PVC card
-
ఒరిజినల్ ఆధార్ పీవీసీ కార్డు.. ఇంటికే కావాలంటే ఇలా చేయండి..
Aadhar PVC Card: ఆధార్ కార్డ్ అనేది ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. ఇటువంటి మీ ఆధార్ కార్డ్ పోయినా లేదా పాడైనా అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఆధార్ పీవీసీ కార్డ్‌ని ఆర్డర్ చేయవచ్చు. కేవలం రూ. 50 రుసుము చెల్లించి యూఐడీఏఐ (UIDAI) అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ కార్డ్‌ని ఆర్డర్ చేయవచ్చు. పీవీసీ కార్డ్‌లను పాలీ వినైల్ క్లోరైడ్‌తో తయారు చేస్తారు. అందుకే వీటిని పీవీసీ కార్డ్‌లు అంటారు. ఇది ఒక రకమైన ప్లాస్టిక్ కార్డ్. దీనిపై ఆధార్ కార్డ్ సమాచారంతా ముద్రిస్తారు. యూఐడీఏఐ ప్రకారం.. ఈ కార్డ్ సురక్షిత క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్, మైక్రో టెక్స్ట్, జారీ చేసిన తేదీ, కార్డ్ ప్రింటింగ్ తేదీ తదితర సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఆధార్ పీవీసీ కార్డ్‌ని ఆర్డర్ చేయండిలా.. యూఐడీఏఐ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. యూఐడీఏఐ వెబ్సైట్లో, మీ 12-అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి తర్వాత సెక్యూరిటీ కోడ్ లేదా క్యాప్చాను ఎంటర్ చేయండి ఓటీపీ కోసం ‘Send OTP’పై క్లిక్ చేయండి. తర్వాత రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ చేయండి అనంతరం 'మై ఆధార్' విభాగానికి వెళ్లి, 'ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్'పై క్లిక్ చేయాలి. తర్వాత మీ ఆధార్ వివరాలు కనిపిస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అనంతరం పేమెంట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. క్రెడిట్/డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఆప్షన్లు వస్తాయి. దీని తర్వాత పేమెంట్ పేజీకి వెళ్తారు. అక్కడ రూ. 50 రుసుము డిపాజిట్ చేయాలి. చెల్లింపును పూర్తి చేసిన తర్వాత మీ ఆధార్ పీవీసీ కార్డ్ కోసం ఆర్డర్ ప్రక్రియ పూర్తవుతుంది. మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత యూఐడీఏఐ ఆధార్‌ను ప్రింట్ చేసి ఐదు రోజుల్లోగా ఇండియా పోస్ట్‌కి అందజేస్తుంది. పోస్టల్ శాఖ స్పీడ్ పోస్ట్ ద్వారా మీ ఇంటికి ఆధార్ పీవీసీ కార్డును డెలివరీ చేస్తుంది. -
ఆధార్ కార్డు యూజర్లకు అలర్ట్.. ఇక ఈ ఆధార్ కార్డులు చెల్లవు?
ఆధార్ కార్డు వినియోగదారులకు యుఐడీఏఐ భారీ షాక్ ఇచ్చింది. భద్రత రక్షణలు లేకపోవడం వల్ల బహిరంగ మార్కెట్లో తయారు చేస్తున్న పీవీసీ ఆధార్ కాపీలను ఉపయోగించడాన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఏఐ) నిషేదించింది. బయటి మార్కెట్లో తయారు చేస్తున్న నకిలీ పీవీసీ కార్డులను ఉపయోగించడం మంచిది కాదని పేర్కొంది. అలాంటి పీవీసీ కార్డ్‌లు ఎలాంటి సెక్యూరిటీ లేదా సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉండవని తెలిపింది. కాబట్టి మీరు ప్రింటెడ్ పీవీసీ ఆధార్ కార్డ్‌ని తీసుకోకండి. అలాగే, పీవీసీ ఆధార్ కార్డు కావాలంటే రూ.50 చెల్లించి ప్రభుత్వ ఆధార్ ఏజెన్సీ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చని యూఐడీఏఐ ట్వీట్లో పేర్కొంది. ఆర్డర్ కోసం ఒక లింక్ కూడా యుఐడీఏఐ ట్విటర్ వేదికగా షేర్ చేసింది. #AadhaarEssentials We strongly discourage the use of PVC Aadhaar copies from the open market as they do not carry any security features. You may order Aadhaar PVC Card by paying Rs 50/-(inclusive of GST & Speed post charges). To place your order click on:https://t.co/AekiDvNKUm pic.twitter.com/Kye1TJ4c7n — Aadhaar (@UIDAI) January 18, 2022 ఆధార్ పీవీసీ కార్డు అంటే ఏమిటి? పీవీసీ ఆధారిత ఆధార్ కార్డు అనేక భద్రతలతో కూడిన ఫోటోగ్రాఫ్, డెమోగ్రాఫిక్ వివరాలతో డిజిటల్‌గా సంతకం చేసిన సురక్షిత క్యూఆర్ కోడ్ కలిగి ఉంటుంది. ఈ కార్డు ఏటీఎం కార్డు పరిమాణంలో ఉంటుంది. దీనిన్ నీటిలో వేసిన కూడా తడవదు. ఆధార్ పీవీసీ కార్డును మీరు పేర్కొన్న చిరునామాకు ఫాస్ట్ పోస్ట్ ద్వారా సరఫరా చేస్తుంది. పీవీసీ ఆధార్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి? యూఐడీఏఐ వెబ్సైట్(https://myaadhaar.uidai.gov.in/) ఓపెన్ చేసి అందులో లాగిన్ అవ్వండి 'ఆర్డర్ ది పీవీసీ కార్డ్'పై క్లిక్ చేయాలి. అక్కడ మీకు మీ వివరాలు కనిపిస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. ఆధార్ కార్డులో ఉన్న అడ్రెస్‌కు పీవీసీ కార్డు వచ్చేస్తుంది. (చదవండి: అయ్యో పాపం! రెండేళ్ల బాలుడికి ప్రపంచంలోనే అరుదైన వ్యాది) -
ఏటీఎం కార్డు లాంటి ఆధార్.. అప్లై ఇలా!
ఆధార్ కార్డుకు కొత్త రూపునిస్తోంది యూఐడీఏఐ. 2021లో సరికొత్తగా పీవీసీ ఆధార్‌ను ప్రవేశపెట్టింది. ఇది వరకు ప్రింట్ వెర్షన్లో 'పేపర్' ఆధార్ కార్డు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇకపై ఏటీఎం కార్డుల మాదిరిగా పీవీసీ ఆధార్లను జారీ చేయనుంది. కేవలం రూ.50 చెల్లించి ఈ పీవీసీ కార్డును పొందవచ్చు. కార్డులో పేర్కొన్న ఇంటి వద్దకే పీవీసీ ఆధార్ కార్డును డెలివరీ చేయనుంది. అయితే, దానికోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. (చదవండి: గూగుల్ పేలో ఆ సేవలు కష్టమే..!) పీవీసీ ఆధార్ కోసం ఎలా దరఖాస్తు చేయాలో చూద్దాం. యూఐడీఏఐ వెబ్సైట్(https://myaadhaar.uidai.gov.in/)కి వెళ్లి లాగిన్ అవ్వండి 'ఆర్డర్ ది పీవీసీ కార్డ్'పై క్లిక్ చేయాలి. అక్కడ మీకు మీ వివరాలు కనిపిస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. ఆధార్ కార్డులో ఉన్న అడ్రెస్‌కు పీవీసీ కార్డు వచ్చేస్తుంది. -
మీ ఆధార్ కార్డ్ పోయిందా..అయితే ఇలా చేయండి!
మన దేశంలో ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఇప్పుడు ఆధార్ కార్డు కలిగి ఉండాల్సిందే. చిన్న పిల్లవాడి నుంచి 60 ఏళ్ల వృద్ధుడి వరకు ప్రతి ఒక్కరికీ ఆధార్ తో అవసరం చాలా ఉంటుంది. కరోనా టెస్ట్ చేయించుకోవాలన్న, చివరికి వ్యాక్సినేషన్ వేయించుకోవాలన్నఆధార్ నెంబర్ ను ప్రధానంగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ సైతం ప్రజల సౌలభ్యం కొరకు అనేక రకాల ఆధార్ సేవలను చాలా సులభతరం చేసింది. అయితే, అలాంటి ఆధార్ కార్డు పోతే ఎలా? ఇలాంటి సమయంలో మీరు ఏమి చింతించాల్సిన అవసరం లేదు. యూఐడీఏఐ అధికారిక పోర్టల్ నుంచి మీరు పీవీసీ లేదా ప్లాస్టిక్ ఆధార్ కార్డును ఆర్డర్ చేసుకోవచ్చు. పీవీసీ ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి ఇలా: మొదట https://uidai.gov.in/ వెబ్సైట్లోకి వెళ్లి My Aadharపై క్లిక్ చేయండి. గెట్ ఆధార్ సెక్షన్ మీద ట్యాప్ చేసి Order - Aadhar PVC Card అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్ కార్డ్ నెంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్, ఆధార్‌తో లింకైన మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ కు వచ్చిన ఓటీపీని కూడా నమోదు చేయాలి. ఆపై కార్డులోని వివరాలను సరిచూసుకుని కార్డు కోసం రూ.50 డెబిట్/క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. ఆ తర్వాత మీకు వచ్చే ఎస్ఆర్ఎన్ నెంబర్ సేవ్ చేసుకోండి. ఆర్డర్ చేసిన రెండు వారాల తర్వాత మీకు కొత్త పీవీసీ ఆధార్ కార్డు ఇంటికి వస్తుంది. -
ఆధార్ యూజర్లకు షాక్.. 2 సేవలు నిలిపివేత!
ఆధార్ యూజర్లకు యుఐడీఏఐ షాక్ ఇచ్చింది. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఏఐ) చిరునామా ధ్రువీకరణ ప్రక్రియను, డాక్యుమెంట్ల పునఃముద్రణకు సంబంధించిన రెండు సేవలను నిలిపివేసినట్లు తెలిపింది. యుఐడీఏఐ పోస్టల్ చిరునామా ధ్రువీకరణ లేఖ ద్వారా ఆధార్ కార్డులో వివరాలను అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని నిలిపివేసింది. యుఐడీఏఐ ఇచ్చిన సమాచారం ప్రకారం తదుపరి ఆర్డర్లు వచ్చే వరకు అడ్రస్ వాలిడేషన్ లెటర్ సదుపాయాన్ని నిలిపివేసింది. అడ్రస్ వాలిడేషన్ లెటర్ ఆప్షన్ తొలగించడం వల్ల అద్దెకు ఉంటున్న వారిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే ఎలాంటి డాక్యుమెంట్లు లేని వారు కూడా ఇకపై అడ్రస్ మార్చుకోవడం ఇక కష్టం కావొచ్చు. అలాగే, యుఐడీఏఐ పాత కార్డును రి ప్రింట్ చేసే అవకాశాన్ని నిలిపివేసింది. ఇంతకు ముందు కార్డుదారులు అసలు కార్డును కోల్పోతే పాత ఆధార్ కార్డును తిరిగి ముద్రించుకునే అవకాశం ఉంది. లైవ్ హిందుస్థాన్ ప్రకారం ఈ సేవలు ఇప్పుడు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇటీవల, ట్విట్టర్ లో ఒక వ్యక్తి ఆధార్ కార్డు రీప్రింట్, అడ్రస్ వాలిడేషన్ లెటర్ గురించి ఆధార్ కార్డు హెల్ప్ లైన్ ను అడిగాడు. దీనికి, హెల్ప్ సెంటర్ నుంచి సర్వీస్ అందుబాటులో లేదని సమాధానం వచ్చింది. ఆధార్ కార్డు రీప్రింట్ స్థానంలో పీవీసీ కార్డును పొందవచ్చు. ఇది ఏటీఎం పరిమాణంలో ఉంటుంది. -
ఆరు నెలలుగా కమిషనర్ పోస్టు ఖాళీ
- ఐదు బాధ్యతలకు ఒకే జేటీసీ - ఖాళీల భర్తీకి డీపీసీ ఊసే లేదు - వాహనదారుల ఫిర్యాదులను పట్టించుకునేవారే ఉండరు - అస్తవ్యస్తంగా రవాణా కార్యాలయాలు సాక్షి, హైదరాబాద్: అక్కడ లైసెన్సులకు వాడే పీవీసీ కార్డుల కొరత ఉంటుంది.. కొత్తగా ఏర్పడ్డ జిల్లా కేంద్రాల్లో పూర్తిస్థాయి రవాణా కార్యాలయాలు రూపుదిద్దుకోలేదు.. ఆరేళ్ల క్రితం కొన్న కంప్యూటర్లు తరచూ మోరాయి స్తుంటాయి.. తరచూ సర్వర్ సమస్యలు.. ఒకేచోట ఏళ్లపాటు పాత కుపోయిన సిబ్బం దిపై అవినీతి ఆరోపణలు.. ప్రస్తుతం రవాణా శాఖలో నెలకొన్న అస్తవ్యస్తం ఇది. ఈ సమస్యలను ఎప్పటి కప్పుడు చక్కదిద్దాల్సిన కమిషనర్ పోస్టు ఆరు నెలలుగా ఖాళీగా ఉంది. ఇటీవల సీనియర్ జేటీసీ పదవీ విర మణ చేసినా ఇప్పటి వరకు శాఖాపర పదో న్నతి కమిటీ(డీపీసీ) ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు చేరలేదు. రాష్ట్ర ఖజానాకు ప్రధాన ఆదాయవనరుగా ఉండటంతోపాటు నిత్యం వాహనదారుల కార్య కలాపాలతో ముడిపడ్డ రవాణాశాఖ గందరగోళంగా మారింది. సమస్యల వలయంలో రవాణా శాఖ రాష్ట్ర విభజనకు పూర్వం రవాణాశాఖ కమిషనర్, ఓ అదనపు కమిషనర్, ఐదుగురు జేటీసీలతో హడావుడిగా ఉండేది. అలాంటిది ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఒకే జేటీసీ విధులు నిర్వర్తిస్తున్నారు. కమిషనర్ లేకపోవటంతో రవాణాశాఖ ముఖ్య కార్య దర్శి సునీల్శర్మే అదనపు బాధ్యతలు చూసు ్తన్నారు. ఆయనకు మరో కీలకమైన రోడ్లు భవ నాల శాఖ ముఖ్యకార్యదర్శి బాధ్య త కూడా ఉండటంతో ఆయన పూర్తి స్థాయిలో రవాణా శాఖకు సమయం కేటాయించ లేకపోతు న్నారు. దీంతో ప్రధాన కార్యాలయం అస్తవ్య స్తంగా తయారైంది. తమకు ఫర్నిచర్ లేదని కొన్ని కార్యాలయాలు, కంప్యూటర్లు మొరా యిస్తున్నాయని కొన్నిచోట్ల, లైసెన్సుల జారీకి కార్డుల సరఫరా సక్రమంగా లేదని, హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల సరఫరా గం దరగోళంగా ఉందని, భవనాలు లేక ఇబ్బం దిగా ఉందని.. ఇలా నిత్యం వచ్చే ఫిర్యాదుల ను పరిష్కరించటం ఇబ్బందిగా మారింది. పడకేసిన విజిలెన్స్ విజిలెన్సు దాదాపు పడకేసింది. రవాణా కార్యాలయాల్లో అవినీతి విచ్చలవిడిగా సాగుతోంది. ప్రధాన కార్యాలయంలో ఉన్న ఏకైక జేటీసీ రఘునాథ్ ఐటీ, పరిపాలన, విజిలెన్సు, లీగల్, ప్లానింగ్.. ఇలా అన్నింటిని చక్కదిద్దాల్సి వస్తోంది. వెంటనే మరో జేటీసీని ఇవ్వాలంటే పదోన్నతులు కల్పించాల్సి ఉంది. కానీ డీపీసీ ప్రతిపాదనే ప్రభుత్వం ముందుకు వెళ్లలేదు. ఇక జీహెచ్ఎంసీ పరిధి మరో సీనియర్ జేటీసీ పాండు రంగనాయక్ బాధ్యతలు చూస్తున్నారు. కొత్త జిల్లాలతో పని ఒత్తిడి పెరిగింది. కమిషనర్, అదనపు కమిషనర్, ఇద్దరు జేటీసీలు ప్రధాన కార్యాలయంలో అవసరం. లారీలకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల మధ్య పర్మిట్ వ్యవహారం లాంటి అంశాలను పర్యవేక్షించటం కూడా కష్టంగా మారింది.