పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్
ఐడియా-1 ఫైనల్ లిస్ట్
టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సారథ్యంలో ‘సాక్షి’ మీడియా గ్రూప్ నిర్వహించిన డైరెక్టర్స్ హంట్ - సూపర్ డూపర్ హిట్... ఎక్స్లెంట్ రెస్పాన్స్!
ఒక్కటి కాదు.. రెండు కాదు.. 1300కు పైగా షార్ట్ ఫిల్మ్‌ల వెల్లువ!
వడపోతకే చాలా టైమ్ పట్టింది. ఇప్పుడు కథ క్లైమాక్స్‌కి చేరింది.
రోజుకో ఐడియా చొప్పున పూరి జగన్నాథ్ 10 ఐడియాలు చెప్పారు.
ఒక్కో ఐడియాకు ఒక్కో సినీ ప్రముఖుడు జ్యూరీగా వ్యవహరించారు.
చాలా నిష్పక్షపాతంగా ఎంట్రీల పరిశీలన, ఫైనల్ లిస్ట్ ఎంపిక జరిగింది.
ఒక్కో ఐడియా నుంచి ముగ్గుర్ని ఫైనల్ లిస్ట్ చేశారు. ఈ ఫైనల్ లిస్ట్ నుంచి ఒక్కో ఐడియాకు ఒక్కో విజేతను ఎంపిక చేసే బాధ్యత పూరి జగన్నాథ్‌దే. ఆ విజే తల ఎంపిక కూడా త్వరలోనే ఉంటుంది.
ఈ రోజు ఐడియా నం.1కు సంబంధించి ఫైనల్ లిస్ట్‌ను జ్యూరీ మెంబర్‌గా వ్యవహరించిన ప్రముఖ దర్శకుడు పి. సునీల్‌కుమార్‌రెడ్డి వెల్లడిస్తున్నారు.
‘‘మన చుట్టూ ప్రపంచంలో బోలెడంత మంది ప్రతిభావంతులున్నారు. వాళ్లను వెలికి తీయడం కోసం చేసిన ఈ ప్రయత్నం చాలా బాగుంది.పూరి ఐడియా నం.1గా ఇచ్చిన స్టోరీ బాగుంది. ఆ స్టోరీకనుగుణంగా చాలామంది చాలా రకాలుగా షార్ట్ ఫిల్మ్స్ తీసి పంపించారు. స్క్రీన్‌ప్లే బాగా చేశారు. టెక్నాలజీని బాగా ఉపయోగించారు. ఫ్రెష్‌నెస్ ఉన్న ఆర్టిస్టులు కనబడ్డారు. వాటి నుంచి ఫైనల్ లిస్ట్‌గా మూడు లఘు చిత్రాలను ఎంపిక చేయడం చాలా కష్టమైంది. ఆ మూడింటితో పాటు, మరో రెండింటిని స్పెషల్ కేటగిరీ కింద ఎంపిక చేశాను. వీరిలో విజేతగా ఎవరు నిలు స్తారో నేను కూడా ఎదురు చూస్తున్నా’’.
- పి. సునీల్‌కుమార్ రెడ్డి