Rachakonda lands
-
సీఎం ‘సర్వే’తోనూతనోత్తేజం
మంచాల: ఫిలింసిటీ ఏర్పాటు కోసం రాచకొండ గుట్టల్లో భూములు పరిశీలించేందుకు సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏరియల్ సర్వే చేయడం స్థానిక ప్రజల్లో నూతనోత్తేజాన్ని నింపింది. సీఎం వస్తారనే సమాచారంతో జనం భారీ ఇక్కడికి సంఖ్యలో తరలివచ్చారు. దీంతో నిత్యం నిర్మానుష్యంగా ఉండే రాచకొండ పరిసర ప్రాంతం జనంతో కిటకిటలాడింది. పోలీసులు అడుగడుగునా తనిఖీలతో జనం రాకుండా వాహనాలను అడ్డుకున్నారు. అయినా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మూడుసార్లు చక్కర్లు.. ఉదయం 11.40 గంటలకు సీఎం కేసీఆర్ హెలికాప్టర్లోంచి దిగారు. నేరుగా సమీపంలోని వేదిక వద్దకు చేరుకున్నారు. అక్కడ రాచకొండ గుట్టలు, వాటి పరిసర ప్రాంతాలకు సంబంధించిన వివరాలతో కూడిన మ్యాపులను పరిశీలించారు. 12-19 గంటలకు రాష్ట్ర మంత్రులు మహేందర్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డిలు హెలికాప్టర్‌పై రాచకొండ గుట్టలను ఏరియల్ సర్వే చేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌తో పాటు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజీవ్ శర్మ, రంగారెడ్డి- నల్లగొండ జిల్లాల కలెక్టర్లు శ్రీధర్, చిరంజీవులుతో కలిసి 12-23 నుంచి 12-50 గంటల వరకు ఏరియల్ సర్వే చేశారు. హెలికాప్టర్లో ఇలా మూడుసార్లు చక్కర్లు కొట్టారు. తిరిగి వేదిక వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన విశ్రాంతి గదిలో భోజనం చేశారు. అధికారులతో మాట్లాడి రాచకొండ గుట్టల విస్తీర్ణం, ప్రాముఖ్యత వంటి అంశాలపై 2-15 గంటల దాకా చర్చించారు. తిరిగి 2-20 గంటలకు మరోసారి ఏరియల్ సర్వే చేసి తిరిగి వెళ్లిపోయారు. రాచకొండ గుట్టల్లో ముఖ్యమంత్రి 2 గంటల 40 నిమిషాలు గడిపారు. పోలీసుల భారీ బందోబస్తు.. రాచకొండ గుట్టల్లో సీఎం కేసీఆర్ ఏరియల్ చేయనుండటంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. రాచకొండ ముఖ ద్వారానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో తిప్పాయిగూడ గ్రామం నుంచే వాహనాలు రాకుండా నిలిపివేశారు. సీఎం వేదిక వద్దకు మీడియా ప్రతినిధులను అనుమతించ లేదు. సీఎం పర్యటన ప్రశాంతంగా ముగియడంతో పోలీసు యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. -
రాచకొండ గుట్టలను అభివృద్ధి చేస్తాం
భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మంచాల: రాచకొండ గుట్టలను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. సీఎం పర్యటన అనంతరం ఆయన సోమవారం రాచకొండ గుట్టల్లో మీడియాతో మాట్లాడారు. రాచకొండ గుట్టల పరిసర ప్రాంతాలు 40 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయన్నారు. 30 వేల ఎకరాలను సర్వే చేయించి పారిశ్రామిక వాడగా అభివృద్ధి పరుస్తామని ఎంపీ తెలిపారు. మొదటగా భూమిని సర్వే చేసి ప్రభుత్వ భూములను గుర్తిస్తామని చెప్పారు. అనంతరం క్లస్టర్లుగా విభజించి సోలార్ కంపెనీ, ఫార్మాసీటీ, ఫిలింసిటితో పాటు అన్ని విధాలుగా రాచకొండ గుట్టలను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. నగరానికి కూత వేటు దూరంలో ఉన్న రాచకొండ గుట్టలను చూసిన సీఎం కేసీఆర్ చాలా సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా పదకొండు నిమిషాల్లో ఇక్కడికి చేరుకున్నారని, రోడ్డు మార్గంలో కూడా 45 నిమిషాల్లో చేరుకునే విధంగా రహదారులను విస్తరించనున్నట్లు చెప్పారు. స్థానిక ప్రజలకు కూడా జీవనోపాధి కల్పించేలా చూస్తామని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తెలియజేశారు. సమావేశంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్, భువనగిరి ఎమ్మెల్యే చంద్ర శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇది బంగారు కొండ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా/ మంచాల: ‘ఇంత అద్భుతమైన గుట్టలు.. వేల ఎకరాల భూములు.. బేగంపేట నుంచి ఇక్కడకు 11 నిమిషాల్లో వచ్చా.. ఈ భూములను చూస్తే గతంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లు గుర్తుకు వస్తున్నాయి. రాజధానికి సమీపంలోని ఇంత విలువైన భూములను వినియోగించుకోకుండా తెలంగాణ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది.’ అని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ ఫిల్మ్‌సిటీ, స్పోర్ట్స్ సిటీ ఏర్పాటులో భాగంగా సోమవారం రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పరిధిలో ఉన్న రాచకొండ భూములపై ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. మన జిల్లాతో పాటు నల్గొండ సరిహద్దుల్లో ఉన్న భూములను పారిశ్రామిక అభివృద్ధి కోసం వినియోగించుకుందామని, ఇందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాచకొండ గుట్టల్లో ఉన్న భూములను ఆయన హెలికాప్టర్లో 22 నిమిషాలపాటు పర్యటించి పరిశీలించారు. ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరిన సీఎం 11 నిమిషాల్లో రాచకొండలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. మంత్రులు పట్నం మహేందర్‌రెడ్డి, గుంతకండ్ల జగదీశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి రాజీవ్‌శర్మలతో కలిసి ఉదయం 11.35గంటలకు హెలికాప్టర్ దిగారు. పక్కనే అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో విస్తరించి ఉన్న రాచకొండ ప్రాంతం గురించి, రెండు జిల్లాల అధికారులు ఆయనకు వివరించారు. రాచకొండ సరిహద్దు మండలాల గురించి కేసీఆర్ ఆరా తీశారు. అనంతరం కేసీఆర్ సూచన మేరకు మంత్రులు జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, రెండు జిల్లాల కలెక్టర్లు న్.శ్రీధర్, టి.చిరంజీవులు మొదట హెలికాప్టర్ ఏరియల్ సర్వేకు వెళ్లారు. వారు తిరిగొచ్చాక సీఎం కేసీఆర్, ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మలు ఇద్దరు కలెక్టర్లతో కలిసి, హెలికాప్టర్లో రాచకొండను చుట్టివచ్చారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో కేసీఆర్ దాదాపు గంటపాటు సమావేశమయ్యారు. అక్కడే భోజనం చేసి మధ్యాహ్నం 2.10గంటలకు హెలికాప్టర్లో తిరుగుపయనమయ్యారు. జొన్నరొట్టె మస్తు మస్తు.. రాచకొండ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించడంతోపాటు మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ఇష్టాగోష్టి మాట్లాడారు. అనంతరం అక్కడే భోజనం చేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కోసం అధికారులు శంషాబాద్ నోవాటెల్ హోటల్ నుంచి ప్రత్యేక భోజనం తెప్పించారు. కేసీఆర్ జొన్నరొట్టె, చికెన్, చేపలతో భోజనం చేశారు. ఈ సందర్భంగా జొన్నరొట్టెతో కూడిన మెనూ మస్తుగుందని అన్నట్టు తెలిసింది. అదేవిధంగా తన పర్యటన సందర్భంగా తక్కువ సమయంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసిన జిల్లా ఉన్నతాధికారులను ఆయన అభినందించారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్నున ప్రశంసించారు. రాచకొండకు కే సీఆర్ ఏరియల్ సర్వేకు వస్తున్నారని పరిసర గ్రామాల నుంచి జనం పెద్దఎత్తున తరలివచ్చారు. పోలీసులు భద్రతా కారణాల దృష్ట్యా దగ్గరివరకు అనుమతించలేదు. దూరంగానే ఆపేశారు. కేసీఆర్ హెలికాప్టర్ ఎక్కే సమయంలో అభివాదం చేయడంతో, ఒక్కసారిగా ఉత్సాహంతో కే రింతలు కొట్టారు. కట్టుదిట్టమైన బందోబస్తు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వేకు పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. రాచకొండ ఒకప్పుడు మావోయిస్టులకు సేఫ్ జోన్. దాదాపు 20సంవత్సరాలపాటు రాచకొండ కేంద్రంగా ఉద్యమం నడిచింది. మావోయిస్టుల ప్రాబల్యం కార ణంగా ఇంత వరకు ఎవరూ ఇక్కడ పర్యటించలేదు. సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వేకు నిర్ణయించడంతో పోలీసులు కొంత ఉత్కంఠకు గుర య్యారు. తొలుత ఈ నెల 3వ తేదీనే ఏరియల్ సర్వే చేయాలని తలపెట్టినప్పటికీ, మావోల కదలికల నేపథ్యంలో వాయిదా పడినట్టు వార్తలొచ్చాయి. దీంతో పోలీసులు సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గత పదిహేను రోజులకాలంగా రాచకొండలో పోలీసుల కూంబింగ్ నడుస్తూనే ఉంది. సోమవారం సీఎం పర్యటన నేపథ్యంలో మరో 10 స్పెషల్‌పార్టీ, గ్రేహౌండ్స్ బలగాలు గత మూడు రోజులుగా రాచకొండను జల్లెడ పట్టాయి. ఆరుగురు డీఎస్పీలు, 20మంది సీఐలు, 50మంది ఎస్ఐలు, 500మందికిపైగా పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. సీఎం ల్యాండయిన గుట్టల చుట్టూకూడా పోలీసులను పెద్దఎత్తున మోహరించారు. భద్రతా కారణాల దృష్ట్యా పలు చోట్ల అక్కడికి వచ్చిన వారిని తనిఖీలు చేశాకే పంపారు. జనాన్ని కూడా అర కిలోమీటర్ దూరంలో ఆపేశారు. మీడియాపై కూడా ఆంక్షలు విధించారు. దీంతో మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. -
నేడు ‘రాచకొండ’కు కేసీఆర్
ఫిలింసిటీ కోసం భూములు పరిశీలించనున్న సీఎం ఏరియల్ సర్వేలో పాల్గొననున్న మంత్రులు మహేందర్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు సాక్షి, రంగారెడ్డి జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫిలింసిటీ ఏర్పాటుకు మరో అడుగు పడనుంది. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల సరిహద్దుల్లోని రాచకొండ గుట్టల్లో ఫిలింసిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాచకొండ భూములను సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరిశీలించనున్నారు. హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించేందుకు రెండు జిల్లాల అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. సీఎం కేసీఆర్‌తో పాటు రెండు జిల్లాలకు చెందిన మంత్రులు మహేందర్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రాజీవ్‌శర్మ, కలెక్టర్లు శ్రీధర్, చిరంజీవులు హాజరుకానున్నారు. పటిష్ట భధ్రత వాస్తవానికి సీఎం కేసీఆర్ ఈ నెల 3న ఫిలింసిటీ, ఫార్మాసిటీ భూముల పరిశీలన నిర్వహించాల్సి ఉండగా.. సమయాభావం, ఫార్మా కంపెనీ ప్రతినిధులతో సమావేశం నేపథ్యంలో కేవలం ఫార్మాసిటీ భూములను మాత్రమే పరిశీలించారు. అనంతరం పదిరోజుల తర్వాత రాచకొండ భూములను పరిశీలించాలని నిర్ణయించిన ఆయన.. సోమవారం ఏరియల్ సర్వేకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో హెలికాప్టర్లో రాచకొండ భూములు పరిశీలించనున్నారు. సీఎం పర్యటన ఉండడంతో అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు చెందిన పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది. రాచకొండ ప్రాంతమంతా నక్సల్ ప్రభావితమైనది కావడంతో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. -
రాచకొండలో కేసీఆర్ ఏరియల్ సర్వే
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బుధవారం రంగారెడ్డి జిల్లా రాచకొండలో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఫిల్మ్‌సిటీ ఏర్పాటు నేపథ్యంలో కేసీఆర్ రాచకొండ గుట్టల్లో పర్యటించారు. అంతకుముందు ముచ్చర్ల అటవీ భూములను పరిశీలించారు. ఔషధ పరిశ్రమల కోసం భూములను అన్వేషిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించారు. కేసీఆర్ వెంట పలువురు పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. కేసీఆర్ పారిశ్రామిక వేత్తలతో కలసి రెండు హెలికాప్టర్లలో ఏరియల్ సర్వేకు వెళ్లారు. -
సీఎం రాచకొండ పర్యటన రద్దు
⇒ ముచ్చర్ల పర్యటనకే పరిమితం ⇒ దేశంలోని 20మంది ఫార్మా దిగ్గజాలతో కలిసి ఏరియల్ సర్వే ⇒ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్న యంత్రాంగం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాచకొండ భూముల్లో సీఎం కేసీఆర్ పర్యటన రద్దయ్యింది. ముచ్చర్ల పర్యటనకు ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఫిల్మ్‌సిటీ ఏర్పాటు నేపథ్యంలో కేసీఆర్ బుధవారం ఏరియల్ సర్వే కోసం రాచకొండ గుట్టల్లో పర్యటించాల్సి ఉంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌తోపాటు ఇతర అధికార యంత్రాంగం కొన్ని రోజులుగా సీఎం పర్యటన ఏర్పాట్లలో తలమునలైంది. దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం పర్యటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత సీఎం పర్యటన రద్దు కావడంతో అధికార యంత్రాంగం నిరాశకు లోనయింది. అయితే ఫార్మాసిటీ ఏర్పాటుకు స్థల పరిశీలన కోసం కోసం బుధవారం కందుకూరు మండలంలోని ముచ్చర్లలో కేసీఆర్ పర్యటించనున్నారు. దాంతో రాచకొండ పర్యటన రద్దు చేశారు. ఈ మేరకు సోమవారం సీఎం కార్యాలయం జిల్లా కలెక్టర్‌కు తెలియజేసింది. దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీల అధినేతలు 20మందికిపైగా ముచ్చర్లకు రానున్నారు. ఈ క్రమంలో సీఎం ఎక్కువ సమయంలో ముచ్చర్లలో ఫార్మా కంపెనీల దిగ్గజాలతో గడపనున్నారు. ఆమనగల్లులో ఫార్మాసిటీ కోసం సుమారు 2వేల ఎకరాలను ప్రాథమికంగా గుర్తించారు. జిల్లా అధికారులు అంతా ఇప్పుడు ముచ్చర్లలో ఏర్పాట్లపై దృష్టిసారించారు. ఫార్మాసిటీ కోసం ఇక్కడ సీఎం ఫార్మా అధినేతలతో కలిసి ప్రభుత్వ భూములను పరిశీలించనున్నారు. అనంతరం అక్కడ యంత్రాంగం ఏర్పాటు చేసే ఫొటో ప్రదర్శనను తిలకించనున్నారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వ హించనున్నారు.