ఢిల్లీ: ఏడు దశల లోక్‌సభ ఎన్నికలకు ఏప్రిల్ 19న (మొదటి దశ) ఓటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం దేశం మొత్తం ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రజలకు ఓటు హక్కు మీద అవగాహన కల్పించడానికి ఎన్నికల సంఘం ఓ వినూత్న పద్దతిని ఎంచుకుంది.
కుతుబ్ మినార్ మీద త్రివర్ణ పతాకంతో పాటు.. మిరమిట్లు గొలిపే ఎన్నికల సంఘం లోగో కనిపించింది. ఎన్నికల నేపధ్యానికి సంబంధించిన లైట్లు, పోస్టర్లు, విజువల్స్ అన్నీ కుతుబ్ మినార్ మీద ఆకర్షణీయంగా కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియోను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన ఎక్స్ (ట్విటర్) పేజీలో పోస్ట్ చేసింది.
ఇప్పటికే రెండు దశల ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. మే 3న మూడో దశ, మే 13న నాలుగో దశ, మే 20న ఐదో దశ, మే 25న ఆరో దశ, జూన్ 1న ఏడో దశలో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడతాయి.
Qutub Minar radiates the spirit of Jash-e-Matdan with its dazzling display of the #ChunavKaParv theme.
Let's celebrate this festivity by casting our votes #GeneralElections2024
📹 @ceodelhi #DeshKaGarv #LokSabhaElections2024 #YouAreTheOne pic.twitter.com/NPhlifadmT— Election Commission of India (@ECISVEEP) April 27, 2024
Comments
Please login to add a commentAdd a comment