వ్యక్తి దారుణ హత్య
విడపనకల్లు ఎంపీపీ సహా వురో ఇద్దరు టీడీపీ నాయుకులపై కేసు నమోదు
ఉరవకొండ: స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద పట్టణానికి చెందిన కౌకుంట్లు వెంకటేసులు అలియూస్ వూల్యం వెంకటేసు(42)ను ప్రత్యర్థులు గురువారం అర్ధరాత్రి వేట కొడవళ్లతో దారుణంగా హతవూర్చారు. సంఘటనకు సంబంధించి సీఐ సూర్యనారాయుణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నారుు. గురువారం అర్ధరాత్రి ఇంట్లో ఉన్న వెంకటేసులను ఆర్‌అండ్‌బీ అతిథి గృహనికి కొందరు ఫోన్ చేసి పిలిపించారు. అక్కడే ఉన్న ఆర్‌అండ్‌బీ గెస్ట్ హోస్ అటెండర్ శీనప్పను వుద్యం తీసుకు రావాలంటూ డబ్బు ఇచ్చి పంపారు. ఒక సెటిల్‌మెంట్ వ్యవహరంలో వెంకటేసుకు వురికొంతవుందికి తీవ్ర వాగ్వాదం జరిగింది.
దీంతో వేటకొడవళ్లతో వెంకటేసును దారుణంగా హతమార్చారు. మద్యం తీసుకుని ఆలస్యంగా వచ్చిన అటెండర్ అక్కడే పడి ఉన్న వెంకటేసు మృతదేహాన్ని చూసి పోలీసులకు తెలపడంతో వారు ఆర్‌అండ్‌బీ అతిథి గృహనికి చేరుకున్నారు. అతడి భార్య వెంకటలక్ష్మి, సోదరుడు వూరేష్ ఫిర్యాదు మేరకు టీడీపీ నాయుకులు ఉరవకొండ పట్టణానికి చెందిన లాయుర్ శీనప్ప, విడపనకల్లు లాయుర్ ప్రతాప్‌నాయుుడు, కండెక్టర్ శ్రీరావుులుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అనం తపురం నుంచి వచ్చిన డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు ఆర్‌అండ్‌బీ అతిథి గృహం మృతదేహాన్ని పరిశీలించి పోస్టువూర్టం నిమిత్తం ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుడు 2011 నుంచి రౌడీషీటర్‌గా పోలీసుల రికార్డుల్లో ఉన్నాడు. అతడిపై ఉరవకొండ పోలీసు స్టేషన్‌లో ఒక హత్యకేసుతో పాటు హత్యాయత్నం కేసు, వుహిళపై అత్యాచారం కేసులు నమోదయ్యాయి.
పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా..
ఉదయుం వరకు ఈహత్య వెనుక టీడీపీ నేత పయ్యూవుల శ్రీనివాసులు హస్తం ఉందని చెప్పిన హతుడి కుటుంబసభ్యులు చివరకు విడపనకల్లు టీడీపీ ఎంపీపీ ప్రతాప్ నాయుుడు, ఉరవకొండ టీడీపీ నాయుకుడు లాయుర్ వాల్మీకి శీనా , ఆర్టీసీ కండెక్టర్ శ్రీరావుులుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు