జాతీయ స్థాయికి ఎంపికైన జూడో క్రీడాకారిణి
ఆత్మకూరు(ఎం): మండలంలోని రహీంఖాన్పేటకు చెందిన బిల్ల అశ్విత జూడో పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపిక అయ్యారు. సెప్టెంబర్ 27న బీబీనగర్ మండలం వెంకిర్యాలలో నల్లగొండ జిల్లా జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి జూడో పోటీల్లో ఆత్మకూరు(ఎం) మండలం నుంచి రహీంఖాన్పేటకు చెందిన బిల్ల అశ్విత పాల్గొన్నారు. బిల్ల అశ్విత జూడో క్రీడలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపిక అయ్యారు. ఈ నెల 1, 2, 3తేదీల్లో వరంగల్ సిటిజన్ క్లబ్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో పాల్గొని జాతీయ స్థాయికి ఎంపికైంది. ఆమె త్వరలో పాట్నాలో జరుగనున్న జూడో క్రీడల్లో పాల్గొననున్నారు.