Qutub Minar
-
కుతుబ్ మినార్‌పై కొత్త థీమ్ - వీడియో
ఢిల్లీ: ఏడు దశల లోక్‌సభ ఎన్నికలకు ఏప్రిల్ 19న (మొదటి దశ) ఓటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం దేశం మొత్తం ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రజలకు ఓటు హక్కు మీద అవగాహన కల్పించడానికి ఎన్నికల సంఘం ఓ వినూత్న పద్దతిని ఎంచుకుంది.కుతుబ్ మినార్ మీద త్రివర్ణ పతాకంతో పాటు.. మిరమిట్లు గొలిపే ఎన్నికల సంఘం లోగో కనిపించింది. ఎన్నికల నేపధ్యానికి సంబంధించిన లైట్లు, పోస్టర్లు, విజువల్స్ అన్నీ కుతుబ్ మినార్ మీద ఆకర్షణీయంగా కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియోను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన ఎక్స్ (ట్విటర్) పేజీలో పోస్ట్ చేసింది.ఇప్పటికే రెండు దశల ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. మే 3న మూడో దశ, మే 13న నాలుగో దశ, మే 20న ఐదో దశ, మే 25న ఆరో దశ, జూన్ 1న ఏడో దశలో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడతాయి.Qutub Minar radiates the spirit of Jash-e-Matdan with its dazzling display of the #ChunavKaParv theme.Let's celebrate this festivity by casting our votes #GeneralElections2024📹 @ceodelhi #DeshKaGarv #LokSabhaElections2024 #YouAreTheOne pic.twitter.com/NPhlifadmT— Election Commission of India (@ECISVEEP) April 27, 2024 -
Qutub Minar Row: ఆలయ పునరుద్ధరణ సాధ్యం కాదు!
న్యూఢిల్లీ: రక్షిత స్మారక ప్రదేశం అయితే కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో.. ఆలయాన్ని పునరుద్ధరించడం సాధ్యం కాదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తేల్చి చెప్పేసింది. భారత పురావస్తు సర్వే శాఖ కీలక ప్రకటన చేసింది. కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో ఆలయపునరుద్ధరణ వ్యవహారం సాకేత్ కోర్టుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో.. ఆ స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలనే అభ్యర్థనను ఏఎస్ఐ తోసిపుచ్చింది. కుతుబ్ మినార్ అనేది 1914 నుంచి పరిరక్షణ స్మారకంగా కొనసాగుతోంది. అలాంటి చోటులో నిర్మాణాలను మార్చడం సాధ్యం కాదు. స్మారక చిహ్నం వద్ద ఆరాధన పునరుద్ధరణ అనుమతించబడదు అని ఏఎస్ఐ స్పష్టం చేసింది. పూజలకే కాదు.. నమాజ్‌కు నో ఆర్కియాలజీ నిబంధనల ప్రకారం.. నివాసం లేని ప్రదేశాల్లో ప్రార్థనలకు అనుమతించరు. ఈ లెక్కన.. కుతుబ్‌మినార్ దగ్గర పూజలకే కాదు.. నమాజ్‌కు అనుమతులు ఇవ్వలేదు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతుండగా.. తాము తాజాగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. పాలసీ ప్రకారం.. నమాజ్‌ను నిలిపివేయాలని గతంలోనే కోరామని, పంపిన ఆదేశాలు కూడా ఎప్పటివో అని స్పష్టం చేసింది. జ్ఞానవాపి మసీద్ సర్వే వ్యవహారం వార్తల్లో నిలిచి వేళ.. ఏఎస్ఐ మాజీ రీజినల్ డైరెక్టర్ ధరమ్వీర్ శర్మ కుతుబ్‌మినార్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుతుబ్ మినార్ను కుతుబ్ అల్ దిన్ ఐబక్ కట్టించలేదని, సూర్యుడి దశను అధ్యయనం చేసేందుకు రాజా విక్రమాదిత్య కట్టించాడని వాదిస్తున్నాడు. మరోవైపు హిందూ సంఘాలు కుతుబ్ మినార్ వద్దకు చేరుకుని విష్ణు స్తంభ్‌గా పేరు మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. చదవండి: కుతుబ్ మినార్ తవ్వకాలపై కేంద్రం క్లారిటీ -
కుతుబ్ మినార్ తవ్వకాలపై మంత్రి కిషన్‌రెడ్డి క్లారిటీ
న్యూఢిల్లీ: ప్రపంచవారసత్వ కట్టడంగా గుర్తింపు దక్కించుకున్న కుతుబ్ మినార్ వార్తల్లోకి ఎక్కింది. అదొక ఆలయం అనే వాదన.. ఈ చారిత్రక కట్టడం చుట్టూ తిరుగుతోంది. ఢిల్లీలోని కుతుబ్ మినార్‌లో తవ్వకాలు జరిపాలని భారత పురావస్తు శాఖను కేంద్ర సాంస్కృతిక శాఖ ఆదేశించినట్టు వచ్చిన కథనాలపై ఆ శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతానికి అలాంటి ఆదేశాలేవీ ఇవ్వలేదని ఆయన చెప్పారు. జ్ఞానవాపి మసీదు సర్వే నేపథ్యంలో కుతుబ్ మినార్ నిర్మాణం కింద కూడా హిందూ, జైన్ ఆలయాలున్నాయని హిందువులు విశ్వసిస్తున్నారు. ఇలాంటి సమయంలో కుతుబ్‌మినార్‌లో తవ్వకాలకు ఆదేశించినట్టుగా వార్తలు చక్కెర్లు కొట్టడంతో.. ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదని కిషన్ రెడ్డి స్పష్టతనిచ్చారు. మరోవైపు పురావస్తు శాఖ మాత్రం తవ్వకాల విషయంపై స్పందించలేదు. మరోవైపు శనివారం కుతుబ్‌మినార్‌ను పురావస్తు శాఖ అధికారులు సందర్శించడంపై ఆసక్తికరమైన చర్చ నడిచింది. ఆర్కియాలజీ సర్వే దీనిని కట్టించెదవరు అనే విషయంపై పరిశోధనలు నిర్వహించబోతున్నట్లు ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే అది రెగ్యులర్ సందర్శనేని, ఎలాంటి పరిశోధన కోసం రాలేదని అధికారులు ఆ తర్వాత స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉంటే.. 12వ శతాబ్ధానికి చెందినదిగా భావిస్తున్న కుతుబ్‌మినార్ కట్టడపు కాంప్లెక్స్‌లో ఉన్న రెండు గణేష్ విగ్రహాలను.. తదుపరి ఆదేశాల ఇచ్చేంతవరకు తొలగించవద్దని గతంలో ఢిల్లీ కోర్టు ASIని ఆదేశించింది. రెండు విగ్రహాలను ‘ఉల్టా గణేష్’, ‘పంజరంలో వినాయకుడు’గా పిలుస్తున్నారు. కుతుబ్‌మినార్‌ను UNESCO 1993లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఆ ఆలయాలను పునర్నిర్మించాలి దేశంలో ఒకప్పుడు ధ్వంసం చేసిన ఆలయాలన్నిటినీ పునర్నిర్మించాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు. గోవాలో పోర్చుగీసు పరిపాలనలో ధ్వంసమైన ఆలయాలను తిరిగి నిర్మించడానికి తాము బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. గోవాలో సాంస్కృతిక టూరిజంను కూడా ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటున్నామని సావంత్ తెలిపారు. చదవండి: అది కుతుబ్‌మినార్ కాదు.. సూర్య గోపురం!! -
కుతుబ్‌మినార్ కాదు సూర్య గోపురం!
Qutub Minar was built by Raja Vikramaditya to observe the sun: తాజ్‌మహల్ కాదు తేజో మహల్ అనే వివాదం తలెత్తి సద్దుమణగక మునుపే మరో వివాదం తెర మీదకు వచ్చింది. కుతుబ్ మినార్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఓ సీనియర్ అధికారి. అది కుతుబ్ మినార్ కాదని.. సూర్యగోపురం అని ఆయన అంటున్నారు. ఐదవ శతాబ్దంలో రాజావిక్రమాదిత్య ఈ గోపురాన్ని నిర్మించాడని ఆర్కియాలజీ సర్వే మాజీ అధికారి ధర్మవీర్ శర్మ వాదిస్తున్నారు. అంతేగాదు ఆయన సూర్యుని దిశను అధ్యయనం చేయడం కోసం కుతుబ్ మినార్‌ని రాజవిక్రమాదిత్య నిర్మించారని, కుతుబ్ అలల్ దిన్ ఐబాక్ దీన్ని నిర్మించలేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది కతుబ్‌మినార్ కాదు సూర్యగోపురం(అబ్జర్వేటరీ టవర్)’’ అని కూడా చెప్పారు. తాను ఆర్కియాలజీ సర్వే తరుఫున కుతుబిమినార్‌లో పలుమార్లు సర్వే చేసినట్లు కూడా చెప్పుకొచ్చారు. అంతేగాదు కుతుబ్ మినార్ టవర్‌లో 25 అంగుళాల వంపు ఉందని జూన్ 21న సూర్యస్తమయం అయ్యే సమయంలో అరగంట సేపు కనువిందు చేసే నీడ ఈ ప్రాంతంలో ఏర్పడదని ఒక కొత్త విషయాన్ని కూడా వెల్లడించారు. కుతుబ్‌మినార్ అనేది స్వతంత్ర నిర్మాణమే గానీ.. మసీదుకు సంబంధించినది కాదని చెప్పారు. తలుపులు కూడా ఉత్తరం వైపు ఉన్నాయని, ఇది రాత్రిపూట ఆకాశంలోని ధృవ నక్షత్రాన్ని చూసేందుకంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. (చదవండి: వేలం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం) -
కుతుబ్‌మినార్ కాల్పుల ఘటనలో మరో ఇద్దరు అరెస్టు
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని కుతుబ్‌మినార్ సమీపంలో ఓ 24 ఏళ్ల యువకుడిని కాల్చి చంపిన కేసులో మరో ఇద్దరిని ఉత్తరప్రదేశ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. మార్చి 9న తన స్నేహితుడు సందీప్‌తో కలిసి కియోస్క్ వద్ద టీ తాగుతుండగా కొందరు దొండగులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సోను అక్కడికక్కడే మరణించగా, సందీప్ గాయాలపాలయ్యాడు. వివరాలు.. సోను సెజ్వాల్(24) సెంట్రల్ ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో పనిచేసేవాడు. సోను స్నేహితుడు నరేందర్‌తో నీరజ్ అనే వ్యక్తికి డబ్బు విషయమై ఉన్న వివాదం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదానికి ముగింపు పలకాలనే ఆలోచనతో నీరజ్ తన స్నేహితులు ముగ్గురితో లడో సరాయ్ టీ పాయింట్‌కి చేరుకున్నాడు. అక్కడికి నరేందర్‌తో పాటు అశోక్, సందీప్, సోను కూడా అదే టీ స్టాల్‌కి వెళ్లారు. రెండు గ్రూపుల మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో నీరజ్ మరికొంత మంది స్నేహితులను అక్కడికి పిలిపించాడు. వారు ఆయుధాలు కూడా తీసుకురావడంతో వాటితో తన స్నేహితుడు రోహిత్‌తో కలిసి నీరజ్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సోను అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనలో రాజీవ్ చౌహాన్, సంజీవ్ శర్మ పాల్గొన్నారనే సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం నాలెడ్జి పార్కు వద్ద వారిద్దరినీ అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 10కి చేరింది. అంతకు ముందు నీరజ్, అరవింద్ కుమార్, కరణ్‌జిత్, రవీందర్ పవార్, కమల్, జగ్‌మోహల్ సాగర్, ద్రుప్, కార్తీక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. -
ఇక జాయ్ రైడ్
సాక్షి, న్యూఢిల్లీ : నగరవాసులకు శుభవార్త. ఐదు సంవత్సరాల క్రితం నగరంలో నిర్మించిన జెయింట్ వీల్ ఢిల్లీ ఐ గురువారం ప్రారంభం కానుంది. దీని ఎత్తు 200 అడుగులు. ఢిల్లీ ఐ పైనుంచి కొన్ని కిలోమీటర్ల దూరం వరకు నగరాన్ని అవలీలగా తిలకించొచ్చు. ఓఖ్లా ప్రాంతంలో కాళిందీకుంజ్ పక్కన ఏర్పాటుచేసిన ఈ జెయింట్ వీల్ నుంచి లోటస్ టెంపుల్, అక్షర్ధామ్ మందిర్. కుతుబ్‌మినార్ కనిపిస్తాయని అంటున్నారు. సింగపూర్ ఫ్లైఓవర్‌ను నిర్మించిన డంచ్ వీల్స్ అండ్ వెంకోమా రైడ్స్ కంపెనీయే దీనిని కూడా 2010లో నిర్మించింది. అయితే్ర పారంభోత్సవానికి ముందే ఇది వివాదంలో చిక్కుకుంది. యమునా నదికి ఇరువైపులా ఆక్రమణలను పర్యవేక్షించేందుకు కోర్టు నియమించిన కమిటీ దీనిని అక్రమ కట్టడంగా పేర్కొంది. ఢిల్లీ ఐ నదికి 300 మీటర్లలోపు ఉందని, నదికి ఇరువైపులా 300 మీటర్ల లోగా ఎలాంటి కట్టడం నిర్మించరాదనే నియమాన్ని ఇది ఉల్లంఘించిందని కమిటీ పేర్కొంది. రూ. 70 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ జెయింట్ వీల్‌కు ఇప్పుడు అవసరమైన అనుమతులన్నీ లభించాయి. దీంతో ఐజారా కంపెనీ ఇప్పుడు దానిని నడపనుంది. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టంతో నడిచే ఢిల్లీ ఐ గంటకు 70 కి.మీల గరిష్ట వేగంతో తిరుగుతుంది. దీనిని గంటకు ఐదు కి.మీల వేగంతో నడుపుతారు. ఢిల్లీ ఐ లో 36 ఎయిర్కండిషన్డ్ కేబిన్లు ఉన్నాయి. ప్రతి కేబిన్‌లో ఆరు నుంచి ఎనిమిది మంది కూర్చోవచ్చు. ఒకసారి 288 మంది ఈ జాయ్ రైడ్‌ను ఆస్వాదించవచ్చు. దీని టికెట్ ధరను రూ. 300లుగా నిర్ణయించారు. ప్రారంభ ఆఫర్ కింద కొద్దిరోజులపాటు రూ.250 కే జాయ్‌రైడ్‌ను ఆనందించవచ్చు. మూడు సంవత్సరాలలోపు వారికి ప్రవేశం ఉచితం. 20 నిమిసాల పాటు కొనసాగే ఒక జాయ్‌రైడ్‌లో నాలుగు రౌండ్లు ఉంటాయి.