PVR stock
-
ఎంతసేపు సినిమా చూస్తే అంతే ధర చెల్లించేలా..
ఎంతో ఆసక్తిగా సినిమా చూసేందుకు వెళ్తారు. తీరా అరగంట చూశాక సినిమా నచ్చకో లేదా ఏదైనా అత్యవసర పనిమీదో బయటకు వెళ్లాల్సి రావొచ్చు. అలాంటి సందర్భంలో టికెట్ డబ్బులు వృథా అయినట్టే కదా. ఇలాంటి ప్రత్యేక సమయాల్లో టికెట్ డబ్బు నష్టపోకుండా మీరు ఎంతసేపు సినిమా చూస్తారో అంతే మొత్తం చెల్లించేలా పీవీఆర్ ఐనాక్స్ ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులో తీసుకొచ్చినట్లు తెలిపింది. అందులో భాగంగా ‘ఫ్లెక్సీ షో’ అనే కొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది.ఈ ఫ్లెక్సీ షో ద్వారా సినిమా చూసే సమయానికి మాత్రమే డబ్బు చెల్లించవచ్చు. ఈ వినూత్న టికెటింగ్ మోడల్లో సీటు ఆక్యుపెన్సీని పర్యవేక్షించడానికి, మూవీ మిగిలి ఉన్న సమయం ఆధారంగా రీఫండ్లను లెక్కించడానికి ఏఐ ఆధారిత వీడియో విశ్లేషణలను ఉపయోగిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.ఎలా పని చేస్తుందంటే..టికెట్ స్కానింగ్: మీరు సినిమా థియేటర్లోకి వెళ్లేప్పుడు టికెట్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తారు. మీ ఎంట్రీ, ఎక్జిట్ సమయాలను ఏఐ ట్రాక్ చేస్తుంది. దానిపరంగా మీకు డబ్బు రీఫండ్ అవుతుంది.రీఫండ్ సిస్టమ్: సినిమా 75% కంటే ఎక్కువ మిగిలి ఉంటే, టికెట్ ధరలో 60% తిరిగి పొందవచ్చు. సినిమా వ్యవధి 50-75%కు మధ్య ఉంటే 50% రీఫండ్ అవుతుంది. ఇంకా 25-50% సినిమా మిగిలి ఉన్నప్పుడు మీరు థియేటర్ నుంచి బయటకు వెళితే 30% రీఫండ్ ఇస్తామని పీవీఆర్ ఐనాక్స్ పేర్కొంది.అదనపు ఛార్జీలుఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునేవారు టికెట్ బుకింగ్ సమయంలోనే ‘ఫ్లెక్సీ షో’ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే అందుకు సాధారణ ధర కంటే టికెట్ ఫేర్‌లో 10 శాతం అధికంగా చెల్లించాలి.ఎక్కడ అమలు చేస్తున్నారు..ఈ సదుపాయాన్ని ప్రస్తుతం న్యూఢిల్లీ, గుర్గావ్ల్లో అమలు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అదికూడా ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో మాత్రమే దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ప్రేక్షకుల స్పందన ఆధారంగా మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని కంపెనీ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: కొత్త సంవత్సరంలో జాబ్స్ పెరుగుతాయా? తగ్గుతాయా?కంపెనీపై ప్రభావంప్రేక్షకుల సంతృప్తి: సినిమా చూసే సమయానికి మాత్రమే ధర నిర్ధారించడం వల్ల పీవీఆర్ ఐనాక్స్‌పై ప్రేక్షకులకు విశ్వసనీయత పెరుగుతుందని కంపెనీ అధికారులు తెలిపారు. ప్రేక్షకుల సంతృప్తికి సంస్థ పెద్దపీట వేస్తుందని చెప్పారు.ఆదాయ వృద్ధి: ఫ్లెక్సీ షో టికెట్ల ధర 10% ఎక్కువగా ఉన్నప్పటికీ, సినిమా వీక్షించిన సమయం ఆధారంగా రీఫండ్లను అందిస్తుండడంతో కంపెనీ ఆదాయం పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కంపెనీ అందించే సౌలభ్యాన్ని వినియోగించుకునేందుకు అదనపు ఛార్జీలు చెల్లించడానికి సిద్ధంగా ఉంటారని కంపెనీ భావిస్తుంది.పోటీని తట్టుకునేలా..: ఈ వినూత్న టికెటింగ్ మోడల్ పీవీఆర్ ఐనాక్స్ ఇతర ఎంటర్టైన్మెంట్ రంగంలోని సంస్థలతో పోటీ పడేందుకు ఉపయోగపడుతుంది.డేటా సేకరణ: సీట్ల ఆక్యుపెన్సీని పర్యవేక్షించడానికి, రీఫండ్లను లెక్కించడానికి ఏఐ ఆధారిత వీడియో విశ్లేషణలు ఉపయోగించనున్నారు. దాంతో ప్రేక్షకుల ప్రవర్తన, వారి ప్రాధాన్యతలకు సంబంధించిన డేటాను సేకరించే అవకాశం ఉంటుందని కంపెనీ తెలిపింది. భవిష్యత్తులో ప్రేక్షకులకు మరింత మెరుగైన సినిమా అనుభవాన్ని అందించేందుకు ఈ డేటా ఉపయోగపడుతుంది. -
కిక్కు అంటే అదీ! ఆ షేర్లు ‘బ్రహ్మాండం’
సాక్షి,ముంబై: బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ కలెక్షన్లుమార్కెట్లోకి మల్టీప్లెక్స్ దిగ్గజ కంపెనీలకు జాక్‌పాట్ తగిలింది. ఈ మూవీ బాలీవుడ్ వసూళ్లు రూ.100 కోట్లు దాటడంతో పీవీఆర్, ఐనాక్స్ షేర్లు ఒక రేంజ్లో పుంజుకున్నాయి. బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ వసూళ్లతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగారు. అందులోనూ ఇటీవలి నష్టాలతో షేర్ ధర తక్కువకు అందుబాటులో ఉండటంతో మరింత ఉత్సాహం నెలకొంది. ఫలితంగా పీవీఆర్ షేర్ 4.06 శాతం లేదా రూ.74.45 మేర ఎగిసింది. ఇంట్రా-డే ట్రేడింగ్‌లో, ఈ షేర్లు గరిష్టంగా రూ.1,926.20ని తాకాయి. ఐనాక్స్ లీజర్ షేర్లు 4.5 శాతం లేదా రూ. 22.55 పైగా ఎగిసి రూ.516.95 వద్ద ఉన్నాయి. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ అంచనాల ప్రకారం శుక్రవారం రూ. 31.5 కోట్లు, శనివారం రూ. 37.5 కోట్లు, ఆదివారం రూ. 39.5 కోట్లు వసూలు చేసింది. ఫైనల్‌గా ఈ లెక్కే ఇంకా ఎక్కువే ఉండవచ్చని కూడా ఆయన అంచనావేశారు. జాతీయ స్థాయిలో మంచి వసూళ్లు సాధిస్తోందని ఆదర్శ్ అన్నారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లు డీలాపడటంతో శుక్రవారం, పీవీఆర్, ఐనాక్స్ లీజర్ దాదాపు 5 శాతం కుప్పకూలిన సంగతి తెలిసిందే. కాగా రణబీర్ కపూర్, అలియా నటించిన బ్రహ్మాస్త్రా పార్ట్ వన్: శివ సినిమాలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, మౌని రాయ్‌తోపాటు, టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున కీలక పాత్రల్లో నటించారు. అలాగే షారుఖ్ ఖాన్ అతిధి పాత్రలో అలరిస్తున్నాడు. దాదాపు 450 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ , మలయాళ భాషలలో విడుదలైంది. 18 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నమోదు చేసింది. అంతేకాదు 'బ్రహ్మాస్త్రా పార్ట్ 2: దేవ్' అనే టైటిల్‌ను కూడా నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ లేదా రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించవచ్చని ఊహాగానాలు వచ్చాయి. -
కోవిడ్ దెబ్బతో కనిష్టాలను తాకిన ఈ షేర్లను కొనేవారే లేరు.!
కోవిడ్ దెబ్బతో స్టాక్ మార్కెట్లో కనిష్టాలకు పతనమైన కొన్ని షేర్లను కొనేవారే కరువయ్యారు. కరోనా కేసుల వ్యాప్తి, దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపులతో మార్చి 24న బీఎస్ఈ-500 ఇండెక్స్ కొన్నేళ్ల కనిష్టాన్ని తాకింది. అనంతరం అనేక ఆటుపోట్లను ఎదుర్కోంటూ మార్చి 24 కనిష్టాల నుంచి 21శాతం వరకు రికవరీని సాధించింది. ఈ ఇండెక్స్‌లో కోవిడ్ కారణంగా 50శాతం నష్టాలను చవిచూసిన 21 కంపెనీ షేర్లను కొనేవారే లేరు. ఈ షేర్లలో అధిక రిస్క్ పొంచి ఉందనే భయాలు ఇన్వెసర్లలో నెలకొన్నందున ఈ షేర్లు రికవరీని సాధించలేకపోయాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. ఆతిథ్యం రంగంలో సేవలు అందించే చాలెట్ హోటల్ షేరు మార్చి 24 నుంచి 49శాతం నష్టాన్ని చవిచూసింది. ఏడాదిలో 71శాతం క్షీణించింది. అలాగే లెమన్ ట్రీ హోటల్ షేరు ఇదే కాలంలో 33శాతం నష్టపోయింది. ఏడాది కాలంలో 74శాతం నష్టపోయింది. హోటల్ చైన్ కంపెనీలపై అధిక అప్పులు భారం పడుతోందని, రాబోయే మూడేళ్ల వరకు వడ్డీ, మూలధన అవసరాలకు రుణాలపై ఆధారపడాల్సి ఉంటుందని ఎడెల్వీజ్ బ్రోకరేజ్ సంస్థ తన నివేదికలో తెలిపింది. మల్టీపెక్స్ నిర్వహణ సంస్థ పీవీఆర్ షేరు మార్చి 24తేదీ నుంచి 38శాతం నష్టాన్ని చవిచూసింది. ఏడాదిలో 71శాతం పతనమైంది. కొందరు నిర్మాతలు వ్యయపరమైన ఒత్తిళ్లు ఎదుర్కోవడం, ఇటీవల కొన్ని సినిమాలు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై విడుదల అవుతుండటం, లాక్డౌన్ కారణంగా కొన్ని చిత్రాల పోస్ట్-ప్రోడక్షన్ పనులు ఆగిపోవడం తదితర కారణాలు ఈ షేరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు బ్రోకరేజ్ సంస్థ ఈక్వైరీస్ క్యాపిటల్ తెలిపింది. ప్రభుత్వరంగ బ్యాంకులు, చిన్న ప్రైవేట్ రంగ బ్యాంక్‌లు మార్చి 24 నుంచి మార్కెట్లో మొదలైన రికవరీ నుంచి అందుకోవడంలో విఫలయ్యాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆర్బీఎల్, డీసీబీ బ్యాంక్, పీఎన్బీ షేర్లతో సహా చోళమండలం ఫైనాన్షియల్ హోల్డింగ్స్, శ్రీరామ్ సిటీ ఫైనాన్స్, రెప్కో హోమ్ ఫైనాన్స్ లాంటి ఎన్బీఎఫ్సీలు 22శాతం నుంచి 33శాతం క్షీణించాయి. ‘‘గతంలో ఎన్‌బీఎఫ్‌సీలకు తగిలిన గాయాలు ఇప్పటికీ మానలేదు. చిన్న ప్రైవేట్ రంగ బ్యాంకులు ఇంకా తమ మనుగడ కొనసాగింపుపై దృష్టి సారిస్తున్నాయి. పీఎస్‌యూ బ్యాంకులు విలీనం వైపు మొగ్గుచూపుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలో పరిమిత రుణ వృద్ధి ఏమైనా జరిగితే ఇప్పుడు కొన్ని పెద్ద ప్రైవేట్ బ్యాంకులకు రాబోతోంది.’’ అని క్రిడెట్ సూసీ అధికార ప్రతినిధి నీలకంఠ్ మిశ్రా తెలిపారు. ‘‘రిటైల్ రంగానికి చెందిన ఆదిత్యా బిర్లా ఫ్యాషన్, ఫ్యూచర్ రిటైల్, షాపర్స్ స్టాప్ లాంటి షేర్లు మార్చి 24నుంచి 30-34శాతం నష్టాన్ని చవిచూశాయి. లాక్డౌన్ విధింపు కారణంగా ప్రజలు కొనుగోళ్లకు పెద్దగా ఆసక్తి చూపరు. ఈ బలహీనత దీర్ఘకాలంగా కొనసాగే అవకాశం ఉండటం రిటైల్ రంగాని ఎదురుదెబ్బే అవుతుంది.’’ అని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ తెలిపింది. -
3 రోజుల్లో బాహుబలి-2 రిలీజ్: ఆ స్టాక్ అదుర్స్
తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో మారుమోగించిన బాహుబలి సినిమా కంక్లూజన్ పార్ట్ ఇంకో మూడు రోజుల్లో రిలీజ్ కు సిద్ధమవుతోంది. దాదాపు 9 వేల సిల్వర్ స్క్రీన్లలో మనల్ని అలరించడానికి వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో బాహుబలి-2 కిక్ మల్టిఫ్లెక్స్ ఆపరేటర్ పీవీఆర్ లిమిటెడ్ స్టాక్ కు భలే జోషిచ్చింది. బీఎస్ఈలో పీవీఆర్ లిమిటెడ్ స్టాక్ 2.60 శాతం మేర లాభపడుతూ 1614 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఫిల్మ్ ఎంటర్ టైన్మెంట్ కంపెనీ పీవీఆర్. ఇది ముఖ్యంగా మూడు బిజినెస్ సెగ్మెంట్లలో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. మూవీ ఎగ్జిబిషన్, మూవీ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ ను వంటి ఇతర కార్యకలాపాలను ఈ కంపెనీ అందిస్తోంది. ఏడాది ఏడాదికి కంపెనీ స్టాక్ 41.17 శాతం పెరిగింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా దాదాపు 7508 కోట్లకు పెరిగినట్టు తెలిసింది. మొత్తం కంపెనీకి చెందిన 28,614 షేర్లు చేతులు మారినట్టు వెల్లడైంది. మరో మూవీ డిస్ట్రిబ్యూటర్ ఐనాక్స్ లీజర్ మాత్రం స్వల్పంగా నష్టపోతోంది.ఇటీవలే బాహుబలి 2 విడుదల సందర్భంగా సిల్వర్ స్క్రీన్లపైకి వచ్చిన బాహుబలి 1కు కూడా మంచి స్పందనే వచ్చింది. రీ-రిలీజ్ ను పురస్కరించుకుని అప్పుడు కూడా మల్టిఫ్లెక్స్ ఆపరేటర్ల షేర్లు దుమ్మురేపాయి. మల్టిప్లెక్స్ ఆపరేటర్లకు మార్చి క్వార్టర్ ఎంతో లాభదాయకమైన త్రైమాసికమని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. దంగాల్, రాయిస్, కబాలి, జోలీ ఎల్ఎల్బీ2, బద్రినాథ్ కి దుల్హానియా వసూళ్లు ఈ కంపెనీ షేర్లకు భారీగా కలిసివచ్చిందని పేర్కొన్నారు.