
కమ్యూనికేషన్ వ్యవస్థలో చైనా కొత్త టెక్నాలజీ!
బీజింగ్: సమాచార శాటిలైట్ల తయారీలో చైనా కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. తొలిసారిగా క్వాంటం కమ్యూనికేషన్ శాటిలైట్ను ప్రయోగించడానికి చైనా రంగం సిద్ధం చేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా క్వాంటం ఆధారిత కమ్యూనికేషన్ శాటిలైట్ను జులైలో ప్రయోగించనున్నట్లు చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్(సీఏఎస్) ప్రకటించింది.
క్వాంటం కమ్యూనికేషన్ ద్వారా హై సెక్యురిటీ కమ్యూనికేషన్ వ్యవస్థను నిర్మించుకోవడానికి చైనా ప్రయత్నిస్తోంది. ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలో అవరోధాలకు ఆస్కారం ఉండదని యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ చైనా ప్రొఫెసర్ పాన్ జైన్వెల్ తెలిపారు. మొదటి క్వాంటమ్ శాటిలైట్ తయారీకి చైనా శాస్త్రవేత్తలు ఐదేళ్లు కృషి చేసినట్లు వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. సాధారణ ట్రాన్స్మిషన్ టెక్నాలజీ ద్వారా సమాచారాన్ని దొంగలించడానికి ఉన్నటువంటి అవకాశాన్ని.. క్వాంటం ఆధారిత కమ్యూనికేషన్ శాటిలైట్ వ్యవస్థ నిరోధిస్తుందని సమాచారం.