radio stations
-
మైఖేల్ జాక్సన్ పాప్ సాంగ్స్ బ్యాన్
పాప్ రారాజు మైఖేల్ జాక్సన్‌ను బాలలపై లైంగిక దాడులు చేసేవారనే ఆరోపణలు న్నప్పటికీ మరణానంతరం ఆయన వేధింపుల పర్వం వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రపంచ దేశాల్లోని 12కుపైగా రేడియో స్టేషన్లు ఆయన పాప్ గీతాలను బ్యాన్ చేస్తూ నిర్ణయించాయి. మైఖేల్ జాక్సన్ పాప్ గీతాలను తొలగిస్తున్నట్టు ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, కెనడా తదితర దేశాలు వెల్లడించాయి. మరణించి ఇన్నేళ్ళయినా చిన్న పిల్లలపై అతను చేసిన దుర్మార్గాల పర్వం మైఖేల్ జాక్సన్‌ను మరింతగా వెంటాడుతోంది. పాప్ గీతాల తొలగింపునకు తోడు బ్రిటిష్ నేషనల్ ఫుట్‌బాల్ మ్యూజియం నుంచి మైఖేల్ జాన్సన్ మైనపు బొమ్మను తొలగింస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. మైఖేల్ జాక్సన్ పాప్సింగర్గా ఒకవెలుగు వెలుగుతున్న క్రమంలో పిల్లలను లైంగికంగా వేధించేవాడని, వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా జిమ్మీ సెఫ్ చక్ (41), వేడ్ రాబ్సన్ (36) లు తమ పదేళ్ళు, ఏడేళ్ళ వయస్సులో మైఖేల్ తమ పట్ల దారుణంగా, చెప్పలేని విధంగా ప్రవర్తించేవాడని, నెవర్లాండ్ ఎస్టేట్‌లో తాము ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నామని తాజాగా వెలుగులోకి తీసుకొచ్చారు. అంతేకాదు తమ లాంటి బాధితులు చాలా మంది ఉన్నారంటూ సంచలనం సృష్టించారు. ఈ కథనాన్ని బ్రిటన్‌లోని ఓ ఛానల్ బుధవారం రాత్రి ప్రసారం చేసింది. మైఖేల్ ఫ్యాన్స్ కూడా చాలామంది ఇది విని షాక్ తిన్నారు. ఆ మధ్య అతని ఎస్టేట్ లో పని చేసిన ఓ మహిళ కూడా అతని నిర్వాకాన్ని బహిరంగ పర్చిన సంగతి తెలిసిందే. తను చూసిన దృశ్యాలను ఎవరికైనా చెబితే తన గొంతు కోస్తామని, అక్కడి ఉద్యోగులు తనను బెదిరించిన విషయాన్ని ఆమె గుర్తు చేయడం గమనార్హం. -
ప్రసారం సమాప్తం
ఒక ఆడపిల్ల కదలికలను ప్రేమతోనైనా సరే నియంత్రించడం అత్యాచారం కన్నా ఏం తక్కువ? అది సాహిత్యం అయినా, సన్నివేశం అయినా.. ఇట్సే ‘రేపీ’. మీటూ ఉద్యమం పుణ్యమా అని కొత్తగా కలిగిన ఈ స్పృహతో యు.ఎస్. రేడియో స్టేషన్లు.. డెబ్బై నాలుగేళ్లుగా క్రిస్మస్ సీజన్లో తాము ప్రసారం చేస్తున్న ‘బేబీ, ఇట్స్ కోల్డ్ అవుట్‌సైడ్’ అనే ఆస్కార్ అవార్డు సాంగ్‌ను తమ ప్లే లిస్ట్‌లోంచి ఒకదాని వెంట ఒకటిగా తొలగిస్తున్నాయి. కొన్ని పాటలు, కొన్ని పువ్వులు సీజన్ వచ్చేసిందని ముందే చెప్పేస్తాయి. యు.ఎస్. రేడియో స్టేషన్ల నుంచి ‘బేబీ, ఇట్స్ కోల్డ్ అవుట్‌సైడ్’ అనే హాలీడే సాంగ్ వినిపించిందంటే క్రిస్మస్ సీజన్ మొదలైనట్లే. అయితే ఈ ఏడాది క్రిస్మస్ సీజన్ మొదలైనా.. ఆ పాట ఏ రేడియో స్టేషన్ నుంచీ వినిపించడం లేదు! యు.ఎస్.ను చూసి కెనడా కూడా స్టాప్ చేసింది. ఇంకా మరికొన్ని దేశాల్లోని రేడియో స్టేషన్లు 1944 నాటి ఆ క్లాసిక్ డ్యూయట్‌ను ఈ ‘మీటూ’ టైమ్‌లో ప్లే చెయ్యకపోవడమే క్షేమకరమన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నాయి. బ్రాడ్వే (రంగస్థలి) ఆస్థాన గీత రచయిత ఫ్రాంక్ లోస్సర్ రాసిన ‘బేబీ, ఇట్స్ కోల్డ్ అవుట్‌సైడ్’ ను 1949 హాలీవుడ్ మూవీ ‘నెప్ట్యూన్స్ డాటర్’లోకి తీసుకున్నారు. సినిమాలో ఎస్తర్ విలియమ్స్, రికార్డో మాంటల్బేన్ మధ్య పాటను చిత్రీకరించారు. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’గా ఆస్కార్ అవార్డు’ కూడా పొందిన ఆ పాటకు ఇన్నేళ్లలో అనేక వెర్షన్లు వచ్చాయి. మొన్న మొన్న ఆమెరికన్ గాయని లేడీ గాగా.. రివర్స్ వెర్షన్లో ఆ పాటను తీసుకున్నారు. అసలుపాటలో అతడు ఆమెను వెళ్లకుండా ఆపుతుంటే.. గాగా వీడియోలో ‘బేబీ, ఇట్స్ కోల్డ్ అవుట్‌సైడ్’ (బేబీ, బయట చలిగా ఉంది) అంటూ ఆమె అతడిని వెళ్లకుండా ఆపుతుంటుంది. ఒరిజినల్ పాటను రాసినవారు కానీ, పాటకు యాక్ట్ చేసివారు గానీ ఇప్పుడు లేరు. పాటొక్కటే బతికి ఉంది. ఇప్పుడా పాట కూడా ‘మీటూ’ పెనుగాలులకు రెపరెపలాడుతోంది. ‘మీటూ’కు, ఈ పాటను ఆపేయడానికి సంబంధం ఏంటి? ఏంటంటే.. పాటపై ఎప్పటి నుంచో బలహీనమైన కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. మీటూ ఉద్యమం చురుగ్గా ఉన్న ఈ టైమ్‌లో అవి బలమైన అభ్యంతరాలుగా రూపాంతరం చెందే ప్రమాదం ఉండొచ్చని స్టేషన్ డైరెక్టర్ల అనుమానం. పాటలోని సాహిత్యం, పాట సన్నివేశం.. ‘స్త్రీపై అత్యాచారం జరుపుతున్నట్లుగా’ ఉన్నాయన్నది ఎప్పటి నుంచో ఉన్న ఆరోపణ. ‘సాంగ్ కాదు.. ఇట్సే రేపీ’ అని అప్పట్లోనే ముఖం చిట్లించిన వారున్నారు. పాట ‘కాల్ అండ్ రెస్పాన్స్’ స్టెయిల్లో సాగుతుంది. ఒకరు పాడుతుండగనే, దానికి లింక్‌గా రెండో వారు అందుకోవడం! ఎలాగంటే.. ‘లాయర్ సుహాసిని’ సినిమాలో సుహాసినికి, భానుచందర్‌కి మధ్య ఒక డ్యూయెట్ ఉంటుంది. ‘దివిని తిరుగు మెరుపు లలన’ అంటాడు అతడు. వెంటనే ‘సామజ వరగమనా’ అంటుంది ఆమె. ‘కరుణ కరిగి భువికి దిగిన’ అంటాడు అతడు. ‘సామజ వరగమనా..’ అంటుంది మళ్లీ ఆమె. పాటంతా అంతే.. ఆమె సామజ వరగమనా అనే మాటొక్కటే అంటుంటుంది. ఇలాంటిదే ‘పెళ్లాం ఊరెళితే’ సినిమాలో శ్రీకాంత్, సంగీతల మధ్య డ్యూయెట్. ‘దొండపండు లాంటి పెదవే నీది’ అంటాడు శ్రీకాంత్. ‘అబద్ధం.. అంతా అబద్ధం’ అంటుంటుంది సంగీత. ‘కాల్ అండ్ రెస్పాన్స్’ ఫార్మాట్. ఇప్పుడీ క్రిస్మస్ సాంగ్‌లో.. ‘బేబీ, ఇట్స్ కోల్డ్ అవుట్‌సైడ్’ అని అంటుంటాడు అతడు, ‘నేను వెళ్తాను’ అని ఆమె ఎంత మొత్తుకుంటున్నా వదలకుండా. ‘ఐ రియల్లీ కాంట్ సే’ అని మొదలు పెడుతుంది ఆమె. వెంటనే అతడంటాడు ‘బేబీ ఇట్స్ కోల్డ్ ఔట్‌సైడ్’ అని. విషయం ఏంటంటే.. ఆ సాయంత్రం ఆమె అతడి గదిలో ఉంటుంది. ఇంటికి వెళ్లాలని లేస్తుంటుంది. అతడు లేవనివ్వడు! ఆమెతో ‘గడపాలని’ ఉంటుంది. అందుకే బయట చల్లగా ఉందనీ, ఆ టైమ్‌లో క్యాబ్‌లు దొరకవని, గడ్డకట్టుకుని పోతావనీ, న్యూమోనియా వచ్చి ఛస్తావనీ.. ఏదో ఒకటి చెప్పి అడ్డుకుంటుంటాడు. వెళ్లేందుకు ఆమె హ్యాట్ పెట్టుకుంటుంటే దాన్ని తీసేస్తూ ఉంటాడు. ‘వెళ్లనివ్వు ప్లీజ్..’ అని బతిమాలుకుంటుంటే.. కాలు, చెయ్యి అడ్డుపెడుతుంటాడు. ఇదంతా పాటలా, మాటలా సాగుతుంటుంది కానీ.. సూక్ష్మంగా ఆలోచించేవారికి.. నిజమే, ‘రేపీ’లానే అనిపిస్తుంది. ఒక ఆడపిల్ల కదలికలను ప్రేమతోనైనా సరే నియంత్రించడం అత్యాచారం కన్నా ఏం తక్కువ? ఇంకా.. అతడు ఆమెకు డ్రింక్ ఇస్తుంటాడు. ఆ డ్రింక్ గ్లాస్ అందుకుని ‘ఇందులో ఏం కలిపావు? అని అడుగుతుంది. మాట మార్చి ఏదో చెప్తాడు. ఇంకో చోట.. ‘నో.. నో.. నో..’ అంటుంది. వినకుండా.. ‘దగ్గరికి వస్తే ఏమైనా అనుకుంటావా’ అని ఒంటి మీద చెయ్యి వెయ్యబోతాడు. అతడు పట్టుకోబోవడం, అమె వదిలించుకోబోవడం.. ఇలా ఉంటుంది. ఇప్పటి అతిసున్నిత సమాజానికి సెక్సువల్ అసాల్టే అది. అందుకే యు.ఎస్. రేడియో స్టేషన్లు ‘ఇంతటితో ఈ పాట ప్రసారం సమాప్తం’ అంటున్నాయి. రచయిత ఎంత మంచి ఉద్దేశంతోనైనా రాయొచ్చు. అందులో చెడు ఉద్దేశం ‘పాప్–అప్’ అయి (పైకి లేచి) కనిపిస్తే మాత్రం ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోయిన వాళ్లని నిందించడానికి లేదు. పాటనైనా, పుస్తకాన్నైనా తీసుకెళ్లి పొయ్యిలో పడేయాల్సిందే. ఫ్రాంక్ లోస్సర్ మొదట ఈ పాటను తనను, తన భార్యను ఉద్దేశించి రాసుకున్నారు. స్టేజ్ షోలలో ఇద్దరూ కలిసి పాడేవారు. ఆ పాటను ఎం.జి.ఎం. కొనుక్కుని సినిమాలో పెట్టుకుంది. పాటగా విన్నా, పాత్రలతో చూసినా ఆ యుగళగీతాన్ని అప్పుడంతా ఇష్టపడ్డారు. వింటర్ థీమ్‌తో వచ్చింది కాబట్టి క్రమేణా అది ‘క్రిస్మస్ సాంగ్’ అయింది. పాట రచయిత ఫ్రాంక్ లోస్సర్ మాధవ్ శింగరాజు -
డైలీ సోప్ అనేది అందుకే!
సీరియల్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడల్లా డైలీ సోప్ డైలీ సోప్ అంటూ ఉంటారు. కానీ అలా ఎందుకంటారో మీకు తెలుసా? టెలివిజన్ రంగప్రవేశం చేయకముందు రేడియో హవా నడుస్తుండేది. ఇప్పుడు టీవీలకు కళ్లప్పగించినట్టే అప్పుడు అందరూ రేడియోలకు చెవులప్పగించేవారు. వాళ్లను మరింత కట్టిపడేయడానికి రకరకాల ప్రోగ్రామ్స్‌ను ప్లాన్ చేసేవి రేడియో స్టేషన్లు. ఆ క్రమంలోనే సీరియళ్లు వచ్చాయి. అనతి కాలంలోనే వాటికి మహిళల ఆదరణ లభించడంతో... ఆ ఆదరణను క్యాష్ చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది కొన్ని సబ్బుల కంపెనీలకి. గిన్నెలు కడగడం, బట్టలుతకడం, పిల్లలకు స్నానాలు చేయించడం... అన్నీ ఆడవాళ్ల పనులే కాబట్టి, అందుకు వాళ్లు వాడేది సబ్బుల్నే కాబట్టి, సూటిగా వాళ్లకే గేలం వేస్తే పోలా అనుకున్నాయి. వెంటనే సీరియళ్ల మధ్యలో తమ యాడ్స్ వేయమంటూ స్పాన్సర్ల కోసం వెతుకుతోన్న రేడియో స్టేషన్ల వెంట పడ్డాయి. అలా 1920 ప్రాంతంలో మొదలై, దశాబ్దాల పాటు సీరియళ్ల మధ్యలో దర్శనమిస్తూనే ఉన్నాయి సోప్ అడ్వర్టయిజ్మెంట్లు. టెలివిజన్ వచ్చాక, అవి కూడా సీరియళ్లు వేయడం మొదలెట్టాక కూడా చాన్నాళ్ల వరకూ సోప్ యాడ్స్ తెగ హల్చల్ చేశాయి. అందువల్లే సీరియళ్లకు డైలీ సోప్ అన్న పేరు వచ్చింది. ఇప్పుడు కూడా ఊ అంటే లక్స్, ఆ అంటే సంతూర్ అంటూ సబ్బుల యాడ్స్ ప్రత్యక్షమవుతూ ఉన్నది అందుకే మరి! -
టీవీ చానళ్లతో పోటీ పడనున్న ఆకాశవాణి
న్యూఢిల్లీ : సాధారణ ఎన్నికల వేళ టెలివిజన్ చానళ్లలో పోటీపడేందుకు ఆకాశవాణి సిద్ధమవుతోంది. టీవీ చానళ్ల తరహాలోనే ఎన్నికల వార్తలు, విశ్లేషణలు, వ్యాఖ్యానాలు,ఫలితాలు, ట్వీట్లు ప్రసారం చేయనుంది. ఇటీవల ఉత్తరాదిన జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నాలుగు ప్రాంతీయ రేడియో స్టేషన్లను ప్రత్యక్షంగా అనుసంధానం చేయడంతో అద్భుతమైన ఫలితాలను ఏఐఆర్ సాధించింది. దీంతో మాంచి ఊపుమీదున్న ఆకాశవాణి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరింత సమర్థంగా దీనిని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు తెలియజేయడం, వార్తలను, విశ్లేషణలను ప్రసారం చేయడంతోపాటు ట్వీట్లను కూడా శ్రోతలకు అందజేయనుంది. 2014 సార్వత్రిక ఎన్నికల నుంచి ఇవన్నీ ప్రారంభిస్తామని ఆకాశవాణి డెరైక్టర్ జనరల్(న్యూస్) అర్చనా దత్తా తెలిపారు. డిసెంబర్ ఎనిమిదిన చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ ఎన్నికల ఫలితాల వెల్లడి సందర్భంగా నాలుగు రాష్ట్రాల్లో రేడియో స్టేషన్ల వార్తా విభాగాలను అనుసంధానించి మంచి ఫలితాలు రాబట్టామని ఆమె చెప్పారు. ప్రత్యక్ష ంగా ఫోన్ ఇన్ కార్యక్రమాలు కూడా నిర్వహించామని ఆమె తెలిపారు. టీవీ చానళ్ల వలెనే ప్రత్యక్ష ప్రసారం చేయడంతో శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని ఆమె వివరించారు. అందుకే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఈ ప్రయోగాన్ని మరింత సమర్థంగా అమలు చేయాలని నిర్ణయించినట్టు అర్చన చెప్పారు. రాజకీయ పరిశీలకులతో చర్చలు, విశ్లేషణలు, వ్యాఖ్యాతలతో ఫలితాల ప్రకటనలు ఉంటాయన్నారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి ప్రత్యక్షంగా వీటిని ప్రసారం చేస్తామన్నారు. ఆకాశవాణి కరస్పాండెంట్ల ద్వారా, రాజకీయ నాయకుల వ్యాఖ్యానాలు, విశ్లేషకుల అభిప్రాయాలు ప్రత్యక్షంగా ప్రసారం చేస్తామన్నారు. ఇందుకోసం అనేక వర్క్‌షాప్‌లు కూడా నిర్వహిస్తామని ఆమె వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విధానాలు, పనితీరు మార్చుకోవాలని నిర్ణయించామన్నారు. తొలిసారిగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కే జ్రీవాల్ సీఎన్జీ ధరల పెంపుపై చేసిన ట్వీట్‌ను ఢిల్లీ ఆకాశవాణిలో ప్రసారం చేసినట్టు ఆమె చెప్పారు.