Qantas
-
ఇక నాన్‌స్టాప్ ప్రయాణం
దూరాలు వెళ్లాలంటే... విమానాల కోసం ఎదురుచూపులు, పడిగాపులు. ఒకటి, రెండు ఫ్లైట్స్ మారాల్సి వస్తుంది. లేదంటే ఒకట్రెండు హాల్టులైనా ఉంటాయి. ఇక ఇలాంటి మార్పులకు హాల్టులు చెక్ పెడుతోంది ఆస్ట్రేలియాకు చెందిన విమానయాన సంస్థ క్వాంటాస్. లండన్ నుంచి ఆస్ట్రేలియాకు డైరెక్ట్ ఫ్లైట్‌ను 2025 నుంచి నడపనుంది. 19 గంటలపాటు నాన్‌స్టాప్‌గా నడిచే ఈ ఫ్లైట్.. ఆగకుండా అత్యంత దూరం 17,016కి.మీ ప్రయాణించే విమానంగా చరిత్ర సృష్టించనుంది. కాగా ప్రస్తుతం సింగపూర్ టు న్యూయార్క్ 15,300కి.మీ దూరాన్ని 17న్నర గంటలపాటు ప్రయాణించే ఫ్లైట్ అత్యంత లాంగెస్ట్. కాగా... లాంగెస్ట్ ట్రయల్ ఫ్లైట్ 2019లో లండన్ నుంచి సిడ్నీ 19 గంటల 19 నిమిషాలు ప్రయాణించింది. ఎక్కడా హాల్టులు లేని ఈ ప్రయాణాలకు డిమాండ్ పెరగడంతో ఎ350–1000 ఎయిర్‌బస్సులు 12 ఆర్డర్ చేసింది. ఇక ఈ ఎ350, ‘ప్రాజెక్ట్ సన్‌రైజ్’విమానాల్లో ఆస్ట్రేలియా నుంచి లండన్, న్యూయార్క్... ఇలా ఏ నగరానికైనా నాన్‌స్టాప్‌గా ప్రయాణించొచ్చు. మొట్టమొదటి ‘ప్రాజెక్ట్ సన్‌రైజ్’ఫ్లైట్స్ న్యూయార్క్, లండన్ల నుంచి ప్రారంభమవ్వనున్నాయి. అలాగే.. ఆస్ట్రేలియా నుంచి పారిస్, ఫ్రాంక్ఫర్ట్ వంటి నగరాలకూ ప్రయాణించనున్నాయి. ఒక్కో విమాన సామర్థ్యం 238 మంది. అధికదూరం ప్రయాణించేవి కావడంతో... ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా నడక, చిన్నపాటి వ్యాయామాలకోసం వెల్బియింగ్ జోన్లను కూడా ఏర్పాటు చేసింది. ఇక ఇందులో ఉన్న ఫస్ట్‌క్లాస్ సూట్... చిన్నపాటి హోటల్ రూమ్‌ను తలపిస్తుంది. బెడ్, పెద్ద టీవీ, లాంజ్చైర్, వార్డ్రోబ్ వంటి ఆధునిక సౌకర్యాలున్నాయి. తక్కువ కర్బన ఉద్గారాలు, తక్కువ శబ్దం వచ్చేలా పర్యావరణహితంగా తయారు చేయిస్తోంది క్వాంటాస్. ప్రయాణికుల బడ్జెట్‌కు అందుబాటులో ఉంటాయని చెబుతోంది. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
గెలాక్సీ యూజర్లకు షాకిచ్చిన ఎయిర్‌లైన్స్
సిడ్నీ : శాంసంగ్ గెలాక్సీ నోట్7 యూజర్లకు ప్రముఖ ఎయిర్ లైన్సు సంస్థ ఆస్ట్రేలియన్ క్వాంటాస్ షాకిచ్చింది. విమాన ప్రయాణంలో గెలాక్సీ నోట్7 స్మార్ట్ఫోన్ల వాడకాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ వల్ల వస్తున్న బ్యాటరీ పేలుళ్ల సమస్యను సాకుగా చూపుతూ విమానంలో ఈ ఫోన్‌ను వాడటం కాని చార్జ్ కాని చేయకూడదని గురువారం ఆదేశించింది. దేశీయ, అంతర్జాతీయ విమానాలన్నింటిలో ఈ ఆదేశాలను పాటించాలని, అదేవిధంగా క్వాంటస్ డిస్కౌంట్ క్యారియర్ జెట్స్టార్కు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఏవియేషన్ అథారిటీ నిబంధనలను సడలింపు చేశాక, 2014లో క్వాంటాస్, దాని ప్రత్యర్థి కంపెనీ వర్జిన్ ఆస్ట్రేలియాలు విమానంలో ఫోన్ల వాడకాన్ని అనుమతి ఇచ్చాయి. ప్లేన్ నేవిగేషన్ ఈక్విప్మెంట్కు ఆటంకం కలుగుతుందనే కారణంతో టాక్సింగ్, టేక్-ఆఫ్, ల్యాండింగ్ సమయంలో ఫోన్ల వాడకంపై రెగ్యులేటర్లు నిషేధం విధించాయి. కానీ తర్వాత ఎయిర్ లైన్సు ఫోన్ల వాడకానికి అనుమతి కల్పించాయి. ప్రస్తుతం బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో క్వాంటాస్ మళ్లీ విమానంలో గెలాక్సీ నోట్7ల వాడకాన్ని నిషేధించింది. బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో తీవ్ర ఇరకాటంలో పడ్డ శాంసంగ్ గ్లోబల్‌గా షిప్ చేసిన 2.5 మిలియన్ యూనియట్ల గెలాక్సీ నోట్7లను రీకాల్ చేయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పేలుళ్ల ఘటనలు సంస్థ గౌరవానికి భంగం వాటిల్లుస్తున్నాయని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలో కూడా శాంసంగ్ తన తాజా ఫ్లాగ్‌షిప్‌లను రీకాల్ చేస్తోంది. శాంసంగ్ పూర్తిగా వీటిని రీకాల్ చేసేవరకు ఈ ఫోన్లను విమానంలో వాడకూడదని క్వాంటాస్ పేర్కొంది. -
సేఫెస్ట్ ఎయిర్‌లైన్స్ ఇవే..
విమాన ప్రయాణం గాల్లో దీపంలా తయారైన తరుణంలో ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తోన్న కంపెనీల మీద రోజు రోజుకూ ఫోకస్ పెరుగుతోంది. విలాసం, విందు, వినోదాల సమ్మేళనమే విమాన ప్రయాణంగా మారిపోయిన నేపథ్యంలో సదరు సౌకర్యాలతో పాటు సురక్షిత ప్రయాణాన్ని అందించే జాబితాను ఎయిర్ లైన్ రేటింగ్ డాట్ కామ్ వెల్లడించింది. ఎయిర్ లైన్ రేటింగ్ డాట్ కామ్ 2016 సంవత్సరానికిగానూ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తోన్న టాప్ 20 జాబితాలో తొలి స్థానాన్ని ఆస్ట్రేలియా ప్రీమియర్ ఎయిర్వేస్ క్వాంటాస్‌కు సెవన్ స్టార్ రేటింగ్ ఇచ్చింది. దీంతో గత మూడేళ్లుగా తన స్థానాన్ని క్వాంటాస్ నిలుపుకున్నట్టయింది. ప్రంచంలోనే రెండో అతిపెద్ద ఎయిర్‌లైన్స్ అయిన అమెరికన్ ఎయిర్ లైన్స్‌కి ఎయిర్ లైన్ రేటింగ్ డాట్ కామ్ ఈ ఏడాదికిగానూ రెండో స్థానం ఇచ్చింది. 1919లో ప్రారంభించిన డచ్ క్యారియర్ కేఎల్ఎమ్కు ఎయిర్ లైన్ రేటింగ్ డాట్ కామ్ జాబితాలో చోటు దక్కింది. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తోన్న ఎయిర్‌లైన్స్‌లో యూరోప్‌లోనే తొలిస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ సంస్థకు చెందిన ఒక్క ఆమ్స్టర్ డ్యాంకు చెందిన నెట్వర్క్ ఏటా 20 మిలియన్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంది. మరిన్ని చిత్రాలు, సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
వాళ్లదో 'వెర్రి' : పీటర్సన్
సిడ్నీ: ఆస్ట్రేలియా ఎయిర్ పోర్టులో తనకు చేదు అనుభవం ఎదురు కావడం పట్ల ఇంగ్లండ్ కు చెందిన మాజీ స్టార్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ మండిపడ్డాడు. బిగ్ బాష్ లీగ్ లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియాకు వచ్చిన పీటర్సన్ కు సిడ్నీ ఎయిర్ పోర్టులో అంతకుముందు ఎన్నడూ ఎదురుకాని ఓ వింత పరిస్థితి అతన్ని తీవ్ర ఇబ్బంది పెట్టింది. ఇందుకు కారణం పీటర్సన్ ను క్వాంటాస్ ఎయిర్ లైన్ విశ్రాంతి గదిలో అనుమతించక పోవడమే. తన ఒంటిపై ప్లాస్టిక్ ను పోలిన కొన్ని వస్తువులు ఉన్న కారణంగా విశ్రాంతి గదిలోకి రానివ్వలేదని పీటర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతకుముందు ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితిని ఇక్కడ తాను చూడలేదని క్వాంటాస్ ఎయిర్ సర్వీస్ ను తిట్టిపోశాడు. క్వాంటాస్ ఎయిర్ వేస్ ను 'వెర్రి' ఎయిర్ వేస్ గా పోలుస్తూ ట్వీట్ చేశాడు. దీనిపై క్వాంటాస్ ఎయిర్ వేస్ దిగివచ్చి పీటర్సన్ కు క్షమాపణలు చెప్పింది. ఈ ఏడాది ఆరంభంలో డ్రెస్ కోడ్ నిబంధనలను కఠినతరం చేసిన కారణంగానే పీటర్సన్ పట్ల తమ సిబ్బంది అలా ప్రవర్తించి ఉంటారని సర్దుచెప్పుకునే ప్రయత్నం చేసింది.