వైఎస్సార్ సీపీని పటిష్టం చేయూలి
మహా నేత వైఎస్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి
పార్టీ జిల్లా పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి
కాజీపేట రూరల్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయూలని ఆ పార్టీ జిల్లా పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి పిలుపునిచ్చారు. హన్మకొండలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో ప్రతి ఇంటికీ లబ్ధి జరిగిందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాయన్నారు. కానీ... కేసీఆర్ పాలనలో అర్హులకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రానున్న గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, మండల, గ్రామ కమిటీల ద్వారా పార్టీ నిర్మాణం చేసేందుకు పరిశీలకులు చేపట్టిన జిల్లా పర్యటన పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపిందన్నారు. కార్యక్రమం అనంతరం మొదటిసారి జిల్లాకు విచ్చేసిన పరిశీలకుడు కొండా రాఘవరెడ్డిని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సహ పరిశీలకులు ఆకుల మూర్తి, సయ్యద్ ముస్తాఫా హుస్సేన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మునిగాల విలియం, జిల్లా ప్రధాన కార్యదర్శి కాయిత రాజ్‌కుమార్, అధికార ప్రతినిధి అప్పం కిషన్, నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ నాడెం శివకుమార్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దుప్పటి ప్రకాష్, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మునిగాల కళ్యాణ్‌రాజ్, సేవాదల్ ప్రెసిడెంట్ మహిపాల్‌రెడ్డి, మండల యూత్ ప్రెసిడెంట్ సిద్దార్థ్, తొర్రూర్ మండల పార్టీ అధ్యక్షుడు కె.అచ్చిరెడ్డి, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్‌బాబా, బీంరెడ్డి రవితేజరెడ్డి, శివకుమార్, ఎం.అబ్రహం, బొడ్డు శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.