Quli Qutb Shah
-
భాగ్యనగరం.. కులీ కలల స్వర్గం
విశ్వనగరం..ఐటీ హబ్..హెరిటేజ్ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌కు ఘన చరిత్ర ఉంది. నాలుగుశతాబ్దాల చరిత్ర కలిగినభాగ్యనగరం.. నాడు నిజాం స్టేట్.. ఉమ్మడి తెలుగురాష్ట్రాలకు రాజధాని. నేడు తెలంగాణ రాజధాని..ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ నగర నిర్మాత కులీకుతుబ్ షా 452వ జయంతి సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. సాక్షి సిటీబ్యూరో: గోల్కొండప్రభువైన ఇబ్రహీం కులీ కుతుబ్ షా మూడో కుమారుడైన మహ్మద్ కులీకుతుబ్ షా 1566 ఏప్రిల్ 4న గోల్కొండ కోటలో జన్మించాడు. చిన్నతనంత నుంచే కులీ కుతుబ్ షా తెలివైన వాడిగా, ధైర్యవంతుడిగా, అన్నిరంగాల్లోనూ ప్రావీణ్యుడిగా గుర్తింపు పొందాడు. 1580లో ఇబ్రహీం కులీకుతుబ్ షా మరణించాడు. తండ్రి సూచనల మేరకు అప్పటికే అన్ని రంగాల్లో ప్రావీణ్యం పొందిన ముహ్మద్ కులీకుతుబ్ షా 14వ ఏటనే పాలనాపగ్గాలు చేపట్టాడు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన తండ్రి ప్రారంభించిన పనులను పూర్తి చేసి ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. కోటలో జనాభా పెరిగిపోవడంతో ఇళ్ల నిర్మా్ణం సమస్యగా మారింది.. ఈ నేపథ్యంలో భాగ్యనగర నిర్మాణానికి బీజం పడింది. తండ్రి కోరిక మేరకు మూసీ నదికి దక్షిణాన నగరం నిర్మించాలని రంగం సిద్ధమైంది. దక్షిణ పరీవాహక ప్రాంతం, చార్మినార్ ప్రాంతాల్లో నేలను పరీక్షించారు. అలాగే నగరం ఉత్తర ముఖంగా ఉండేలా భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. గోల్కొండ నుంచి ముసొలిపట్నం (మచిలీపట్నం) వెళ్లే మార్గంలో తూర్పు నుంచి పడమరకు 90 డిగ్రీల కోణంలో ఉత్తరం, దక్షిణాన్ని కలిపేలా నగరాన్ని నిర్మించాలని నిర్ణయించారు. అదేవిధంగా చార్మినార్‌కు నాలుగు వైపులా విశాలమైన రోడ్డు ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించారు. చార్మినార్‌కు పడమర వైపు బజార్, ఉత్తర దిశలో చార్సూ హౌస్ ( నేడు గుల్జార్‌హౌస్), దానికి నాలుగు వైపులా కమాన్లు నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. కమాన్ల పడమర వైపు రాజ మహల్లు, తూర్పు వైపున జనావాసాలు నిర్మించాలనుకున్నారు. చార్మినార్‌ను కేంద్రంగా చేస్తూ ఐదుమైళ్ల విస్తీర్ణంలో నాలుగు వైపులా రహదారులను ఏర్పాటు చేశారు. అలా భాగ్యనగరం నిర్మితమైంది. తెలుగు భాషకు పెద్దపీట కుతుబ్ షాహీ పాలనలో ప్రత్యేకంగా ఇబ్రహీం, ముహ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో తెలుగు భాషా, సాహిత్యం విరాజిల్లింది. ఇబ్రహీం కుతుబ్‌షా స్వయంగా తెలుగులో కవితలు రాయడమేగాక, కవితా పఠనాలు నిర్వహించాడు. వీరి హయాం తెలుగు సాహిత్యానికి స్వర్ణ యుగంగా చరిత్రకారులు పేర్కొంటారు. తెలుగులోనే ఫర్మానాలు కులీకుతుబ్‌షా తల్లి విజయనగర సామ్రాజ్యానికి చెందిన మహిళ కావడం, అతని భార్య చంచల గ్రామానికి చెందిన యువతి కావడంతో ముహ్మద్ కులీ కులీకుతుబ్‌షా తెలుగు భాషాను ఆనర్గళంగా మాట్లాడటమే కాకుంగా తెలుగు భాషలో కవితలు రాసినట్లు చరిత్ర చెబుతోంది. అ రోజుల్లో సంస్థాన అధికార భాషగా పార్సీ కొనసాగుతున్నా.. కుతుబ్ షాహీ హయాంలో తెలుగు భాషను ఎంతో ఆదరించారు. తెలుగు కవులకు జాగీర్లు ఇచ్చారు. ఫర్మనాలు ( ప్రభుత్వ ఆదేశాలు ) సైతం తెలుగులోనే జారీ చేయడం విశేషం. ఆధునిక నగర నిర్మాత 427 ఏళ్ల క్రితమే నగరం ప్రజల సౌకర్యార్థం నిర్మించిన భవనాలు, ఉద్యానవనాలతో ప్రణాళిక ప్రకారం సుందర నగరాన్ని నిర్మించిన ఘనత ముహ్మద్ కులీ కుతుబ్‌షాకు దక్కుతుంది. పాలనా దక్షత, దార్శనికత సాహిత్య రంగాల్లో మేటిగా నిలిచిన ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మించిన మహ్మద్ కులీ కుతుబ్ షా 47 ఏళ్ల వయస్సులో 1612 ఏప్రిల్ 11న కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన సమాది కుతుబ్ షాహీ టూంబ్స్ ప్రాంగణంలో ఉంది. -
నా నగరం జనంతో నిండిపోనీ..
♦ కులీ కుతుబ్‌షా కవితను ఉటంకించిన ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ♦ మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో ప్రసంగం ♦ కులీ పాలనలో ఆచరణాత్మక, లౌకిక ధోరణులకు పెద్ద పీట ♦ అనతికాలంలోనే సకల కళలు వికసించాయి ♦ వ్యాపార కేంద్రంగా హైదరాబాద్ నిలిచిందని వెల్లడి సాక్షి, హైదరాబాద్: 1590–91లో కులీ కుతుబ్‌షా హైదరాబాద్ నగర నిర్మాణాన్ని ప్రారంభించారని, ‘నా నగరం జనంతో నిండిపోనీ, చెరువులోని చేపల మాదిరిగా వర్ధిల్లనీ’ అని రెండు పంక్తుల కవిత్వంతో తన ఆకాంక్షను అక్షరీకరించారని ఉప రాష్ట్రపతి ఎం.హమీద్ అన్సారీ పేర్కొన్నారు. కుతుబ్‌షాహీల వంశం 1520–1687 మధ్య కాలంలో 164 ఏళ్లు మాత్రమే హైదరాబాద్ నగరాన్ని ఏలినా, ఇంత తక్కువ కాలంలో వాస్తు కళ, కవిత్వం, సంగీతం, నాట్యం, పాక కళలు వికసించాయని ప్రశంసించారు. అంతర్జాతీయ వ్యాపారానికి కీలక కేంద్రంగా, సంస్కృతి సంప్రదాయాలకు మారు పేరుగా నగరం నిలిచిందన్నారు. కుతుబ్‌షాహీల పాలనలో ఆచరణాత్మక, లౌకిక ధోరణులకు పెద్ద పీట వేశారని కొనియాడారు. మహమ్మద్ కులీ కుతుబ్‌షా కాలంలో హిందూ, ముస్లింల మధ్య సన్నిహిత స్నేహం వర్ధిల్లిందని, ఆయన దర్బారులో ముస్లింలు, ముస్లిమేతరులకు సమ ప్రాతినిధ్యం లభించిందన్నారు. హిందువులు, పార్సీలు.. అందరి పట్ల కులీ కుతుబ్‌షా ఉదారంగా వ్యవహరించేవారని చరిత్రకారులు రాశారని పేర్కొన్నారు. ఆయన మతవాది కాదన్నారు. గురువారం హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం(మనూ)లో మహమ్మద్ కులీ కుతుబ్షాపై హమీద్ అన్సారీ ఉపన్యాసం చేశారు. ‘దక్కన్ రాజ్యాల పాలన గురించి రెండు అంశాలను ప్రముఖంగా చెప్పుకోవాలి. పరిపాలన ఎలా సాగాలి, ప్రజల విషయంలో ఎలాంటి విధానాన్ని అవలంబించాలి అనేది మొదటిదైతే.. భారత ఉపఖండంలో బలమైన శక్తులతో ఎలా సంఘర్షించాలన్నది రెండో అంశం’ అని చెప్పారు. ప్రేమైక కవిత్వం.. మృదు వ్యక్తిత్వం దక్కనీ ఉర్దూకు తనదైన శ్రేష్టత్వం ఉందని, స్వయంగా కులీ కుతుబ్ షా కవితలు రాశారని అన్సారీ తెలిపారు. జల తరంగాల తరహాలో తన కవితలు అత్యంత సహజమైనవని కులీ చెప్పుకున్నారని గుర్తు చేశారు. పర్షియన్ శైలీ కవిత్వానికి అంకురార్పణ చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ప్రముఖ కవులు తులసీదాస్, మీరాబాయి, సూర్దాస్ల సమకాలికుడైన కుతుబ్‌షా తన కవిత్వంలో ప్రేమైక ప్రపంచం, మార్మిక అనుభూతులకు పెద్దపీట వేశారని వివరించారు. క్షమాగుణం, మృదుత్వంతో కులీ కుతుబ్‌షా వ్యక్తిత్వం అలరారేదని పేర్కొన్నారు. దక్కనీ ఉర్దూ కవిత్వంలో తెలుగు పదాలు తెలుగు భాషపై కులీ కుతుబ్‌షా విశాల హృదయం కలిగి ఉండేవారని, తెలుగును తన మాతృ భాషగా పరిగణిం చేవారని చెప్పారు. దక్కనీ ఉర్దూ కవిత్వం లో తెలుగు పదాలను పొందుపరిచేవారని తెలిపారు. అధికారిక ఫర్మానాలు, ప్రకట నలు తెలుగు, ఉర్దూ 2 భాషల్లోనూ ఉండే వన్నారు. కులీ వారసుల్లో ఒకరు కూచి పూడి నాట్య రీతికి పోషకుడు కావడం ఏమాత్రం యాదృచ్ఛికం కాదని తెలి పారు. ప్రాచీన ఏథెనీయన్స్ల మాదిరి గానే హైదరాబాదీలు వారి నగరంతో బంధాన్ని పెనవేసుకున్నారని చెప్పారు. హైదరాబాద్ ప్రజల్లో దక్కనీ తెహజీబ్, సహనం, సౌమ్యతను రంగరించేందుకు కులీ ప్రయత్నం చేశారన్నారు. కార్యక్ర మంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, వర్సిటీ వీసీ డాక్టర్ అస్లం పర్వేజ్ పాల్గొన్నారు. -
గేట్ వే ఆఫ్ చార్మినార్
హైదరాబాద్ నగర నిర్మాత మహ్మద్ కులీకుతుబ్‌షా అందించిన ఆణిముత్యాల్లో చార్‌కమాన్ ఒకటి. చార్మినార్‌కు ముఖ ద్వారాలుగా నిర్మించిన నాలుగు ఆర్చీలనే కమాన్లుగా వ్యవహరిస్తారు. 16వ శతాబ్దంలో వీటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటి ఎత్తు 30 అడుగులు. మచిలీ కమాన్, కలి కమాన్, షేర్ ఎ బత్తీకా కమాన్, గోల్ కమాన్ అని వీటికి అప్పట్లోనే నామకరణం చేశారు కులీకుతుబ్‌షా. వీటికి ఇరువైపులా కిటికీలను నిర్మించారు.కమాన్లకు గంధం కలపతో తయారు చేయించిన తలుపులు అమర్చారు. ఇప్పుడివి శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ చార్కమాన్ను ‘గేట్ వే ఆఫ్ చార్మినార్’గా వ్యవహరిస్తున్నారు. -
ప్రేమనగర్!
గ్రంథపు చెక్క ప్రపంచంలో ఏ నగరం కూడా ప్రేమ పునాదిగా ప్రేమకోసం స్థాపించబడలేదు ఒక హైద్రాబాద్ నగరం తప్ప. ఖులీ కుతుబ్ షా తన ప్రేయసి భాగ్మతి కోసం నిర్మించిన ప్రేమనగరమే హైదరాబాద్. నవాబు ఇస్లాం మతానికి చెందినవాడు. ఆయన ప్రేయసి హిందూ స్త్రీ. అట్లా హైద్రాబాద్ నగరం రెండు మతాల మధ్య సమైక్యతకు, సహజీవనానికి వారధిగా నిలిచింది. ప్రేయసి భాగ్మతి, అర్ధాంగి హైదర్‌బేగంగా మారంగనే బాగ్‌నగర్ హైద్రాబాద్‌గా పేరు మార్చుకుంది. యావత్ భారతదేశంలోనే తొలిసారిగా కవిత్వాన్ని ఒక పుస్తకంగా తీసుకొచ్చింది మహ్మద్ కులీ కుతుబ్‌షా. ఆ కవితా సంపుటి పేరు ‘కుల్లీయత్’. అట్లనే అప్పటి వరకూ దేశంలోనే తొలి ఉర్దూ కవయిత్రి మాహ్‌లాఖా బాయి చందా. స్త్రీల తొలి కవిత్వ సంపుటి కూడా ఆమెదే. మొదటిసారి ఒక కవీ, కవయిత్రీ కవితా సంపుటులు హైద్రాబాద్ నుండి రావడం హైద్రాబాద్ నగర అదృష్టం. ఆమె కవిత్వం ఢిల్లీ, లాహోర్, లక్నోలలో కూడా మారుమోగింది. పండితులచే ప్రశంసలు అందుకుంది. హైద్రాబాద్ నగర నిర్మాత మహమ్మద్ కులీ కుతుబ్ షా, భాగ్‌మతిలకు పుత్ర సంతానం కలగలేదు. వారి ఏకైక పుత్రికే హయాత్ భక్షీ బేగం. చిన్నతనంల ఆమెను తల్లిదండ్రులు ప్రేమగా ‘‘లాడ్లీ’’ అని పిలిచేటోళ్లు. ఆమె పేరనే చార్మినార్ దగ్గర లాడ్ బజార్ వెలిసింది. ఆమెకు యుక్త వయసు రాంగనే నవాబు తన మేనల్లుడు మహమ్మద్‌తో వివాహం జరిపించినాడు. నవాబు తదనంతరం ఆ అల్లుడే వారసునిగా సుల్తాన్ మహమ్మద్ కుతుబ్‌షా పేరుతో రాజ్యాధికారం చేపట్టినాడు.ప్రజలు హయాత్ భక్షీ బేగంను గౌరవించి ‘మాసాహెబా’ అని పిలిచేటోళ్లు. ఆమె కట్టించిన మాసాహెబా ట్యాంకు కాలక్రమంలో ‘మాసాబ్‌ట్యాంక్’ అయింది. - లోకేశ్వర్ ‘సలాం హైద్రాబాద్’ నుంచి.