లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడ్డి రైల్వే ఇంజినీర్
ఒంగోలు : ఉన్నతస్థాయిలో ఉన్న ఓ అధికారి అయిదు వేలకు కక్కుర్తి పడి సీబీఐకి అడ్డంగా దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా గిద్దలూరు రైల్వే స్టేషన్లో సీనియర్ సెక్షన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ బుధవారం తెల్లవారుజామున గ్యాంగ్‌మెన్ బాషా నుంచి అయిదువేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా సీబీఐ అధికారులకు చిక్కారు.
ఆయనను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు లక్ష్మీనారాయణ నివాసంలో కూడా సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. రైల్వే అధికారి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లక్ష్మీనారాయణను సీబీఐ అధికారులు విశాఖ కోర్టుకు తరలిస్తున్నట్లు సమాచారం.