Quit India Movement of 1942
-
Quit India Movement: ఉద్యమం కాదు.. మహాభారత యుద్ధం!
స్వాతంత్య్రం కోసం ఇండియా ఎన్నో ఉద్యమాలు చేసింది. వాటిల్లో చివరి ఉద్యమం.. క్విట్ ఇండియా! నిజానికది ఉద్యమం కాదు. ఒక యుద్ధం. భరతజాతి అంతా ఏకమై బ్రిటిషర్లపై విరుచుకుపడిన మహాభారత యుద్ధం! ఆ యుద్ధంతోనే మనం స్వాతంత్య్రాన్ని గెలుచుకున్నాం. ఈ డెబ్బ ఐదేళ్లను నడిపిన ఒక స్ఫూర్తిగా క్విట్ ఇండియా ఉద్యమం నేటితో 80 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇండియాలో బ్రిటిష్ పాలనను తుదముట్టించేందుకు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1942 ఆగస్టు 8న మహాత్మాగాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాంబే సమావేశంలో పిలుపు నిచ్చిన ఉద్యమమే క్విట్ ఇండియా. ఆ రోజున బొంబాయిలో గోవాలియా ట్యాంక్ మైదానంలో చేసిన క్విట్ ఇండియా ప్రసంగంలో గాంధీ ‘డూ ఆర్ డై’ అన్నారు. ఆ వెంటనే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ భారతదేశం నుండి ‘క్రమబద్ధమైన బ్రిటిషు ఉపసంహరణ‘ కోరుతూ భారీ నిరసనను ప్రారంభించింది. ప్రపంచ యుద్ధంలో మునిగి ఉన్నప్పటికీ, ఈ నిరసనలపై చర్య తీసుకోవడానికి బ్రిటిషు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. గాంధీ ప్రసంగించిన గంటల్లోనే భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వం మొత్తాన్నీ విచారణనేది లేకుండా జైల్లో వేసింది. వీళ్లలో చాలామంది యుద్ధం ముగిసే వరకు జైలులోనే, ప్రజలతో సంబంధం లేకుండా గడిపారు. మరోవైపు.. క్విట్ ఇండియాకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం లీగ్, రాచరిక సంస్థానాలు, ఇండియన్ ఇంపీరియల్ పోలీస్, బ్రిటిషు ఇండియన్ ఆర్మీ, హిందూ మహాసభ, ఇండియన్ సివిల్ సర్వీస్, వైస్రాయ్ కౌన్సిల్ (ఇందులో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు)లు బ్రిటిస్ వారికి మద్దతుగా నిలిచాయి! యుద్ధకాలంలో జరుగుతున్న భారీ వ్యయం నుండి లాభం పొందుతున్న భారతీయ వ్యాపారవేత్తలు చాలామంది కూడా క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతు ఇవ్వలేదు. విద్యార్థులు అక్ష రాజ్యాలకు (జర్మనీ, ఇటలీ, జపాన్) మద్దతు ఇస్తూ ప్రవాసంలో ఉన్న సుభాస్ చంద్రబోస్ పట్ల ఎక్కువ ఆసక్తి చూపారు. దాంతో క్విట్ ఇండియా ఉద్యమాన్ని బ్రిటిషు ప్రభుత్వం సమర్థవంతంగా అణì వేయగలిగింది. వెంటనే స్వాతంత్య్రం ఇవ్వడానికి నిరాకరించింది. యుద్ధం ముగిసాక చూద్దాం లెమ్మంది. ఈ ఘర్షణలో దేశవ్యాప్తంగా హింస చెలరేగింది. బ్రిటిషు వారు పదివేల మంది నాయకులను అరెస్టు చేసి, వారిని 1945 వరకు జైల్లోనే ఉంచారు. అయితే, రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన ఖర్చు కారణంగా భారతదేశాన్ని ఇక నియంత్రణలో పెట్టలేమని బ్రిటిషు ప్రభుత్వం గ్రహించింది. మర్యాద కోల్పోకుండా, శాంతియుతంగా ఎలా నిష్కమ్రించాలనే ప్రశ్న యుద్ధానంతరం వారికి ఎదురుగా నిలిచింది. అనంత పరిణామాలు ఇండియా స్వాతంత్య్రానికి పురికొల్పాయి. అసలు క్విట్ ఇండియా ఉద్యమానికి గాంధీ పిలుపునివ్వడానికి క్రిప్స్ మిషన్ చర్చల వైఫల్యం ప్రధాన కారణం. 1942 మార్చి 22 న బ్రిటన్ యుద్ధ ప్రయత్నాలకు మద్దతును పొందటానికి బ్రిటిషు ప్రభుత్వం సర్ స్టాఫోర్డ్ క్రిప్స్‌ను ఇండియా పంపింది. ఆయన బ్రిటిషు ప్రభుత్వపు ముసాయిదా ప్రకటనను సమావేశానికి సమర్పించారు. అందులో రాజ్యాంగ సభ ఏర్పాటు, రాష్ట్రాల హక్కుల వంటివేవో ఉన్నాయి. అయితే అవి కూడా రెండవ ప్రపంచ యుద్ధం ఆగిపోయిన తరువాత మాత్రమే. అంటే ఇప్పుడు కాదు అని. క్రిప్స్ ప్రతిపాదనపై గాంధీజీ వ్యాఖ్యానిస్తూ, ‘‘ఇది మునిగిపోతున్న బ్యాంకుకు చెందిన పోస్ట్ డేటెడ్ చెక్కు’’ అని అన్నారు. -
అజ్ఞాత ఆజ్ఞలు
క్విట్ ఇండియా ఉద్యమకారుల తిరుగుబాట్లు, పోలీసుల దౌర్జన్యాల వార్తలతో పాటుగా 1942 అక్టోబర్ 29న లోహియా అజ్ఞాత రేడియో పది ఆజ్ఞలను (విధులను) నిర్దేశించింది. ఈ పది విధులను ప్రతి భారతీయుడూ ఎటువంటి సమస్య లేకుండా నిర్వహించాలని ఉద్బోధించింది. బ్రిటిష్ వారితో గానీ, వారి ప్రభుత్వంతో గానీ ఎటువంటి వ్యవహారం పెట్టుకోవద్దు. వారికి మీరిచ్చే ధనంగానీ, లేదా మీకు వారిచ్చే ధనంగానీ మన సోదర భారతీయుల రక్తంతో తడిసింది. ప్రతి ఇంటి మీదా, కిటికీ మీద మువ్వన్నెల జెండా ఎగురవేయండి. సినిమాలు చూడవద్దు. ఇతరులను చూడనీయవద్దు. ఎందుకంటే దానికి మీరు వెచ్చించే వ్యయం దుష్ట ప్రభుత్వానికి వెడుతుంది. కోర్టులకెళ్లడం పాపంగా పరిగణించాలి. విదేశీ వస్తువులు కొనవద్దు.ప్రభుత్వ బ్యాంకుల నుండి మీ ధనం తీసేయండి.న్యాయం లేని ప్రభుత్వానికి సేవలందించే అధికారులను బాయ్‌కాట్ చెయ్యండి. కోర్టుకు వెళ్లే అవసరమున్న ఏ వ్యవహారమైనా కొనసాగించవద్దు.నగరాలు వదలండి, పల్లెలకు తరలండి. రైతు పండించే ధాన్యం మొదలైనవి అతని దగ్గరే వుండనివ్వండి.. ఇవీ ఆ ఆజ్ఞలు. అవి క్విట్ ఇండియా ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న రోజులని గుర్తు పెట్టుకోవాలి. అంతేకాదు, అవి రెండో ప్రపంచ యుద్ధం రోజులు కూడా. బ్రిటిషు ప్రభుత్వం నడిపే ఆల్ ఇండియా రేడియో స్టేషన్లు ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, లక్నో, మద్రాసు, తిరుచిరాపల్లిలలో మాత్రమే వున్నాయి. ఇవేకాక తిరువాంకూరు, మైసూరు, హైదరాబాదు, ఔరంగాబాదు సంస్థానాలు నడిపే రేడియో కేంద్రాలున్నాయి. అయితే ఇవేవీ ప్రజల స్పందనను గానీ, స్వాతంత్య్ర ఉద్యమం వార్తలు కానీ ఇవ్వడం లేదు. వార్తాపత్రికలు సెన్సార్ కాకుండా అచ్చు కావడంలేదు. ఆ సమయంలో లోహియా రహస్య రేడియో కేంద్రాలు కీలకపాత్ర పోషించాయి. అవి రోజుకు ఒకసారి ఇంగ్లీషులో, మరోసారి హిందూస్తానీలో అంటే రెండుసార్లు, ప్రతిసారి సుమారు అరగంటపాటు ప్రసారాలు అందించేవి. వార్తలు, వార్తా సమీక్షలు, గాంధీజీ, వల్లభ్‌భాయ్ పటేల్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి నాయకుల ప్రసంగాలు; భారతీయ స్వాతంత్య్ర ఉద్యమం ప్రత్యేకత, డూ ఆర్ డై కార్యాచరణ వెనుక ఉండే తాత్విక నేపథ్యం, వర్తమాన విషయాలపై ప్రశ్నోత్తరాలు.. ఇలా చాలా ప్రయోజనకరంగా ఆ రేడియో ప్రసారాలు ఉండేవి. ఇంకా పగటిపూట శుభాకాంక్షలు, మతాల మధ్య సామరస్య ప్రబోధం కూడా ఈ ప్రసారాలలో కనబడేది. మచ్చుకు కొన్ని భారతదేశం స్వాతంత్య్రం సముపార్జించటానికి 9 కోట్ల ముస్లింలు వ్యతిరేకమనే అబద్ధ ప్రచారాన్ని గమనించమని 1942 అక్టోబరు 12 ఈద్ రోజున ప్రసారమైంది. విజయదశమి అంటే చెడు మీద మంచి విజయం. అబద్ధం మీద నిజం సాధించే విజయం. నిజాల్ని దాచే వార్తా పత్రికలు చదవకండి (1942 అక్టోబరు18). తెల్ల పోలీసులు భారతీయ స్త్రీలను చెరచడం అనే సమస్య ఎదుర్కోవడం నుంచి, నగరాల నుంచి ప్రజలు గ్రామాలకు తరలి వెళ్లడం వరకు ఎన్నో ప్రశ్నలకు జవాబులిచ్చారు (1942 అక్టోబరు 19) . పోస్ట్ ఆఫీసుల్లో ధనం పెట్టవద్దని కూడా వివరంగా ప్రకటించారు. రైతులు, భూస్వాములు, అప్పులిచ్చే వాళ్లు ఏకమైతే చాలు తిండిలేక బ్రిటిషు సైనికులు మాడిపోతారు అంటూ డూ ఆర్ డై నియమానికి సంబంధించిన లోతులు (1942 అక్టోబరు 20) వివరించారు. ప్రత్యేక ప్రసారం భారతీయ స్వాతంత్య్ర ఉద్యమం చాలా ప్రత్యేకమైందని 1942 అక్టోబరు 21న చేసిన ప్రసారంలో కనబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా గత 200 సంవత్సరంలో జరిగిన విప్లవాలతో పోల్చి ఒక్క భారతదేశంలోనే పేదలు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నట్లు విశదం చేశారు. రష్యన్ విప్లవంలో కేవలం ఒక శాతం జనాభా పాల్గొనగా, ఫ్రెంచి విప్లవంలో సైతం కొందరే పాలుపంచుకున్నారు. వారందరూ ధనికులే కాని పేదలు కాదు. సాంప్రదాయకంగా విప్లవాల పంథాలో పోకుండా, ఆయుధాలు లేని పేదవారు పెద్ద సంఖ్యలో పాల్గొనడం భారతదేశంలో ఒక ప్రత్యేకత. భారతదేశంలో అనాదిగా వుండే శాంతి భావన, నిరాయుధీకరణ, గాంధీజీ అహింసా ప్రబోధం కలగలిసి భారత స్వాతంత్యోద్య్రమాన్ని ప్రపంచంలోనే సరికొత్తగా రూపొందించాయి.. అంటూ సాగిన ఈ ప్రసంగం ఎంతో విజ్ఞాన భరితమైంది. జాతికవసరమైన ఎన్నో ప్రబోధాలు రామ్ మనోహర్ లోహియా సారథ్యంలో ఆనాటి సీక్రెట్ రేడియో దేశానికందించింది. – డా నాగసూరి వేణుగోపాల్‌ఆకాశవాణి పూర్వ సంచాలకులు (చదవండి: క్విట్ ఇండియా సీక్రెట్ సెగ ఏడు గుర్రాల రేడియో) -
క్విట్ ఇండియా సీక్రెట్ సెగ ఏడు గుర్రాల రేడియో
‘క్విట్ ఇండియా’ ఉద్యమ సమయంలో 1942 ఆగస్టు 27 నుంచి నవంబర్ 12 వరకు.. అంటే బ్రిటిష్ ప్రభుత్వం కనిపెట్టేవరకు 78 రోజుల పాటు రామ్ మనోహర్ లోహియా అజ్ఞాత ప్రదేశాల్లోంచి నడిపించిన సీక్రెట్ రేడియో (బ్రిటిష్‌వారి దృష్టిలో ‘కాంగ్రెస్ ఇల్లీగల్ రేడియో’).. అదే ఏడాది జర్మనీలో సుభాస్ చంద్రబోస్ ప్రారంభించిన ‘ఆజాద్ హింద్ రేడియో’కు భిన్నమైనది. క్విట్ ఇండియా స్వర్ణోత్సవాల సందర్భంగా ఆ తర్వాతి ఏడాది 2018లో కేంద్రప్రభుత్వ సంస్థ పబ్లికేషన్ డివిజన్ ప్రచురించిన ‘అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ బ్రాడ్కాస్ట్ డ్యూరింగ్ క్విట్ఇండియా మూవ్మెంట్’ అనే పుస్తకంలో ఆ సీక్రెట్ రేడియోకు సంబంధించి విస్మయకరమైన అనేక వివరాలు ఉన్నాయి. ఐదారు చోట్ల నుంచి! అంతరాయం లేకుండా వివిధ స్థలాల నుంచి కనీసం మూడు ట్రాన్స్మీటర్లు నడిచేవి. ఈ 78 రోజుల (అధికారుల రికార్డుల ప్రకారం 71) రోజుల ప్రసారాలు ఐదారు చోట్ల నుంచి, నాలుగైదు ఫ్రీక్వెన్సీల నుంచి సాగాయి. పరుపులు, సూట్‌కేసులతో ట్రాన్స్‌మీటర్ పరికరాలను వేర్వేరు చోట్లకు బ్రిటిష్‌వాళ్ల కళ్లు కప్పడానికి తరలించేవారు. నవంబరు 12 దాకా ఈ ప్రసారాలు ఆగకపోవడం గమనార్హం. 41.78, 42.34, 41.12, 42.12 మీటర్ల మీద ప్రసారాలు జరిగాయని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఉదయం, రాత్రి 9 గంటల సమయంలో అరగంటసేపు ఈ ప్రసారాలు సాగేవి. ‘హిందుస్థాన్ హమారా’ అనే పాటతో మొదలై వందేమాతరం గీతంతో ముగిసేవి. 10 వాట్ల ప్రసారశక్తిని, 100 వాట్లు చేయడానికి కృషి చేసి సఫలీకృతులయ్యారు. ఇక ఈ ప్రసారాలు నిర్వహించిన యువసైన్యం వివరాలు ఉత్తేజం కలిగిస్తాయి. బాబూ భాయ్ బొంబాయిలో ఫోర్త్ స్టాండర్డ్ దాకా మాత్రమే చదివిన 20 సంవత్సరాల గుజరాత్ యువకుడు బాబూ భాయ్.. (అసలు పేరు విఠల్దాస్ మాధవి ఖక్కడ్) కిరోసిన్‌తో కారు నడిపే యంత్రం (కేరో గ్యాస్) తయారీ వ్యాపారంలో ఉన్నవాడు.. ఈ సీక్రెట్ రేడియోకు ముఖ్య నిర్వాహకుడిగా ఉన్నాడు. రామ్ మనోహర్ లోహియా ప్రణాళికను విజయవంతంగా నిర్వహించిన ఘనుడు ఇతనే. 1943 మే తీర్పు ప్రకారం ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఇతను ఈ రేడియో ప్రసారాల కారణంగా అనుభవించాడు. నారీమన్ అబరాబాద్ నలభై ఏళ్ల పార్సీ నారీమన్ అబరాబాద్ ప్రింటర్ రావల్పిండిలో జన్మించి లాహోర్‌లో చదువుకున్నారు. మెట్రిక్యులేషన్ తరవాత వైర్లెస్ విజ్ఞానం పట్ల ఆసక్తి కలిగి బొంబాయి టెక్నికల్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ప్రారంభించి అందులో శిక్షణ ఇచ్చేవారు. ఇంగ్లండు వెళ్లి టెలివిజన్ గురించి అధ్యయనం చెయ్యాలని ప్రయత్నించి సఫలుడు కాలేక వెనక్కు వచ్చి బాబూభాయ్ కేరోగ్యాస్ వాణిజ్యంలో చేయి కలిపారు. దీన్ని కూడా నిషేధించాక, బాబూ భాయ్‌కు సీక్రెట్ రేడియో ట్రాన్స్‌మీటర్ నిర్మించి ఇచ్చారు ఈ ప్రింటర్ మహాశయుడు. మరో నలుగురు బాబూ భాయ్, ఉషా మెహతా, నారిమన్‌తో పాటు గుజరాత్ భావనగర్ ప్రాంతానికి చెందిన 28 సంవత్సరాల విఠల్దాస్ కాంతాభాయ్ జవేరీ, బర్కానా సింథ్ ప్రాంతానికి చెందిన 40 సంవత్సరాల వైర్లెస్ నిపుణులు నానక్ ఘర్చంద్ మోత్వానే, బొంబాయికి చెందిన 23 సంవత్సరాల చంద్రకాంత్ బాబుభాయ్ జవేరీ, బొంబాయికే చెందిన 27 సంవత్సరాల జగన్నాథ రఘునాథ్ ఠాకూర్లు లోహియా రేడియోలో కీలకపాత్రలను పోషించారు. ఇంకా ఎంతోమంది ఇందులో భాగస్వాములయ్యారు. కొందరి పేర్లు మాత్రమే ఇంటెలిజన్స్ రికార్డులలో ఉన్నాయి కనుక వారి పేర్లు మాత్రమే ఈ పుస్తకంలో పేర్కొన్నారు. కానీ ఎందరో అజ్ఞాత వీరుల సేవల గురించీ, ఈ సీక్రెట్ రేడియో గురించీ.. 1988 దాకా నేషనల్ ఆర్కైవ్స్‌లో దాగివున్న ఈ పోలీసు ఫైలు పరిశోధకులు గౌతమ్ ఛటర్జీ కంటపడకపోతే.. మనకు తెలిసి వుండేది కాదు. ఆ అజ్ఞాత వీరులు దేశవ్యాప్తంగా సమాచారం సేకరించి ఆ చీకటి రోజుల్లో రేడియో ప్రసారాల క్రతువుకు ఇచ్చేవారు. –డా నాగసూరి వేణుగోపాల్‌ఆకాశవాణి పూర్వ సంచాలకులు (చదవండి: క్విట్ ఇండియా రేడియో! సీక్రెట్ ఫైల్స్) -
క్విట్ ఇండియా రేడియో! సీక్రెట్ ఫైల్స్
క్విట్ ఇండియా ఉద్యమ వేళ 1942లో ఒక రహస్యవాణి 78 రోజులపాటు ఈ జాతిని ప్రభావితం చేసింది. అప్పటి బ్రిటిష్ పాలకులు దీనిని ‘కాంగ్రెస్ ఇల్లీగల్ రేడియో’ అని పిలిచారు. అయితే దాన్ని నిర్వహించిన నాయకులు ‘కాంగ్రెస్ రేడియో’ అని పిలిచారు. దివంగత సోషలిస్టు రచయిత మధు లిమాయే ‘ఆజాద్ రేడియో’ అని పేర్కొన్నారు. ఈ రహస్య ప్రజావాణికి వ్యూహకర్త రామ్ మనోహర్ లోహియా! ఈ రేడియో ప్రసారాల క్రతువు నిర్వహించిన బృందం 20 నుంచి 40 ఏళ్ల వయసు గల ఏడు యువకిశోరాలు! ఇంతవరకు పూర్తిగా తెలియని ఈ సమాచారం మనకు గొప్ప తృప్తినీ, గర్వాన్ని ఇస్తుంది. కరేంగే.. యా మరేంగే 1942 ఆగస్టులో గాంధీజీ బ్రిటిష్ వారి దుష్టపాలనకు మృత్యుగీతం రచిస్తూ ‘కరేంగే... యా మరేంగే’ అనే పిలుపునిచ్చారు. అది జాతిమంత్రమై దేశం ఎల్లెడలా పాకింది. బ్రిటిషు అధికారులు ఈ నాయకులను అగ్రస్థాయి నుంచి, అడుగున బ్లాకు స్థాయి దాకా చెరసాలల్లో నింపేశారు. ఆ సమయంలో చాలామంది సోషలిస్టు నాయకులు తప్పించుకుని రహస్యంగా ఉద్యమంలో సాగారు. అరెస్టుల కారణంగా 1942 ఆగస్టు 9 నుంచి ఉద్యమం నాయకత్వాన్ని కోల్పోయింది. ఆ సమయంలో దిశానిర్దేశం చేసిన రహస్య మాధ్యమం ‘కాంగ్రెస్ రేడియో’! 1942 ఆగస్టు 27 నుంచి బ్రిటిషు ప్రభుత్వం కైవశం చేసుకునే దాకా (అంటే 1942 నవంబర్ 12 దాకా) గొప్ప సేవలందించింది. 1988 ఫిబ్రవరి 13 సంచిక మరాఠీ పత్రిక ‘సాధన’లో సోషలిస్టు నాయకుడు మధు లిమాయే ఈ చరిత్రాత్మక ఆధారాలు రాస్తూ నాసిక్‌లోని శంకరాచార్య మఠంలో ఆజాద్ రేడియో పరికరాలను విఠల్‌రావ్ పట్వర్థన్ తెచ్చి ఉంచారనీ, అక్కడ నుంచి ప్రసారాలు చేయాలని తలంచినా, పోలీసు దాడిని ఎదుర్కోవలసి వస్తుందని గోదావరి నదిలో పడవేశారని పేర్కొన్నారు. పోలీస్ మానిటరీ రిపోర్ట్! ‘అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ బ్రాడ్కాస్ట్ డ్యూరింగ్ క్విట్ఇండియా మూవ్మెంట్’ అనే పుస్తకం 2018లో కేంద్ర ప్రభుత్వ సంస్థ పబ్లికేషన్ డివిజన్ ప్రచురించింది. దాని ప్రకారం ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్, న్యూఢిల్లీకి చెందిన పరిశోధకులు గౌతమ్‌చటర్జీ 1984 నుంచి నేషనల్ ఆర్కైవ్స్‌లో గాలించి, పరిశోధన చేశారు. వీరికి ‘పోలీస్ మానిటరీ రిపోర్ట్’ అనే పోలీసు ఇంటెలిజెన్స్ సీక్రెట్ ఫైల్ తారసపడింది. దీన్ని గురించి ఎవరూ ఎక్కడా రాయలేదు. అప్పట్లో ‘ఆజాద్ రేడియో’ ప్రసారాలను గమనిస్తూ, బ్రిటిష్ పోలీసులు తయారు చేసిన రహస్య ఫైలు ఇది. ఇందులో అక్టోబరు 9 నుంచి పోలీసులు నమోదు చేసిన ప్రసారాల వివరాలున్నాయి. ఇవి దేశ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసిన పోలీసు ఇంటెలిజెన్స్ అధికారులు పరిశీలించిన అంశాలు. ఈ రేడియో ప్రసార విషయాలను గమనిస్తే కరాచీ నుంచి బృందావనం దాకా, అలహాబాద్ నుంచి బెంగాల్ దాకా, బిహార్ నుంచి మద్రాసు దాకా, కోయంబత్తూరు నుంచి త్రివేండ్రం దాకా, గుజరాత్ నుంచి మహారాష్ట్ర దాకా సమాచారాన్ని సవ్యంగా ఇచ్చారని బోధపడుతుంది. కీలకం.. లోహియా! ‘... స్కాట్ సిద్ధం చేసిన నివేదికలు జాగ్రత్తగా పరిశీలించాను. కాంగ్రెస్ సోషలిస్టు భావాలతో సాగిన ఈ ప్రసారాలకు కీలకం సోషలిస్ట్ రాజకీయ నాయకుడు రామ్ మనోహర్ లోహియా అని తెలిసింది. రైతులు, కార్మికుల కోసమే స్వాతంత్య్ర భారతదేశమని అక్టోబరు 23వ తేదీ ప్రసారాలలో ప్రకటించడం గమనార్హం. అలాగే అక్టోబరు 27వ తేదీన స్వాతంత్య్రం కోసం విప్లవం అనేది పేదల కోసం విప్లవం. రైతుల కోసం, కార్మికుల కోసమే ఈ స్వాతంత్య్ర భారతం’’ అని బ్రిటిష్ గవర్నమెంట్ అడిషనల్ సెక్రటరీ హెచ్.వి.ఆర్. అయ్యంగార్ ఈ ఆజాద్ రేడియో ప్రసారాల పూర్వాపరాల గురించి అప్పటి ప్రభుత్వానికి వివరించారు. సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ద్వారా నిర్వహించిన ‘ఆజాద్ హింద్ రేడియో’కు భిన్నమైనది ఈ ఆజాద్ రేడియో. – డా. నాగసూరి వేణుగోపాల్‌ఆకాశవాణి పూర్వ సంచాలకులు (చదవండి: అఖండ భారత స్వతంత్ర ప్రధాని: మౌలానా బర్కతుల్లా) -
గాంధీతో ప్రయాణం మరువలేను
సాక్షి, నందనవనం : బానిస సంకెళ్ల నుంచి భరతమాతకు విముక్తి కల్పించే సమరంలో పాలుపంచుకున్న అనుమాల అశ్వద్ధనారాయణ అలనాటి జ్ఞాపకాలను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్నారు. జరుగుమల్లి మండలం నందనవనం గ్రామానికి చెందిన అశ్వద్ధ నారాయణ 1942వ సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన వయసు 91 సంవత్సరాలు. భార్య లక్ష్మమ్మ, కుమారుడు దినేష్ ఉన్నారు. అశ్వద్ధనారాయణ బీఏ, లా చదివే సమయంలో ఉద్యమంలో తనదైన పాత్ర పోషించారు. నెల్లూరు సమీపంలో రైలు పట్టాలు తొలగించిన కేసులో బ్రిటిష్ పాలకులు అరెస్టు చేసి బళ్లారి జైల్లో ఖైదు చేశారు. 1946లో నెల్లూరు నుంచి చెన్నై వరకు గాంధీజీతో రైలులో ప్రయాణించానని, ఆ అనుభవం తాను ఎన్నటికీ మరువలేనంటున్నారాయన. గాంధీజీని అంత దగ్గరగా చూస్తానని తాను ఎన్నడూ అనుకోలేదని ఆనాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. తన 20 ఎకరాల పొలాన్ని స్వాతంత్య్ర ఉద్యమం కోసం విక్రయించగా ప్రస్తుతం 2 ఎకరాలు మాత్రమే మిగిలింది. కందుకూరు మండలం పలుకూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మాణానికి తన సొంత స్థలం దానంగా ఇచ్చి నిధులు ఖర్చు చేశారు. నేటికీ ఆయన పేరు పాఠశాల శిలాఫలకంపై ఉంది. ఆగస్టు 15వ తేదీన ఢిల్లీలోని ఎర్రకోటలో స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి అశ్వద్ధ నారాయణకు ఆహ్వాన పత్రం అందింది. అయితే అనారోగ్య కారణాల వల్ల తన తండ్రి ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారని కుమారుడు దినేష్ వివరించారు. దినేష్ ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. -
క్విట్ ఇండియాకు ఊపిరులూదిన రేడియో
బ్రిటిష్ వారితో గానీ, వారి ప్రభుత్వంతో గానీ ఎటువంటి వ్యవహారం పెట్టుకోవద్దు. వారికి మీరిచ్చే ధనంగానీ, లేదా మీకు వారిచ్చే ధనంగానీ మన సోదర భారతీయుల రక్తంతో తడిసింది. ప్రతి ఇంటి మీదా, కిటికీ మీద మువ్వన్నెల జెండా ఎగురవేయండి. కోర్టులకెళ్ళడం పాపంగా పరిగణించాలి. విదేశీ వస్తువులు కొనవద్దు. ప్రభుత్వ బ్యాంకుల నుండి మీ ధనం తీసేయండి. న్యాయం లేని ప్రభుత్వానికి సేవలందించే అధికారులను బాయ్‌కాట్ చెయ్యండి. రైతు పండించే ధాన్యం మొదలైనవి అతని దగ్గరే ఉండనివ్వండి. ఇలాంటి పది విధులను ప్రతి భారతీయుడు తప్పకుండా నిర్వహించాలని 1942 అక్టోబరు 29వ తేదీన రహస్య ఆకాశవాణి కాంగ్రెస్ రేడియో హిందూస్తానీలో ఉద్బోధించింది. అవి క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులు. అంతేకాదు, అవి రెండో ప్రపంచ యుద్ధం రోజులు కూడా. బ్రిటిష్ ప్రభుత్వం నడిపే ఆల్ ఇండియా రేడియో స్టేషన్లు ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, లక్నో, మద్రాసు, తిరుచ్చురాపల్లిలు మాత్రమే ఉన్నాయి. ఇవేకాక తిరువాంకూరు, మైసూరు, హైదరాబాదు, ఔరంగాబాదు సంస్థానాలు నడిపే రేడియో కేంద్రాలున్నాయి. అయితే ఇవేవీ ప్రజల స్పందననుగానీ, స్వాతంత్య్ర ఉద్యమం వార్తలు కానీ ఇవ్వడం లేదు. వార్తాపత్రికలు సెన్సార్ కాకుండా అచ్చు కావడంలేదు. దాంతో భాగ్యనగర్ రేడియో వంటి రహస్య రేడియో కేంద్రాలు కీలకపాత్ర పోషించాయి. 1942 ఆగస్టు 27 నుంచి నవంబరు 12 వరకు 78 రోజులపాటు రామమనోహర్ లోహియా పర్యవేక్షణలో కాంగ్రెస్ రేడియో గొప్పగా సాగింది. మనదేశంలో 1927 జూలై 23న వ్యవస్థీకృతమైన రేడియో ప్రసారాలు మొదలయ్యాయనే కారణంతో ఆరోజును భారత ప్రసార దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా విలువైన ప్రసారాలు చేసి గొప్ప చరిత్ర సృష్టించిన ఈ ఆజాద్ రేడియో గురించి తెలుసుకోవాలి. ప్రభుత్వం కన్నుగప్పడానికి కొన్నిరోజులకొకసారి ప్రసార ఫ్రీక్వెన్సీతోపాటు ట్రాన్స్‌మీటర్ స్థానం ఆరేడుచోట్లకు మార్చారు. విఠల్దాస్ కాకర్, ఉషా మెహతా, విఠల్దాస్ జవేరి, నానక్ మెత్వానివంటి మెరికల్లాంటి నలుగురు యువతీయువకులతో ఈ ప్రసారాలలో తోడ్పడ్డారు. ఇంటెలిజెన్స్ సీక్రెట్ ఫైల్స్ ఆధారంగా ఈ కాంగ్రెస్ రేడియో లేదా ఆజాద్ రేడియో గురించి మరిన్ని విషయాలు ఇటీవలే బయల్పడ్డాయి. రోజుకు ఒకసారి ఇంగ్లిష్‌లో, మరోసారి హిందూస్తానీలో అంటే రెండుసార్లు, ప్రతిసారి సుమారు అరగంటపాటు ప్రసారాలు చేసిన ఈ రేడియో ఎటువంటి విషయాలు ఇచ్చిందనే అంశంపై అధ్యయనం ప్రారంభించినపుడు ఈ వ్యాసం మొదట్లో పేర్కొన్న విషయాలు తారసపడ్డాయి. ఈ సమాచారంతో 2018లో ‘అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ బ్రాడ్కాస్ట్ డూరింగ్ క్విట్ఇండియా మూమెంట్’ అనే పుస్తకం వెలువడింది. ఈ 78 రోజుల ప్రసారాలు హిందూస్తాన్ హమారా అనే పాటతో మొదలై వందేమాతరం పాటతో ముగిసేవి. వార్తలు, వార్తా సమీక్షలు, గాంధీ, వల్లభ్‌భాయ్ పటేల్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి నాయకుల ప్రసంగాలు, భారతీయ స్వాతంత్య్ర ఉద్యమం ప్రత్యేకత, డూ అండ్ డై కార్యాచరణ వెనుక ఉండే తాత్విక నేపథ్యం, వర్తమాన విషయాలపై ప్రశ్నోత్తరాలు– ఇలా చాలా ప్రయోజనకరంగా ఆ రేడియో కార్యక్రమాలు ఉండేవి. భారతీయ స్వాతంత్య్ర ఉద్యమం చాలా ప్రత్యేకమైందని 1942 అక్టోబరు 21న చేసిన ప్రసారంలో కనబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా గత 200 ఏళ్లలో జరిగిన విప్లవాలలో పోల్చి ఒక భారత్‌లోనే పేదలు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నట్లు విశదం చేశారు. రష్యన్ విప్లవంలో కేవలం ఒక శాతం జనాభా పాల్గొనగా, ఫ్రెంచి విప్లవంలో సైతం కొందరే పాలుపంచుకున్నారు. వీరందరూ ధనికులే కానీ పేదలు కాదు. సాంప్రదాయకంగా విప్లవాల పంథాలో పోకుండా, ఆయుధాలు లేని పేదవారు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఒక ప్రత్యేకత. భారత్‌లో అనాదిగా ఉండే శాంతి భావన, నిరాయుధీకరణ, గాంధీ అహింసా ప్రబోధం కలగలిసి భారత స్వాతంత్య్రోద్యమాన్ని ప్రపంచంలోనే సరికొత్తగా రూపొందించాయి. ఇటువంటి కారణాలతో భారత స్వాతంత్య్రోద్యమం విశేషమైంది, విలక్షణమైంది. జాతికవసరమైన ఎన్నో ప్రబోధాలు రామ్మనోహర్ లోహియా సారథ్యంలో ఆనాటి ఆజాద్ రేడియో దేశానికందించింది. ఈ రేడియో సాగింది 78 రోజు లైనా ప్రసారం చేసిన సమాచారం, మార్గదర్శకత్వం మాత్రం విలువైనవి. డా.నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త వర్తమానాంశాల పరిశోధకులు, పత్రికా రచయిత, మొబైల్ : 94407 32392 -
న్యాయ పోరాటంలో ఓడిన సమరయోధుడి భార్య
సైనిక్ సమ్మాన్ పెన్షన్ కు ఆమె అర్హురాలు కాదన్న సుప్రీం న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుడి భార్య పింఛన్ కోసం జరిపిన సుదీర్ఘ న్యాయ పోరాటంలో ఓడిపోయింది. ఆమె పెన్షన్ కు అర్హురాలు కాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. స్వాతంత్య్ర పోరాటంలో ఆర్నెల్లకు మించి అజ్ఙాతంలో గడిపినా లేదా ఆర్నెల్లకు మించి జైల్లో ఉన్న వారే పెన్షన్ కు అర్హులంటూ న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్ భానుమతిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. 1942 క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా 13 రోజులు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి భార్యకు ‘స్వతంత్ర సైనిక్ సమ్మాన్ పెన్షన్ స్కీమ్ 1980’కింద పింఛన్ ఇప్పించాల్సిందిగా కోరుతూ 1993 ఏప్రిల్‌లో అప్పటి బిహార్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయితే కేంద్రం 2000 జూలైలో ఆమె అందుకు అర్హురాలు కాదని ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆమెకు మద్దతుగా నిలవటంతో కేంద్రం సుప్రీం కోర్టును ఆదేశించింది. ఆ కేసును ఇటీవల సుప్రీం కోర్టు కొట్టేసింది.