Raj Bawa
-
178 పరుగులకే ఆలౌట్.. సిరీస్ క్లీన్‌స్వీప్; సంజూ కెప్టెన్సీ అదరహో
భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్-ఏ జట్టుకు భంగపాటే ఎదురైంది. న్యూజిలాండ్-ఏతో జరిగిన అనధికారిక మూడు వన్డేల సిరీస్‌ను సంజూ శాంసన్ కెప్టెన్సీలోని ఇండియా-ఏ జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం చెన్నై వేదికగా జరిగిన అనధికారిక మూడో వన్డేలో ఇండియా-ఏ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్-ఏ 178 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ డానే క్లీవర్ ఒక్కడే 83 పరుగులతో ఒంటరి పోరాటం చేయగా.. మిగిలినవారిలో మైకెల్ రిప్పన్ 29, చాడ్ బోవ్స్ 20 పరుగులు చేశారు. ఇండియా-ఏ బౌలర్లలో రాజ్ బవా నాలుగు వికెట్లతో చెలరేగగా.. రాహుల్ చహర్, కుల్దీప్ యాదవ్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ జట్టు 49.3 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ సంజూ శాంసన్(54), తిలక్ వర్మ(50), శార్దూల్ ఠాకూర్(51) అర్థ సెంచరీలతో చెలరేగారు.కివీస్ బౌలర్లలో జాకోబ్ డఫీకి రెండు, మాథ్యూ ఫిషర్‌కు రెండు, జో వాకర్‌కు ఒకటి, మైఖేల్ రిప్పన్‌కు రెండు, రచిన్ రవీంద్రకు ఒక వికెట్ దక్కాయి. ఇక అనధికారిక వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇండియా-ఏ టెస్టు సిరీస్‌ను మాత్రం డ్రాతోనే సరిపెట్టుకుంది. చదవండి: షమీకి పెరుగుతున్న మద్దతు.. అక్టోబర్ 9న డెడ్‌లైన్! -
ఐపీఎల్ 2022: 8 మ్యాచ్‌ల హైలైట్స్
-
అండర్ 19 వరల్డ్‌కప్ హీరో రాజ్ బవాకి యువరాజ్ సింగ్‌తో ఉన్న లింక్ ఏంటి..?
అండర్ 19 ప్రపంచకప్ 2022 ఫైనల్లో 5 వికెట్ల ప్రదర్శన(5/31)తో చెలరేగి, అనంతరం బ్యాట్(54 బంతుల్లో 35; 2 ఫోర్లు, సిక్స్)తో కూడా రాణించి.. టీమిండియా ఐదో ప్రపంచకప్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన డాషింగ్ యంగ్ ఆల్‌రౌండర్ రాజ్ అంగద్ బవాపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అతను ఎవరు, అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటీ అని భారత క్రికెట్ అభిమానులు ఆరా తీయడం మొదలు పెట్టగా, ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. రాజ్ బవా తండ్రి సుఖ్విందర్ బవా.. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్‌కు కోచ్‌గా వ్యవహరించాడన్న విషయం తెలిసింది. సుఖ్విందర్ పర్యవేక్షణలో యువరాజ్ అండర్ 19 ప్రపంచకప్ 2000లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఇక్కడ మరో విశేషమేమింటంటే.. రాజ్‌బవా తాత సర్దార్ తర్లోచన్ సింగ్ బవా కూడా భారత క్రీడారంగంతో సంబంధం ఉంది. తర్లోచన్ సింగ్ బవా, 1948 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత హాకీ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. యాదృచ్చికంగా ఆ ఒలింపిక్స్‌లో తర్లోచన్ సింగ్ ప్రాతినిధ్యం వహించిన భారత హాకీ జట్టు ఫైనల్లో గ్రేట్ బ్రిటన్ను ఓడించి స్వర్ణం నెగ్గగా.. తాజాగా మనవడు రాజ్ బవా కూడా ఫైనల్లో ఇంగ్లండ్‌పైనే చెలరేగి టీమిండియాకు అండర్-19 వరల్డ్‌కప్ అందించాడు. కాగా, రాజ్ బవా.. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లోనే కాకుండా టోర్నీ ఆధ్యాంతం మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. 6 వన్డేల్లో 9 వికెట్లతో పాటు 252 పరుగులు చేసి ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. ఇందులో బవా ఓ ఐదు వికెట్ల ప్రదర్శనతో పాటు సౌతాఫ్రికాపై (4/47) నాలుగు వికెట్ల ఘనతను సాధించాడు. అలాగే ఉగాండా(108 బంతుల్లో 162 నాటౌట్; 14 ఫోర్లు, 8 సిక్సర్లు)తో జరిగిన లీగ్ దశ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. అంతకుముందు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లతో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించి 42 పరుగులు చేశాడు. చదవండి: తన ఆరాధ్య గాయనికి కన్నీటి నివాళులర్పించిన క్రికెట్ గాడ్