గాంధీపార్క్‌స్కూల్ వద్ద బారీకేడ్ల ఏర్పాటుకు పరిశీలిస్తున్న ఆర్డీఓ, ఆర్‌అండ్‌బీ అధికారులు
సాక్షి,మిర్యాలగూడ టౌన్ : అసెంబ్లీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నామని ఆర్డీఓ జగన్నాథరావు పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని ఖమ్మం రోడ్డులో గల గాంధీపార్క్ స్కూల్ వద్ద, సుందర్‌నగర్, చర్చి రోడ్డు ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద బారీ కేడ్ల ఏర్పాటుతో పాటు ఆర్‌అండ్‌బీ అథితి గృహలోని వసతులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద గల వసతులను ఆర్‌ఆండ్‌బీ, పోలీస్‌లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉన్నందున రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం నుంచి వంద మీటర్ల వరకు భారీ కేడ్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 12వ తేదీన 11గంటల నుంచి నామినేషన్లు వేసేందుకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు వస్తుంటారని, వంద మీటర్ల దాటిన తరువాతనే వాహనాలతో పాటు పార్టీల కార్యకర్తలను నిలుపుదల చేయాల్సి ఉంటుందన్నారు. కాగా ఖమ్మం రోడ్డులో నుంచి వెళ్లే వాహనాలను దారిమళ్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 19వ తేదీ వరకు వంద మీటర్ల దూరం ఆర్‌ఓ ఆధీనంలో ఉంటుందన్నారు.
నామినేషన్ల సమయంలో నామినేషన్ వేసే అభ్యర్థితో కలిపి ఐదుగురు వ్యక్తులకు మాత్రమే ఆర్‌ఓ కార్యాలయానికి అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఉండేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. అదే విధంగా ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ఎన్నికలు ముగిసే వరకు తమ ఆధీనంలో ఉంటున్నందున ఆర్‌అండ్‌బీ అధికారులు అన్ని వసతులను ఏర్పాటు చేయాలని కోరారు. అదే విధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ వద్ద కూడా బారీ కేడ్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. ఆయన వెంట ఆర్‌అండ్‌బీ డీఈ నరేందర్‌రెడ్డి, వన్ టౌన్ సీఐ సదా నాగరాజు, ఆర్‌అండ్‌బీ ఏఈ రాజశేఖర్, ఆర్‌ఐ మహేందర్‌రెడ్డి, డివిజనల్ సర్వేయర్ బాలాజీనాయక్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment