్రంగా ఆదిలాబాద్ సమస్య నల్లగొండను మించి పోయిందని రూఢీ అయింది. తరువాత వరసగా రంగారెడ్డి, ఖమ్మం, మెదక్ జిల్లాలు తీవ్రత విషయంలో ముందు ఉన్నాయి. 1975లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాటి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) అధిపతి డాక్టర్ శ్రీకాంతయ్య ఆధ్వర్యంలో ఈ అంశం మీద గోష్టి ఏర్పాటయింది. అందులో కూడా పీపీఎం 0.5కు మించరాదనే నిర్ధారించారు. భారత ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన ప్రమాణమైనా ఒక శాతం పీపీఎం. కానీ, 1970లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫ్లోరోసిస్ మీద ప్రచురించిన పుస్తకం కోసం రాసిన వ్యాసంలో ప్రఖ్యాత వైద్యుడు, పరిశోధకుడు డాక్టర్ సిద్దికీ ఒక శాతం పీపీఎం ఉన్న నీటితో కూడా తీవ్ర పరిణామాలు ఎదురైన సంగతి తన అనుభవంలో ఉందని పేర్కొన్నారు. శీతల దేశం కాబట్టి మన పక్కనే ఉన్న చైనా పీపీఎం శాతాన్ని 0.7 వరకు భరించవచ్చునని లక్ష్మణరేఖ పెట్టుకుంది. మనది వేడి దేశం కాబట్టి 0.5 శాతం పీపీఎం మించరాదన్నదే ఎక్కువ మంది నిపుణుల అభిప్రాయం. పరిశుభ్రమైన నీటి వనరులు లేవు మొత్తానికి తేలేదేమిటంటే, తెలంగాణలో పరిశుభ్రమైన మంచి నీటి వనరులు లేవు. భూగర్భ జలాలే ప్రధాన వనరు కావడం ఇందుకు కారణం. చాలా ప్రాంతాలలో చెరువులు ద్వారా లభించే ఉపరితల నీటి వనరులే ఇప్పటికి మంచివని తేలింది. ఫ్లోరైడ్ విషయం వరకు ఇది నిజమే. కానీ ఇలాంటి నీటిలో బాక్టీరియా సంబంధిత కాలుష్యం కలవరపరిచే స్థాయిలో ఉంది. నిజామాబాద్ జిల్లా జంగమపల్లె గ్రామంలో చేసిన ప్రయోగాల వల్ల ఇదే అంశం తేటతెల్లమైంది. ఇక్కడ మూడు చెరువులు, మూడు దిగుడు బావులు, మూడు బోర్వెల్స్లోని భూగర్భ జలాలను పరీక్షించారు. వీటిలో ఫ్లోరైడ్ శాతం 0.56, 0.63, 0.26, 0.67 - ఇదే ప్రమాణాలలో కనిపించింది. ఒక బోర్వెల్ నీటిలో మాత్రం 1.39 ఫ్లోరైడ్ కనిపించింది. ఈ బోర్వెల్ నీరు తాగుతున్న ప్రజలకు ఆ వ్యాధి బెడద ఉంది. మొత్తంగా చూస్తే జంగమపల్లెలో ఈ సమస్య లేదు. నిజానికి బోర్వెల్ నీటితో ప్రజలు పెద్ద బెడదనే ఎదుర్కొంటున్నారు. ఒకే గ్రామంలో రెండు చోట్ల బోర్వెల్స్ నీటిని పరీక్షిస్తే ఫ్లోరైడ్ శాతం వేర్వేరుగా ఉంది. నల్లగొండ జిల్లా ఎల్లారెడ్డిగూడలో ఒక బోర్వెల్ నీటిలో 1.45 నుంచి 8.8 పీపీఎం కనిపించింది. ఇలాంటి చోట ఫ్లోరైడ్ శాతం తక్కువగా ఉన్న బోర్వెల్ నుంచి నీరు తాగడం తప్పనిసరి. ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటే తేనీటిని కూడా తీసుకోకపోవడం ఉత్తమం. కాబట్టి ప్రతి బావి దగ్గర ఫ్లోరైడ్ ఏ మేరకు ఉన్నదో తెలియచేసే బోర్డులు పెట్టి, ఆ మేరకు ప్రజలలో చైతన్యం తీసుకు రావలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఫ్లోరైడ్ ఉన్న నీటిని నేరుగా తీసుకుంటేనే ఫ్లోరోసిస్ వస్తుందనుకుంటే పొరపాటు. వంట కోసం ఉపయోగించినప్పటికీ సమస్య తప్పదు. ఏ విధంగా చూసినా భూగర్భ జలాలలో ఫ్లోరైడ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు అందుబాటులో ఉన్న కొన్ని నివారణ చర్యలను గురించి వెల్లడించడం అవసరం. కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ -సి చాలి నంతగా తీసుకుంటే సమస్య పరిష్కారమవుతుంది. అవసరమైన మేర కాల్షి యం తీసుకుంటే దేహంలో తిష్ట వేసిన ఫ్లోరైడ్ను తగ్గిస్తుంది. పెరిగే పిల్లల కోసం ఇది మరింత అవసరమని గుర్తించాలి. ఇక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని ఉదాహరణగా చెప్పాలి. ఈ సమస్యను తీవ్ర స్థాయిలో ఎదుర్కొంటున్న రాష్ట్రా లలో ఇదొకటి. కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ -సిలను ఉపయోగించడం వల్ల వ్యాధి తీవ్ర స్థాయిలో ఉన్న చిన్నారులు కూడా ఉపశమనం పొందగలి గారు. ఫ్లోరైడ్ బెడద లేని ఉపరితల నీటిని ప్రజలకు అందించాలని ఈ మధ్య ఆ రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం గమనించదగినది. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఎన్నో పథకాలు చేపడుతు న్నాయి. సంక్షేమం ఇదివరకటి కంటే కొత్త రూపాన్నీ, విస్తృతినీ సంతరించు కుంది కూడా. ప్రభుత్వాల దృష్టి ఇంత విశాలమైనప్పుడు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల ప్రజల జవజీవాలను తోడేస్తున్న ఈ సమస్య గురించి ఆలోచించక పోవడం మంచిది కాదు. నగరవాసులకైనా, గ్రామీణ ప్రాంతాలకైనా ఆరోగ్య భద్రత సమంగానే ఉండాలి. రక్షిత మంచినీరో, పరిశుభ్రమైన నీరో పట్టణా లకూ, నగరాలకూ పరిమితం చేయడం తీవ్ర సమస్యలకు దారి తీస్తుంది. జీవనదుల నుంచి ఈ ప్రాంతాలకు నీటిని సరఫరా చేయడమే సమస్య పరిష్కారానికి ఉన్న గొప్ప అవకాశం. వాన నీటిని పదిలం చేసే ప్రక్రియను ప్రోత్సహించడం మరొకటి. 1975 నుంచి తీవ్రతను చూపుతున్న ఈ వ్యాధిని నిరోధించడం ఉద్యమ ప్రాతిపదికన జరగాలి. నిరంతర పరిశోధన నేటి అవసరం. ఇందుకు ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయాలి. కొత్త నీటి ఒప్పందాలు జరుగుతున్నాయి. తెలంగాణ నేల సస్యశ్యామలమవుతుందని అంతా ఆశిస్తున్నారు. నేల పచ్చగా ఉండడంతో పాటు, ప్రజలు కూడా ఆరోగ్యంతో ఉండాలి. అప్పుడే సమగ్ర అభివృద్ధికి అర్థం. - డా.దేమె రాజారెడ్డి (వ్యాసకర్త ప్రముఖ వైద్యులు. ఫ్లోరోసిస్ పరిశోధకులు) 98480 18660 -
మా ఊరు మణిపూస
సంపూర్ణ మద్య నిషేధం అమలు వివేకానందుని బోధనలే స్ఫూర్తి పేద విద్యార్థులకు చదువు డొంకాడ ఆదర్శం పచ్చదనం కనువిందు చేస్తుంది. అది కోనసీమ కాదు. మద్యపాన నిషేధం అమలవుతోంది. అది గుజరాత్ కాదు. వేసిన పంట చక్కగా పండుతుంది. ఊరిపక్కన నది లేదు. అంతేనా... ఊరంతా పరిశుభ్రంగా ఉంటుంది. స్వచ్ఛమైన తాగునీరు అందుతోంది. అంతకుమించి ఒక్క మాటపై నిలబడుతుంది. పల్లె బాగుంటేనే దేశం బాగుంటుందని విశ్వసిస్తోంది. ఆదర్శ గ్రామంగా నిలుస్తోంది.... దాని పేరు డొంకాడ. యలమంచిలి/నక్కపల్లి రూరల్ : ఇంటినే కాదు... ఊరిని కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటామని నక్కపల్లి మండలం డొంకాడ గ్రామస్తులు సగర్వంగా చెబుతారు. పచ్చదనం, పరిశుభ్రతలోనే కాదు... అయిదేళ్లుగా మద్యపాన నిషేధాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. గ్రామం బాగుపడింది సరే.... మరి మీ బతుకు గురించి చెప్పండంటే... మాకేం..గతంలో ఎన్నడు లేని విధంగా వ్యవసాయం బాగుపడిందంటున్నారు గ్రామ అన్నదాతలు. గతంలో భూములన్నీ వర్షాధారమే. ఇప్పుడంతా వ్యవసాయ బోర్లతో సాగు చేస్తున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం మూడేళ్ల క్రితం గ్రామంలో బెల్టు దుకాణాలుండేవి. తరచూ గ్రామంలో గొడవలు జరిగేవి. దీంతో యువకులంతా గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని సంకల్పించారు. గ్రామ పెద్దలను సమావేశ పరచి బెల్టు దుకాణాల వేలం పాటను రద్దు చేయించారు. గ్రామంలో మద్యం విక్రయించకుండా, ఇతర ప్రాంతాలనుంచి తెచ్చుకుని సేవించకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టారు. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని సమీప గ్రామాలైన డీజీ కొత్తూరు, సీతానగరంలో కూడా మద్యపాన నిషేధాన్ని అమలు చేయడం విశేషం. ఫ్లోరైడ్ సమస్య నుంచి విముక్తి గ్రామంలో లభించే తాగునీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండటంతో గ్రామస్తులు తరచూ మోకాళ్ల నొప్పులు, జ్వరాలతో బాధపడేవారు. పిల్లలు అంగవైకల్యంతో పుడుతుండటంతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు నడుం బిగించారు. గ్రామస్తుల చందాలతో పాటు రామకృష్ట మఠం, విశాఖ డెయిరీ అందించిన సహకారంతో వివేకా జలం పేరుతో మినరల్ వాటర్ ప్లాంటును ఏర్పాటు చేసుకున్నారు. దీంతో గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారమైంది. ఊరంతా నందనవనం పచ్చదనంలో డొంకాడ కోనసీమను తలపిస్తోంది. గ్రామంలో కొబ్బరి, అరటి చెట్లతో పాటు రోడ్లు కిరువైపులా మొక్కలు నాటి పెంచుతున్నారు. దీంతో గ్రామమంతా పచ్చదనంతో కళకళలాడుతోంది. ఇక్కడి విద్యార్థులు, మహిళలు, పెద్దల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది. రోజూ వెంకటేశ్వరస్వామి ఆలయంలో విష్ణు సహస్ర నామ పారాయణం చేస్తుంటారు. దీంతో పాటు రామకృష్ణ పరమహంస ధ్యాన మందిరాన్ని నిర్మించుకుని ధ్యానం చేస్తుంటారు. ఈ మందిరం వద్ద ఆహ్లాదకరమైన రీతిలో ఉద్యానవనాలను ఏర్పాటు చేశారు. వ్యవసాయ బోర్లతో పంటల సాగు గతంలో వర్షాధారంపై రైతులు పంటలు పండించేవారు. వర్షాలు కురవకపోతే ఆర్థిక సమస్యలతో పాటు పశువులకు గ్రాసం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. దీంతో విశాఖ డెయిరీ 10మంది రైతులకు వ్యవసాయ బోర్లు ఏర్పాటు చేసి విద్యుత్ సౌకర్యం కల్పించింది. మరో 30 మంది వరకు గ్రామస్తులు సొంతంగా వ్యవసాయ బోర్లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో అన్ని రకాల కూరగాయలు, చెరకు, బొప్పాయి, అరటి, పశుగ్రాసం పెంపకంతో పచ్చగా కళకళలాడుతోంది. మండలంలోనే ఈ గ్రామం వ్యవసాయంలో ఆదర్శంగా నిలిచింది. వివేకానందుడే స్ఫూర్తి స్వామీ వివేకానందుని స్ఫూర్తితో యువకులు గ్రామాన్ని ముందుకు నడిపిస్తున్నారు. రామకృష్ణ మఠం పీఠాధిపతి సహకారంతో విద్యార్థులకు చేయూతనందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నగదాధర ప్రకల్ప పథకం ద్వారా 1వ తరగతి నుంచి 5 వరకు చదువుకుంటున్న 120 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.6 చొప్పున ఖర్చు చేస్తున్నారు. ఈ పథకం దేశంలోని 106 గ్రామాల్లో అమలవుతోంది. రాష్ట్రంలో అమలవుతున్న 4 గ్రామాల్లో డొంకాడ ఒకటి. ఇందుకోసం నెలకు రూ.35 వేలు ఖర్చు చేస్తున్నారు. రామకృష్ణ మఠం ద్వారా తుని, పాయకరావుపేటలలో చదువుకుంటున్న విద్యార్థినులకు రవాణా చార్జీలు చెల్లిస్తున్నారు. గ్రామంలో నిరుపేదలైన వృద్ధులకు సాయం చేసేందుకు యువకులంతా శ్రీ కృష్ణ అక్షయ పాత్ర పథకాన్ని రూపొందించారు. గ్రామంలో ప్రతీ ఇంటికి ఒక డబ్బా ఇస్తారు. ఈ డబ్బాలో ప్రతి కుటుంబం రోజూ ఒక రూపాయి, లేదా కొంత బియ్యాన్ని దానంగా వేస్తారు. చదువుకుంటున్న విద్యార్థులు వీటిని సేకరించి నెలకు 20 పేద కుటుంబాలకు 20 కేజీల బియ్యం, కొంత నగదు అందజేసి ఆదుకుంటున్నారు. పోలీసుస్టేషన్ వరకూ వెళ్లం గతంలో మా గ్రామం విద్య, వ్యవసాయ రంగాల్లో బాగా వెనుకబడి ఉండేది. తునికి చెందిన శర్మ ద్వారా రామకృష్ణ మఠం ఏర్పాటు చేశాం. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువకుల్లో చైతన్యం వచ్చింది. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని సంకల్పించాం. గ్రామంలో ఉత్సాహంగా ఉన్న 21 మందితో కమిటీ వేశాం. ఏ చిన్న తగాదా వచ్చినా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా గ్రామంలోనే పరిష్కరించుకుంటున్నాం. - చందిన వెంకటరమణ, డొంకాడ మద్య నిషేధంతో మార్పు గతంలో గ్రామంలో మద్యం బెల్టు దుకాణాలు నిర్వహించడం వల్ల మగవారంతా మద్యం సేవించేవారు. వ్యవసాయం, కూలి పనుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మద్యానికి ఖర్చు చేయడం వల్ల ఇబ్బందులు పడేవాళ్లం. గ్రామంలో మద్య నిషేధం విధించడంతో ఎంతో హాయిగా ఉంది. - అర్లంక అమ్మాజీ, డొంకాడ విద్యాభివృద్ధికి ప్రోత్సాహం గ్రామంలో విద్య వికాసానికి చర్యలు చేపట్టాం. చదువుకుంటున్న విద్యార్థులను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నాం. మంచి చదువులు చదివిన సుమారు 20 మంది వరకు ఉపాధ్యాయులుగా, రైల్వే శాఖలో స్థిరపడ్డారు. - రాజు, గ్రామస్తుడు, డొంకాడ వ్యవసాయంలో మా గ్రామం ఆదర్శం నాకు పొలం ఉన్నా నీరు లేక ఇబ్బం దులు పడేవాడిని. ప్రస్తుతం వ్యవసాయ బోరు వేయించడంతో మామి డి, కూరగాయలు, పండ్ల తోటలు, పశుగ్రాసం పెంచుతున్నాను. వ్యవసాయంలో మంచి లాభాలు వస్తున్నా యి. - ప్రగడ శివ, రైతు, డొంకాడ -
స్వచ్ఛత ఎక్కడ?
సాక్షి, నల్లగొండ : గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యం నీరు గారుతోంది. నీటి నాణ్యత, మలినాల పరిశీలన జరగడమే లేదు. పరీక్షకు ఉపయోగించే కిట్లు నామరూపాల్లేకుండా పోయాయి. రసాయనాలు మట్టిలో కలిసిపోయాయి. దీంతో గ్రామీణ ప్రజలకు కలుషిత నీరే దిక్కవుతోంది. గామీణులకు పరిశుభ్రమైన నీటిని సరఫరా చేయడం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇది మంచిదే అయినా ఆచరణకు నోచుకోకపోవడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. రెండేళ్లుగా గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో ప్రత్యేకాధికారులు నీటి సరఫరాను పట్టించుకోలేదు. ఫలితంగా గ్రామీణులకు అపరిశుభ్ర నీరే దిక్కవుతోంది. లక్ష్యం నీరుగార్చారు ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గ్రామ పంచాయతీల్లో నీటి పరీక్ష విధానాన్ని 2007లో ప్రవేశపెట్టారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తోంది. వర్షాకాలంలో నీరు ఎక్కువగా కలుషితమయ్యే అవకాశాలు ఉంటాయి. ఫలితంగా ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి ప్రతి గ్రామపంచాయతీకి గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో నీటి పరీక్ష కిట్లు, పరీక్ష కోసం అవసరమయ్యే ర సాయనాలు అందజేశారు. వీటి ద్వారా నీటి పరీక్షలు జరిపి స్వచ్ఛతను నిర్ధారించాల్సి ఉంటుంది. శుభ్రమైనవి అని తేలితేనే సదరు నీటిని ప్రజలకు సరఫరా చేయాల్సి ఉంది. దీనికి అవసరమయ్యే కిట్టు కోసం అప్పట్లో ప్రభుత్వం రూ.2,200 ఖర్చు చేసింది. ఆనవాళ్లే లేవు నీటి పరీక్షా విభాగం నిర్వహణ కోసం ప్రతి గ్రామం నుంచి ఓ అంగన్వాడీ కార్యకర్త, ఒక యువకుడు, పొదుపు సంఘం సభ్యురాలితో పాటు మరో ఇద్దరు గ్రామస్తులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. నీటి పరీక్షలు నిర్వహించే విధానంపై వీరికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. కమిటీ సభ్యులకు ప్రతి నెలా రూ.1,200 గౌరవ వేతనం అంద జేయాలని నిర్ణయించారు. కొంత కాలం పాటు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. పత్రి 10, 15 రోజులకు ఒకసారి నీటి పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత పరీక్షలు చేయడం మర్చిపోయారు. కిట్లు అటకెక్కాయి. ప్రస్తుతం సదరు కిట్ల, రసాయనాల ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. అధికారుల నిర్లక్షమే.. నీటి స్వచ్ఛత పరీక్షించే బాధ్యత ఆయా గ్రామ పంచాయతీలకే అప్పగించారు. కొన్నాళ్లు పరీక్షలు నామమాత్రంగా చేపట్టారు. రానురాను వీటికి స్వస్తి పలికారు. ప్రభుత్వం కిట్లు అందించే సమయంలో 100 సార్లు పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన రసాయనాలు కూడా ఇచ్చారు. ఆతర్వాత అవసరమయ్యే రసాయనాలను గ్రామ పంచాయతీ నిధులతో కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ ఏ ఒక్క గ్రామ పంచాయతీలోనూ ప్రస్తుతం నీటి స్వచ్ఛత పరీక్షలు జరగడం లేదు. రెండేళ్లుగా గ్రామ పంచాయతీలకు కార్యవర్గాలు లేకపోవడం, ప్రత్యేకాధికారులు పట్టించుకోకపోవడంతో పరీక్షలు కాలగర్భంలో కలిసిపోయాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వర్షాలకు నీరు కలుషితమయ్యే అవకాశం ఉంది. కలుషిత నీరే తాగితే ప్రజలకు వాంతులు, విరేచనాలు, కలరా వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఇటీవలే పల్లెలో కొత్త పాలకవర్గాలు కొలువుదీరా యి. అధికారులు మేల్కొని నీటి పరీ క్ష విధానాన్ని పునఃప్రారంభిం చాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. తమను రోగాల బారి నుం చి కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.