పౌండ్...'టూ మినిట్ మిస్టరీ క్రాష్'
బ్రెగ్జిట్ ఉదంతం బ్రిటిష్ కరెన్సీని పట్టి పీడిస్తోంది. మార్చిలోగా యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగనున్నట్లు బ్రిటీష్ ప్రధాని ప్రకటించిన (బ్రెక్సిట్) నేపథ్యంలో శుక్రవారం పౌండ్ అనూహ్య పరిస్థితుల్లో భారీ పతనం కావడంతో మార్కెట్లో మదుపర్లు తీవ్ర గందరగోళం పడిపోయారు. కేవలం రెండే రెండు నిమిషాల్లో రికార్డ్ స్థాయి పతనాన్ని నమోదుచేసింది. అమెరికన్ డాలరుతో మారకంలో ఒక దశలో 6 శాతం క్షీణించింది. ఇటీవల భారీగా పతనమైన నాలగవ ముఖ్యమైన కరెన్సీగా ఉన్న పౌండ్ ఈ రోజు మరోసారి 31 ఏళ్లలోనే కష్టాన్ని తాకింది. అయితే ఈ పతనానికి ట్రేడర్ల పొరపాటే కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషించాయి. ఇట వజ్ ఔట్ ఆఫ్ ప్రపోర్షన్ అని సిడ్నీ రోచ్ఫోర్డ్ కాపిటల్ ఎనలిస్ట్ ముంఫోర్డ్ చెప్పారు. బ్రెగ్జిట్ ఉదంతం తర్వాత్ స్టెర్లింగ్ పౌండ్ భారీ పతనమని, ఇది అత్యంత నాటకీమ పరిణామమని, దీన్ని ఎవరూ ఊహించలేదని సింగపూర్ సీనియర్ మార్కెట్ విశ్లేషకుడు మాట్ సింప్సన్ వ్యాఖ్యానించారు.
సాధారణంగా ఆసియా మార్కెట్ సమయంలో స్టెర్లింగ్ లో వాల్యూమ్స్ ఆ తక్కువగా ఉంటాయనీ, కానీ అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలున్నప్పటికీ శుక్రవారం ధరల తుఫాను షాకిచ్చిందన్నారు. ఈ పరిణామంతో పౌండ్ విలువ 1.25 , 1.20 డాలర్ల స్థాయిలో కొందరు వ్యాపారులు మునిగిపోయారన్నారు.
కాగా యూరప్ మార్కెట్లు భారత మార్కెట్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి.