హెచ్డీఎఫ్సీ క్యూ4 ఫలితాలు, డివిడెండ్
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నాలుగవ త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. ఫలితాలు మెరుగ్గానే ఉన్నప్పటికీ బ్యాడ్ లోన్ బెడద మాత్రం వెన్నాడుతోంది. క్యూ4(జనవరి-మార్చి)లో నికర లాభం 18.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. రూ. 3,990 కోట్లను నికార లాభాలను పోస్ట్ చేసింది. మొత్తం ఆదాయం రూ. 21,560 కోట్లుగా ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 18,862 కోట్ల రూపాయలను రిపోర్ట్ చేసింది.
నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 21.5 శాతం పెరిగి రూ. 9,055 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 4.1 శాతం నుంచి 4.3 శాతానికి బలపడ్డాయి. ఇతర ఆదాయం 20 శాతం పుంజుకుని రూ. 3446 కోట్లను అధిగమించగా.. నిర్వహణ లాభం(ఇబిటా) 27 శాతం జంప్‌చేసి రూ. 7,279 కోట్లయ్యింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికి బ్యాంకు మొత్తం స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పిఏ) 1.05 శాతం పెరగ్గా, 2015-15 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 0.94 శాతం గా ఉన్నాయి. రుణాలు రూ. 1,261 కోట్లుగా ఉన్నాయని , 2015-16 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి కాలంలో రూ.662 కోట్లగా బ్యాంకు బిఎస్ఇ ఫైలింగ్ లో తెలిపింది.ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కౌంటర్ 2.4శాతానికిపైగా లాభపడింది.
మరోవైపు గత ఐదు సంవత్సరాలుగా మంచి డివిడెండ్ ట్రాక్ రికార్డు ఉన్న బ్యాంకు మరోసారి వాటాదారులకు డివిడెండ్ ప్రకటించింది. షేరుకి రూ. 11 చొప్పున డివిడెండ్ చెల్లించనున్నట్లు బ్యాంక్ పేర్కొంది. గత ఏడాది ప్రతి ఈక్విటీ షేరుకి రూ.9.5 లు అందించింది.