సుందర్ పిచాయ్ కూడా బుక్కయ్యాడు...!
ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ సోషల్ మీడియా అకౌంట్ల హ్యాకింగ్ అనంతరం హ్యాకింగ్ గ్రూప్ అవర్ మైన్ లేటెస్ట్ టార్గెట్ గా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ బుక్కాయ్యారు. సుందర్ పిచాయ్ క్వారా అకౌంట్ ను అవర్ మైన్ గ్రూప్ హ్యాకింగ్ చేసింది. క్రౌడ్ సోర్స్ డ్ సమాధాన సైట్ కు అనుసంధానంగా ఉండే ట్విట్టర్ అకౌంట్లో తప్పుడు క్వారా పోస్టులను పోస్టు చేసింది. సుందర్ పిచాయ్ ఫాలోవర్స్ 508,000 మందికి ఈ హ్యాకింగ్ విషయాన్ని అవర్ మైన్ ప్రచారం చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్ లను తొలగించినా.. ఆ హ్యాకింగ్ స్క్రీన్ షాట్ లు బయటికి వెల్లడించింది.
కానీ ఈ గ్రూప్ అకౌంట్ల హ్యాకింగ్ కు ఎలా పాల్పడుతుందో క్లియర్ గా తెలియడం లేదు. సోషల్ నెట్ వర్క్ ల సిస్టమ్ దొంగతనం వల్ల హ్యాకింగ్ కు పాల్పడటం లేదని మాత్రం తెలిసింది. అయితే అవర్ మైన్ గ్రూప్, తనకు తాను భద్రతా సంస్థగా అభివర్ణించుకుంటోంది. ఈ హ్యాకింగ్ ఘటనలు మళ్లీ జరగకుండా, సర్వీసులను ఆఫర్ చేస్తుందని వెల్లడిస్తోంది. వెబ్ సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లు, కంపెనీల భద్రతా వలయాలను స్కాన్ చేసి, తన సైట్ లో భద్రతకు సంబంధించి ప్రచార సేవలను అందిస్తున్నట్టు చెబుతోంది.
సుందర్ పిచాయ్ క్వారా అకౌంట్ హ్యాకింగ్ కు సోమవారం పాల్పడామని, గూగుల్ సీఈవో భద్రత చాలా వీక్ గా ఉందని అవర్ మైన్ గ్రూప్ తెలిపింది. ఎవరైనా దాడిచేసే విధంగా ఉందని పేర్కొంది. ఈ హ్యాకింగ్ రిపోర్టుపై గూగుల్, క్వారాలు వెంటనే స్పందించలేదు. ఈ హ్యాకింగ్ గ్రూప్ ఈ నెల మొదట్లో జుకర్ బర్గ్ సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే.