Railway station development
-
రైల్వే ప్రయాణికులకు షాక్.. భారీగా బాదుడు!
న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు భారీగా షాక్ ఇచ్చేందుకు రైల్వే శాఖ సిద్దం అవుతుంది. ఇక నుంచి కొన్ని రైల్వే స్టేషన్లలో ఎక్కిన, దిగిన మోత తప్పదు. పునర్అభివృద్ధి చెందిన స్టేషన్లలో ఎక్కువ దూరం ప్రయాణించే రైల్వే ప్రయాణికుల మీద ప్రయాణ తరగతిని బట్టి ₹10 నుండి ₹50 వరకు స్టేషన్ అభివృద్ధి రుసుము విధించాలని రైల్వే శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. పునర్అభివృద్ధి చెందిన స్టేషన్లలో ఎక్కిన, దిగిన ఈ స్టేషన్ అభివృద్ధి రుసుమును వసూలు చేయనున్నారు. బుకింగ్ సమయంలోనే రైలు టిక్కెట్లకు రూపంలో ఈ మొత్తాన్ని వసూలు చేయలని చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. పునర్అభివృద్ధి చేసిన స్టేషన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ ఫీజు విధించనున్నారు. ఈ యూజర్ ఫీజు మూడు కేటగిరీల్లో ఉంటుంది. అన్ని ఏసీ క్లాసులకు ₹50, స్లీపర్ క్లాసులకు ₹25, అన్ రిజర్వ్డ్ క్లాసులకు ₹10 వసూలు చేయనున్నరు. రైల్వే బోర్డు జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం సబర్బన్ రైలు ప్రయాణాలకు ఈ స్టేషన్ అభివృద్ధి రుసుము వసూలు చేయరు. ఈ స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టిక్కెట్ల ధరలు కూడా ₹10 పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. "స్టేషన్ డెవలప్ మెంట్ ఫీజు(ఎస్డిఎఫ్) ప్రయాణీకుల నుంచి సేకరించనున్నారు. అభివృద్ధి చెందిన/పునర్అభివృద్ధి చెందిన స్టేషన్లలో క్లాస్ వారీగా ఎస్డిఎఫ్ కింద ఛార్జ్ చేస్తారు. ఈ స్టేషన్లలో ప్రయాణీకులు దిగినట్లయితే ఎస్డిఎఫ్ సూచించిన రేట్లలో 50 శాతం రుసుము ఫీజు ఉంటుంది. ఒకవేళ ఎక్కి, దిగే స్టేషన్స్ రెండు పునర్అభివృద్ధి చెందిన స్టేషన్స్ అయితే ఎస్డిఎఫ్ వర్తించే రేటుకు రుసుము 1.5 రెట్లు" అని సర్క్యులర్ లో పేర్కొంది. ఎస్డిఎఫ్ రుసుము విధించడం వల్ల రైల్వేలకు ఆదాయం పెరుగుతుంది. ఈ చర్య ప్రైవేట్ కంపెనీలను ఆకర్షించడానికి సహాయపడుతుంది అని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు పశ్చిమ మధ్య రైల్వేకు చెందిన రాణి కమలాపతి స్టేషన్, పశ్చిమ రైల్వేలోని గాంధీనగర్ క్యాపిటల్ స్టేషన్లను అభివృద్ధి చేసి ప్రారంభించారు. (చదవండి: Jan Dhan Yojana: జన్ ధన్ యోజన ఖాతాలో భారీగా నగదు జమ..!) -
‘ఎంత మార్పు.. థ్యాంక్స్ పీయూష్ జీ’
లక్నో: కాంగ్రెస్‌కు కంచుకోటలాంటి అమేథి నియోజకవర్గంలో ఈ సారి బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీద కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ భారీ విజయం సాధించారు. ఈ క్రమంలో అమేథిలోని గౌరిగంజ్ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన ఫోటోలను ట్విటర్ ద్వారా షేర్ చేశారు స్మృతి ఇరానీ. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. 2019కి ముందు.. ప్రస్తుతం రైల్వే స్టేషన్ రూపురేఖలు ఎలా మారాయో ఈ ఫోటోలు తెలుపుతున్నాయి. ఈ క్రమంలో ‘ఏళ్లుగా నిర్లక్ష్యం చేయబడిన అమేథి గౌరిగంజ్ రైల్వే స్టేషన్‌ను నూతనంగా మార్చడానికి సాయం చేసిన పియూష్ గోయల్‌కు కృతజ్ఞతలు’ అంటూ స్మృతి ఇరానీ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన ఫోటోలను అప్పుడు.. ఇప్పుడు పేరుతో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. రైల్వే స్టేషన్ అభివృద్ధికి కృషి చేసినందుకు స్మృతి ఇరానీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు నెటిజనులు. वर्षों से जर्जर स्थिति और नागरिक सुविधाओं के अभाव में जूझ रहे अमेठी के गौरीगंज स्टेशन का कायाकल्प करने हेतु रेल मंत्री @PiyushGoyal जी का हार्दिक धन्यवाद। स्टेशन पर यात्रियों के लिए Wi-Fi, कोच जानकारी प्रणाली जैसी सुविधाओं के सफल कार्यान्वयन हेतु @drmlko25 जी के प्रति भी आभार। pic.twitter.com/ewzUPooRWz — Smriti Z Irani (@smritiirani) July 9, 2020 ఎన్నికల ప్రచారం నాటి నుంచే స్మృతి ఇరానీ అమేథిలో మౌలిక సదుపాయాల కొరత గురించి తీవ్రంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నియోజకవర్గ అభివృద్ధి కొరకు పలు కార్యక్రమాలు ప్రారంభించారు. నియోజకవర్గాన్ని పలుమార్లు సందర్శించారు. స్థానిక దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నారు. అంతేకాక రాజీవ్‌గాంధీ హాయాంలో రాయ్‌బరేలీ నుంచి అన్చహర్ వరకు తలపెట్టిన రైల్వే ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లుందుకు కూడా స్మృతి ప్రయతిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాహుల్ గాంధీ అమేథిలో 12 వేల శానిటైజర్ల బాటిళ్లు, 20 వేల ఫేస్ మాస్క్‌లు, 10 వేల సబ్బులు పంపిణీ చేశారు. -
జహీరాబాద్ రైల్వే స్టేషన్ కు కొత్త హంగులు
జహీరాబాద్ : స్థానిక రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సుధీర్ఘ కాలం తర్వాత పెండింగ్ పనులు చేపట్టారు. జిల్లాలోనే ఏకైక అతిపెద్దది కావడంతో మోడల్ రైల్వే స్టేష¯Œ గా తీర్చిదిద్దేందుకు 2010 సంవత్సరంలో నిధులు మంజూరు చేశారు. అప్పట్లో స్టేషన్ లో పలు అభివృద్ధి పనులు చేపట్టినా ప్రధాన పనులను మాత్రం పెండింగ్‌లో పెట్టారు. ఎట్టకేలకు తొమ్మిదేళ్ల తర్వాత పెండింగ్ పనులకు మోక్షం కలిగింది. ప్రస్తుతం సుమారు రూ.3 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రైల్వే స్టేషన్ జహీరాబాద్ పట్టణం నడి బొడ్డున ఉండడంతో రెండు వైపుల ప్రాంతాలకు వెళ్లి, రావడం కష్టంగా మారింది. అండర్ బ్రిడ్జిలను నిర్మించినా అవి ఏ మాత్రం సౌకర్యంగా లేకపోవడంతో ప్రజలు స్టేషన్ కు ఇరు వైపులా వెళ్లేందుకు రైల్వే ట్రాక్‌ను దాటుతున్నారు. వీటిని పరిగణలోకి తీసుకుని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ప్రత్యేక చొరవ తీసుకుని పెండింగ్ పనులను పూర్తి చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నెలాఖరు వరకల్లా ఫుట్ ఓవర్ బ్రిడ్జి, రెండో ప్లాట్‌ఫాంలను ప్రారంభించి వినియోగంలోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. ఈ మేరకు పనులు చురుకుగా సాగుతుండడంతో ప్రజలు, ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జహీరాబాద్ రైల్వే స్టేషన్ లో 26 రైళ్లు ఆగుతున్నాయి. ఆయా రైళ్లలో ప్రయాణించే వారికి ఇప్పుడు నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి, రెండో ప్లాట్‌ఫాం సౌకర్యంగా మారనుంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జితో తీరనున్న ఇబ్బందులు రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో జహీరాబాద్ పట్టణ ప్రజల, ప్రయాణికుల ఇబ్బందులు తీరనున్నాయి. పట్టణంలోని రెండు వైపులా ప్రాంతాలకు రాక పోకలు సాగించే ప్రజలకు ఇక ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉపయోగపడనుంది. నిలుచున్న రైళ్ల కింద నుంచి దాటుకుని వెళ్లే ఇబ్బందులు ఇక శాశ్వతంగా దూరం కానున్నాయి. పాఠశాల విద్యార్థులు, వ్యాపారులు, ఉపాధి కోసం ఆయా ప్రాంతాలకు వెళ్లే వారికి ఎంతో సౌకర్యంగా మారనుంది. రెండో ప్లాట్‌ఫాంతో సౌకర్యం ప్రస్తుతం స్టేషన్ లో ఒకే ప్లాట్ ఫాం ఉండడంతో రెండో ప్లాట్‌ఫాంపై నిలిచే రైళ్లలో నుంచి కిందిగి దిగే సమయంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. లగేజీని తీసుకుని కిందికి దిగే అవకాశం లేకపోవడంతో తప్పనిసరిగా ఇతరుల సహాయం తీసుకోవాల్సి వస్తోంది. రెండో ప్లాట్‌ఫాం నిర్మాణం జరగనందునే ఈ పరిస్థితి కలుగుతోంది. ప్రస్తుతం రెండో ప్లాట్‌ఫాం పనులు వేగంగా సాగుతున్నాయి. పనులు చివరి దశలో ఉన్నాయి. పనులు పూర్తయితే ప్రయాణికులు రైలులో నుంచి కిందికి దిగేందుకు సౌకర్యంగా మారనుంది. ఆకట్టుకుంటున్న బొమ్మలు జహీరాబాద్ రైల్వే స్టేషన్ కు రంగులద్దే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన 15 మంది కళాకారులు స్టేషన్ లో గోడలపై రంగులు, బొమ్మలు వేసే పనులు చేపట్టారు. పర్యావరణం, నీటి పొదుపు, ప్లాస్టిక్ వాడకం వద్దు, స్వచ్ఛ భారత్, పచ్చదనం తదితర వాటి ప్రాధాన్యతను చాటిచెప్పే విధంగా చిత్రాలు, నినాదాలతో తీర్చిదిద్దుతున్నారు. అంతే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఉపయోగపడే జంతువులు, పక్షుల చిత్రాలను ప్లాట్ ఫాం గోడలు, స్టేషన్ గోడలపై తీర్చిదిద్దుతున్నారు. రేల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులను ఆయా చిత్రాలు ఆకట్టుకోనున్నాయి. ప్రజల ఇబ్బందులు తీరనున్నాయి రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జి, రెండో ప్లాట్‌ఫాం నిర్మాణం పనులు త్వరలో పూర్తై వినియోగంలోకి రానున్నాయి. వీటిని పూర్తి చేయించేందుకు నేను ప్రత్యేక చొరవ తీసుకుని రైల్వే శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడా. రైల్వే శాఖ అధికారులు సానుకూలంగా స్పందించి పనులను ప్రారంభించారు. పనులు త్వరలో పూర్తి చేయించి ప్రారంభింపజేసి ప్రజలకు ఉపయోగంలోకి తెస్తాం. ప్రయాణికులతో పాటు పట్టణ ప్రజలకు ఎంతో సౌకర్యం కలుగనుంది. –బీబీ పాటిల్,జహీరాబాద్ ఎంపీ -
గద్వాల – మాచర్ల రైల్వేలైన్‌కు కేంద్రం అంగీకారం
గద్వాల టౌన్: గద్వాల– మాచర్ల రైల్వేలైన్ చేపట్టేలా కృషి చేస్తున్నామని, రాష్ట్రవాటాతో కలిసి చేపట్టేందుకు కేంద్ర మంత్రి అంగీకరించినందున త్వరలోనే ప్రజాప్రతినిధులు అందరం కలిసి సీఎం కేసీఆర్‌ను కలవబోతున్నామని నాగర్‌కర్నూలు పార్లమెంట్ సభ్యులు పి రాములు అన్నారు. శనివారం గద్వాల మండలం జమ్మిచేడు హరిత హోటల్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. రాయచూరు నుంచి గుంటూరు జిల్లాలోని మాచర్ల వరకు ఏర్పాటు చేయాల్సిన రైల్వే లైన్లో గద్వాల రాయచూర్ మధ్య మాత్రమే మొదటి దశలో పూర్తయిందని, రెండో దశగా గద్వాల నుంచి వనపర్తి, నాగర్‌కర్నూల్, కల్వకుర్తిల ద్వారా మాచర్ల వరకు చెపట్టాల్సిన రైల్వే లైన్‌ను చేపట్టేందుకు కృషి చేస్తున్నానమన్నారు. ఇందుకు కేంద్ర మంత్రి పీయూస్ గోయల్‌ను కోరగా, ప్రాజెక్టులో రాష్ట్ర వాటాకు అంగీకరిస్తే చేపట్టేందుకు వీలుపడుతుందని చెప్పారన్నారు. నాగర్‌కర్నూలు పార్లమెంట్ ప్రాంత ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అందరం కలిసి త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కలవాలని నిర్ణయించామని తెలిపారు. గద్వాల మాచర్ల లైన్ వల్ల ఈ ప్రాంత అభివృద్దికి జరిగే మేలును ఆయనకు వివరించి, రాష్ట్ర వాటాను కలిపేందుకు కోరుతామన్నారు. త్వరలోనే గద్వాల మాచర్ల లైన్ డీపీఆర్‌కు అవసరమైన కసరత్తు పూర్తి చేసేలా తన వంతు కృషి ఉంటుందని తెలిపారు. గద్వాల, జోగుళాంబ స్టేషన్ల అభివృద్ధికి చర్యలు గద్వాల రైల్వే స్టేషన్లో 21 బోగీల ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తగినట్లుగా ప్లాట్ ఫాంలు 1.2లను పొడగింపురకు జీఎం అంగీకరించారన్నారు. గద్వాల జిల్లా కేంద్రం, జంక్షన్ స్టేషన్‌గా ఉన్న ఈ స్టేషన్ ద్వారా ఆగకుంగా వెళ్తున్న కొంగు, అజరత్ నిజాముద్దీన్, ఘోరక్పూర్, ఓకా రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌లకు హల్టింగ్ ఇవ్వాలని కోరడమైందన్నారు. వాటిలో రెండింటిని ఆపేలా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని జీఎం హామీ ఇచ్చారన్నారు. గద్వాల స్టేషన్లో వాహనాల పార్కింగ్‌ను విస్తరించాలని కోరగా.. చేస్తామన్నారని వివరించారు. జోగుళాంబ రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ సౌకర్యం కల్సించేలా బుకింగ్‌ను అభివృద్ధి, స్టేషన్ ప్రక్కనే ఉన్న రహదారికి అండర్ బ్రిడ్జిని చేపట్టాలని కోరగా.. అందుకు అంగీకారం తెలిపారన్నారు. -
రైల్వేల్లో ప్రైవేటుకు పెద్దపీట
* జమ్మూకాశ్మీర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ * కాత్రాలో కొత్త రైలు జాతికి అంకితం * యూరీలో 240 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రానికి ప్రారంభోత్సవం కాత్రా: దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్ల అభివృద్ధి, సౌకర్యాల మెరుగు దలలో ప్రైవేటురంగాన్ని భాగస్వామ్యం చేయదల చుకున్నట్టు ప్రధాని నరేంద్రమోడీ సూచనప్రాయంగా తెలిపారు. దేశంలో విమానాశ్రయాలకంటే, రైల్వే స్టేషన్లే మెరుగ్గా ఉండాలని తాను కోరుకుంటున్నట్టు జమ్ముకాశ్మీర్‌లోని కాత్రాలో ఆయన అన్నా రు. త్వరలోనే పిపిపి పద్ధతిలో రైల్వేస్టేషన్లను ఆధునీకరించ టంపై దృష్టి సారిస్తామన్నారు. జమ్మూలోని వైష్ణోదేవి ఆలయా నికి బేస్‌క్యాంప్ అయిన కాత్రాలో కొత్త రైల్వే లైనును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఆర్థికంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు పీపీపీ లాభదాయకంగా ఉంటుందని మోడీ అన్నా రు. దేశంలో శాంతిస్థాపనకు బలమైన సైనిక శక్తి ఉండటం అత్యవసరమని మోడీ స్పష్టం చేశారు. ప్రధాని పగ్గాలు చేపట్టాక శుక్రవారం తొలిసారిగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోడీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జమ్మూలోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్లేందుకు బేస్‌క్యాంపుగా ఉన్న కాత్రాలో కొత్తగా నిర్మించిన రైలు మార్గంలో ప్రవేశపెట్టిన కాత్రా-న్యూఢిల్లీ (వయా ఉధంపూర్) రైలును మోడీ జెండాఊపి ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ఈ రైలుకు శ్రీశక్తి ఎక్స్‌ప్రెస్‌గా పేరు పెట్టాలని అధికారులకు సూచించారు. కాత్రాకు ఇప్పటివరకూ రైలు మార్గం లేకపోవడంతో వైష్ణోదేవి ఆలయ దర్శనం కోసం వచ్చే భక్తులు జమ్మూ వరకూ రైల్లో వచ్చి అక్కడి నుంచి బస్సులో కాత్రాకు చేరుకొని అనంతరం 14 కి.మీ దూరంలోని ఆలయానికి వెళ్లాల్సి వచ్చేది. కాశ్మీర్ రైలు లింక్ ప్రాజెక్టులో భాగంగా కాత్రా-ఉధంపూర్ మధ్య 25 కి.మీ రైలుమార్గాన్ని రూ. 1,132.75 కోట్లతో నిర్మించారు. ఈ సందర్భంగా కాత్రా స్టేషన్లో ఏర్పాటు చేసిన సభలో మోడీ మాట్లాడుతూ వైష్ణోదేవి యాత్రకు వచ్చే భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త రైలు మార్గం రాష్ట్రాభివృద్ధిని వేగవంతం చేస్తుందన్నారు. ‘‘అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రారంభించిన ప్రయాణాన్ని (రాష్ట్రాభివృద్ధి) మేం కొనసాగిస్తాం. తద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి మనసు గెలుచుకోవడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఈ రైలు కేవలం రాష్ర్ట ప్రజలకేగాక యావత్ దేశానికే బహుమతి’’ అని పేర్కొన్నారు. బాంద్రా, న్యూఢిల్లీ, కాల్కా, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు నుంచి కాత్రాకు త్వరలోనే ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. జమ్మూ-ఉధంపూర్ మధ్య లోకల్ రైళ్లను కాత్రా వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రైల్వేమంత్రి సదానందగౌడ, జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. విద్యుత్ రంగంలో పీపీపీ పద్ధతి కావాలి విద్యుత్ రంగంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానం అవసరమని మోడీ అభిప్రాయపడ్డారు. పునర్వినియోగ ఇంధన వనరులే పెరుగుతున్న దేశ విద్యుత్ అవసరాలను తీర్చగలవన్నారు. బారాముల్లా జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) సమీపంలో ఉన్న యూరీలో ఝీలం నదిపై నిర్మించిన 240 మెగావాట్ల యూరీ-2 జలవిద్యుత్ కేంద్రాన్ని మోడీ ప్రారంభించారు. స్థానిక కేంద్రీయ విద్యాలయ హైస్కూల్‌ను హయ్యర్ సెకండరీ స్కూల్‌గా మార్చాలన్న ప్రజల డిమాండ్‌పై అప్పటికప్పుడు మోడీ ఆమోదించారు. రక్షణ ఉత్పత్తుల్లో స్వావలంబన అవసరం రక్షణరంగ ఉత్పత్తుల్లో స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందని మోడీ పేర్కొన్నారు. దేశానికి పూర్తిస్థాయిలో ముప్పును నివారించేందుకు ఇది ఎంతో అవసరమన్నారు. శ్రీనగర్‌లోని సైనిక చినార్ కోర్లో జరిగిన సైనిక సమ్మేళనంలో జవాన్లు, సైనికాధికారులను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. జవాన్లను సంతోషంగా ఉంచేందుకు తన ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని మోడీ హామీ ఇచ్చారు. ‘‘జవాను సంతోషంగా ఉన్నప్పుడే మాతృభూమికి సేవ చేయగలడు’’ అన్నారు. ప్రసంగానికి ముందు అమర జవాన్ల స్తూపానికి నివాళులర్పించారు. అమెరికాకు మోడీ శుభాకాంక్షలు: శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోడీ ఆ దేశ ప్రజలకు ‘ట్విట్టర్’లో శుభాకాంక్షలు తెలిపారు.