R & B guest house
-
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షి,మిర్యాలగూడ టౌన్ : అసెంబ్లీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నామని ఆర్డీఓ జగన్నాథరావు పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని ఖమ్మం రోడ్డులో గల గాంధీపార్క్ స్కూల్ వద్ద, సుందర్‌నగర్, చర్చి రోడ్డు ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద బారీ కేడ్ల ఏర్పాటుతో పాటు ఆర్అండ్బీ అథితి గృహలోని వసతులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద గల వసతులను ఆర్‌ఆండ్‌బీ, పోలీస్‌లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉన్నందున రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం నుంచి వంద మీటర్ల వరకు భారీ కేడ్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 12వ తేదీన 11గంటల నుంచి నామినేషన్లు వేసేందుకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు వస్తుంటారని, వంద మీటర్ల దాటిన తరువాతనే వాహనాలతో పాటు పార్టీల కార్యకర్తలను నిలుపుదల చేయాల్సి ఉంటుందన్నారు. కాగా ఖమ్మం రోడ్డులో నుంచి వెళ్లే వాహనాలను దారిమళ్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 19వ తేదీ వరకు వంద మీటర్ల దూరం ఆర్ఓ ఆధీనంలో ఉంటుందన్నారు. నామినేషన్ల సమయంలో నామినేషన్ వేసే అభ్యర్థితో కలిపి ఐదుగురు వ్యక్తులకు మాత్రమే ఆర్ఓ కార్యాలయానికి అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఉండేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. అదే విధంగా ఆర్అండ్బీ అతిథి గృహం ఎన్నికలు ముగిసే వరకు తమ ఆధీనంలో ఉంటున్నందున ఆర్అండ్బీ అధికారులు అన్ని వసతులను ఏర్పాటు చేయాలని కోరారు. అదే విధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ వద్ద కూడా బారీ కేడ్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. ఆయన వెంట ఆర్అండ్బీ డీఈ నరేందర్‌రెడ్డి, వన్ టౌన్ సీఐ సదా నాగరాజు, ఆర్అండ్బీ ఏఈ రాజశేఖర్, ఆర్ఐ మహేందర్‌రెడ్డి, డివిజనల్ సర్వేయర్ బాలాజీనాయక్ ఉన్నారు. -
నేను మల్లారెడ్డి.. హైదరాబాద్ డాన్ !
♦ ఇసుక కాంట్రాక్ట్ ఇప్పిస్తానని రూ.63 లక్షలు వసూలు ♦ డబ్బులు అడిగిన బాధితులపై బౌన్సర్లతో దాడి ♦ చంపుతానని రివాల్వర్‌తో బెదిరింపు ♦ పోలీసులను ఆశ్రయించిన బాధితులు ♦ మల్లారెడ్డితో పాటు 15 మంది అరెస్ట్ ♦ రివాల్వర్, మూడు వాహనాలు స్వాధీనం మంచిర్యాల క్రైం: ‘మల్లారెడ్డి అంటే చందారం మల్లారెడ్డి కాదురా.. హైదరాబాద్ డాన్ మల్లారెడ్డి.. మరోసారి డబ్బులడిగారో శవాలవుతారు’ అంటూ రివాల్వర్‌తో బెదిరించిన వ్యక్తితోపాటు 15 మంది బౌన్సర్లను గురువారం మంచిర్యాల పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం చందారం గ్రామానికి చెందిన కొమ్మురెడ్డి మల్లారెడ్డి అదే గ్రామానికి చెందిన చింతం నరేశ్, చాక శ్రీనివాస్, చాక కొమురయ్య, జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఆకుల శ్రీనివాస్, నక్కలపల్లికి చెందిన మామడి జలంధర్, సిద్దం రవికుమార్‌కు మణుగూర్‌లో ఇసుక కాంట్రాక్టు ఇప్పిస్తానని నమ్మబలికాడు. పదినెలల క్రితం వారి నుంచి రూ.63 లక్షలు వసూలు చేశాడు. ఇసుకు రీచ్‌లను చూపిస్తానని చెప్పి అక్కడికి తీసుకెళ్లాడు. కానీ, వారికి వాటిని చూపించకపోవడంతో తమ డబ్బులివ్వాలని మల్లారెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. ఈక్రమంలో నాలుగు నెలల క్రితం వారికి రూ.19 లక్షలు ముట్టజెప్పాడు. మిగతా డబ్బుల కోసం ఒత్తిడి తీసుకురాగా, ఈ రోజు గడువు పెట్టి మంచిర్యాలలోని ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌కు వారిని పిలిపించాడు. చితకబాదిన బౌన్సర్లు... పథకం ప్రకారం మల్లారెడ్డి హైదరాబాద్, గోదావరిఖని, మందమర్రికి చెందిన 15మంది బౌన్సర్లతో వచ్చి డబ్బులిచ్చిన వారిని చితకబాదారు. మరోసారి పైసలంటే శవాలవుతారంటూ వారిని హెచ్చరించాడు. అనంతరం మల్లారెడ్డి, బౌన్సర్లు మంచిర్యాలలోని ఓ లాడ్జికి వెళ్లిపోయారు. బాధితులు లక్సెట్టిపేటకు చెందిన ఓ ప్రజాప్రతినిధి సహకారంతో మంచిర్యాల పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు లాడ్జీని ముట్టడించి మల్లారెడ్డితోపాటు 15 మంది బౌన్సర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రివాల్వర్, 15 బుల్లెట్లు, 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, అ«ధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల అండతోనే మల్లారెడ్డి ఈ దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది. గతేడాది ఓ ప్రధాన రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధికి చెందిన ఓ నేత మామను చందారం తీసుకువచ్చి మొక్కలు నాటించి గ్రామంలో హల్చల్ చేసినట్లు సమాచారం. అలాగే, మల్లారెడ్డి స్థానికంగా గతంలో ఓ చానల్లో రిపోర్టర్‌గా పని చేసి అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. -
వ్యక్తి దారుణ హత్య
విడపనకల్లు ఎంపీపీ సహా వురో ఇద్దరు టీడీపీ నాయుకులపై కేసు నమోదు ఉరవకొండ: స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద పట్టణానికి చెందిన కౌకుంట్లు వెంకటేసులు అలియూస్ వూల్యం వెంకటేసు(42)ను ప్రత్యర్థులు గురువారం అర్ధరాత్రి వేట కొడవళ్లతో దారుణంగా హతవూర్చారు. సంఘటనకు సంబంధించి సీఐ సూర్యనారాయుణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నారుు. గురువారం అర్ధరాత్రి ఇంట్లో ఉన్న వెంకటేసులను ఆర్అండ్బీ అతిథి గృహనికి కొందరు ఫోన్ చేసి పిలిపించారు. అక్కడే ఉన్న ఆర్అండ్బీ గెస్ట్ హోస్ అటెండర్ శీనప్పను వుద్యం తీసుకు రావాలంటూ డబ్బు ఇచ్చి పంపారు. ఒక సెటిల్మెంట్ వ్యవహరంలో వెంకటేసుకు వురికొంతవుందికి తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో వేటకొడవళ్లతో వెంకటేసును దారుణంగా హతమార్చారు. మద్యం తీసుకుని ఆలస్యంగా వచ్చిన అటెండర్ అక్కడే పడి ఉన్న వెంకటేసు మృతదేహాన్ని చూసి పోలీసులకు తెలపడంతో వారు ఆర్అండ్బీ అతిథి గృహనికి చేరుకున్నారు. అతడి భార్య వెంకటలక్ష్మి, సోదరుడు వూరేష్ ఫిర్యాదు మేరకు టీడీపీ నాయుకులు ఉరవకొండ పట్టణానికి చెందిన లాయుర్ శీనప్ప, విడపనకల్లు లాయుర్ ప్రతాప్నాయుుడు, కండెక్టర్ శ్రీరావుులుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అనం తపురం నుంచి వచ్చిన డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు ఆర్అండ్బీ అతిథి గృహం మృతదేహాన్ని పరిశీలించి పోస్టువూర్టం నిమిత్తం ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుడు 2011 నుంచి రౌడీషీటర్‌గా పోలీసుల రికార్డుల్లో ఉన్నాడు. అతడిపై ఉరవకొండ పోలీసు స్టేషన్లో ఒక హత్యకేసుతో పాటు హత్యాయత్నం కేసు, వుహిళపై అత్యాచారం కేసులు నమోదయ్యాయి. పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా.. ఉదయుం వరకు ఈహత్య వెనుక టీడీపీ నేత పయ్యూవుల శ్రీనివాసులు హస్తం ఉందని చెప్పిన హతుడి కుటుంబసభ్యులు చివరకు విడపనకల్లు టీడీపీ ఎంపీపీ ప్రతాప్ నాయుుడు, ఉరవకొండ టీడీపీ నాయుకుడు లాయుర్ వాల్మీకి శీనా , ఆర్టీసీ కండెక్టర్ శ్రీరావుులుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు