rachamallu sivaprasadreddy
-
ఆ బాబు బాధ్యత నాది: ఎమ్మెల్యే రాచమల్లు
సాక్షి, ప్రొద్దుటూరు : ‘తండ్రి లేని పిల్లాడని దిగులు చెందవద్దమ్మా.. ఈ బాబు బాధ్యత నేను తీసుకుంటా’ అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. స్థానిక శ్రీకృష్ణదేవరాయ వీధిలో నివాసం ఉంటున్న రాజేష్ గత నెల 7న తొండూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇతనితో పాటు మరో ఇరువురు మృత్యువాత పడ్డారు. రాజేష్ చనిపోయే నాటికి అతని భార్య షబానా గర్భిణి. సోమవారం ఆమె జిల్లా ఆస్పత్రిలో ప్రసవించి మగ బిడ్డకు జన్మనిచ్చారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వార్డుకు వెళ్లి షబానా, పసికందు ఆరోగ్య స్థితిగతులపై వైద్యులతో మాట్లాడారు. ఆమె బిడ్డను చేతుల్లోకి తీసుకొని రాజేష్ రూపంలో దేవుడు పంపించాడని అన్నారు. ‘దిగులు పడ వద్దమ్మా.. ఈ బిడ్డ బాధ్యత నేను తీసుకుంటా ’ అని అన్నారు. బాబుకు 19 ఏళ్లు వచ్చే నాటికి రూ. 10 లక్షలు చేతికి వచ్చేలా బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేస్తానని చెప్పారు. ఆ డబ్బు అతని జీవనోపాధి కోసం ఉపయోగపడుతుందన్నారు. రెండు, మూడు రోజుల్లోనే ఈ పని చేస్తానన్నారు. ముగ్గురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకొని వెళ్లగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద కేవలం రెండు రోజుల్లోనే రూ. 5 లక్షలు చొప్పున ముగ్గురి కుటుంబాలకు అంద చేశారన్నారు. -
అమరావతి వెళ్లినా...తేలని టీడీపీ అభ్యర్థి!
సాక్షి, ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి నెల రోజులు ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి జోరుగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దాదాపు సగం నియోజకవర్గంలో ప్రచారాన్ని పూర్తి చేశారు. అధికార పార్టీని గత ఐదేళ్లలో గట్టిగా ఎదుర్కోవడంతోపాటు ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారనే మంచి పేరు రాచమల్లుకు ఉంది. ఈ కారణాల వల్ల ఆయన విజయం ఖాయమని, మెజారిటీపైనే స్పష్టత రావాల్సి ఉందని చర్చ జరుగుతోంది. ఇది ఇలా ఉండగా టీడీపీ అభ్యర్థిని ఇంత వరకు ఆ పార్టీ అధిష్టానం ప్రకటించలేదు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి ఎంపిక అయోమయంగా మారింది. కొత్తపేర్లు సైతం ప్రచారంలోకి వస్తున్నాయి. ఆ పేర్లు వింటున్న టీడీపీ కార్యకర్తలు తమ అధిష్టానం ఇలా చేయడం ఏమిటని లోలోన ఆవేదనచెందుతూ బయటికి చెప్పుకోలేకపోతున్నారు. దాదాపు డజను పేర్లు తెరమీదికి వచ్చి కనుమరగైపోయాయి. ఇంకా స్పష్టత మాత్రం రాలేదు. పలు మార్లు స్థానిక నేతలు అమరావతికి వెళ్లడం, తిరిగి రావడం జరుగుతోంది. ఈనెల 18 నుంచి నామినేషన్ల కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుడుతుండగా అధిష్టానం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఫిబ్రవరి 6 నుంచే ప్రచారం ప్లాన్ ప్రకారం ఎన్నికల బరిలోకి దిగుతున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఫిబ్రవరి 6వ తేదీ నుంచే ఎన్నికల ప్రచారాన్ని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈకార్యక్రమానికి వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ కన్వీనర్ కె.సురేష్‌బాబు హాజరయ్యారు. నియోజకవర్గ పరిధిలో ప్రొద్దుటూరు, రాజుపాళెం మండలాలకు సంబంధించి 30 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ పరిధిలో 40 వార్డులు ఉన్నాయి. రాజుపాళెం మండలంలో రాజుపాళెం గ్రామ మినహా మిగతా మండలమంతా ప్రచారం దాదాపుగా పూర్తయింది. ప్రొద్దుటూరు మండలంలో కాకిరేనిపల్లె, చౌడూరు, నరసింహాపురం, రామాపురం, రేగుళ్లపల్లి, సీతంపల్లి, ఎర్రగుంట్లపల్లి, కొట్టాల, నంగనూరుపల్లి, సోములవారిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే పూర్తి చేశారు. ఎమ్మెల్యే రాచమల్లు ప్రచారం ఓటర్లను ఆకర్షిస్తుండటంతోపాటు వైఎస్సార్సీపీ నాయకుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మంగళవారం నుంచి ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో ఒకటో వార్డు నుంచి ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 30 రోజుల్లో ప్రచారం చేస్తారా.. షెడ్యూల్ ప్రకారం ఈనెల 18 నుంచి అసెంబ్లీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండగా ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. అన్నింటికి కలిపి నెల రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఇప్పటి వరకు టీడీపీ అధిష్టానం అభ్యర్థిని ఎంపిక చేయలేదు. మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల వరదరాజులరెడ్డి, మల్లేల లింగారెడ్డి, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డితోపాటు వరద కుమారుడు కొండారెడ్డి, ఉక్కు ప్రవీణ్కమార్రెడ్డి, డాక్టర్ వైవీ స్వరూప్‌కుమార్‌రెడ్డి, ఆప్కో చైర్మన్ గుజ్జల శ్రీను, టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ పేర్లు పార్టీ వైపు నుంచి వినిపించగా స్థానికంగా పలువురు తామూ టికెట్ రేసులో ఉన్నామని ప్ర చారం చేసుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు అభ్యర్థి ని అధిష్టానం ఎంపిక చేసినా నియోజకవర్గమంతా తిరిగి ప్రచారాన్ని పూర్తి చేయడం అంత సులు వు కాదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. జగన్ నాయకత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారు ప్రొద్దుటూరు : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు పూర్తిగా కోరుకుంటున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో మంగళవారం ఉదయం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తొలి రోజు ఇక్కడ ప్రచారం చేస్తున్నానన్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, కూలీలు, చిన్న వ్యాపారులు జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటున్నారని తెలుస్తోందన్నారు. ఈ వార్డు పూర్తిగా వైఎస్సార్సీపీకి పట్టుకొమ్మలాంటిదన్నారు. ఈ కారణంగా 2014 ఎన్నికల్లో ఇక్కడ మంచి మెజారిటీ వచ్చిందని అన్నారు. అంతకు రెండింతలు ఈ ఎన్నికల్లో మెజారిటీ వస్తుందని తెలిపారు. జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని సర్వత్రా అభిప్రాయం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. దీనిని బట్టి చూస్తే ఆ బ్రహ్మదేవుడు వచ్చినా చంద్రబాబును కాపాడలేరన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైతే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే తాను నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేగా తన వంతు ప్రజా సేవ చేశానన్నారు. టీడీపీ ప్రభుత్వం మాత్రం దృష్టి సారించకపోవడంతో నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. అభివృద్ధి విషయంలో ప్రొద్దుటూరుకు పట్టిన దరిద్రం వదలాలంటే జగన్ ప్రభుత్వం ఏర్పాటు కావాలని చెప్పారు. సమావేశంలో వైఎస్సార్సీపీ వార్డు నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి, కౌన్సిలర్ గోనా సరస్వతీ ప్రభాకర్‌రెడ్డి, పోరెడ్డి ప్రదీప్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వంగనూరు మురళీధర్‌రెడ్డి, కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ దేవీ ప్రసాదరెడ్డి, రాజుపాళెం మండల కన్వీనర్ ఎస్ఏ నారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు నాగేంద్రారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఓబయ్య, ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి స్నూకర్ భాస్కర్, గోకుల్ సుధాకర్, మాజీ కౌన్సిలర్ వరికూటి ఓబుళరెడ్డి, ఆయిల్ మిల్ ఖాజా, మార్కెట్ దాదాపీర్, 24వ వార్డు మహ్మద్‌రఫి పాల్గొన్నారు. -
టీడీపీ కార్యకర్తకు ఉద్యోగం ఎలా ఇచ్చారు..?
ప్రొద్దుటూరు టౌన్ : మున్సిపాలిటీలో ఒక స్వీపర్ మృతి చెందితే ఆయన భార్యకు ఉద్యోగం ఇవ్వకుండా టీడీపీ కార్యకర్తకు ఇవ్వడం బాధాకరమని, వెంటనే అతన్ని తొలగించాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న కార్మికుల వద్దకు ఎమ్మెల్యే బుధవారం అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా మృతి చెందిన కార్మికుడు సుబ్బ రాయుడు భార్య మేరి, వారి పిల్లలతో కలిసి దీక్షా శిబిరంలో కూర్చున్నారు. అక్కడికి వచ్చిన కమిషనర్‌తో ఎమ్మెల్యే మాట్లాడారు. కార్మికుడు చనిపోతే సంబంధిత కాంట్రాక్టర్ మృతి చెందిన కార్మికుడి కు టుంబంలో ఉద్యోగం చేసే వారు లేకపోతే మరొకరికి ఇవ్వాలన్నారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా మరొకరి పేరును ఎలా నమోదు చేశారని ప్రశ్నిం చా రు. 9 నెలల పాటు పార్కులో పని చేయించుకొని జీతం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. కాంట్రాక్టర్‌కే తెలియకుండా.. కార్మికుడు ఎవరైనా మరణిస్తే వారి స్థానంలో మరొకరిని నియమించాల్సింది కాంట్రాక్టర్ అని, అయితే కాంట్రాక్టరకే తెలియకుండా మేరువ కుమార్ అనే టీడీ పీ కార్యకర్తకు పోస్టింగ్ ఎవరిచ్చారని ఎమ్మెల్యే కమిషనర్‌ను ప్రశ్నించారు. అవన్నీ తనకు తెలియవని కమిషనర్ చెప్పడంతో ఎమ్మెల్యే ఇది పద్ధతి కాదన్నారు. న్యా యం జరగకపోతే 48 గంటలు నిరా హార దీక్ష చేస్తానని హెచ్చరించారు.కార్మికుని కుమార్తెకు రూ.లక్ష బాండు అందించిన ఎమ్మెల్యేసుబ్బరాయుడు కుమార్తెకు 20 ఏళ్ల నాటికి రూ.లక్ష వస్తుందని, అది పాపకు ఉపయోగపడే విధంగా బ్యాంకులో డిపాజిట్ చేశామని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. చెప్పిన ఏడవ రోజే పాప పేరుతో డిపాజిట్ చేశామన్నారు. బాండు పత్రాన్ని సుబ్బరాయుడు కుమార్తెకు అందించారు. వైఎస్ఆర్సీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వంగనూరు మురళీధర్‌రెడ్డి, కౌన్సిలర్లు ట ప్పా గైబూసాహెబ్, రాగుల శాంతి, శివకుమార్‌యాదవ్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సం యుక్త కార్యదర్శి కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, రాజుపాళెం మండల కన్వీనర్ ఎస్ఏ నారా యణరెడ్డి, మహిళా రాష్ట్ర కార్యదర్శి విజ యలక్ష్మి, వైఎస్ఆర్టీయూసీ జిల్లా అధ్యక్షుడు షెక్షావలి, చేనేత విభాగం రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి బడిమెల చిన్నరాజ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు విజయ్‌కుమార్, ప్రమీలమ్మ, సాల్మన్ తదితరులు ఉన్నారు. కాంట్రాక్టర్‌తో మాట్లాడిన ఎమ్మెల్యే... ఎమ్మెల్యే కాంట్రాక్టర్ రమణారెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. సుబ్బ రాయుడు మరణిస్తే అతని స్థానంలో అతని భార్యకు ఉద్యోగం ఇవ్వకుండా మరొకరిని ఎలా నియమించారని ప్రశ్నించారు. తనకు ఆ విషయమే తెలియదని, నాయకులే ఇష్టం వచ్చిన వారిని వేసుకొని పేర్లు రాయించుకున్నారని తెలిపారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్, చైర్మన్లకు జడ్జి నోటీసులు లీగల్ (కడప అర్బన్) : జిల్లాలోని ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో జరిగిన అ వకతవకలపై వచ్చిన ఫిర్యాదు ను సుమోటోగా స్వీకరించి బుధవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్ కేసు నమోదు చేయడంతోపాటు ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్, చైర్మన్లకు నోటీసులు జారీ చేశారు. వారు ఈనెల 21వ తేదీన జిల్లా కోర్టులోని న్యాయ సేవాసదన్‌లో డీఎల్ఎస్ఏ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. -
ఎట్టకేలకు చేనేతలకు పింఛన్
ప్రొద్దుటూరు టౌన్ : ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి గాంధీ మార్గం ద్వారానే సమస్యను పరిష్కరించగలిగారు. 31 రోజుల ఆందోళన అనంతరం 77 మంది చేనేతలకు అధికారపార్టీ నేతల చేతుల మీదుగాప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్లు ఇప్పించి వారి మన్ననలు పొందారు. ప్రభుత్వం చేనేత ఐడీ కార్డులు కలిగిన వారి నుంచి పింఛన్ల కోసం దరఖాస్తులను గత ఏడాది ఆహ్వానించింది. పట్టణంలోని 13 వార్డుల్లో ఉన్న 436 మంది దరఖాస్తు చేసుకున్నారు. జౌళిశాఖ ఏడీఓ విజయానంద్ ఇంటింటికి వెళ్లి వివరాలను సేకరించి ప్రభుత్వానికి పంపారు. వీరిలో ఐడీ కార్డులు ఉన్న 77 మందిని పింఛన్లకు అర్హులుగా తేల్చి నవంబర్‌లో మున్సిపాలిటీకి జాబితా పంపింది. డీఆర్డీ అధికారుల ఆదేశాల మేరకు 77 మంది వివరాలను జన్మభూమి కమిటీ సభ్యులు ఆయా వార్డుల కౌన్సిలర్ల సంతకాలు చేయించి క్లర్క్ మనోహర్ ఆన్లైన్లో పొందుపరిచారు. అప్పటికంటే ముందు వచ్చిన వారి వివరాలను కమిషనర్‌కు తెలియజేశారు. ప్రభుత్వం 77 మందికి పింఛన్లు మంజూరు చేసి మొత్తాన్ని మున్సిపల్ ఖాతాలో జమ చేసింది. సిబ్బంది రెండు వార్డుల్లో నలుగురు చేనేతలకు పింఛన్ డబ్బు పంపిణీ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి తన సంతకం లేకుండా ఎలా పింఛన్లు ఆన్లైన్లో పొందుపరిచారంటూ క్లర్క్ మనోహర్‌పై ఫిర్యాదు చేసి సస్పెండ్ చేయించారు. అనంతరం డీఆర్డీఏ అధికారులకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి పింఛన్లను నిలిపివేశారు. దీంతో నవంబర్ నెల పింఛన్ ఆగిపోయింది. డిసెంబర్లో సొమ్ము మున్సిపల్ ఖాతాలో జమ కావడం, చేనేతలకు పింఛన్ ఇవ్వని విషయాన్ని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలుసుకుని కమిషనర్‌ను ప్రశ్నించారు. సరైన సమాధానం రాకపోవడంతో చేనేతలతో కలసి ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయంలో... డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో ఎమ్మెల్యే, చేనేత లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయంలో ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. అధికారులు ఎవ్వరూ çస్పందించకపోవడంతో డిసెంబర్ 8న ప్రొద్దుటూరుకు వస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దృష్టికి సమస్యను తీసుకెళుతామని ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకటించారు. దీంతో కలెక్టర్ బాబురావు నాయుడు స్పందించి రామచంద్రారెడ్డి చేత దీక్ష విరమింపచేయాలని డీఆర్డీఏ పీడీని పంపించారు. ఉపరాష్ట్రపతి వెళ్లిన మరుసటి రోజు 9వ తేదీ మున్సిపాలిటీకి చైర్మన్ ఫిర్యాదుపై విచారించి పింఛన్ పంపిణీ చేస్తామని పీడీ హామీ ఇచ్చారు. అదే రోజు విచారణ చేసిన పీడీ 77 మంది పింఛన్లకు అర్హులని తేల్చి కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. అయినా వరదరాజులరెడ్డి పింఛన్ ఇవ్వొద్దని చెప్పడంతో అధికారులు ఇవ్వలేదు. గత ఏడాది డిసెంబర్ 22న పుట్టపర్తి సర్కిల్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ఎమ్మెల్యే శాంతియుత మార్గంలో చేనేతలతో కలసి భిక్షాటన చేశారు. అయినా అధికారులు స్పందించలేదు. దీంతో డిసెంబర్ 28వ తేదీ నుంచి మున్సిపల్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేనేతలతో కలసి ఎమ్మెల్యే చేశారు. ఐదో తేదీ ఇవ్వకపోతే ఆరో తేదీ ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఆరు నెలల పింఛన్ ఇస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. 7న అమరావతిలో సీఎం వెళ్లే రహదారిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జనవరి 4న 77 మంది చేనేతలకు మంత్రి ఆదినారాయణరెడ్డి, పింఛన్లను అడ్డుకున్న వరదరాజులరెడ్డి చేతుల మీదుగా పింఛన్లను ఇప్పించారు. శాంతి మార్గంలో ఎంతటి కష్టమైన సమస్యకైనా పరిష్కారం లభిస్తుందనేది ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది. -
పేదల ఆరోగ్యం గురించి పట్టదా?
ప్రొద్దుటూరు క్రైం: ‘జిల్లాలోనే పెద్దాస్పత్రి. అయినా 14 ఏళ్లుగా డాక్టర్లు లేరు. సిబ్బంది కొరత. దీనికి కారణం ప్రభుత్వాల అసమర్థతే. రోగుల ఆరోగ్యం గురించి పట్టించుకునే దిక్కులేదు. ఇలాగైతే ఎలా? అని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. స్థానిక జిల్లా స్థాయి ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి రాచమల్లుతో పాటు జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, కమలాపురం, మైదుకూరు ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, రఘురామిరెడ్డి హాజరయ్యారు. ‘ఇక్కడి ఆస్పత్రిని నమ్ముకుని వచ్చే రోగి.. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా పూర్తి స్థాయిలో కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్లేలా చూడాలి. అందుకు ఎంత డబ్బు కావాలో చెప్పండంటూ ఆయన వైద్యాధికారులను అడిగారు. ఆస్తులు అమ్మై సరే డబ్బు ఇస్తానని ప్రకటించారు. బ్లడ్‌బ్యాంక్‌కు 30 కేవీ జనరేటర్‌ను తన సొంత ఖర్చులతో సమకూరుస్తానని హామీ ఇచ్చారు. విద్యుత్ కోతల నేపథ్యంలో జనరేటర్ ఏర్పాటు చాలా ఖర్చుతో కూడుకున్నదని, సోలార్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలని జెడ్పీ చైర్మన్ గూడూరు రవి సూచించారు. తొమ్మిది మంది సివిల్ సర్జన్లకు గాను కేవలం నలుగురు ఉండటం ఏమిటని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆస్పత్రి సూపరింటెండెంట్ మూర్తిని ప్రశ్నించారు. పేదలకు వైద్యం అందేలా చూడాలని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి సూచించారు. డీసీహెచ్ఎస్ రామ్మోహన్రావు, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, రాజుపాళెం జెడ్పీటీసీ సభ్యురాలు మంజుల, చెన్నూరు ఎంపీపీ బాలమ్మ, రోటరీ క్లబ్ అధ్యక్షుడు రాజారామ్మోహన్‌రెడ్డి, ఆర్ఎంఓ బుసిరెడ్డి, డిప్యూటీ ఆర్ఎంఓ శివరాం, నర్సింగ్ సూపరింటెండెంట్ రాణెమ్మ, వైద్యులు పాల్గొన్నారు. సూపరింటెండెంట్‌తో బ్లడ్‌బ్యాంక్ డాక్టర్ వాగ్వాదం బ్లడ్‌బ్యాంక్ డాక్టర్ విజయనిర్మల, సూపరింటెండెంట్ ఎస్ఎన్.మూర్తి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బ్లడ్‌బ్యాంక్‌కు సంబంధించి ఎలాంటి నిధులు ఇవ్వలేదని ఆమె ఆరోపించారు.