Putta Sudhakaryadav
-
ఎలక్షన్ అయిపోనీ.. మీ అంతుచూస్తా!
సాక్షి ప్రతినిధి కడప : ‘ఎంతరా.. మీ బ్రతుకులు.. ఎలెక్షన్ అయిపోనీ మీ అంతుచూస్తా. కొడుకుల్లారా మీ నాయన ఎట్లా బ్రతుకుతాడో చూడు. తలలేస్తుంది. మా వద్ద పనులు చేయించుకుని పార్టీ మారుతారా.. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. ఎట్లా బ్రతుకుతారో చూస్తా. లం..కొడుకుల్లారా’.. అంటూ వైఎస్సార్ జిల్లా మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్ తనయుడు మహేష్ యాదవ్ స్థానిక వైఎస్సార్సీపీ నేతపై రెచ్చిపోయారు. బి.మఠం మండల నాయకుడు మేకల రత్నకుమార్ యాదవ్ కుమారుడు బాలకృష్ణ యాదవ్‌కు గురువారం సా.3.30 గంటలకు 91004 92938 ఫోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్‌చేసి హాలో అంటుండగానే.. ‘ఎంతరా.. మీ బ్రతుకులు, ఎలెక్షన్ అయిపోనీ మీ అంతుచూస్తా.. మీ నాయన ఎట్లా బ్రతుకుతాడో చూస్తా, తలలేస్తుంది.. కొడుకుల్లారా’.. అంటూ తిట్లదండకం అందుకున్నారు. ఎవ్వరూ మాట్లాడేది, మర్యాదగా మాట్లాడండంటూ బాలకృష్ణయాదవ్ చెబుతున్నప్పటికీ మరింత రెచ్చిపోయినా మహేష్.. ‘ఐదేళ్లు మా వద్ద పనులు చేయించుకుని పార్టీ మారుతార్రా.. వచ్చేదీ తెలుగుదేశం ప్రభుత్వమే. కొడుకుల్లారా తిన్నదంతా కక్కిస్తా. ఎలా బ్రతుకుతారో చూస్తా. లం..కొడుకుల్లారా’.. అంటూ అసభ్య పదజాలంతో నోటికొచ్చినట్లు బండ బూతులు మాట్లాడారు. ఇందుకు బాలకృష్ణ స్పందిస్తూ.. ‘రేయ్ మర్యాదగా మాట్లాడు అనగానే, ‘బోసుడికే చెప్పేది వినూ.. మీ నాన్న తిన్న డబ్బుంతా కక్కిస్తా. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే. మీరు యాదవ్‌కు పుట్టారా.. రెడ్డికి పుట్టారా.. లం.. కొడుకుల్లారా ఉండండీ’.. అంటూ ఫోన్ కట్ చేశాడు. వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ మహేష్‌యాదవ్ బూతు పురాణం వ్యవహారం సాయంత్రం నుంచి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. బాలకృష్ణ ఇటీవల వైఎస్సార్సీపీలో చేరినందునే మహేష్‌యాదవ్ అధికారం అండతో నోటికొచ్చినట్లు మాట్లాడి తన అక్కసు తీర్చుకున్నట్లు తెలుస్తోంది. పైగా సామాజికవర్గాలను ప్రస్తావిస్తూ, ఎవ్వరికీ పుట్టారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. బీసీని కావడంవల్లే: మేకల రత్నకుమార్ తాము బీసీ కావడంవల్లే మహేష్ తన కుమారుడికి ఫోన్‌చేసి నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడారని మేకల రత్నకుమార్ యాదవ్ తెలిపారు. తనతో పాటు ఎంతోమంది పార్టీ మారిన వారున్నారని.. మమ్మల్ని మాత్రమే టార్గెట్ చేయడానికి కారణం వెనుకబడిన వర్గాలకు చెందిన వారం కావడమేనని ఆయన వాపోయారు. టీడీపీ బి.మఠం మండల కన్వీనర్‌గా ఉన్న తాను 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన పుట్టా సుధాకర్‌యాదవ్ కోసం ఎంతో కృషిచేశానన్నారు. పార్టీలో నియంతృత్వ పోకడలు, ఏకపక్ష నిర్ణయాలు, విచ్చలవిడి అవినీతి కారణంగానే తాను వైఎస్సార్సీపీలో చేరానన్నారు. ‘నాకిష్టమొచ్చిన పార్టీకి మద్దతిస్తానని.. అంతమాత్రానా నన్ను నా కుటుంబాన్ని దూషిస్తారా’ అని రత్నకుమార్ వాపోయారు. -
టీడీపీ ఇన్చార్జి పుట్టాకు పెద్ద షాక్..!
సాక్షి, చాపాడు : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మైదుకూరు టీడీపీ ఇన్ఛార్జీ పుట్టా సుధాకర్‌యాదవ్‌ను ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా వీడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఊహించని పెద్ద షాక్ తగిలింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన మండల టీడీపీ నాయకుడు వెంకటసుబ్బయ్య అనుచరగణంతో సోమవారం ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కోసం పని చేసి మెజార్టీ ఓట్లు తెప్పించిన నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది.మండలంలోని నక్కలదిన్నె పంచాయతీలోని తిప్పిరెడ్డిపల్లెకు చెందిన మల్లెం వెంకటసుబ్బయ్య యాదవ్‌తో పాటు 80 కుటుంబాలకు చెందిన టీడీపీ వర్గీయులు ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువాలను వేసిన వెంకటసుబ్బయ్య వర్గీయులను ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. వెంకటసుబ్బయ్యతో పాటు చిన్న ఎల్లయ్య, గంగరాజు, పామిడి రామసిద్దయ్య, కొండయ్య, ఓబయ్య, సి, విజయుడు, బిర్రు ఆంజనేయులుతో 80 కుటుంబాలకు చెందిన టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీలో చేరారు. 2014 ఎన్నికలకు ముందు రాజకీయాల్లో వచ్చిన పుట్టా సుధాకర్‌యాదవ్ తమ సామాజిక వర్గానికి చెందిన వాడనే అభిమానంలో రఘురామిరెడ్డిని కాదని టీడీపీలో చేరారు. ఎన్నికల సమయంలో వెంకటసుబ్బయ్యపై దాడులు కూడా జరిగాయి. ఎన్నికల్లో చిన్న గ్రామమైన తిప్పిరెడ్డిపల్లె టీడీపీకి మెజార్టీ ఓట్లు తెప్పించారు. అనుచరులతో కలిసి టీడీపీలో చేరడాన్ని పుట్టా వర్గం జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిసింది. రెండేళ్లుగా అవమానాలు భరిస్తూ వచ్చానని ఇక విలువల్లేని పుట్టా వద్ద వద్దనుకుని వైఎస్సార్సీపీలో చేరినట్లు వెంటకసుబ్బయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ఎంపీపీ వెంకటలక్షమ్మ భర్త లక్షుమయ్య, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి, నాయకులు రామచంద్రయ్య, సీవీ సుబ్బారెడ్డి, జయరామిరెడ్డి, రాజు, మురళీ, కిట్టయ్య, రమణారెడ్డి, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. -
అది డబ్బులిచ్చి చేయించుకున్న సర్వే
ఆంధ్రజ్యోతి సర్వేపై టీడీపీ నేత పుట్టా సుధాకర్‌యాదవ్ వ్యాఖ్యలు అన్నవరం(చాపాడు): రెండు రోజుల క్రితం ఆంధ్రజ్యోతి పత్రిక ఫ్లాష్ టీం సర్వే పేరుతో దొంగ సర్వేలను ప్రచురించిందని వైఎస్సార్ జిల్లా టీడీపీ సీనియర్ నేత పుట్టా సుధాకర్ యాదవ్ మండిపడ్డారు. బుధవారం మైదుకూరు నియోజకవర్గం అన్నవరం గ్రామంలో జన చైతన్య యాత్ర లో ప్రజలతో మాట్లాడుతూ డబ్బులు తీసుకుని సర్వేల పేరుతో తప్పుడు నివేదికలను ప్రచురించారన్నారు. ఆ పత్రికలో ప్రచురితమైన తప్పుడు సర్వేలను ప్రజలెవ్వరూ నమ్మెద్దని సూచించారు.