quantum communication
-
Aditi Sen De: అద్వితియ ప్రతిభ
పాపులర్ అయిన తరువాత ఆ బాటలో ప్రయాణించడం విశేషమేమీ కాదు. దార్శనికులు మాత్రం వర్తమానంలో ఉంటూనే భవిష్యత్ వెలుగును దర్శిస్తారు. ఇలాంటి వారిలో ఒకరు అదితి సేన్ డె. ‘క్వాంటమ్’ అనే కాంతి మిణుకు మిణుకుమంటున్న కాలంలోనే దాని ఉజ్వల కాంతిని ఊహించింది అదితి. క్వాంటమ్ సైన్స్‌లో చేసిన కృషికి డా.అదితి సేన్ డె ‘జీడీ బిర్లా అవార్డ్ ఫర్ సైంటిఫిక్ ఎక్సెలెన్స్’ పురస్కారానికి ఎంపికైంది. ఈ అవార్డ్‌కు ఎంపికైన 33వ శాస్త్రవేత్త, తొలి మహిళా శాస్త్రవేత్త అదితి సేన్ గురించి.... అలహాబాద్‌లోని హరీష్చంద్ర రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటేషన్ (క్యూఐసీ)లో అదితి ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. ‘క్యూఐసీ’ అనేది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అత్యున్నత రూపం. ఎన్నో రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల శాస్త్రం. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన పరిశోధన రంగాలలో క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటేషన్ ఒకటి’ అంటుంది అదితి. కోల్‌కతాలో పుట్టి పెరిగిన అదితికి చిన్నప్పటి నుంచి గణితం ఇష్టమైన సబ్జెక్ట్. తల్లి లక్ష్మి టీచర్. తండ్రి అజిత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. కలకత్తా యూనివర్శిటీలో అప్లాయిడ్ మ్యాథమేటిక్స్‌లో ఎంఎస్సీ చేసిన అదితి పోలాండ్లోని గడాన్స్క్ యూనివర్శిటీలో భౌతికశాస్త్రంలో పీహెచ్డీ చేసింది. తన థీసీస్‌కు క్వాంటమ్ ఫిజిక్స్‌కు సంబంధించిన అంశాన్ని ఎంచుకుంది. ‘రెండు వేల సంవత్సరంలో నా కెరీర్‌ను మొదలు పెట్టాను. ఆ సమయంలో క్వాంటమ్ ఫిజిక్స్ ప్రారంభ దశలో ఉంది. పరిమిత సంఖ్యలో అప్లికేషన్లు ఉండేవి’ అంటూ ఆనాటి పరిమితులను గుర్తు తెచ్చుకుంటుంది అదితి. పరిమితులు, ప్రతిబంధకాలతో పనిలేకుండా ‘క్వాంటమ్ ఫిజిక్స్’పై తన ఇష్టాన్ని పెంచుకుంటూ పోయింది. కాలంతో పాటు నడుస్తూ, ఎప్పటికప్పుడు ‘క్వాంటమ్ ఫిజిక్స్’ను అధ్యయనం చేస్తూ ప్రయాణాన్ని కొనసాగించింది. క్వాంటమ్ థర్మల్ యంత్రాల రూపకల్పన(బ్యాటరీలు, రిఫ్రెజిరేటర్లాంటివి) నుంచి క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ అల్గారిథమ్‌ల సమర్థవంతమైన అమలు, సూటబుల్ క్వాంటమ్ సిస్టమ్స్ వరకు... ఎన్నో విషయాలపై పని చేస్తోంది అదితి. ప్రతిష్ఠాత్మక శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డ్ (2018) అందుకుంది. 2022లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ మెంబర్‌గా ఎంపికైంది. క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ స్విన్సిస్టమ్, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ విత్ అల్ట్రా– కోల్డ్ గ్యాసెస్, క్వాంటమ్ కోరిలేషన్స్... మొదలైన వాటికి సంబంధించి అదితి లెక్చర్స్, టాక్స్ ఆదరణ పొందాయి. బెనర్జీ, శ్రీజన్ ఘోష్, శైలాధిత్యలతో కలిసి ‘స్ప్రెడింగ్ నాన్ లోకాల్టీ ఇన్ క్వాంటమ్ నెట్వర్క్స్’, కవన్ మోదీ, అరుణ్ కుమార్, ఉజ్వల్ సేన్లతో కలిసి ‘మాస్కింగ్ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంపాజిబుల్...మొదలైన పుస్తకాలు రాసింది. క్లాసులో పాఠం చెప్పినా, సెమినార్లో ఉపన్యాసం ఇచ్చినా, పుస్తకం రాసినా విషయాన్ని కమ్యూనికేట్ చేయడంలో తనదైన శైలిని ఎంచుకుంది. సంక్లిష్టమైన శాస్త్రీయ విషయాలను సులభంగా అర్థమయ్యేరీతిలో కమ్యూనికేట్ చేయడం ఆమె శైలి. ‘క్వాంటమ్’పై ఆసక్తి చూపుతున్న ఈతరంలోని చాలామందికి మొదటగా గుర్తుకు వచ్చే పేరు అదితి సేన్. ‘క్వాంటమ్’ అనేది ఆమె ఇంటి పేరుగా మారింది. సమన్వయం చేసుకుంటూ... కెరీర్, ఫ్యామిలీలో ఏదో ఒక ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవడంపైనే మహిళా శాస్త్రవేత్తల కెరీర్ కొనసాగుతుందా, ఆగిపోతుందా అన్నట్లుగా ఉంటుంది. అయితే కెరీర్, ఫ్యామిలీని సమన్వయం చేసుకుంటూ వెళితే సమస్యలు ఉండవు. ఒక బిడ్డకు తల్లి అయిన తరువాత తిరిగి పనిలో చేరి అద్భుతమైన శక్తిసామర్థ్యాలను చాటుకున్న మహిళా శాస్త్రవేత్తలు ఎంతోమంది ఉన్నారు. – అదితి సేన్ -
భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే టెక్నాలజీ ఇదే.. కానీ..
ప్రస్తుతకాలంలో కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న సంచలనం అంతాఇంతా కాదు! ఏఐనే మన జీవితాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో ప్రభావం చూపుతోంది. అలాంటిది ఏఐ కంటే ఎన్నోరెట్లు ఎక్కువ సమర్థతో పనిచేసే క్వాంటమ్ కంప్యూటింగ్ అందరికీ అందుబాటులోకి వస్తే ప్రభంజనమే. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్‌లు కలిసి కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో ఎన్నో పరిశోధనలు సాగుతున్నాయి. దాంతో దేశాల మధ్య పోటీ మొదలైంది. కెనడా, అమెరికాల తరువాత సొంతంగా క్వాంటమ్ కంప్యూటర్ను తయారు చేసిన ఘనత ఇటీవలే చైనా సొంతం చేసుకుంది. 2026 నాటికి భారత్ 50 క్యుబిట్ల సామర్థ్యంతో సొంత క్వాంటమ్ కంప్యూటర్ను రూపొందిస్తుందని నాస్కామ్ అంచనా. దానికన్నా ముందు క్వాంటమ్ సిమ్యులేటర్లు, సెన్సర్ల తయారీకి భారత్ సమాయత్తమవుతోంది. క్వాంటమ్ రంగంలో అగ్రశక్తుల్లో ఒకటిగా భారత్‌ను నిలపడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2018లో క్వాంటమ్ ఆధారిత సైన్స్, టెక్నాలజీ (క్వెస్ట్) కార్యక్రమాన్ని ప్రారంభించారు. భవిష్యత్తులో ఇలా.. క్వాంటమ్ పథకం కింద 2023-31 మధ్య కాలంలో సంబంధిత కంప్యూటర్ ప్రాసెసర్లు, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ రూపకల్పన, నిపుణులైన మానవ వనరులను తయారు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆరోగ్య సంరక్షణ, భూగర్భ వనరుల అన్వేషణ, ఉపగ్రహ కమ్యూనికేషన్ల కోసం క్వాంటమ్ సెన్సర్లు తయారు చేస్తారు. భూ, వాయు, జల, అంతరిక్ష మార్గాల్లో ప్రయాణాల కోసం క్వాంటమ్ నావిగేషన్ సాధనాలను రూపొందిస్తారు. క్వాంటమ్ సాంకేతికతలు దేశ భద్రత, బ్యాంకింగ్ రంగానికి మెరుగైన కమ్యూనికేషన్ అందిస్తాయని అభిప్రాయాలు ఉన్నాయి. క్వాంటమ్ సాధనాల తయారీకి కావాల్సిన సూపర్, సెమీ కండక్టర్లు, రకరకాల లోహ మిశ్రమాలను భారత్ సొంతంగా తయారుచేసుకుంటోంది. 2035కల్లా క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో లక్ష కోట్ల డాలర్ల మార్కెట్ రాబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతరిక్ష-వైమానిక, ఆటోమోటివ్, ఫైనాన్స్, ఫార్మా వంటి వివిధ రంగాలకు క్వాంటమ్ కంప్యూటింగ్ అత్యంత వేగవంతమైన సమాచార ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని అందిస్తుందని చెబుతున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా ప్రస్తుత ఎన్క్రిప్షన్ పద్ధతులను ఛేదించే వీలుంది. దీంతో అత్యంత సునిశిత సెన్సర్లను రూపొందించవచ్చు. ఇవి ప్రత్యర్థి సైనిక, ఆర్థిక, కార్పొరేట్, ప్రభుత్వ కమ్యూనికేషన్ వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేయగలవు. పేటెంట్ల నమోదు, క్వాంటమ్ కమ్యూనికేషన్లలో చైనా అమెరికాను మించిపోయింది. భూమి నుంచి అంతరిక్షానికి కమ్యూనికేషన్ యంత్రాంగ నిర్మాణం కోసం అనేక క్వాంటమ్ నానో ఉపగ్రహాలను ప్రయోగించింది. ప్రత్యర్థుల రాడార్లకు చిక్కని స్టెల్త్ జలాంతర్గాములు, యుద్ధవిమానాలను పసిగట్టే క్వాంటమ్ ఆధారిత రాడార్‌నూ చైనా రూపొందించింది. ఇదీ చదవండి: ఒకే బ్యాంకులో వచ్చే రెండేళ్లలో 20 వేలకు పైగా లేఆఫ్స్..! నిపుణులు కరవు.. ప్రపంచ విశ్వవిద్యాలయాల్లో చాలా కొద్ది వర్సిటీలు మాత్రమే క్వాంటమ్ సైన్స్‌ను అందిస్తున్నాయి. ఇప్పటికీ క్వాంటమ్ రంగం కోసం ప్రత్యేక నిపుణులెవరూ తయారు కాలేదు. 2021లో ప్రపంచవ్యాప్తంగా క్వాంటమ్ సాంకేతికతలో అందుబాటులో ఉన్న ఉద్యోగాలు దాదాపు 851 మాత్రమే. ఆ రంగంలో ప్రపంచమంతటా పట్టభద్రులైనవారు కేవలం 290 మందే. నిపుణుల కొరతను తీర్చడానికి ప్రస్తుతం భౌతిక శాస్త్రవేత్తలు, ఇంజినీర్లే క్వాంటమ్ పరిశోధకుల అవతారం దాలుస్తున్నారు. భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీలో నిపుణుల కొరతపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
క్వాంటమ్ మిషన్‌కు ఆమోదం
న్యూఢిల్లీ: క్వాంటమ్ టెక్నాలజీలో శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనలు, అభివృద్ధికి ఉద్దేశించిన నేషనల్ క్వాంటమ్ మిషన్(ఎన్‌క్యూఎం)కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదముద్ర వేసింది. దీనికి వచ్చే ఆరేళ్లలో రూ.6,003.65 కోట్లు వెచ్చిస్తారు. ఈ రంగంలో పరిశోధనలతో దేశంలో మరింత ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ, క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్ విభాగాల్లో నాలుగు థీమాటిక్ హబ్స్(టీ–హబ్స్) నెలకొల్పనున్నట్లు తెలియజేశారు. సినిమాటోగ్రఫీ (సవరణ) బిల్లు–2023కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. సినిమాల పైరసీకి అడ్డుకట్ట వేసే కఠినౖ నిబంధనలను బిల్లులో చేర్చినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడతామని చెప్పారు. ప్రస్తుతమున్న యూ, ఏ, యూఏ అని కాకుండా ప్రేక్షకుల వయసుల విభాగం ఆధారంగా సినిమాలను వర్గీకరించనున్నట్లు పేర్కొన్నారు. -
కీలక మైలురాయి చేరిన ఇస్రో
బెంగళూరు: కమ్యూనికేషన్ వ్యవస్థలో ఇస్రో మరో మైలురాయిని చేరింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తొలిసారిగా 300 మీటర్ల దూరంలో ఫ్రీ-స్పేస్ క్వాంటం కమ్యూనికేషన్‌ను విజయవంతంగా ప్రదర్శించిందని సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో క్వాంటం కమ్యూనికేషన్ రంగంలో గణనీయమైన కృషి చేసిన యూఎస్, యూకె, కెనడా, చైనా, జపాన్ వంటి ఇతర దేశాల సరసన భారతదేశం చేరింది. సాంకేతికంగా స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించడంలో భారత్ మరోసారి తన సత్తా చాటింది. క్వాంటం టెక్నాలజీని ఉపయోగించి ఉపగ్రహ డేటా లీక్ అవ్వకుండా సురక్షితంగా సమాచార వినిమయం జరపడంలో ప్రధాన మైలురాయి అని ఇస్రో తెలిపింది. స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించి ఈ ప్రయోగాన్ని విజయవంతం చేశారు. శాటిలైట్ బేస్డ్ క్వాంటం కమ్యూనికేషన్ (ఎస్బీక్యూసీ)ని ప్రదర్శించాలనే లక్ష్యంలో ఇస్రో ప్రధాన పురోగతి సాధించింది. అసలు ఏంటి ఈ క్యాంటం కమ్యూనికేషన్...? సాధారణంగా మనందరికీ తెలిసే ఉంటుంది. రెండు వ్యవస్ధల మధ్య డేటా కమ్యూనికేషన్ కోసం ఒక నిర్ధిష్టమైన పౌనపున్యాన్ని(బాండ్) ఉపయోగిస్తారు. ఈ సమయంలో మనం పంపించే డేటాలో ఏంతో కొంత లీక్ అవ్వవచ్చును. క్వాంటం కమ్యూనికేషన్స్‌లో క్వాంటం మెకానిక్స్ ఉపయోగించి సమాచార వినిమయం చేస్తారు. సమాచార వినిమయంలో భాగంగా రెండు వ్యవస్థల మధ్య డేటాను ట్విన్ ఫోటాన్ రూపంలో జరుపుతారు. ఈ విధంగా సమాచారాన్ని వినిమయం చేస్తే ఎలాంటి డేటా చౌర్యం జరగదు. క్వాంటం కీ- డిస్ట్రిబ్యూషన్ ఒక రహస్య కీని ఉత్పత్తి చేయడానికి, పంపిణీ చేయడానికి అనుమతిస్తుంది, ఇది సందేశాన్ని ఎన్‌క్రీప్ట్, లేదా డీక్రిప్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ అందిపుచ్చుకోవడానికి చాలా కంపెనీలు పరిశోధనలు చేస్తున్నాయి. -
దీపిక స్థానంలో ప్రియాంక!
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా మరోసారి ‘ఆసియా సెక్సీయస్ట్ విమెన్‌గా’ నిలిచారు. ఇప్పటివరకూ నాలుగుసార్లు ఆసియా సెక్సీయస్ట్ విమెన్‌గా నిలిచిన ఆమె ఐదోసారీ ఈ టైటిల్ గెలుచుకుని శెభాష్ అనిపించుకున్నారు. లండన్‌కి చెందిన ఓ వారపత్రిక నిర్వహించిన పోలింగ్‌లో ఆమె మొదటి స్థానం సంపాదించుకున్నారు. అమెరికా టీవీ సిరీస్ ‘క్వాంటికో’లో ఈ బ్యూటీ ఎంత గ్లామర్ ఒలకబోసిందో తెలిసిందే. ‘క్వాంటికో’తో అక్కడ కూడా అభిమానులను సంపాదించుకున్నారు ప్రియాంక. 50 మందితో నిర్వహించిన పోలింగ్‌లో ఆమె తొలి స్థానంలో నిలవగా, టీవీ నటిగా పాపులర్ అయిన నియాశర్మ ద్వితీయ స్థానంలో నిలిచారు. గత ఏడాది తొలి స్థానంలో నిలిచిన బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోన్ని ప్రియాంక ఈసారి బీట్ చేశారు. అంతకుముందు సంవత్సరం కైవసం చేసుకున్న ‘నంబర్ వన్’ స్థానాన్ని మళ్లీ దక్కించుకున్నారు. ఈ ఏడాది దీపికా మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కుర్రా తార ఆలియా భట్ నాలుగో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో పాక్ నటి మహీరాఖాన్కి కూడా చోటు దక్కింది. ‘‘ఆసియా సెక్సీయస్ట్ విమెన్‌గా’ ఐదోసారి నిలవడం చాలా ఆనందంగా ఉంది. నేనింత అందంగా ఉన్నానంటే దానికి కారణం నా పేరంట్స్ జీన్సే. అలాగే ఐదోసారి ఈ టైటిల్ నాకు దక్కేలా చేసిన అభిమానులు మరో కారణం. నన్ను గెలిపించిన అందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు ప్రియాంకా చోప్రా. -
కమ్యూనికేషన్ వ్యవస్థలో చైనా కొత్త టెక్నాలజీ!
బీజింగ్: సమాచార శాటిలైట్ల తయారీలో చైనా కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. తొలిసారిగా క్వాంటం కమ్యూనికేషన్ శాటిలైట్‌ను ప్రయోగించడానికి చైనా రంగం సిద్ధం చేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా క్వాంటం ఆధారిత కమ్యూనికేషన్ శాటిలైట్‌ను జులైలో ప్రయోగించనున్నట్లు చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్(సీఏఎస్) ప్రకటించింది. క్వాంటం కమ్యూనికేషన్ ద్వారా హై సెక్యురిటీ కమ్యూనికేషన్ వ్యవస్థను నిర్మించుకోవడానికి చైనా ప్రయత్నిస్తోంది. ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలో అవరోధాలకు ఆస్కారం ఉండదని యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ చైనా ప్రొఫెసర్ పాన్ జైన్వెల్ తెలిపారు. మొదటి క్వాంటమ్ శాటిలైట్ తయారీకి చైనా శాస్త్రవేత్తలు ఐదేళ్లు కృషి చేసినట్లు వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. సాధారణ ట్రాన్స్మిషన్ టెక్నాలజీ ద్వారా సమాచారాన్ని దొంగలించడానికి ఉన్నటువంటి అవకాశాన్ని.. క్వాంటం ఆధారిత కమ్యూనికేషన్ శాటిలైట్ వ్యవస్థ నిరోధిస్తుందని సమాచారం.