qualified candidates
-
1998 డీఎస్సీ క్వాలిఫైడ్లకు ఉద్యోగాలివ్వాలి
పంజగుట్ట (హైదరాబాద్): వచ్చే ఆగస్టు 15వ తేదీ లోపు 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చి, స్వాతంత్య్ర వేడుకలను పాఠశాలల్లో నిర్వహించుకునేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవచూపాలని 1998 డీఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సార్లు తమను ఉద్యోగాల్లోకి తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి 4,567 మంది డీఎస్సీ–1998 క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఎమ్‌టీఎస్ పద్ధతిలో ఉద్యోగాలు ఇస్తూ.. అభ్యర్థులనుంచి అంగీకార పత్రాలు కూడా తీసుకున్నారని గుర్తుచేశారు. అయితే తెలంగాణలో 1,500 మంది అభ్యర్థులు ఉద్యోగాలు పొందలేకపోయామని, ఇప్పటికే మానసిక వేదనతో సుమారు 100 మంది మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. 2016 జనవరిలో ముఖ్యమంత్రి కేసీఆర్ తమను పిలిపించుకుని సుమారు రెండున్నర గంటలు చర్చించారని, న్యాయ, సాంకేతిక సమస్యలు ఏమున్నా సరిదిద్ది, సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి అయినా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కాగా, ముఖ్యమంత్రి హామీ మేరకు సాధారణ ఎన్నికలు మొదలు, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ అన్ని ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ఇచ్చామని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సమితి గౌరవాధ్యక్షుడు నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తండ్రి ఇచ్చిన హామీ నెరవేర్చిన సీఎం జగన్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వారి కష్టం ఎట్టకేలకు ఫలించింది. చదివిన చదువు వృథా పోలేదు. తమ బతుకులు ఇంతేనని నిరాశలో ఉన్న వారి జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపింది. 1998లో డీఎస్సీ రాయగా అది చెల్లదంటూ అందులో ఎంపికైన వారికి నాటి చంద్రబాబు ప్రభుత్వం మొండిచెయ్యి చూపించింది. దీనిపై వారు 22 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. కోర్టుకు వెళ్లారు. చదవండి: ‘అలా చేస్తే చూస్తూ ఊరుకుంటారా.. చంద్రబాబును తరిమి కొడతారు’ తమకు అన్యాయం జరిగిందంటూ నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని కలిశారు. 1998 డీఎస్సీలో అర్హులైన అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని అప్పట్లో ఆయన హామీ ఇచ్చారు. తర్వాత ఆయన హఠాన్మరణంతో ఆ ఫైల్ ఆగిపోయింది. తరువాత వచ్చిన ప్రభుత్వాలు వారి గోడును పట్టించుకోలేదు. విపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తూ జిల్లాకు వచ్చినప్పుడు డీఎస్సీ అభ్యర్థులు ఆయనను కలిశారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తమ ప్రభుత్వం రాగానే సమస్య పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అధికార పగ్గాలు చేపట్టాక ఆ మాట నిలబెట్టుకునే దిశగా చర్యలు చేపట్టారు. కోర్టు తీర్పు అనంతరం 1998 డీఎస్సీ అభ్యర్థులను ఉపాధ్యాయులుగా నియమించేందుకు అన్ని చర్యలూ పూర్తి చేశారు. ఫలితంగా తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని 1998 డీఎస్సీ అభ్యర్థులు 2,807 మంది ఉపాధ్యాయ ఉద్యోగాల్లో చేరనున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఉత్తర్వులు అందాయి. అర్హులందరూ అవసరమైన ధ్రువపత్రాలను అప్లోడ్ చేసే పనిలో పడ్డారు. ఈ నెల ఆరు నుంచి 14వ తేదీలోగా వాటి వెరిఫికేషన్ పూర్తి కానుంది. అనంతరం అర్హులైన అందరినీ ఈ నెల 14వ తేదీ తర్వాత ఉపాధ్యాయులుగా నియమించనున్నారు. 6 నుంచి క్వాలిఫైడ్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కాకినాడ సిటీ/రాయవరం: ఈ నెల 6, 7 తేదీల్లో డీఎస్సీ–1998 క్వాలిఫైడ్ అభ్యర్థుల అర్హత సర్టిఫికెట్లను పరిశీలించనున్నట్టు కాకినాడ జిల్లా విద్యాశాఖాధికారి డి.సుభద్ర పేర్కొన్నారు. ఈ విషయాన్ని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1998 డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూకు హాజరై పోస్టు పొందని అభ్యర్థులు 560 మంది ఉన్నారు. వీరిలో ఆసక్తి ఉన్న క్వాలిఫైడ్ అభ్యర్థులు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేసేందుకు ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వారి ఒరిజనల్ సర్టిఫికెట్లను కాకినాడలోని పీఆర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పరిశీలించనున్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే వారు ఆధార్ కార్డు, డీఎస్సీ ఇంటర్వ్యూ లెటర్, మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, హాల్ టికెట్/ర్యాంకు కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలు, ఎస్ఎస్సీ/ఇంటర్/డిగ్రీ/పీజీ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు, డీఈడీ/బీఈడీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు, స్టడీ/రెసిడెన్స్ సర్టిఫికెట్లు, ఏజెన్సీ ఏరియా సరి్టఫికెట్లు (వర్తిస్తే), పీహెచ్సీ సర్టిఫికెట్లు (అవసరమైన వారు), టీచింగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ (అనుభవం ఉన్నవారు) తీసుకుని ఉదయం 9 గంటలకు హాజరు కావాలి. వీరందరూ మూడు సెట్ల సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలు కూడా అందజేయాలని డీఈఓ తెలిపారు. అభ్యర్థుల వివరాలను వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. హాల్ టికెట్ నంబర్ 4100047 నుంచి 4102488 వరకూ ఉన్న అభ్యర్థులు 6వ తేదీన, 4102489 నుంచి 4105490 వరకూ ఉన్న అభ్యర్థులు 7వ తేదీన ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని డీఈఓ సుభద్ర సూచించారు. -
థాంక్యూ సీఎం సార్.. 24 ఏళ్ల చరిత్రలో మీలాంటి సీఎం ను చూడలేదు..!!
-
కళ్లలో ఆనందం: జగనన్నా.. కొలువుదక్కిందన్నా..
గుంటూరు ఎడ్యుకేషన్: 2008-డీఎస్సీలో అర్హత సాధించి పోస్టింగ్స్ పొందలేకపోయిన అభ్యర్థులకు ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలు కల్పించింది. 13 ఏళ్లుగా ఉపాధ్యాయ నియామకాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన అభ్యర్థుల కళ్లలో ఆనందం తొణికిసలాడింది. మాట ఇస్తే తప్పని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ కష్టాలను చెప్పుకున్న ఫలితంగా ఒకే ఒక్కమాటతో రాష్ట్ర వ్యాప్తంగా 2,193 మంది అభ్యర్థులకు ఉద్యోగాలను ఇచ్చిన హామీకి సలాం చెప్పారు. ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులందరూ ధ్యాంక్యూ సీఎం సార్ అంటూ సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. గుంటూరు పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్లో శనివారం జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.ఎస్ గంగా భవానీ అధ్యక్షతన నిర్వహించిన 2008–డీఎస్సీ కౌన్సెలింగ్ ద్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 167 మంది అభ్యర్థులను సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ)లుగా నియ మిస్తూ పాఠశాలలను కేటాయించారు. రావాల్సిన వారిలో నలుగురు గైర్హాజరయ్యారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం ఉదయం కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని అభ్యర్థులకు శుక్రవారం సమాచారాన్ని పంపడంతో శనివారం ఉదయం 9.00 గంటల నుంచి అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులతో పెద్ద సంఖ్యలో కౌన్సెలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కాగా 171 మంది అభ్యర్థులతో మెరిట్ జాబితా సిద్ధం చేసిన తరువాత పాఠశాలల్లో ఖాళీలను ప్రదర్శించే విషయంలో ఉన్నతాధికారుల నుంచి స్పష్టత కోసం మధ్యాహ్నం వరకు ఎదురు చూశారు. అనంతరం ఏడు అంశాలతో కూడిన నిబంధనల తో ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా మధ్యాహ్నం 2.30కు కౌన్సెలింగ్ ప్రారంభించిన అధికారులు బ్యాచ్‌కు 25 మంది అభ్యర్థుల చొప్పు న కౌన్సెలింగ్ హాల్లోకి పిలిచి పాఠశాలలను కేటాయించారు. నరసరావుపేట డివిజన్ పరిధిలోకి వచ్చే పల్నాడు ప్రాంతంలోని మండలాలతో పాటు గుంటూరు, తెనాలి, బాపట్ల, సత్తెనపల్లి డివిజన్ల పరిధిలో మండలాల్లోని పాఠశాలల్లో ఖాళీలను డిస్ప్లేలో ప్రదర్శించి, అభ్యర్థులు కోరుకున్న పాఠశాలలను కేటాయించారు. 3,4 కేటగిరీలకు చెందిన పాఠశాలలతో పాటు 2వ కేటగిరీకి చెందిన పాఠశాలల్లోని ఖాళీలను సైతం భర్తీ చేశారు. -
2018 గ్రూప్-1 క్వాలిఫైడ్ అభ్యర్ధుల ఆందోళన
విజయవాడ: గ్రూప్-1 (2008) క్వాలిఫైడ్ అభ్యర్ధుల శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ ప్రతిష్టకు భంగం కలిగించారని అభ్యర్ధుల ఆందోళన చేపట్టారు. గ్రూప్-1 క్వాలిఫైడ్ అభ్యర్ధుల పేర్లను బహిర్గతం చేయడంపై మండి పడ్డారు. భిన్నాభిప్రాయాలుంటే ఏపీపీఎస్సీతో తేల్చుకోవాలని అభ్యర్ధులు సూచించారు. తమను అసమర్ధులుగా చిత్రీకరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ సెక్రటరీకి గ్రూప్-1 క్వాలిఫైడ్ అభ్యర్ధులు ఫిర్యాదు చేశారు. అయితే హైకోర్టు స్టేపై డివిజన్ బెంచ్‌కు వెళ్లేందుకు సిద్ధమైనట్లు ఏపీపీఎస్సీ పేర్కొంది. ఇక్కడ చదవండి: గ్రూప్–1 ఇంటర్వ్యూలకు హైకోర్టు బ్రేక్ చదవండి: ప్రిలిమ్స్‌కు స్వస్తి: ఏపీపీఎస్సీ కీలక ప్రతిపాదన -
ఏడాదైనా ఎదురు చూపులే
సాక్షి, హైదరాబాద్ : గ్రూప్–2 ఉద్యోగాల భర్తీపై అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. రాతపరీక్ష రాసి ఏడాది గడిచినా నియామకాల ప్రక్రియ పూర్తి చేయకపోవడంపై ఆం దోళన వ్యక్తమవుతోంది. గ్రూప్–2 పరీక్షకు సంబంధించి కోర్టు పరిధిలో కేసు ఉండడంతో ఫలితాలు వెల్లడించడం లేదని టీఎస్పీఎస్సీ చెబుతుండగా.. పరిష్కారం కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని అభ్యర్థుల నుంచి ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. గ్రూప్–2 కేటగిరీలో 439 ఉద్యోగాల భర్తీ కోసం 2015 డిసెంబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నాయని క్షేత్రస్థాయి నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో మరో 593 పోస్టులను కలిపి మొత్తంగా 1,032 పోస్టులతో సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 7.89 లక్షల మంది పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది నవంబర్ 11, 13 తేదీల్లో టీఎస్పీఎస్సీ రాత పరీక్ష నిర్వహించగా 5.17 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలు ప్రకటించినా ఇప్పటికీ ఇంటర్వ్యూ తేదీలను మాత్రం ప్రకటించలేదు. కేసులతో చిక్కులు.. గ్రూప్–2 పరీక్షలో కొందరు జవాబు పత్రాల్లో వైట్నర్ వినియోగించారంటూ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. వైట్నర్ వినియోగం, డబుల్ బబ్లింగ్‌తో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. దీంతో నియామకాల ప్రక్రియ నిలిచిపోయింది. రాత పరీక్షతోపాటు ఫలితాల వెల్లడిలోనూ అవకతవకలు జరిగాయంటూ ఇంకొందరు కోర్టుకెక్కారు. భర్తీ ప్రక్రియలో 1:2 నిష్పత్తిలో జాబితా ప్రకటించాల్సి ఉండగా.. 1:3 నిష్పత్తిలో ఇచ్చారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. కేసు పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. -
రేపు డీఎస్సీ–98 క్వాలీఫైడ్ అభ్యర్థుల సమావేశం
ఆగిరిపల్లి : డీఎస్సీ–98 క్వాలీఫైడ్ అభ్యర్థుల అత్యవసర సమావేశాన్ని ఆదివారం నిర్వహించనున్నట్లు ఏపీ డీఎస్సీ–98 క్వాలీఫైడ్ అభ్యర్థుల జిల్లా కన్వీనర్ చింతా శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక శారదా రామకృష్ణ విద్యాలయంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. -
డీఎస్సీ.. దగా .
సాధ్యం కాని హామీలతో ఎన్నికల్లో గెలిచిన టీడీపీ నిరుద్యోగ ఉపాధ్యాయులతో చెలగాటమాడుతోంది. ఊరించి.. ఊరించి విడుదల చేసిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలో (టెట్ అండ్ టీఆర్టీ) ‘బాబు మార్క్’ కొర్రీల్లో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. రుణమాఫీని తలపిస్తున్న ఈ డీఎస్సీ నోటిఫికేషన్ అర్హులైన అభ్యర్థుల పాలిట శాపంలా మారింది. తాజాగా ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు అర్హతపై సందిగ్ధత నెలకొంది. నెల్లూరు(విద్య) : నెల్లూరు బాలాజీనగర్‌కు చెందిన రమేష్ చదువు పదో తరగతి వరకు సాఫీగా సాగింది. వేసవి సెలవుల్లో కూలి పని చేసే తండ్రి అకస్మాత్తుగా మరణించాడు. తల్లితోపాటు తాను కూలి పనులకు పోవడం ప్రారంభించాడు. ఇద్దరు చెల్లెళ్లతోపాటు తల్లి బాధ్యత మీద పడింది. దీంతో ఇంటర్మీడియట్ చేరే అవకాశం లేకుండా పోయింది. కూలి పనులు నుంచి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చాడు. చదువు మీద ఆశ చావలేదు. దీంతో దృష్టి ఓపెన్ యూనివర్సిటీపై పడింది. ఇంటర్మీడియట్ లేకుండానే ఓపెన్ యూనివర్సిటీలో చేరి డిగ్రీ పూర్తి చేశాడు. అంతటితో ఆగకుండా అప్పులు చేసి బీఈడీ చదివి పట్టా సాధించాడు. తాజాగా బీఎస్సీ నోటిఫికేషన్ వెలువడంతో కష్టాలు తీరిపోయాయని ఎగిరి గంతేశాడు. తీరా దరఖాస్తు చేసుకునేందుకు వెళ్తే ఓపెన్ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు అర్హులా కాదా అనే అంశంపై అధికారులు తర్జభర్జన పడ్డారు. స్పష్టమైన ఆదేశాలు లేవన్నారు. రెండు రోజుల తర్వాత రమ్మన్నారు. తీరా రెండు రోజుల తర్వాత వెళ్లిన రమేష్‌కు పిడుగులాంటి వార్త అధికారులు చెప్పారు. ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేసినా, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ ఉంటే డీఎస్సీకి అర్హులని అధికారులు చావు కబురు చల్లగా చెప్పారు. ఏమి చేయాలో తెలియక రమేష్ దిగాలు పడిపోయాడు. ఇలా రమేష్ ఒక్కడే కాదు. ఓపెన్ యూనివర్సిటీల ద్వారా డిగ్రీ, ఆపై బీఈడీ చేసిన విద్యార్థులకు బాబు ప్రభుత్వం పెట్టిన మెలిక వారిపాలిట శాపంగా మారింది. అసలు ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులను బీఈడీకి అర్హులను చేయడం తప్పని విద్యాశాఖ అధికారులు కొందరు మాట్లాడుకోవడం వారికి మరింత బాధను కలిగిస్తోంది. ప్రతి ఒక్కరూ చదవాలనే ప్రకటనలు గుప్పించే ప్రభుత్వం కష్టాలుపడి చదుుకున్న వారికి ప్రోత్సహించే తీరు ఇదేనా అని ప్రశ్నను రేకెత్తిస్తోంది. ప్రయోజనంలేని దూర విద్య విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వందే తప్పవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగానికి పనికిరాని చదువులకోసం తాము పడిన కష్టాన్ని కనబడిన వారందరికీ ఏడుస్తూ వివరిస్తున్నారు. బాబు మార్క్ కొర్రీలు... నోటిఫికేషన్ వెలువడిన తర్వాత 20 శాతం పోస్టులకు అనధికారికంగా కోత విధించారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒప్పుకోవడంలేదనే సాకు చూపారు. బీకాం విద్యార్థులకు సంబంధిత కోర్సులు నాలుగు సబ్జెక్టులు ఉండాలనే నిబంధన, ఇండస్ట్రీయల్ ఆర్గనైజేషన్, బిజినెస్ ఆర్గనైజేషన్ పేపర్లు రెండూ ఒకటేనా లేదా అనే అంశంపై స్పష్టత లేదు. బీఎస్సీ విద్యార్థుల్లో రెండు సబ్జెక్టులు సైన్స్‌కు సంబంధించినవి ఉండాలన్నారు. మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ, బయోటెక్, డెయిరీ సైన్స్ చదివిన అభ్యర్థుల అర్హతపై స్పష్టత లేదు. సోషల్‌లో ఏఈఎస్ (అకౌంట్స్, ఎకనామిక్స్, స్టాటస్టిక్స్) గ్రూప్ అభ్యర్థులకు బీఈడీలో మెథడాలజీకి సంబంధించిన అంశంపై స్పష్టత లేకపోవడంతో అభ్యర్థులు అర్హత కోల్పోయారు. ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులు కచ్చితంగా ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ ఉంటేనే అర్హులని ప్రకటించారు. అదే ఉంటే ఓపెన్ యూనివర్సిటీ ఎందుకు అని వారి వాదన. ఇంటర్ తత్సమాన అర్హత.. గతంలో ఇంటర్మీడియట్‌కు సమాన అర్హతగల బీఓఎల్ (బ్యాచలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్)ను ఈ నోటిఫికేషన్లో ప్రస్తావించలేదు. సక్సెస్ స్కూల్లో ఇంగ్లిష్ మీడియం నిర్వహిస్తున్నప్పటికీ ఇంగ్లిష్ మాధ్యమ ఉపాధ్యాయుల పోస్టులకు నోటిఫికేషన్లో తావు లేకుండా పోవడం. గత మూడు డీఎస్సీల్లో ఉర్దూ భాషాపండితులను ఎస్సీ, ఎస్టీ విభాగాలకు కేటాయించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 18 ఉర్దూ ఎస్జీటీలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని డీ రిజర్వ్ చేసి ఓపెన్ కేటగిరి చేయాల్సి ఉంది. ఆ అంశం, నోటిఫికేషన్లో లేదు. ఇలా ఎన్నికల్లో హామీలిచ్చి కొర్రీలు పెట్టి డీఎస్సీ అభ్యర్థులతో చెలగాటమాడుతున్న క్రమంలో మేలో డీఎస్సీ నిర్వహిస్తారా లేదా అనే నియమాంశ అటు విద్యావేత్తల్లో ఇటు అభ్యర్థుల్లో నెలకొంది.