Rail journey
-
రైలు టికెట్ బుక్ చేస్తే జైలు శిక్ష, 10వేలు జరిమానా..!
దూర ప్రాంతాలకు వెళ్లాలంటే వెంటనే రైలు గుర్తొస్తుంది కదా. మనం వెళ్లాలనుకునే ప్రదేశానికి రైలు రూటు ఉంటే వెంటనే ఐఆర్సీటీసీ ద్వారా ఆన్లైన్లో టికెట్ బుక్ చేస్తాం. చాలాసార్లు మన వ్యక్తిగత ఐఆర్‌సీటీఐ ఐడీ నుంచి మన మిత్రులు, బంధువులు, తెలిసిన వారికి సైతం టికెట్ బుక్ చేస్తుంటాం. అయితే ఇకపై అలా చేస్తే జైలుశిక్షతో పాటు జరిమానా చెల్లించాల్సిందే. ‘అదేంటి కేవలం రైలు టికెట్ బుక్ చేస్తేనే అలా చేస్తారా..?’ అనే అనుమానం వస్తుందా.. అయితే, రైల్వేశాఖ తీసుకొచ్చిన కొత్త నిబంధనల గుర్తించి మీకు తెలియాల్సిందే..స్నేహితులు, బంధువులు, టెక్నాలజీపై అంతలా అవగాహన లేని వారికి, మనకు తెలిసిన వారికి టికెట్ బుక్ చేసి ఇవ్వాలనే ఉద్దేశం మంచిదే. అయినప్పటికీ, ఈ విధానాన్ని రైల్వేశాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వ్యక్తిగత ఐడీతో ఇతరులకు టికెట్ బుక్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. అలాచేస్తే ఏకంగా జైలుశిక్షతో పాటు భారీ జరిమానా తప్పదని స్పష్టం చేసింది. ఈ మేరకు రైల్వేశాఖ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. టికెట్ రిజర్వేషన్ వ్యవస్థలో దుర్వినియోగాన్ని కట్టడి చేయడంతోపాటు పారదర్శకత కోసమే ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు ప్రకటించింది.రైల్వే చట్టం, 1989-సెక్షన్ 143 ప్రకారం.. పరిమితులకు మించి టికెట్లు బుక్ చేయాలంటే రైల్వేశాఖ గుర్తింపు కలిగిన ఏజెంట్లై ఉండాలి. దీన్ని అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. ఒకవేళ అనుకోని కారణాల వల్ల కొత్త నిబంధనలు మీరితే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.10వేల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఐటీఆర్ ఫైలింగ్.. ఇవి గమనిస్తే మేలునిబంధనలు ఏం చెబుతున్నాయంటే..రైల్వేశాఖ నిబంధనల ప్రకారం..ఐఆర్సీటీసీ వ్యక్తిగత ఐడీతో కేవలం రక్త సంబంధీకులు లేదా ఒకే ఇంటిపేరు ఉన్న వ్యక్తులకు మాత్రమే టికెట్ బుక్ చేయాలి. ఆధార్‌తో లింకు చేసుకున్న యూజర్ నెలకు 24 టికెట్లు బుక్ చేసుకోవచ్చు. లింక్ చేసుకోనివారు 12 టికెట్ల వరకు తీసుకోవచ్చు. ఇది కూడా యూజర్‌తో పాటు తన కుటుంబీకులకే వర్తిస్తుంది. అలా కాకుండా మిత్రులు, ఇతర బంధువులకు టికెట్ బుక్ చేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు. -
సెంట్రల్ రైల్వే కారిడార్‌లో నిలిచిపోయిన రైళ్లు.. కారణం..
ముంబయి సెంట్రల్ రైల్వే ప్రధాన కారిడార్‌లో సోమవారం ఉదయం సిగ్నలింగ్ సమస్యల వల్ల రైలు సేవలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. ఉదయం 9.16 గంటలకు కొన్ని సాంకేతిక కారణాల వల్ల థానే రైల్వేస్టేషన్ పరిధిలో సబర్బన్ రైలు సేవలు నిలిచిపోయాయని సెంట్రల్ రైల్వే ప్రతినిధి పేర్కొన్నారు.థానే రైల్వేస్టేషన్ పరిధిలో సిగ్నల్ వైఫల్యం కారణంగా కళ్యాణ్(థానే), కుర్లా (ముంబయి) మధ్య సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. దాంతో ఇరుప్రాంతాలకు ప్రయాణిస్తున్నవారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే ఉదయం 10.15 గంటలకు సిగ్నలింగ్ వ్యవస్థను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.సెంట్రల్ రైల్వే ప్రధాన కారిడార్ సబర్బన్ పరిధి దక్షిణ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుంచి కళ్యాణ్ (థానే జిల్లా), ఖోపోలి (రాయ్‌గఢ్) వరకు విస్తరించి ఉంది. ఈ కారిడార్‌లో రోజూ లక్షల మంది ప్రయాణిస్తుంటారు. తాజాగా సుమారు గంటపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోవడం వల్ల ప్యాసింజర్లు ఇబ్బందులు పడ్డారు. -
రైలులో మద్యం మత్తులో...
ఝాన్సీ: ఇటీవల విమానంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన సంఘటన గురించి విన్నాం. అలాంటి ఘటనపై ఉత్తరప్రదేశ్‌లో రైలులో జరిగింది. 19 ఏళ్ల రితేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఏసీ కంపార్ట్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తూ కింది బెర్తుపై నిద్రిస్తున్న వృద్ధ దంపతులపై మద్యం మత్తులో మూత్ర విసర్జన చేశాడు. అతడిని అరెస్టు చేశామని ఆరీ్పఎఫ్ పోలీసులు శుక్రవారం తెలిపారు. అయితే, అతడు ఉద్దేశపూర్వకంగా ఈ పని చేయలేదని తేలినట్లు చెప్పారు. మూత్ర విసర్జన ఘటన జరగ్గానే దంపతులు రైలులో ఉన్న టీటీఈకి ఫిర్యాదు చేశారు టీటీఈ ఝాన్సీ రైల్వే స్టేషన్‌కు సమాచారం చేరవేశాడు. రైలు ఝాన్సీ స్టేషన్‌కు చేరుకోగా పోలీసులు రితేశ్‌ను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారు. రైల్వే చట్టం ప్రకారం జరిమానా చెల్లించిన రితేశ్‌ను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. -
కొత్త పోకడ...రైలెక్కి రయ్.. రయ్
ఇంటి నుంచి కాలు బయట పెడితే విమానాలు ఎక్కడమే వారికి తెలుసు. రయ్యిమంటూ గాల్లో తేలిపోతూ గమ్యస్థానాలకు చేరుకోవడాన్ని ఇష్టపడతారు. అలాంటిది ఇప్పుడు వారిలో కూడా మార్పు వస్తోంది. హాయిగా రాత్రిపూట రైలెక్కి బెర్త్ వాల్చితే ఉదయానికల్లా ఊరు చేరుకోవడంలో ఎంత సదుపాయముందో యూరప్ వాసులు గ్రహించారు. చుకు బుకు చుకు బుకు రైలును, అదిరిపోయే దాని స్టైలును, ఆ ప్రయాణంలోని మజాను ఆస్వాదిస్తున్నారు. విమాన ప్రయాణాలతో పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి యూరప్‌లో పలు దేశాలు కూడా రైలు ప్రయాణాలకు ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి. దాంతో వారు కూడా తక్కువ దూరాలకు విమానానికి బదులుగా రైలు వైపే మొగ్గు చూపిస్తున్నారు... యూరప్‌లో రైలు ప్రయాణాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని డచ్ విమానయాన సంస్థ కేఎల్ఎమ్ వంటివి రైలు రవాణా నెట్‌వర్క్‌లో భాగస్వాములవుతున్నాయి. యూరోపియన్ కమిషన్ కూడా 2021ని ఇయర్ ఆఫ్ యూరోపియన్ రైల్‌గా ప్రకటించి రైలు ప్రయాణికులకు భారీగా ప్రోత్సాహకాలు కల్పించింది. హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టడం, రైలు టికెట్ ధరల్ని తగ్గించడం వంటి చర్యలతో ఇప్పుడు చాలామంది రైలు జర్నీయే సో బెటరని అంటున్నారు. ముఖ్యంగా స్వల్ప దూర ప్రయాణాలకు రైళ్లల్లో వెళ్లడానికి యూరప్ పౌరుల్లో 62% మంది ఇష్టపడుతున్నారని తాజా సర్వేలో తేలింది. 1990 తర్వాత మళ్లీ ఇప్పుడు రాత్రిళ్లు ప్రయాణించే స్లీపర్ రైళ్లకు హఠాత్తుగా డిమాండ్ పెరిగింది. ప్రభుత్వాల ద్వంద్వ ప్రమాణాలు... యూరప్‌లో విమాన ప్రయాణాల వల్ల వెలువడుతున్న కాలుష్యం ఏటా పెరుగుతూనే ఉంది. ఈ పెరుగుదల 2013–2019 మధ్య ఏడాదికి సగటున 5% చొప్పున నమోదైంది! ఈ నేపథ్యంలో యూరప్ దేశాలు కేవలం స్వల్ప దూరాల విమానాలను మాత్రమే నిరుత్సాహపరుస్తూ అధిక దూరం ప్రయాణించే విమానాలకు ప్రోత్సాహకాలు కొనసాగించడాన్ని పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల వచ్చే పెద్దగా ఒరిగేదేమీ ఉండదంటూ పెదవి విరుస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ వాటి కాలుష్యమే అధికం ప్రపంచవ్యాప్తంగా అధిక దూరాలు ప్రయాణించే విమానాల నుంచి వెలువడే కాలుష్యమే ఎక్కువ! జర్నల్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ జియోగ్రఫీ తాజా నివేదిక ప్రకారం 500 కి.మీ. కంటే తక్కువ దూరం ప్రయాణించే విమానాల యూరోపియన్ యూనియన్‌లో 27.9 % కాగా వాటి నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు 5.9%. 4 వేల కి.మీ. కంటే అధిక దూరం వెళ్లే విమానాలు కేవలం 6.2% మాత్రమే. కానీ వాటినుంచి వెలువడే కాలుష్యం ఏకంగా 47 శాతం! అలాంటప్పుడు కేవలం తక్కువ దూరాలు ప్రయాణించే విమానాల రద్దుతో ఒరిగే ప్రయోజనాలేమిటన్న ప్రశ్న వినిపిస్తోంది. రైల్వేలకున్న అడ్డంకులివే..! కొన్ని దశాబ్దాలుగా విమాన ప్రయాణానికే అలవాటు పడడంతో చాలా మార్గాల్లో రైలు సదుపాయం లేదు. కొత్త ట్రాక్‌లు నిర్మించడం, రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచడం వంటి చర్యలు ఇంకా తీసుకోవాల్సి ఉంది. చాలా దేశాల్లో విమాన ప్రయాణాల కంటే రైలు ప్రయాణాలు ఎక్కువ ఖరీదు. అధిక చార్జీలు కూడా రైలు ప్రయాణానికి అడ్డంకిగా మారింది. యూరప్ రైలు ఆపరేటర్లకు లాభార్జనే ధ్యేయం. మార్కెట్ షేర్ కంటే అధిక లాభాలు ప్రజల నుంచి గుంజాలని చూస్తుంటాయి. ఇవన్నీ రైల్వేల విస్తరణకు అడ్డంకిగా మారుతున్నాయి. ఫ్లైట్ షేమ్ ఉద్యమంతో దశ మారిన రైల్వే యూరప్‌లో ప్రజలు రైలు ప్రయాణానికి మొగ్గుచూపించడానికి ఫ్లైట్ షేమ్ ఉద్యమం ప్రధాన కారణం. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి స్వీడన్‌కు చెందిన టీనేజ్ ఉద్యమకారిణి గ్రేటా థెన్‌బర్గ్ 2019లో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. న్యూయార్క్‌లో జరిగిన ఐక్య రాజ్యసమితి పర్యావరణ సదస్సుకి హాజరవడానికి ఆమె విమాన ప్రయాణం చెయ్యకుండా అట్లాంటిక్ సముద్రంలో నౌకలో కొద్ది రోజుల పాటు ప్రయాణించి మరీ అమెరికా చేరుకున్నారు. విమానం నడపడానికి భారీగా చమురు ఖర్చు చేయడం వల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోతోందని అందుకే విమానానికి బదులుగా పడవలు, రైళ్లు, బస్సుల్లో ప్రయాణించాలని గ్రేటా థెన్‌బర్గ్ పిలుపునిచ్చారు. ఈ ఉద్యమ ప్రభావంతో యూరప్ వాసులు విమానాలకి బదులుగా రైలు ప్రయాణంపై ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. యూరప్ దేశాలు తీసుకుంటున్న చర్యలివే... ► జర్మనీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, స్పెయిన్, ఇటలీ వంటి దేశాలన్నీ రైలు ప్రయాణానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ► తక్కువ దూరం ఉండే మార్గాల్లో ఫ్రాన్స్ ప్రభుత్వం విమానాలను రద్దు చేసింది. ఆయా మార్గాల్లో కొత్త రైళ్లను నడపడం ప్రారంభించింది. ► రెండున్నర గంటల కంటే తక్కువ సమయం పట్టే రెండు ఊళ్ల మధ్య రైళ్లలోనే ప్రయాణం చేయడం తప్పనిసరి చేసింది. ► దీని వల్ల దేశీయంగా విమానం ద్వారా వెలువడే గ్రీన్హౌస్ వాయువుల్ని 3% తగ్గించగలిగింది. ► 2020లో ఆస్ట్రియా ప్రభుత్వం రైలులో ప్రయాణిస్తే మూడు గంటల కంటే తక్కువ సమయం పట్టే అన్ని మార్గాల్లోనూ విమానాలను రద్దు చేసింది. ► ఆస్ట్రియాలో 350 కి.మీ. కంటే తక్కువ దూరం విమానాల్లో వెళ్లే ప్రయాణికుల నుంచి 30 యూరోల పన్ను వసూలు చేస్తోంది. ► మరోవైపు 2050 నాటికి 2.5 గంటల కంటే తక్కువ సమయాల్లో వెళ్లే విమానాలన్నీ రద్దు చేయడానికి స్పెయిన్ సన్నాహాలు చేస్తోంది. -
రన్నింగ్ ట్రైన్ ఫుట్‌బోర్డుపై కత్తులతో వీరంగం
చెన్నై: రన్నింగ్ ట్రైన్ ఫుట్‌బోర్డులో నిల్చుని.. కత్తులు, కొడవళ్లతో వీరంగం సృష్టించిన ఆకతాయిల ఆట కట్టించారు పోలీసులు. వాళ్లను కాలేజీ విద్యార్థులుగా గుర్తించి.. ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. ఈ విషయాన్ని చెన్నై డివిజనల్ రైల్వే మేనేజర్ మంగళవారం ట్విటర్ వేదికగా ప్రకటించారు. రైలు ఫుట్‌బోర్డుపై వేలాడుతూ.. ప్లాట్‌ఫామ్‌పైకి పదునైన ఆయుధాలు దూస్తూ.. గోల చేస్తూ ముగ్గురు యువకులు హల్ చల్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇలాంటి వాళ్ల వల్ల దేశానికి ఏం ఉపయోగమంటూ తిట్టిపోశారు కొందరు. ఈ నేపథ్యంలో ఆ వీడియోపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు. గుమ్మిడిపూండికి చెందిన అన్బరసు, రవిచంద్రన్‌ను, పొన్నేరికి చెందిన అరుల్‌ను అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు ప్రెసిడెన్సీ కాలేజీ విద్యార్థులుగా నిర్ధారించారు. రైళ్లలో, రైల్వే ప్రాంగణాల్లో ఇలాంటి దుర్మార్గపు ప్రవర్తన, ప్రమాదకరమైన విన్యాసాలను సహించేది లేదంటూ అధికారులు తెలిపారు. ఈ మధ్యకాలంలో రైలు ప్రయాణాలకు సంబంధించిన ఘటనలు ఇంటర్నెట్లో వైరల్‌కావడం, రైల్వే శాఖ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో.. రైల్వే శాఖ సకాలంలో స్పందించేందుకు యత్నిస్తోంది. We would like to inform you that the 3 youths seen in this viral video performing stunts with sharp weapons in their hand, have been arrested by @grpchennai! They are Anbarasu and Ravichandran from Gummidipoondi and Arul from Ponneri. They are all students of Presidency College. pic.twitter.com/3FQVpTWeoW — DRM Chennai (@DrmChennai) October 11, 2022 -
నాలుగు నిమిషాలు..40 వేల లీటర్లు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన నగేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ బయలుదేరాడు. రాత్రి భోజనం ముగించుకున్నాక రైలు వాష్‌రూమ్‌కు వెళ్లాడు. కానీ అక్కడ నీళ్లు రావడం లేదు, వెలుపల హ్యాండ్ వాష్ దగ్గర పరిశీలించాడు, అక్కడా అదే కథ. మరో బోగీకి వెళ్లి చూసినా, పరిస్థితిలో మార్పులేదు. కాసేపట్లో ప్రయాణికుల్లో అలజడి మొదలైంది. అత్యవసరాలకు కూడా నీళ్లు లేకపోవడమేంటని వారు సిబ్బందిని నిలదీశారు. రైలులో నీళ్లు అయిపోయాయని, మధ్యలో నింపే వెసులుబాటు కూడా లేదని, ఏదైనా ప్రధాన స్టేషన్లో నింపాలంటే అరగంట సమయం పడుతుందని, అంతసేపు రైలును ఆపలేమని చెప్పి చేతులెత్తేయటంతో జనం ఆగ్రహంతో సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. ఇది ఈ ఒక్క రైలుకే పరిమితం కాదు. దూరప్రాంతాలకు వెళ్లే అన్ని రైళ్లలో తరచూ ఏర్పడే సమస్యే. గత వేసవి కాలంలో మొత్తం రైలు ఫిర్యాదుల్లో 42 శాతం ఇవే కావటం విశేషం. మెరుగైన ప్రయాణం సంగతి దేవుడెరుగు, రైళ్లలో కనీసం నీళ్లు కూడా ఉండవు అన్న అపవాదును భారతీయ రైల్వే మూటగట్టుకుంది. ఇంతకాలం తర్వాత దీనికి విరుగుడు మొదలుపెట్టింది. ఇప్పుడు ఇక నీటి సమస్య ఉండదు. కేవలం నాలుగు నిమిషాల్లో... రైలు ప్రయాణంలో నీటి ప్రాధాన్యం ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాగునీరైతే కొనుక్కుంటారు. కానీ వాడుక నీరు లేకుంటే ఇబ్బంది అంతాఇంతా కాదు. దూరప్రాంతాలకు వెళ్లేవారి అవస్థలు ఎన్నో. ఇటీవలి వరకు ప్రయాణికులను ఈ సమస్య వెంటాడింది. ప్రారంభ స్టేషన్లో నిండుగా నీటిని నింపిన తర్వాత వేసవి సమయాల్లో ఆ నీళ్లు వేగంగా అయిపోయేవి. మళ్లీ ఆ నీటిని నింపాలంటే అన్ని స్టేషన్లలో వసతి ఉండేది కాదు. వసతి ఉన్నా రైలు మొత్తం నీటిని నింపాలంటే కనీసం 25 నిమిషాల నుంచి అరగంట పట్టేది. అంతసేపు రైలును నిలపడం వీలు కానందున, కొంత నీటినే నింపేవారు. కాస్త దూరం వెళ్లగానే అవి అయిపోయేవి. దీంతో గమ్యం చేరుకునేవరకు నీళ్లు లేకుండానే రైలు వెళ్లాల్సి వచ్చేది. ప్రయాణికుల నుంచి కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు వస్తుండటంతో ఎట్టకేలకు రైల్వే మేల్కొంది. ఇప్పుడు ప్రధాన స్టేషన్లలో ‘క్విక్ వాటరింగ్ సిస్టం’ను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడల్లో ఏర్పాటు చేశారు. త్వరలో మిగతా ప్రధాన స్టేషన్లలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం బోగీల్లో నీళ్లు నింపే పాత పైప్లైన్లు మార్చి కొత్తవి ఏర్పాటు చేశారు. ఒక్కోచోట నాలుగు చొప్పున 40 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న మోటార్లు అమర్చారు. ఈ పైప్‌లైన్ నుంచి బోగీలకు చిన్న పైప్‌లను అమర్చి మోటారు అన్ చేయగానే కేవలం నాలుగు నిమిషాల్లో మొత్తం రైలులోని నీటి ట్యాంకులు నిండిపోతాయి. పైగా ఒకేసారి అన్ని బోగీల్లో నీళ్లు నిండుతాయి. మరో లైన్లో నిలబడిన రైలుకు కూడా అదే సమయంలో నీళ్లు నింపేలా ఏర్పాటు చేశారు. వెరసి నాలుగు నిమిషాల్లో రెండు రైళ్లలో ట్యాంకులు నింపేయొచ్చన్నమాట. నీళ్లు అయిపోయిన రైలు వచ్చి ఆగి.. తిరిగి బయలుదేరేంత సమయంలోనే నీటిని నింపేస్తారు. కొద్దిరోజుల క్రితమే ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యవస్థను సెన్సార్లు, రిమోట్లతో అనుసంధానించారు. నీళ్లు నిండగానే సెన్సార్లు గుర్తించి ఆటోమేటిక్‌గా పంపింగ్ నిలిచిపోయేలా చేస్తాయి. ఈ పనిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా మనుషులు ఉండాల్సిన అవసరం కూడా లేదు. మోటారు వద్ద ఉండే వ్యక్తి రిమోట్ సాయంతో దాన్ని ఆపరేట్ చేయొచ్చు. అంతకుముందు పంపింగ్ సామర్థ్యం లేక ఒక బోగీ నిండాక మరో బోగీ నింపాల్సి వచ్చేది. పైప్‌లైన్‌కు లీకేజీల వల్ల నీళ్లు కూడా వృథాగా పోయేవి. - ఈ ప్రాజెక్టు కోసం రైల్వే బోర్డు గతేడాది రూ.300 కోట్లు విడుదల చేసింది. ప్రధాన స్టేషన్లకు రూ.2 కోట్లు చొప్పున కేటాయింపులు చేసింది. ఏప్రిల్‌లో పనులు పూర్తయి ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. - ఒక్కో బోగీకి 1,600 లీటర్ల సామర్థ్యం ఉన్న నీటి ట్యాంకులుంటాయి. గరిష్టంగా పెద్ద రైలులో 40 వేల లీటర్ల నీళ్లు అందుబాటులో ఉంటాయి. గతంలో ఇన్ని నీళ్లు నింపాలంటే దాదాపు అరగంట పట్టేది. కొత్త వ్యవస్థతో ఇది 4 నిమిషాల్లో పూర్తవుతుంది. - దేశవ్యాప్తంగా 142 స్టేషన్లలో ఈ వ్యవస్థ అందుబాటులోకిరాగా, దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడల్లో ప్రారంభించారు. త్వరలో మిగతా ప్రధాన స్టేషన్లలో ఏర్పాటు చేస్తారు. -
అధ్యక్షుడికీ తప్పని.. ఓట్లపాట్లు
జొహాన్నెస్‌బర్గ్: ఓట్ల పండగొస్తే అది అనకాపల్లైనా ఆఫ్రికా అయినా గుళ్లో ఉండే దేవుడి కంటే గల్లీలో ఉండే ఓటరు దర్శనానికే నాయకులు క్యూ కడతారు. ఓటరు మహాశయుడిని కలిసి వారి సుఖదుఃఖాలు తెలుసుకుంటారు. మేమున్నామంటూ మాటిచ్చి ఓట్లు వేయించుకుంటారు. ఈ క్రమంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రాజధానిలో ఉండే నేతలు కూడా వాడవాడకూ, ఇంటింటికీ తిరగాల్సిందే. ప్రజలను కలసి హామీల మాయా మూటలు అప్పజెప్పాల్సిందే. లేదంటే ఓటరు మనసు మారిపోదూ!.. అలా అయిన పక్షంలో ప్రాణం కంటే ఖరీదైన ఓటు జారిపోదూ..! అసలు వివయంలోకి వస్తే మన దేశంలోలాగే భగభగ ‘మండే’లా దక్షిణాఫ్రికాలోనూ ఎన్నికలు రెండు నెలల్లో జరగనున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత సౌతాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫొసా ఇప్పట్నుంచే తన ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీంట్లో భాగంగా రాజధానికి దగ్గరలోని మబోపనే టౌన్‌షిప్‌ను సందర్శించారు. ప్రచార అనంతరం మబోపనే నుంచి రాజధాని ప్రిటోరియాకు సాధారణ ప్రయాణికులతో కలసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. కానీ అక్కడ రైలు రాక కోసం రామఫొసా గంటసేపు ఎదురు చూడవలసి వచ్చింది. ఆలస్యంగా వచ్చిన రైలు 45 నిమిషాల వ్యవధిలో చేరుకునే ప్రిటోరియా స్టేషన్‌కు వెళ్లడానికి 3 గంటల సమయం పట్టింది. ప్రయాణ సమయంలో మార్గమధ్యంలో అనుకోకుండా చాలాసేపు ఆగిపోయింది. ఆ టైమ్‌లో ఆయనతో ఉన్న విలేకరులు ప్రయాణికులతో రామఫొసా ముచ్చటిస్తున్న చిత్రాలను సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ అయ్యాయి. దక్షిణాఫ్రికాలో రైళ్లు ఆలస్యంగా రావడమనేది సర్వసాధారణమైన విషయం. ప్రయాణికులతో అధ్యక్షుడు రామఫొసా ఉన్న ఫొటోలపై అక్కడి సామాజిక కార్యకర్తలు సోషల్ మీడియాలో విమర్శల దాడికి దిగారు. రామఫొసా ఆధ్వర్యంలో నడుస్తున్న ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) ప్రభుత్వానికి సిగ్గులేదని, ఘోరంగా ఉన్న రైల్వే వ్యవస్థ ప్రాసా (ప్యాసింజర్ రైల్ ఏజెన్సీ ఆఫ్ సౌతాఫ్రికా) సర్వీసుల గురించి ప్రజలు గగ్గోలు పెడుతున్నా సిరిల్ సర్కార్ పట్టించుకోవపోవడం పాపమని ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ప్రయాణానంతరం ప్రిటోరియాకు చేరుకున్న అధ్యక్షుడు రామఫొసా అక్కడి రైల్వే అధికారులను కలసి ఇది జాతీయ సమస్యగా మారిందని దీన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్యరించాలని ఆదేశించారు. తర్వాత మీడియాతో మాట్లాడిన రామఫొసా ’’రైళ్లో 50 కి.మీ దూరాన్ని చేరుకోవడానికి మాకు దాదాపు 3 గంటల సమయం పట్టింది. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్యరించేలా ప్రాసాతో చర్చలు జరుపుతున్నామ’’ని అన్నారు. 400 సీట్లున్న సౌతాఫ్రికా పార్లమెంట్లో సమారు 60 శాతం ఓట్లను గెలుచుకునే దిశగా రామఫొసో పార్టీ వ్యూహాలు రచిస్తోంది. -
శుభవార్త.. ఇక 584కి.మీ మూడుగంటల్లో..
సాక్షి, న్యూఢిల్లీ : రెండు ప్రముఖ వాణిజ్య నగరాలు హైదరాబాద్ - నాగ్‌పూర్‌ల మధ్య ప్రయాణించేందుకు ప్రస్తుతం పట్టే సమయం(తొమ్మిది గంటలు) కాస్త అమాంతం తగ్గిపోనుంది. ఈ రెండు నగరాల మధ్య దాదాపు 584 కి.మీల దూరాన్ని బాహుబలిలాంటి సినిమాను చూసినంత సమయంలో అంటే మూడే మూడు గంటల్లో రైలు ప్రయాణం ద్వారా ముగించే అవకాశం కలగనుంది. అందుకోసం ప్రత్యేక రైల్వే కారిడార్‌ను సిద్ధం చేసేందుకు బ్లూప్రింట్ కూడా రెడీ అయిందట. ఈ మేరకు రైల్వేశాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి ఈ విషయం చెప్పారు. 'రష్యన్ రైల్వేస్ సహకారంతో పూర్తి చేయాలనుకుంటున్న ఈ ప్రాజెక్టు వివరాలను రైల్వే బోర్డు ఆమోదం కోసం పంపించాల్సి ఉంది' అని ఆ అధికారి చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ - నాగ్‌పూర్‌ల మధ్య నేరుగా విమాన సర్వీసులు లేవు. వేరే ప్రాంతం గుండా విమానంలో వచ్చినా దాదాపు నాలుగు గంటల సమయంలో పడుతుంది. ఈ విషయాన్ని తమకు అవకాశంగా రైల్వే శాఖ ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఈ రెండు నగరాల మధ్య ఉన్న రైల్వే లైన్‌ను గంటకు 160-200కిలో మీటర్ల వేగంతో (సెమీ-హైస్పీడ్ కారిడార్) వెళ్లేందుకు అనువుగా రూపొందించడం ద్వారా మూడుగంటల్లో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం పూర్తి చేసేలా చూడొచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే, హైదరాబాద్ - నాగ్‌పూర్ మధ్య ప్రయాణం కాస్త.. హైదరాబాద్ - సూర్యాపేట మధ్య బస్సులో వెళ్లినంత సేపట్లో ముగించేయొచ్చు.