Quad Summit 2022
-
క్వాడ్.. ఎవరి ప్రయోజనాల కోసం?
చతుష్టయం(క్వాడ్) అని పిలిచే ‘చతుర్ముఖ భద్రతా ముచ్చట్లు’ (క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్) అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియాల మధ్య వ్యూహాత్మక భద్రతా ఏర్పాటు! ఎవరికి ఎవరి నుండి భద్రత కావాలి? అమెరికాకు చైనా నుండి వాణిజ్య భద్రత, జపాన్‌కు చైనా నుండి సరిహద్దు భద్రత కావాలి. ఈ ముచ్చట్లను 2007లో నాటి జపాన్ ప్రధాని షింజొ అబే ప్రారంభించారు. చైనా ఈ కూటమి ఏర్పాటుపై నిరసన తెలిపింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా 2008లో తప్పుకొంది. అయితే ఈ చతుష్టయాన్ని 2017లో పునఃప్రారంభించారు. ఈ చతుష్టయం మొన్న మే 24న జపాన్ రాజధాని టోక్యోలో కలిసింది. చట్టవ్యతిరేక చేపల వేటను ఎదుర్కోడానికి సముద్రయాన ప్రేరణను ప్రారంభించింది. అనుమానిత చేపల వేట చైనా నుండే. ఇండో– పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని నియంత్రించడానికి 4 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. అందులో భారత్ వంతు లక్ష కోట్ల రూపాయలు. జపాన్, అమెరికాల ప్రయోజనాలకు, చైనా అభివృద్ధిని అడ్డుకోడానికి మనం ఇంత సొమ్మును వృథా చేయాలా? (👉🏾చదవండి: క్షమాభిక్షలోనూ ఇన్ని రాజకీయాలా?) గతంలో మోదీ జపాన్ గడ్డపై, ప్రత్యక్షంగా జపాన్ను, పరోక్షంగా అమెరికాను బుజ్జగించడానికి చైనాను విమర్శించారు. జపాన్, చైనాల మధ్య ‘సెంకకు ద్వీపాల’ సార్వభౌమత్వ, సముద్ర సరిహద్దు వివాదాలున్నాయి. మోదీ విమర్శను చైనా తీవ్రంగా పరిగణించింది. సరైన నిర్ణయం కాకపోయినా భారత సరిహద్దుల్లో చైనా సైనిక చర్యలు దీని ఫలితమే. ‘క్వాడ్’ భారత్–అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని అధ్యక్షుడు బైడెన్ అన్న మాటల్లో నిజం లేదు. అమెరికా కుట్రలనూ, యుద్ధసామగ్రి వాణిజ్యాన్నీ, మోదీ అమెరికా సౌజన్య పక్షపాతాన్నీ (ఔనంటే ఔను కాదంటే కాదనే గుణం) గర్హించాలి. భారత ప్రజల ప్రయోజనాలను, ఆర్థిక వనరులను, భారత సైనికుల ప్రాణాలను కాపాడుకోవాలి. (👉🏾చదవండి: సైద్ధాంతికంగా కాంగ్రెస్ మేల్కొన్నట్లేనా?) – సంగిరెడ్డి హనుమంత రెడ్డి ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
చైనాపై చతుర్భుజ వ్యూహం.
జపాన్ రాజధాని టోక్యో రెండు రోజులుగా పలు కీలక ఘట్టాలకు వేదికైంది. చతుర్భుజ కూటమి (క్వాడ్) దేశాల తాజా సదస్సులో ప్రాంతీయ భద్రతపై మాటలు, ‘క్వాడ్’ ఫెలోషిప్‌ల లాంటి చేతలతో పాటు ‘ఇండో – పసిఫిక్ ఆర్థిక చట్రం’ (ఐపీఈఎఫ్) అనే కొత్త ఆర్థిక కూటమి తెరపైకొచ్చింది. చైనాకు ముకుతాడు వేసి, ఈ ప్రాంతంలో తన ప్రాబల్యం పెంచుకోవడానికే అయినా, 13 దేశాలతో అమెరికా శ్రీకారం చుట్టిన ఈ ఐపీఈఎఫ్ భారత్ సహా వివిధ దేశాలకు తెరుచుకున్న ఓ కొత్త కిటికీ. అలాగే, ‘క్వాడ్’ను పట్టించుకోని ఇండో– పసిఫిక్‌లోని చిన్న దేశాల మద్దతును కూడగట్టడం కోసం ఆ ప్రాంతంలో (చైనా) అక్రమ చేపలవేటను అడ్డుకునే సముద్రజల కార్యాచరణ ప్రకటించారు. అంటే, ఇప్పటి దాకా మానవతా సాయం, టీకాలు, వాతావరణ మార్పులు, సరఫరా వ్యవస్థల లాంటి సాధారణ అంశాలే అజెండాగా ఉన్న ‘క్వాడ్’ రూపం మార్చుకుంటోంది. మోదీ మాటల్లో చెప్పాలంటే, ‘క్వాడ్’ ఇప్పుడు ఓ చురుకైన వేదికగా మారింది. ‘క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్’ (క్వాడ్) అనే నాలుగు ప్రజాస్వామ్య దేశాల కూటమికి 17 ఏళ్ళ క్రితం అనుకోకుండా బీజం పడింది. 2004లో హిందూ మహాసముద్రంలో చెలరేగిన భయంకర సునామీ తరువాత బాధిత ప్రాంతంలో మానవతా దృక్పథంతో సాయం చేయడానికి అమెరికా, ఆస్ట్రేలియా, భారత్, జపాన్‌లు ఒక తాటి మీదకు వచ్చాయి. 2007లో అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే ఈ చతుష్పక్ష కూటమిని లాంఛనంగా స్థిరీకరించారు. ఈ కూటమిలో పాలు పంచుకుంటే చైనాకు కోపం తెప్పిస్తానేమోనని కొన్నేళ్ళ పాటు ఆస్ట్రేలియా తటపటాయించింది. అలా దశాబ్ద కాలం ‘క్వాడ్’ నిద్రాణంగా ఉంది. అయితే, పెరుగుతున్న చైనా ప్రాబల్యం పట్ల మారిన వైఖరులను ప్రతిఫలిస్తూ, 2017లో ‘క్వాడ్’ పునరుత్థానమైంది. ఇండో – పసిఫిక్‌పై మరింత దృష్టి పెట్టి, చైనాకు ముకుతాడు వేయడానికి ‘క్వాడ్’ కీలకమని నిన్నటి ట్రంప్, ఇవాళ్టి బైడెన్ ప్రభుత్వాలు గుర్తించాయి. ‘క్వాడ్’ నేతల సదస్సు 2021లో తొలిసారి జరిగింది. ఈ మార్చిలో వర్చ్యువల్‌గా భేటీ అయ్యారు. తాజా టోక్యో శిఖరాగ్ర సదస్సు నేతలు భౌతికంగా కలిసిన రెండో భేటీ. చైనా పేరెత్తకుండానే, ఆ దేశ విస్తరణవాదాన్ని అడ్డుకొనే చర్యలకు తాజా సదస్సులో ‘క్వాడ్’ సమాయత్తమైంది. నిజానికి, తైవాన్‌పై చైనా దాడి ప్రమాదం ఉందని భావిస్తున్న తరుణంలో, చూస్తూ ఊరుకోబోమని అమెరికా రెండు రోజుల క్రితమే హెచ్చరించింది. తాజాగా ‘క్వాడ్’ దేశాలు సైతం ప్రాంతీయ సమగ్రత, సార్వభౌమత్వాలకే తాము కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేయడం చైనాకు పంటి కింద రాయే. అలాగే, చైనాతో దౌత్య, వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ సదస్సులో ఆస్ట్రేలియా నూతన ప్రధాని ఆంథోనీ అల్బనీస్ చురుకైన పాత్ర గమనార్హం. ఈ చతుర్భుజ కూటమి దేశాల తాజా భేటీ, కార్యాచరణ ప్రణాళిక సహజంగానే చైనాకు నచ్చట్లేదు. ‘ఆసియా ప్రాంతపు నాటో కూటమి’ అంటూ ‘క్వాడ్’పై ముద్ర వేస్తున్న చైనా తన అసహనాన్ని దాచుకోవట్లేదు. ‘క్వాడ్’ సదస్సు వేదికకు దగ్గరలోనే చైనా – రష్యాల జెట్ విమానాలు గగనతల గస్తీ నిర్వహించాయని తాజావార్త. రెచ్చగొట్టేలా సాగిన ఈ వ్యవహారాన్ని జపాన్ తీవ్రంగా నిరసించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి కూడా తాజా ‘క్వాడ్’ నేతల సదస్సులో ప్రస్తావనకు వచ్చింది. చిరకాల మిత్రదేశమైన రష్యాతో భారత్‌కు ఉన్న వ్యూహాత్మక, వాణిజ్య సంబంధాలపై ఒత్తిడి పడింది. అయితే, భారత్ మాత్రం తన ప్రయోజనాల్ని వదులుకోకుండానే, ఉక్రెయిన్ యుద్ధ వేళ తన అలీన వైఖరినీ, శాంతిస్థాపన ఆవశ్యకతనూ పునరుద్ఘాటించింది. పనిలో పనిగా టోక్యోలో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా నేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 70 ఏళ్ళుగా అనుబంధం ఉన్న జపాన్‌తో వాణిజ్యం నుంచి భద్రత వరకు అనేక అంశాలు చర్చకు వచ్చాయి. అదే సమయంలో భారత్ కోవిడ్ టీకా మైత్రి ప్రపంచాన్ని కాపాడిందంటూ భారత్ చొరవను దేశాలన్నీ అభినందించాయి. ఉత్సాహం చూపుతున్న దక్షిణ కొరియా, న్యూజిలాండ్, వియత్నామ్ లాంటి దేశాలతో భవిష్యత్తులో ‘క్వాడ్’ విస్తరించినా, భాగస్వామ్యం పెరిగినా ఆశ్చర్యం లేదు. ఈ సదస్సులో ‘క్వాడ్’ తన భద్రతా లక్ష్యాలను కానీ, మరో కూటమి ‘ఆకస్’ (ఆస్ట్రేలియా – యూకె– యూఎస్‌ల కూటమి) విషయంలో వైఖరిని కానీ స్పష్టం చేయలేదు. ఆస్ట్రేలియాకు అణు జలాంతర్గాముల సరఫరాకై అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాల మధ్య కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం – ‘ఆకస్’. గమనిస్తే ఇటు ‘క్వాడ్’, అటు ‘ఆకస్’, చైనా వాణిజ్య ప్రాబల్యాన్ని తగ్గించేందుకు ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చిన ఆర్థిక కూటమి ‘ఐపీఈఎఫ్’ – ఇవన్నీ చైనా బలపడకుండా అమెరికా అనుసరిస్తున్న విస్తృత ప్రపంచ వ్యూహంలో భాగాలే! అయితే, వీటి నుంచి మనకు దక్కేది ఏమిటన్నదే భారత్‌కు కీలకం కావాలి. పొరుగున ఉన్న పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్‌లలో మౌలిక వసతుల కల్పన పేరిట వేలు పెడుతున్న చైనా మనకు పక్కలో బల్లెమే. అలాగని చైనా బూచిని చూపెట్టి, మనల్ని తన చంకలో పెట్టుకోవాలన్న అమెరికా వలలో పడితే అమాయకత్వమే. మన దేశ భద్రత, దౌత్య, వాణిజ్య ప్రయోజనాలే గీటురాయిగా వ్యూహాత్మకంగా అడుగులు వేయడమే అవసరం. అటు చైనాతో పాటు అయిదు ఆర్థిక వ్యవస్థల కూటమి ‘బ్రిక్స్’లో, ఇటు అమెరికాతో ‘క్వాడ్’, కొత్త ఐపీఈఎఫ్లలో ఉంటూ సమన్వయం సాధించడం ఎల్తైన తాడు మీద గడకర్ర పట్టుకొని నడవడం లాంటిదే! కానీ తప్పదు! -
పరస్పర విశ్వాసం, చిత్తశుద్ధి...ఇవే క్వాడ్ బలం: మోదీ
టోక్యో: పరస్పర విశ్వాసం, చిత్తశుద్ధే క్వాడ్ కూటమి బలమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇండో పసిఫిక్‌ను స్వేచ్ఛాయుత ప్రాంతంగా రూపుదిద్దడంలో ఈ నాలుగు దేశాల కూటమిది కీలక పాత్ర అంటూ ప్రశంసించారు. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కూడిన క్వాడ్ శిఖరాగ్ర సదస్సు మంగళవారం టోక్యోలో జరిగింది. కూటమిని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలు తదితరాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులు అల్బనీస్, ఫుమియో కిషిడాలతో మోదీ లోతుగా చర్చించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో క్వాడ్ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తోందన్నారు. ఉగ్రవాదాన్ని క్వాడ్ శిఖరాగ్రం ముక్త కంఠంతో ఖండించింది. పాకిస్తాన్ పాల్పడ్డ ముంబై, పఠాన్‌కోట్ ఉగ్ర దాడులను తీవ్రంగా నిరసించింది. సీమాంతర దాడులకు ప్రోత్సాహాన్ని, ఉగ్రవాద తండాలకు సైనిక, ఆర్థిక, వ్యూహాత్మక మద్దతును మానుకోవాలని పాకిస్తాన్‌ను ఉద్దేశించి హితవు పలికింది. చైనా విస్తరణవాదాన్ని, పొరుగు దేశాల సరిహద్దుల్లో చొరబడుతున్న తీరును కూడా నిరసించింది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చేందుకు, ఉద్రిక్తతలను పెంచేందుకు జరుగుతున్న ఏకపక్ష ప్రయత్నాలను, కవ్వి ంపు చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొంది. క్వాడ్ నేతలు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అనంతరం కిషిడా, అల్బనీస్‌లతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పరస్పర బంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. పుతిన్‌పై బైడెన్ నిప్పులు ఉక్రెయిన్‌పై ఆటవిక యుద్ధానికి తెరతీసి కనీవినీ ఎరగని మానవ సంక్షోభానికి కారకుడయ్యారంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై బైడెన్ మండిపడ్డారు. కిషిడా కూడా రష్యా తీరును తీవ్రంగా నిరసించారు. మోదీ మాత్రం దీనిపై వ్యూహాత్మక మౌనం పాటించారు. సభ్య దేశాల మధ్య ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కుదిరాయి. సభ్య దేశాల సముద్ర జలాల పరిరక్షణను పరిపుష్టం చేసేందుకు, చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఇండో–పసిఫిక్ మారిటైం డొమైన్ అవేర్నెస్ (ఐపీఎండీఏ) ఏర్పాటు విపత్తుల సమర్థ నిర్వహణకు హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ (హెచ్ఏడీఆర్) ఏర్పాటు వాతావరణ మార్పుల సమస్యను దీటుగా ఎదు ర్కొనేందుకు క్వాడ్ క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ అం డ్ మిటిగేషన్ ప్యాకేజీ (క్యూ–చాంప్) ఏర్పాటు. -
భారత్ ‘భేష్’.. చైనా వల్ల కాలేదు
Joe Biden praised Prime Minister Narendra Modi.. క్వాడ్ సదస్సులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జపాన్ పర్యటనలో ఉన్నారు. ఈ సదస్సులో భాగంగా మంగళవారం మోదీతో జో బైడెన్ భేటీ అయ్యారు. ఈ క్రమంలో భారత్‌ను బైడెన్ ప్రశంసించారు. అదే సమయంలో చైనా విఫలమైందంటూ వ్యాఖ్యలు చేశారు. వివరాల ప్రకారం.. క్వాడ్ సమ్మిట్‌లో భాగంగా టోక్యోలో మంగళవారం క్లోజ్డ్ సెషన్లో ప్రధాని మోదీ, బైడెన్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా కోవిడ్ మహ్మారిని ఎదుర్కొవడంతో భారత్ సక్సెస్ అయిందని.. ప్రధాని నరేంద్ర మోదీని బైడెన్ ప్రశంసించారు. ఇదే సమయంలో కరోనాను ఎదుర్కోవడంలో చైనా పూర్తిగా విఫలమైందని వ్యాఖ్యానించారు. అలాగే, ప్రజలకు ప్రజాస్వామ దేశాలే అభివృద్ధిని అందించగలవని అన్నారు. చైనా, రష్యా వంటి దేశాలు నిరంకుశ దేశాలు అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, జపాన్ పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇండో పసిఫిక్ ట్రేడ్ డీల్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో అమెరికా, ఇతర క్వాడ్ దేశాలు(అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్) సహా 12 దేశాలు భాగమయ్యాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతం ఆర్థికంగా బలోపేతం అవడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: పుతిన్‌తో తప్ప మరే అధికారితో సమావేశం అవ్వం: జెలెన్స్కీ -
ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ భేటీ
-
క్వాడ్ నేతల మూడో శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ
-
క్వాడ్.. మంచి కోసం ఓ శక్తి: ప్రధాని మోదీ
టోక్యో: క్వాడ్ సభ్య దేశాల పరస్పర విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని మరియు ఉత్సాహాన్ని ఇస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. క్వాడ్ అనేది మంచి కోసం పుట్టుకొచ్చిన ఒక శక్తి అని, అది ఇండో-పసిఫిక్‌ను మెరుగుపరుస్తుందని అభివర్ణించారు. మంగళవారం టోక్యో వేదికగా క్వాడ్ నేతల సమావేశం జరిగింది. భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, ఆస్ట్రేలియా నూతన ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. క్వాడ్ సభ్య దేశాల పరస్పర విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని మరియు ఉత్సాహాన్ని ఇస్తోందని అన్నారు. క్వాడ్ తక్కువ వ్యవధిలో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుందని, ఇండో-పసిఫిక్‌లో శాంతిని నిర్ధారించిందని పేర్కొన్నారు. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో సభ్యదేశాల మధ్య.. వ్యాక్సిన్ పంపిణీ, క్లైమేట్ యాక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఆర్థిక తోడ్పాటుతో పరస్పర సహకారం మరింతగా వృద్ధి చెందిందని మోదీ పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రమాణం చేసిన కొన్ని గంటలకే క్వాడ్ సదస్సుకు హాజరైన ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. సదస్సుకు ముందు.. బైడెన్, కిషిదా, అల్బనీస్‌లతో విడివిడిగా భేటీ అయ్యి ద్వైపాకక్షిక సంబంధాల గురించి చర్చించారు ప్రధాని మోదీ. మార్చి 2021లో వర్చువల్‌గా క్వాడ్ నేతల మధ్య భేటీ జరగ్గా.. సెప్టెంబర్ 2021 వాషింగ్టన్ డీసీలో ఇన్ పర్సన్, మార్చి 2022లో వర్చువల్ మీటింగ్ జరగ్గా.. ఇప్పుడు టోక్యో వేదికగా జరుగుతున్న సమావేశం నాలుగవది.