అభ్యర్థుల మేనిఫెస్టో | Candidates Manifesto In Nalgonda District | Sakshi
Sakshi News home page

అభ్యర్థుల మేనిఫెస్టో

Published Wed, Nov 21 2018 10:08 AM | Last Updated on Wed, Nov 21 2018 10:18 AM

Candidates Manifesto In Nalgonda District - Sakshi

నల్గొండ జిల్లా

నామినేషన్ల పర్వం ఈనెల 19న ముగియడంతో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు స్థానిక సమస్యలపై అనేక  రకాల హామీలిస్తూ ప్రచారంలో ముందుకు వెళుతున్నారు. ప్రధానంగా పోటీలో ఉన్న కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు వేర్వేరు అంశాలతో స్థానిక మేనిఫెస్టోను సిద్ధం చేసి కరపత్రాలు ప్రచురించి పంపిణీ చేస్తున్నారు.  

భువనగిరి :


టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి 

  •  బస్వాపురం రిజర్వాయర్‌ ద్వారా చెరువులను నింపి లక్ష ఎకరాలకు సాగునీరు అందజేసి సస్యశ్యామలం చేస్తాం. 
  •  ఎయిమ్స్‌లో పూర్తి స్థాయిలో వైద్యసేవలను అందుబాటులోకి తెస్తాం. 
  •  భువనగిరి పట్టణంలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణాన్ని చేపడుతాం. 
  •  భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్‌ పట్టణాలను సుందరీకరణ చేస్తాం. 
  •  భువనగిరి ఖిలాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. 
  •  నియోజకవర్గంలోని బునాదిగాని, ధర్మారెడ్డి, పిలాయిపల్లి కాల్వలకు మంజూరైన నిధులతో పూర్తి స్థాయిలో కాల్వల సామర్థ్య పనులను పూర్తి చేస్తాం.  

కాంగ్రెస్‌ అభ్యర్థి అనిల్‌కుమార్‌రెడ్డి 

  •  ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్యసేవలు అందుబాటులోకి తెస్తాం
  •  సీసీఎంబీని త్వరితగతిన పూర్తి చేస్తాం.
  •  సాగునీటి కాల్వలు బునాదిగాని కాల్వ, పిలాయిపల్లి కాల్వ, ధర్మారెడ్డి కాల్వ, బొల్లేపల్లి కాల్వలను తక్షణమే పూర్తిచేస్తాం.
  •  మూసీ ప్రక్షాళనను త్వరితిగతిన పూర్తి చేస్తాం.
  •  ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం, డ్రెయినేజీ వ్యవస్థ నిర్మాణం
  •  భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాం. 

బీఎల్‌ఎఫ్, అభ్యర్థి కల్లూరి మల్లేశం 

  • సాగునీటి కోసం బునాదిగాని కాల్వ, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వల పనులు వెంటనే పూర్తి చేస్తాం. 
  • బస్వాపురం ప్రాజెక్టు కోసం మార్కెట్‌ రేటుకు అనుగుణంగా స్థలసేకరణ చేసి ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసే విధంగా కృషిచేస్తాం. 
  • భువనగిరి పట్టణాభివృద్ధికి ప్రభుత్వంతో పోరాడి రూ.200కోట్ల నిధులతో సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతాం. 
  • ఇళ్లు లేని పేదలందరికీ కోరిన చోటే కట్టిస్తాం. 
  • ఎయిమ్స్‌ ఆస్పత్రిని త్వరితగతిన పూర్తి చేయిస్తాం. 
  • నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం, తాగునీటి సౌకర్యం, మురికి నీటి కాల్వల ఏర్పాటు, శ్మశాన వాటికలకు స్థల కేటాయింపులకు కృషి చేస్తాం. 
  • జిల్లా కేంద్రంలో ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, ప్రతి మండల కేంద్రంలో 30పడకల ఆస్పత్రి, 24గంటల వైద్య సదుపాయం కోసం కృషి చేస్తాం. 
  • ప్రభుత్వ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ కళాశాలల ఏర్పాటు.

 హుజూర్‌నగర్‌ :
ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి(కాంగ్రెస్‌
)
 

  •      నియోజకవర్గ కేంద్రానికి రైల్వే లైన్, స్టేషన్‌ ఏర్పాటు  
  •      హుజూర్‌నగర్‌లో ఇండోర్‌ స్టేడియం 
  •      వైద్య విద్య కళాశాల 
  •      అన్ని కులాల వారికి కమ్యూనిటీ భవనాల నిర్మాణం 
  •      హుజూర్‌నగర్‌లో అంతర్గత డ్రెయినేజీ నిర్మాణం 
  •      హుజూర్‌నగర్‌లో పార్క్‌ ఏర్పాటు 
  •      హుజూర్‌నగర్‌లో కోదాడ రోడ్డు నుంచి మిర్యాలగూడ రోడ్డుకు ఫ్‌లై ఓవర్‌ నిర్మాణం 
  •      హుజూర్‌నగర్‌లో అంతర్గత ఎలక్ట్రిసిటీ 
  •      లిఫ్టుల నిర్వహణను ప్రభుత్వ పరిధిలోకి తీసుకు వెళ్లడం 
  •      చివరి భూములన్నింటికీ సాగునీరు అందించేందుకు లిఫ్ట్‌ల ఏర్పాటు 
  •      మోడల్‌ కాలనీ నిర్మాణం పూర్తి చేసి లబ్దిదారులకు పంపిణీ  

టీఆర్‌ఎస్‌ పార్టీ :   శానంపూడి సైదిరెడ్డి  

  •   యువతకు ఉపాధి అవకాశాలపై నిరంతర శిక్షణ తరగతులు 
  •   మహిళల స్వయం ఉపాదికి వృత్తి నైపుణ్య శిక్షణలు 
  •   రైతులకు వ్యవసాయంలో ఆధునిక విధానాలపై శిక్షణ, సహకారం 
  •   కృష్ణానది, మూసీ పరివాహక ప్రాంతాలలో అవసరమైన చోట చెక్‌ డ్యాంలు,లిఫ్ట్‌లు, ఫీడర్‌ ఛానెళ్ల నిర్మాణం 
  •   స్థానికంగా ఉన్న సిమెంట్‌ పరిశ్రమలలో యువతకు  ఉద్యోగావకాశాల కల్పనకు శిక్షణలు 
  •   నియోజకవర్గ  కేంద్రంలో ఈఎస్‌ఐ వైద్యశాల ఏర్పాటు
  •   రక్తనిధి కేంద్రం ఏర్పాటుతో పాటు ప్రాంతీయ వైద్యశాలలో మెరుగైన వైద్యసేవ లందించేందుకు కృషి 
  •   హుజూర్‌నగర్‌లో మినీ స్టేడియం ఏర్పాటు 
  •   అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు కృషి 
  •   అన్ని గ్రామాలలో లింక్, అంతర్గత రోడ్ల నిర్మాణానికి కృషి 
  •   నేరేడుచర్లలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలతోపాటు మేళ్లచెరువులో ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలల ఏర్పాటు, మండల కేంద్రాలలో జూనియర్‌ కళాశాలల ఏర్పాటుకు కృషి 
  •   అర్హులైన వారందరికీ ఇళ్ల నిర్మాణం  

ఆలేరు  :
గొంగిడి సునిత (టీఆరెస్‌)

  • నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం.
  • అలాగే ఈ ప్రాంతానికి బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్ల ద్వారా సాగునీటిని అందించి సస్యశ్యామలం చేస్తాం.
  • సిరిసిల్ల తరహా ప్యాకేజీనీ చేనేత కార్మికులకు ఆలేరు నియోజకవర్గానికి వర్తింపజేస్తాం.
  • రాజపేట, మండలంలోని కొలనుపాక గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతాం. గుండాల మండలాన్ని ఆలేరు నియోజకవర్గంలో కల్పుతాం.
  • ఆలేరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తా. 

100రోజుల్లో తపాసుపల్లి జలాలు : బూడిద (కాంగ్రెస్‌ )

  • కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే 100రోజుల్లో తపాసుపల్లి జలాలతో 85 చెరువుల్లో నీటితో నింపుతాము.
  • నవాబ్‌పేట రిజర్వాయర్‌ ద్వారా గుండాల మండలానికి నీటిని అందిస్తాము.
  • బునాదిగాని కాలువను పూర్తి చేస్తాం.
  • ఆలేరు చేనేత కార్మికులకు సిరిసిల్ల తరహా ప్యాకేజీలను ప్రకటిస్తాం.
  • ప్రతి చేనేత కార్మికునికి 35కిలోలు బియ్యం అంత్యోదయ రేషన్‌ కార్డులు అందిస్తాం.
  • 5లక్షల రూపాయల ప్రమాద భీమా, ఆరోగ్య శ్రీ కింద రూ. 5లక్షల వరకు వైద్యం.
  • ప్రతి 500 జనాభా కలిగిన గ్రామానికి ఒక వాటర్‌ ఫిల్టర్‌ను ఏర్పాటు చేస్తాం.. ఉచితంగా ఒక్కో కుటుంబానికి 20లీటర్ల వాటర్‌ను అందిస్తాం.
  • నియోజకవర్గ కేంద్రంలో పాలిటెక్నిక్‌ కళాశాల, ప్రతి మండలానికి జూనియర్‌ కళాశాల, గిరిజనుల గురుకుల పాఠశాల ఏర్పాటు,
  • తుర్కపల్లి, బొమ్మలరామారంలలో బాలికల ఎస్టీ గురుకుల పాఠశాల, గుట్టలో వెటర్నరీ యూనివర్సిటీ, అలాగే ఎస్టీలకు సేవాలాల్‌ భవన్‌ నిర్మిస్తాం.
  • కొలనుపాకలో ఆదిజాంబవంతుని ఆలయ నిర్మాణం పూర్తయ్యేందుకు సహకరిస్తాం.  

కళాశాలల ఏర్పాటుకు కృషి : దొంతిరి (బీజేపీ )

  • ప్రతి మండలంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలల ఏర్పాటు.
  • నియోజకవర్గంలో నాణ్యమైన విద్యను అందిస్తాం. రైతుల ఆదాయం నాలుగు రెట్టు పెరిగేలా చేస్తాం.
  • ఒక ప్రత్యేక ప్రణాళికతో దళారి వ్యవస్థను నిర్మూలించి రైతుల ఆదాయాన్ని పెంచుతాం.
  • నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా నిర్మూలించి స్వయం ఉపాధి అవకాశాలను పెంచుతాం.
  • పారిశ్రామికీకరణ ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తాం.
  • సంపూర్ణ మహిళా సాధికారత, గ్రామాల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ ద్వారా నైపుణ్యాన్ని పెంచుతాం.
  • గుండాలను యాదాద్రి జిల్లా కలుపుతాం.
  • తపాసుపల్లి జలాలతో ఆలేరు, రాజపేట మండలాలను సస్యశ్యామలం చేస్తాం.
  • ప్రతి గ్రామంలో లైబ్రేరీ, స్మశాన వాటికలను నిర్మిస్తాం.  

గోదావరి జలాలలను తీసుకొస్తాం : మోత్కుపల్లి( బీఎల్‌ఎఫ్‌ )

  • ఆలేరు ప్రాంతానికి గోదావరి నదిజలాలను తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తాం.
  • పల్లెపల్లెకు ఆర్టీసీ బస్సులు నడిపిస్తాం.
  • రైతుబందు స్కీం కింద అర్హులైన రైతులకు, కౌలు రైతులకు, రైతు కూలీలకు నగదును అందిస్తాం.
  • తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ. 5వేల నగదును అందిస్తాం. బీసీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు.
  • వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం తీసుకొస్తాం.  

మిర్యాలగూడ:
భాస్కర్‌రావు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి 

  •  బస్వాపురం రిజర్వాయర్‌ ద్వారా చెరువులను నింపి లక్ష ఎకరాలకు సాగునీరు అందజేసి సస్యశ్యామలం చేస్తాం. 
  •  ఎయిమ్స్‌లో పూర్తి స్థాయిలో వైద్యసేవలను అందుబాటులోకి తెస్తాం. 
  •  భువనగిరి పట్టణంలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణాన్ని చేపడుతాం. 
  •  భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్‌ పట్టణాలను సుందరీకరణ చేస్తాం. 
  •  భువనగిరి ఖిలాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. 
  •  నియోజకవర్గంలోని బునాదిగాని, ధర్మారెడ్డి, పిలాయిపల్లి కాల్వలకు మంజూరైన నిధులతో పూర్తి స్థాయిలో కాల్వల సామర్థ్య పనులను పూర్తి చేస్తాం.  

జూలకంటి రంగారెడ్డి, సీపీఎం అభ్యర్థి

  •  నియోజకవర్గంలోని ఎడమ కాలువపై ఉన్న ఎత్తిపోతల పథకాల రైతుల సమస్యలు పరిష్కరించడంతో పాటు దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల్లో నూతన లిఫ్టుల నిర్మాణం.
  •  నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని అన్ని గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పిస్తాము. 
  •  వేములపల్లి, అడవిదేవులపల్లి, దామరచర్ల మండలాల్లో లింకురోడ్ల నిర్మాణం.
  •  అడవిదేవులపల్లిలో 50 పడకల ఆస్పత్రి ఏర్పాటు.
  •  యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో స్థానికులకు ఉద్యోగ, ఉపా«ధి అవకాశాలు కల్పించడం. 
  •  మిర్యాలగూడ పట్టణంలోని బాలికల జూనియర్, మహిళా డిగ్రీ కళాశాలలు, ప్రభుత్వ ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలల ఏర్పాటు.     

మునుగోడు:
ప్రభాకర్‌రెడ్డి(టీఆరెస్‌)

  • ప్రధానంగా తను చేపట్టిన చర్లగూడెం, లక్ష్మాణపురం ప్రాజెక్టులను పూర్తి చేసి, రాచకొండ ఎత్తిపోతల పథకం ద్వార మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం.
  • రాచకొండను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తా.
  • రీజినల్‌ రింగ్‌ రోడ్‌తో ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా.
  • నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పన కోసం ఇండస్ట్రీయల్‌ పార్కు పూర్తి చేసి ఉద్యోగాలు కల్పిస్తా.
  • చౌటుప్పల్లో డిగ్రీ కళాశాల, మునుగోడులో జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేస్తా. విద్యా, వైద్యంకు పెద్ద పీట వేస్తా.
  • ఇప్పుడున్న ఆరోగ్య కేంద్రాలను, ఆస్పత్రులను స్థాయిని పెంచుతాం. గట్టుపల్‌ మండలం ఏర్పాటు చేస్తాం.
  • ఇప్పటివరకు పెండింగ్‌ ఉన్న పనులన్నీ పూర్తి చేస్తా.
  • పార్టీ మేనిఫెస్టో ప్రకారం అర్హత ఉన్న వారికి ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తా.  

సమృద్ధిగా సాగునీరు : రాజగోపాల్‌రెడ్డి

  • డిండి, ఉదయ సముద్రం, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా మునుగోడు నియోజకవర్గానికి సమృద్ధిగా సాగునీరు అందిస్తాం.
  • పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువాలు పొడిగింపు చేస్తా. చర్లగూడెం రిజర్వాయర్‌ పనులు రెండేళ్లలో పూర్తి చేస్తా.
  • ప్రతి మండల కేంద్రంలో హకా ద్వార కందులు, సీసీఐ ద్వార పత్తి కొనుగోలు చేపడతాం.బత్తాయి, నిమ్మ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తాం.
  • ప్రతి గ్రామంలో వాటర్‌ ప్లాంట్‌ ,ప్రజల సాయం కోసం ప్రజా సహాయ కేంద్రం ఏర్పాటు చేస్తాం.
  • కమ్యూనిటీ హాల్‌ లో నిర్మాణం, నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీలు అభివృద్ధి చేస్తాం.
  • చౌటుప్పల్‌ వేదికగా 2000 పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా అత్యుత్తమ స్థాయి పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు.
  • ఐదు మండలాల్లో డిగ్రీ కళాశాలలు, చండూర్‌ లో డిగ్రీ కళాశాల భవనం నిర్మాణం, విద్యార్థులకు పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ, మునుగోడు నియోజకవర్గంలో ఐటిఐ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. గట్టుపల్‌ మండలాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 

రక్షిత మంచినీరు అందిస్తాం :  గోశిక 

  • నియోజకవర్గ వ్యాప్తంగా రక్షిత మంచినీరు అందిస్తాం.
  • సాగు జలాల కోసం పిలాయిపల్లి, నక్కలగండి, డిండి చర్లగూడెం, లక్ష్మాణపురం రిజర్వాయర్‌ పనులు పూర్తి చేస్తాం. శ్రీశైలం సొరంగ మార్గం పనులు పూర్తి చేస్తాం.
  • ఇల్లు లేని పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు  వారికి ఇష్టమైన చోట నిర్మిస్తామన్నారు.
  • అన్ని మండల కేంద్రాల్లో వంద పడకల ఆసుపత్రితో పాటు 24 గంటల వైద్యం అందిస్తాం.
  • గట్టుపల్‌ మండలం ఏర్పాటు చేస్తున్నారు. చౌటుప్పల్, చండూరులో కోర్టులను ఏర్పాటు చేస్తా. ప్రజా సంక్షేమ పథకాలను అందిస్తాం.  

నల్గొండ:
అభివృద్ధికి పెద్దపీట : కోమటిరెడ్డి

  • ఈ సారి కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి వస్తుంది తానూ కీలకమైన పదవిలో ఉంటా.. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి పెద్దపీట వేస్తా.
  • అసంపూర్తిగా ఉన్న మెడికల్‌ కళాశాలను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తా.. దాంతో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కూడా దొరుకుతాయి.
  • శంషాబాద్‌ నుంచి నల్లగొండ వరకు కొన్ని పరిశ్రమలను తీసుకొచ్చి అభివృద్ధి చేసి నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తా..
  • పట్టణంలో గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అండర్‌గ్రౌండ్‌ డ్రైయినేజీకి రూ.50 కోట్లు ఇచ్చింది. ఇంకా పూర్తి కావడానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిధులు అవసరం ఉండగా మంజూరు చేయలేదు.    వచ్చే కాంగ్రెస్‌  ప్రభుత్వంలో దాన్ని పూర్తి చేసి పట్టణ ప్రజలకు ఉపయోగంలోకి వచ్చే విధంగా కృషి చేస్తా...
  • పట్టణ శివార్లలో 300 ఎకరాల్లో పేదలకు ఇండ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం
  • కలెక్టరేట్‌ సమీపంలో జర్నలిస్టుల కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వంలో భూమిని ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అది అలాగే ఉంది.  కేసీఆర్‌ జర్నలిస్టులకు డబుల్‌ బెడ్‌రూం అని మోసం  చేశాడు. తాము అధికారంలోకి రాగానే నల్లగొండ జర్నలిస్టులకు ఆ భూమిలోనే ఇండ్లు కట్టించే వి«ధంగా చర్యలు తీసుకుంటా.. మిగతా వారికి ఎక్కడైనా ఇంటి స్థలం ఉన్నా డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కట్టుకునేందుకు  రూ.5లక్షలు మంజూరు చేస్తాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement