గేట్ వే ఆఫ్ చార్మినార్
హైదరాబాద్ నగర నిర్మాత మహ్మద్ కులీకుతుబ్‌షా అందించిన ఆణిముత్యాల్లో చార్‌కమాన్ ఒకటి. చార్మినార్‌కు ముఖ ద్వారాలుగా నిర్మించిన నాలుగు ఆర్చీలనే కమాన్‌లుగా వ్యవహరిస్తారు. 16వ శతాబ్దంలో వీటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటి ఎత్తు 30 అడుగులు.
మచిలీ కమాన్, కలి కమాన్, షేర్ ఎ బత్తీకా కమాన్, గోల్ కమాన్ అని వీటికి అప్పట్లోనే నామకరణం చేశారు కులీకుతుబ్‌షా. వీటికి ఇరువైపులా కిటికీలను నిర్మించారు.కమాన్‌లకు గంధం కలపతో తయారు చేయించిన తలుపులు అమర్చారు. ఇప్పుడివి శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ చార్‌కమాన్‌ను ‘గేట్ వే ఆఫ్ చార్మినార్’గా వ్యవహరిస్తున్నారు.