quit services
-
మంగళ్యాన్ కథ ముగిసింది
బెంగళూరు: అంగారక (మార్స్) గ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చేపట్టిన మంగళ్యాన్ మిషన్ ముగిసింది. మార్స్ ఆర్బిటార్ క్రాఫ్ట్తో గ్రౌండ్ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయినట్లు ఇస్రో సోమవారం ధ్రువీకరించింది. 2013 నవంబర్ 5న ఆర్బిటార్ ప్రయోగం ప్రారంభించారు. ఆర్బిటార్ 300 రోజులపాటు ప్రయాణించి 2014 సెప్టెంబర్ 24న అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ ఎనిమిదేళ్ల కాలంలో అరుణగ్రహం ఉపరితలంపై వాతావరణ పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందించింది. మంగళ్యాన్ జీవితకాలం ముగిసిందని, పని చేయడం ఆగిపోయిందని, ఆర్బిటార్‌ను ఇక రికవరీ చేయలేమని ఇస్రో అధికారులు స్పష్టం చేశారు. ఇతర గ్రహాలపై పరిశోధనల విషయంలో మంగళ్యాన్ అద్భుత సాంకేతిక, శాస్త్రీయ ప్రయోగంగా మిగిలిపోతుందని ఒక ప్రకటనలో వెల్లడించారు. -
నగరంలో నిలిచిన ఆర్టీసీ బస్సులు
హైదరాబాద్: తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. కంటోన్మెంట్ డిపోలో రెండు రోజుల క్రితం కార్మికులు విధులను బహిష్కరించిన విషయం తెలిసిందే. గురువారం మరోసారి మరిన్ని డిపోల్లో విధులకు హాజరుకాలేదు. సికింద్రాబాద్ రీజియన్‌లోని రాణిగంజ్1, 2, కుషాయిగూడ, చెంగిచర్ల, హకీంపేటలో కార్మికులు విధుల్లోకి రాకపోవటంతో వందలాది బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.