చైనా విఫలం.. మనకు లాభమా? | China fails to longmarch 5 rocket failed to put satellite | Sakshi
Sakshi News home page

చైనా విఫలం.. మనకు లాభమా?

Published Tue, Jul 4 2017 9:15 PM | Last Updated on Tue, Sep 5 2017 3:12 PM

చైనా విఫలం.. మనకు లాభమా?

చైనా విఫలం.. మనకు లాభమా?

బీజింగ్‌: చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లాంగ్‌మార్చ్‌ 5 రాకెట్‌ ప్రయోగం విఫలం కావడంతో ఆ దేశ అంతరిక్ష పరిశోధనలకు అడ్డంకి ఏర్పడినట్లయింది. లాంగ్‌ మార్చ్‌ 5 రాకెట్‌ ప్రయోగం ఎందుకు విఫలమైందో ఆ దేశ శాస్త్రవేత్తలు ఇప్పటివరకు ప్రకటించలేదు. హైనన్‌లోని అంతరిక్ష ప్రయోగకేంద్రం నుంచి ఆదివారం లాంగ్‌మార్చ్‌ రాకెట్‌ ప్రయోగాన్ని నిర్వహించారు. అయితే ప్రయోగించిన కొద్ది నిమిషాలకు ప్రయోగం విఫలమైందని అక్కడి మీడియా పేర్కొంది.

లాంగ్‌మార్చ్‌ సిరీస్‌లో ఇప్పటివరకు పలు రాకెట్లను ప్రయోగించిన చైనా ఘన విజయాలు సాధించింది. అయితే ఉన్నట్లుండి లాంగ్‌మార్చ్‌ 5 రాకెట్‌ విఫలం కావడం ఆ దేశ శాస్త్రవేత్తలను ఆందోళనలకు గురి చేస్తోంది. భవిష్యత్తులో ఆ దేశ అంతరిక్ష కార్యక్రమాలకు ఇబ్బందికరంగా మారుతుందని అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

భారత్‌కు ఇది చక్కని చాన్స్‌
చైనా వైఫల్యం భారత అంతరిక్ష ప్రయోగాలకు కలసిరానుందని కొందరు విశ్లేషించారు. ఇప్పటికే ఇస్రో పలు అంతరిక్ష ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించివుండటం తెలిసిందే. చైనా తిరిగి పురోగతి సాధించేందుకు కాస్త సమయం పడుతుంది. ఈ సమయంలో భారత్‌ తన అంతరిక్ష పరిశోధనా కార్యక్రమాలను మరింత విస్తృతి చేసుకుంటే మరింత ముందుకు దూసుకుపోవచ్చని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు సూచించారు.

అంగారక గ్రహ పరిశోధనకు భారత్‌ చేపట్టిన మంగళ్‌యాన్‌ విజయవంతమైంది. చైనా మాత్రం ఇప్పటికీ అంగారక యాత్ర కోసం సన్నాహాలు మొదలుపెట్టకపోవడం గమనార్హం. చైనా వైఫల్యాలను భారత్‌ అందిపుచ్చుకుంటే అంతరిక్ష పరిశోధనా రంగంలో మరిన్ని మైలురాళ్లను అధిగమించగలదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement