జియో ఫిర్యాదు: ఎయిర్ టెల్కు దెబ్బపడింది
రిలయన్స్ జియో ఫిర్యాదుతో ఎయిర్ టెల్ కు దెబ్బపడింది. 'ఫాస్టెస్ట్ మొబైల్ నెట్ వర్క్' తమదేనంటూ ప్రచారాన్ని నిర్వహిస్తున్న ప్రమోషనల్ క్యాంపెయిన్ ను ఆపివేయాలని దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ ను వ్యాపార ప్రకటనల వాచ్ డాగ్ ఆదేశించింది. రిలయన్స్ జియో ఫిర్యాదుతో ఎయిర్ టెల్ కు అడ్వర్ టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఏఎస్సీఐ) ఈ ఆదేశాలు జారీచేసింది. 2017 ఏప్రిల్ 11 వరకు టీవీ కమర్షియల్ లలో, వెబ్ సైట్ అడ్వర్ టైజ్మెంట్లో దీన్ని ఉపసంహరించుకోవాలని లేదా తగిన విధంగా సవరించుకోవాలని ఎయిర్ టెల్ కు ఏఎస్సీఐ సూచించింది.
బ్రాడ్ బ్యాండ్ టెస్టర్ ఊక్లా ఎయిర్ టెల్ కు దేశంలోనే 'ఫాస్టెస్ట్ మొబైల్ నెట్ వర్క్ ' గా డిక్లేర్ చేసింది. కానీ ఊక్లా టెస్టింగ్ ను తప్పుబడుతూ జియో, ఏఎస్సీఐను ఆశ్రయించింది. అయితే ఏఎస్సీఐ నిర్ణయాన్ని తాము ఆమోదించేది లేదని, నిబంధనల ప్రకారమే తాము దీన్ని వాడుకుంటున్నట్టు అప్పీల్ దాఖలు చేస్తామని ఎయిర్ టెల్ చెబుతోంది. గ్లోబల్ మొబైల్ స్పీడ్ టెస్ట్ ఊక్లానే ఫాస్టెస్ట్ మొబైల్ నెట్ వర్క్ గా తమల్ని గుర్తించిందని పేర్కొంది. పారదర్శకత, విశ్వసనీయమైన డేటాతోనే తాము ఎయిర్ టెల్ కు ఈ ట్యాగ్ ఇచ్చినట్టు ఊక్లా కూడా స్పష్టంచేసింది.