వర్ష బీభత్సం
ఈదురు గాలులతో
ధ్వంసమైన ఇళ్ల పైకప్పు రేకులు షాబాద్ మండలం రుద్రారంలో
పిడుగుపాటుతో ఎద్దు మృతి
షాబాద్ : ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. బుధవారం మండల పరిధిలోని హైతాబాద్, చందనవెల్లి, రుద్రారం తదితర గ్రామాల్లో జనాన్ని అతలాకుతలం చేసింది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో దాదాపు 30 ఇళ్ల రేకులు దెబ్బతిన్నాయి.. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ర్లు ధ్వంసమై చెట్లు విరిగిపోయాయి. రుద్రారం గ్రామంలో రైతు జెట్ట పాపయ్య కాడి ఎద్దు పిడుగుపాటుతో మృతిచెందింది.
చేతికొచ్చిన వరి పంటలు నేలవారింది. మామిడి కాయలు నేలరాలాయి. రుద్రారం గ్రామంలో యాదగిరి, సిద్ధేశ్వర్, రాంచంద్రయ్య, లక్ష్మయ్య, వెంకటయ్య, హనుమంతుతో పాటు మరి కొందరి ఇళ్ల రేకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చందనవెల్లిలో వెంకటయ్య, ఎల్లయ్య, మహేందర్, రా ములు, జంగయ్య, అంజయ్యకు చెందిన ఇళ్లు, హైతాబాద్ గ్రామంలో లలిత, నారాయణ, శ్రీనివాస్‌రెడ్డిల ఇళ్లు వర్షానికి కూలిపోయాయి.
శంషాబాద్ మండలంలో..
శంషాబాద్ రూరల్: మండల పరిధిలోని హమీదుల్లానగర్, బహదుర్గూడ గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఇదురుగాలులు, వడగళ్ల వర్షం కురవడంతో పంటలకు తీవ్రనష్టం జరిగింది. హ మీదుల్లానగర్లో రమేష్, సత్తయ్యకు చెందిన పొలాల్లోని డెయిరీఫాం పైకప్పు రేకులు ధ్వంసమయ్యాయి. భారీ వర్షంతో వరి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు నేలరాలాయి.