Raja Sekhar Reddy
-
వైఎస్ఆర్ విగ్రహం మీద చెయ్యేస్తే తాట తీస్తాం: వైఎస్ షర్మిల
-
కొడుకే చంపేశాడు..
తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు మిస్టరీని చేదించిన పోలీసులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన మేడ్చల్‌రూరల్: తండ్రి తాగివచ్చి అకారణంగా తనను, ఇంట్లో వారిని తిడుతున్నాడని ఆగ్రహించిన ఓ తనయుడు తండ్రిని హత్య చేసిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారంపేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్, సీఐ రాజశేఖర్‌రెడ్డి తో కలిసి వివరాలు వెల్లడించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో నివాసం ఉంటున్న మహమ్మద్ అలీ(50) గత నెల 12న రాత్రి తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 20న మరణించాడు. కాగా 14న తన తండ్రి తలకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని ఇందుకు కారణం తెలియడం లేదని మృతుడి కుమారుడు మహమ్మద్ ఉస్మాన్ మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి కుమారుడే మహమ్మద్ ఆలిపై దాడి చేసి గాయపర్చినట్లు గుర్తించారు.. మహమ్మద్ అలీ(50) భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతని పెద్ద కుమారుడు మహమ్మద్ ఉస్మాన్(22) కొద్ది రోజులుగా ఖాళీగా ఉంటున్నాడు. మహమ్మద్ అలీ గత నెల 11న మనవరాలి తొట్టెల ఫంక్షన్లో తనతో పాటు కూడా కుటుంబసభ్యులను అకారణంగా తిట్టడంతో తండ్రిపై కోపం పెంచుకున్న ఉస్మాన్ తండ్రికి బుద్ధి చెప్పాలని నిర్ణరుుంచుకున్నాడు. 12వ తేదీ రాత్రి మహమ్మద్ అలీ నిద్రిస్తున్న సమయంలో ఉస్మాన్ అతడిపై ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. అనంతరం బాత్రూంలో రాడ్‌కు అంటిన రక్తపు మరకలను కడిగి ఎవరికీ అనుమానం రాకుండా రాడ్‌ను పారవేశాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో మహమ్మద్ ఆలీ వాంతులు చేసుకోవడం గమనించిన నిందితుడు కుటుంబసభ్యుల సహకారంతో అతడిని ఆస్పత్రికి తరలించాడు. మద్యం మత్తులో కిందపడడంతో గాయాలైనట్లు వైద్యులకు చెప్పాడు. అనంతరం పోలీసులకు అనుమానం రాకుండా నవంబర్ 14న మేడ్చల్ పీఎస్‌కు వెళ్లి తన తండ్రి కి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని గాయాలెలా అయ్యాయో తెలియడం లేదని ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు వైద్యులను విచారించగా తలపై బలంగా కొట్టినందునే అతను గాయపడినట్లు చెప్పడంతో హత్యకేసు నమోదు చేసుకున్నారు. గత నెల 20న చికిత్స పొందుతూ మహమ్మద్ అలీ మరణించగా దీంతో పోలీసులు శనివారం మృతుడి పెద్ద కుమారుడు మహమ్మద్ ఉస్మాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. మృతుడి హత్యకు ఉపయోగిం చిన ఇనుపరాడ్‌ను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. హత్యకేసు చేదించిన మేడ్చల్ పోలీసులకు ఏసీపీ అభినందించాడు. -
ముక్తీశ్వరా...
కాళేశ్వర ముక్తీశ్వర ఎత్తిపోతల పథకం ఐదేళ్ల నుంచి అడుగులో అడుగు వేస్తోంది. పనులు మొదలెట్టి ఐదేళ్లయినా ఇప్పటికీ భూసేకరణే పూర్తి కాలేదు. 2012లోనే పూర్తి కావాల్సిన పనుల గడువును ఇప్పటికే రెండు సార్లు పెంచగా మరో వారంలో తుదిగడువు కూడా పూర్తి కానుంది. అయినా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. - మంథని మంథని : మంథని డివిజన్లోని మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్, కాటారం మండలాల్లోని 65 గ్రామాలకు మేలు చేకూర్చేలా 45 వేల ఎకరాల బీడు భూములను సాగులోకి తెచ్చేలా కాళేశ్వర, ముక్తీశ్వర ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. 2008 సెప్టెంబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మహదేవపూర్ మండలం బీరసాగర్‌లో శంకుస్థాపన చేయగా 2009లో పనులు ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టు పూర్తయ్యేందుకు రూ.499 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. నీటి తరలింపు ఇలా... గోదావరి ఒడ్డు నుంచి మహదేవపూర్ మండ లం కన్నెపల్లిలోని ఇంటేక్‌వెల్‌కు నీటిని తరలిస్తారు. అక్కడినుంచి పైప్‌లైన్ ద్వారా మహదేవపూర్ మండల చెరువు, ఊర చెరువుల్లో నీరు నింపుతారు. ఇది మొదటి దశ(స్టేజ్-1) పను లు. ఇక్కడ నుంచి రోడ్డు మార్గంలో కాటారం మండలం గారెపల్లి కొత్తచెరువులోకి తరలిస్తారు. దీన్ని రిజర్వాయర్‌గా(స్టేజ్-2) మా ర్చుతారు. ఇక్కడినుంచి రెండువైపులా పైప్‌లైన్ ఉంటుంది. కాటారం, ఆదివారంపేట, కొత్తపల్లి, సుందర్రాజ్పల్లి నుంచి మల్హర్ మండలం రుద్రారం వరకు పైప్‌లైన్ ద్వారా నీరు తరలిస్తారు. ఇది ఒకవైపు కాగా, రెండోవైపు గారెపల్లి నుంచి పోలారం, మహాముత్తారం వరకు నీటిని తరలిస్తారు. ఈ చెరువుల ద్వారా రైతుల భూములకు సాగునీరందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఏదీ పురోగతి ప్రాజెక్టు నిర్మాణానికి 3625 ఎకరాల భూమి అవసరం కాగా, ఇందులో 2981 ఎకరాలు రెవెన్యూ భూమి. మిగతా 644 ఎకరాలు భూమి అటవీభూమి. ఇప్పటివరకు 900 ఎకరాల రెవెన్యూ భూమి మాత్రమే సేకరించారు. కానీ, నిర్వాసితులకు రూపాయి కూడా చెల్లించలేదు. భూసేకరణ, అటవీశాఖ అడ్డంకులు, వర్షాకాల సీజన్ సాకులు చూపుతూ కాంట్రాక్టర్ పనులు జాప్యం చేయగా అధికారులు కూడా పట్టించుకోలేదు. దీంతో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయాయి. 2012 సెప్టెంబర్ వరకు పనులు పూర్తి కావాల్సి ఉండగా 2013కు ఓసారి గడువు పొడిగించారు. కాంట్రాక్టర్ విజ్ఞప్తి మేరకు గడువు 2014 డిసెంబర్ వరకు పొడిగిస్తూ మరోసారి నిర్ణయం తీసుకున్నారు. మరో వారం రోజుల్లో ఈ గడువు కూడా పూర్తి కానుండగా పనుల్లో మాత్రం పురోగతి లేదు. ఇప్పటివరకు పూర్తయిన పనులకు రూ.270 కోట్లు చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. 50 శాతానికిపైగా నిధులు కాంట్రాక్టర్‌కు చెల్లించినప్పటికీ పనులు మాత్రం అత్తెసరుగానే జరిగాయి. మిగతా పనులన్నీ పూర్తి కాకుండానే పంపింగ్ కోసం మోటార్లు తీసుకురావడంతో అవన్నీ వృథాగా ఉంటున్నాయి. చెల్లింపుల్లో అక్రమాలు జరిగినట్లు అధికారుల విచారణలో తేలడంతో పలువురు అధికారులపై గత ఫిబ్రవరిలో సస్పెన్షన్ వేటు వేశారు. ప్రస్తుతం ఇంటేక్వెల్ పనులు కొనసాగుతున్నాయి. పనుల్లో జాప్యంతో అంచనాలు రూ.637 కోట్లకు చేరినట్లు సమాచారం. 644 ఎకరాల అటవీ భూమిలో పైప్‌లైన్ నిర్మాణానికి కేంద్ర అటవీపర్యావరణ అనుమతి ఇటీవలే వచ్చినట్లు సమాచారం. మిగతా భూములు త్వరగా సేకరించి, పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఇంటేక్వెల్ నిర్మాణం త్వరగా పూర్తి చేసి పైప్‌లైన్ వేసి నీరందించాలని పేర్కొంటున్నారు. -
పేదల పెన్నిధి రాజన్న
సాక్షి, మంచిర్యాల : విద్యార్థుల చదువులకు భరోసా ఇచ్చేందుకు ఫీజు రీయింబర్స్మెంట్, ఆడపడుచులకు పావలావడ్డీ, ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు 108,104, సాగు భూములకు జలకళ అందించేందుకు ప్రాజెక్టుల నిర్మాణం, వికలాంగులు, వృద్ధులు సకాలంలో పెన్షన్లు ఇవన్నీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మంచి పనుల్లోని కొన్ని అంశాలు.. మంగళవారం ఆ మహనీయుడి జయంతి. ఈ సందర్భంగా జిల్లావాసుల కోసం ఆయన చేసిన మంచి పనుల్లోని కొన్ని అంశాలు.. తెలంగాణ వరప్రదాయని ప్రాణహిత.. తెలంగాణలోని ఏడు జిల్లాల్లో 16.40 లక్షల ఎకరాలకు సాగు నీరందించిందాలనే బృహత్ లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి మదిలో నుంచి ఆవిష్కృతమైందే ప్రాణ హిత-చేవెళ్ల ప్రాజెక్టు. రూ.38,500 కోట్ల వ్యయంతో 2008 డిసెంబరు 16న కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. ఇన్వెస్టిగేషన్, మెబిలైజేషన్ చెల్లింపుల కింద రూ.1,025 కోట్లు ఖర్చు చేశారు. 2009లో దివంగత వైఎస్ మరణానంతరం ఈ ప్రాజెక్టుపై చిన్నచూపు ప్రారంభమైంది. 2010-11 బడ్జెట్లో రూ.700 కోట్లు కేటాయించి రూ.33.57 కోట్లు విడుదల చేశారు. 2011-12 బడ్జెట్లో ఆర్భాటంగా ’608.28 కోట్లు కేటాయించినా ఒక్క రూపాయి కూడా ప్రాజెక్టు కోసం ఖర్చు చేయలేదు. 2012-13లో రూ.1050 కోట్లు, 2013-14లో రూ.780 కోట్లు కేటాయించారు. ఈ విధంగా అరకొర నిధులతో పనులు జరగడంలేదు. కేవలం మూడు కిలోమీటర్ల పొడవున మాత్రమే పనులు చేపట్టారు. ఆదిలాబాద్‌కు ఆధునిక వైద్యం కనీస వైద్యానికి నోచుకోని ఆదిలాబాద్ ఆదివాసులకు ఆధునిక కార్పొరేట్ వైద్యం అందించేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన మరో ఆపన్నహస్తం రిమ్స్. 2008లో రూ.128 కోట్ల నిధులతో రిమ్స్ నిర్మాణానికి వైఎస్ శంకుస్థాపన చేశారు. రోగం ఏదైనా తక్షణ సేవలు అందించే స్థాయిలో రిమ్స్ అలరారుతుండటంతో పేద రోగుల మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు. రిమ్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీ వార్డు వల్ల పేద రోగులు లబ్ధిపొందుతున్నారు. మరోవైపు రిమ్స్ మెడికల్ కాలేజీలో వైద్య విద్య పూర్తిచేసుకున్న వైద్యులు సమాజ సేవకు కదులుతున్నారు. ఆధునిక విద్యకు అందలం విద్యార్థులకు ఇన్షర్మేషన్ టెక్నాలజీ చదువుల కోసం తెలంగాణకు కేటాయించిన ట్రిపుల్ ఐటీ జిల్లాలోని చదువుల తల్లి నిలయమైన బాసరలో కొలువుదీరింది. విద్యార్థుల సాంకేతిక చదువులకోసం వైఎస్ ట్రిపుల్ ఐటీకి 2008లో పచ్చజెండా ఊపారు. ఆ ఆర్థిక సంవత్సరంలో రూ.400 కోట్లను బాసర ట్రిపుల్ ఐటీకి కేటాయించారు. దీంతో శరవేగంగా తరగతి గదులు, వసతి భవనాలు, క్యాంపస్‌లు ఏర్పాటయ్యాయి. మొదట్లో ఫ్రీ ప్యాబ్రికేటెడ్ పద్ధతిలో భవనాలు నిర్మించినప్పటికీ వైఎస్సార్ ప్రత్యేక శ్రద్ధతో నిధులు కేటాయించి పనులు పూర్తిచేయించారు. అయితే దివంగత వైఎస్ మరణానంతరం ట్రిపుల్ ఐటీలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. గోడు దూరం గోదావరి నదిపై 20 టీఎంసీల నీటిని నిల్వచేసేందుకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు రూపకల్పనకు రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. తద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి రైతన్నలకు నీటి వసతి లేదనే గోడు దూరం చేసేందుకు కార్యచరణ రూపొందించారు. 2004 జూలైలో ఎల్లంపల్లి జలాశయ నిర్మాణానికి వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనుల కోసం రూ.408 కోట్లు మంజూరు చేశారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన 2 లక్షల రైతులకు సాగునీరు అందుతుంది. సాగునీటితోపాటు మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి మునిసిపాలిటీలకు గోదావరి తాగునీరు, ఎన్టీపీసీకి 6 టీఎంసీల నీరు, దండేపల్లి మండలం గూడెం వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడం వైఎస్ ఆశయం. అయితే ఆయన మరణానంతరం పనులు నత్తనడకన సాగాయి. దాదాపుగా పూర్తి కావచ్చిన ఈ ప్రాజెక్టు త్వరలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. సంతృప్తికర స్థాయిలో పెన్షన్లు అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు వైఎ స్సార్ పెన్షన్లు మంజూరు చేశారు. దీంతోపాటు వికలాం గులకు చెల్లించే పెన్షను మొత్తాన్ని రూ.200 నుంచి రూ. 500కు పెంచారు. వృద్ధులకు, వితంతువులకు అప్పటివరకు చెల్లిస్తున్న రూ.75 మొత్తాన్ని రూ.200 చెల్లించారు. ఈ విధంగా సంతృప్తకర స్థాయితోపాటు పెన్షన్ మొత్తం పెంపుతో పండుటాకులతో పాటు విధివంచిత వికలాం గులు, వితంతువుల కళ్లల్లో ఆనందం వెళ్లివిరిసింది. బడుగు విద్యార్థులకు భరోసా ఉన్నత విద్య అభ్యసించేందుకు ఫీజులు చెల్లించేందుకు వెనకబడిన వర్గాల కోసం ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు రాజశేఖర రెడ్డి. జిల్లాలో ఈ విధానం ద్వారా వేలాది విద్యార్థులు లబ్ధిపొందారు. ఎందరో విద్యార్థులు మెడిసిన్, ఇంజినీరింగ్, పీజీ వంటి తమ కలల కోర్సుల్లో విద్యాభ్యాసాన్ని పూర్తిచేసుకున్నారు. అయితే ఆ తర్వాతి కాలంలో రీయింబర్స్‌మెంట్‌పై విధించిన ఆంక్షలతో బడుగులకు భరోసా దూరమయింది. అందుకే ప్రభుత్వ గణాంకాలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. 2004-05 విద్యాసంవత్సరంలో జిల్లాలోని 14,744 మంది విద్యార్థులకు రూ.6,14,00,000 ఫీజు కింద ప్రభుత్వం చెల్లించింది. 2005-06లో 6,770 విద్యార్థుల కోసం రూ.3,63,00,000 చెల్లించారు. 2006-07 విద్యా సంవత్సరంలో 20,639 మంది విద్యార్థులకు రూ.7,12,00,000 చెల్లించారు. 2007-08లో 23,955 మంది విద్యార్థులకు రూ.11,64,00,000 సొమ్మును చెల్లించారు. 2008-09 విద్యాసంవత్సరంలో17,192 మంది విద్యార్థులకు 10,36,00,000 చెల్లించారు. 2009-10లో విద్యార్థులు ఫీజురీయింబర్స్ అర్హులు సంఖ్య పెరిగి17,364కు చేరినప్పటికీ క్రితం సంవత్సరం కంటే తగ్గించి రూ.7,30,00,000 కేటాయించారు. వీటితోపాటు వ్యవసాయానికి ఉచిత కరెంటు అందించి రైతన్నల కళ్లల్లో వెలుగురేఖలు నింపారు. దళితుల కోసం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల నుంచి దళిత కాలనీలకు ఉచిత విద్యుత్ సౌలభ్యాన్ని పునరుద్ధరించారు. రాజీవ్ పల్లెబాట, రాజీవ్ నగరబాట కార్యక్రమాల ద్వారా పుర, గ్రామ ప్రజల సమస్యలను క ళ్లారా చూసి వాటిని తీర్చేందుకు అధికారులతో ప్రతిపాదనలు స్వీకరించి నిధులు మంజూరు చేశారు. -
ఆ ముగ్గురూ జోగులే !: షర్మిల
► గుంటూరు జనభేరిలో మోడీ, వెంకయ్య, పవన్‌లపై షర్మిల ధ్వజం ►జగన్ ఒక్కడిని ఎదుర్కోలేక చంద్రబాబు వీళ్లను తెచ్చాడు ►జోగీ జోగీ రాసుకుంటే రాలేది బూడిదే ►విభజన పాపంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకూ భాగముంది ►మోడీ మాటలు నమ్మడానికి సీమాంధ్ర ప్రజలు పిచ్చివాళ్లు కాదు సాక్షి, గుంటూరు: ‘‘టీడీపీఅధినేత చంద్రబాబునాయుడు రాజశేఖరరెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేక అందరితో కలసి మహాకూటమిగా ఏర్పాటు చేసి పోరాడినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు రాజశేఖరరెడ్డి వెళ్లిపోయినా.. ఆయన కొడుకును కూడా ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము ఈ చంద్రబాబుకు లేదు. అందుకనే బీజేపీకి చెందిన నరేంద్రమోడీ, వెంకయ్య నాయుడు, పవన్ కల్యాణ్‌లను మూకుమ్మడిగా తీసుకొచ్చాడు. అయినా ఫరవాలేదు. జోగీజోగీ రాసుకుంటే బూడిదే రాలుతుంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల విమర్శిం చారు. తిరుపతి సభలో ఈ ముగ్గురూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ వారిని కడిగిపారేశారు. తెలుగు ప్రజలను విడగొట్టిన పాపంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకూ భాగముందన్నారు. కొడుకును ప్రధానమంత్రిని చేసుకోవాలని సోనియా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే.. ‘కొబ్బరికాయ ముక్కల్లా విభజించండి’ అని చంద్రబాబు మద్దతు పలికారని, చట్టసభల్లో విభజనకు బీజేపీ బేషరతుగా మద్దతిచ్చిందని దుయ్యబట్టారు. గుంటూరు జిల్లాలోని క్రోసూరు, తాడికొండ, పెదకాకానిలో గురువారం జరిగిన ‘వైఎస్సార్ జనభేరి’ సభల్లో ప్రసంగించారు. షర్మిల ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే.. మూడురాష్ట్రాల్లో ఏం చేశారు..? ‘‘చంద్రబాబు మూకుమ్మడిగా తెచ్చిన మోడీ, వెంకయ్య, పవన్ కల్యాణ్.. ఈ జోగులంతా తిరుపతిలో ఒక బహిరంగ సభ పెట్టారు. అందరిదీ ఒక్కటే టార్గెట్ జగన్. అందరూ మనస్ఫూర్తిగా జగన్‌ను ఆడిపోసుకున్న తరువాత, ‘సీమాంధ్రను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాము.. హైదరాబాద్ లాంటి రాజధానిని మళ్లీ సీమాంధ్రలో కడతాము.. అదిగదిగో చందమామ..’అని మోడీ సీమాంధ్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే బీజేపీ జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. అప్పుడూ ఇదే వాగ్దానాలు చేసింది. కనీసం ఒక్కో రాష్ట్రానికి రూ. 500 కోట్లయినా ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ రాష్ట్రాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం లేదు, కనీసం చెప్పుకోదగ్గ మంచి ఆస్పత్రి కూడా లేదు. అలాంటిది మోడీ నిన్న వచ్చి బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తాం, బ్రహ్మాండమైన రాజధాని కడతామంటే నమ్మడానికి తెలుగు ప్రజలు అమాయకులనుకుంటున్నారా.. లేక పిచ్చివాళ్లనుకుంటున్నారా..? ఇంకొకరు వెంకయ్యనాయుడు ఈయన సొంత నియోజకవర్గంలో, సొంత వార్డుల్లో ఒక్క వార్డు మెంబరును కూడా గెలిపించుకోలేరు. పవన్ సేవ చేస్తారట.. ఇంకొకరు ఆయన పక్కనే నిల్చున్నారు, పవన్ కల్యాణ్ అట. ఈ పవన్ కల్యాణ్ తన అన్న చిరంజీవితో కలిసి ప్రజారాజ్యం అనే ఓ పార్టీ పెట్టారు. అన్నా తమ్ముడు ఇద్దరూ కలిసి రూ. 70 కోట్లకు ఆ పార్టీని అమ్మేసుకుని మంచం కింద ఆ డబ్బు దాచి పెట్టుకుని కేసులు జరగకుండా మేనేజ్ చేసుకున్నారు. ఈ ఐదేళ్లు అదే మంచంమీద ఇద్దరూ తొంగున్నారు. ప్రజారాజ్యం పెట్టేటప్పుడు పవన్ కల్యాణ్ అక్కడే ఉన్నారు. ఎన్నికల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. ప్రచారం చేశారు, హామీలు కూడా ఇచ్చారు. ప్రజారాజ్యంలో యువసేన అనే దానికి అధ్యక్షునిగా ఉన్నారు. మరి ఏ కాంగ్రెస్ పార్టీకి అయితే వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీని పెట్టారో ఆ కాంగ్రెస్ పార్టీకే పార్టీని అమ్మేసుకుంటే ప్రజల ముందుకు వచ్చి ఒక్క సమాధానమైనా చెప్పారా ఈ పవన్ కల్యాణ్. ఈయన సేవ చేస్తారట.. సేవ అనే పేరుతో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే సంస్థ పెట్టి.. కోట్ల కొద్దీ విరాళాలు కూడా సేకరించారు. ఆ సంస్థ ఏమైందో, ఆ విరాళాలను ఏం చేశారో ఎప్పుడైనా చెప్పారా? ఎంత మంది ప్రజలకు సేవ చేశారో ఎప్పుడైనా చెప్పారా? అంత హడావుడిగా కోట్ల రూపాయలు సేకరించి స్థాపించిన సంస్థ కదా.. కనీసం ఇప్పుడది బతికి ఉందా, చచ్చిందా.. అదైనా చెప్పారా పవన్ కల్యాణ్ . చెప్పలేదు. ఈ ఐదేళ్ళల్లో ఎవరికీ ఏ సమాధానం చెప్పలేదు. మొన్న ఆడిటోరియంలో ఒక పెద్ద సభ పెట్టి ఆ సభలో ప్రజల కోసం ప్రశ్నించడానికే ముందుకు వచ్చానని చెప్పుకున్నాడు ఈ పవన్ కల్యాణ్. చంద్రబాబుకు అధికారమిస్తే గొయ్యి తవ్వుకున్నట్టే.. వీళ్లందరినీ తెచ్చింది చంద్రబాబు. బాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను ఫలానా గొప్ప పథకాన్ని చేశాను, నేను ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ ఆ పథకాన్ని చేస్తానని చెప్పుకునే ధైర్యం ఈ రోజు చంద్రబాబుకు లేదు. పదేళ్లు చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నారు. ఈ పదేళ్లలో నేను ప్రజలకు వచ్చిన ప్రధాన సమస్యలో ఫలానా పోరాటం చేశాను.. ప్రభుత్వం మెడలు వంచి ఫలానాది సాధించాను.. ఓట్లు వేయండనే ధైర్యం చంద్రబాబుకు లేదు. ఇంత అసమర్థుడు ఈ రోజు ఎన్నికలు వచ్చాయి కదా అని, అన్ని దొంగ వాగ్దానాలు చేస్తూ తిరుగుతున్నాడు.. ఒక సామెత ఉంది.. పేనుకు పెత్తనం ఇస్తే మొత్తం గొరిగేసినట్లు చంద్రబాబుకు పెత్తనం ఇస్తే మొత్తం దోచేస్తాడు. చంద్రబాబు మాటల్లో నిజంలేదు. చంద్రబాబు వాగ్దానాల్లో నిజం లేదు. చంద్రబాబు గుండెల్లో నిజాయితీ లేదు. ఇలాంటి వారికి అధికారమిస్తే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్లే. -
బలహీనవర్గాలకు అండ - వైఎస్ఆర్ సీపీ జెండా
నందిగాం, న్యూస్‌లైన్: బడుగు, బలహీన వర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా అండగా ఉంటుందని ఆ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి అన్నారు. ఆది వారం కొండల ప్రాంతంలోని సుడిగాలి పర్యటన చేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏ గ్రామానికి వెళ్లినా ఆమె ప్రసంగానికి ప్రజలు నీరాజనం పట్టారు. ఓ వైపు ప్రచండమైన ఎండ, ఉక్కపోత, వేడిమిని సైతం తట్టుకొని ప్రజలు నీరాజనం పట్టారు. తొలుత రాంపురంలో అడుగుపెట్టిన శాంతి కొండల ప్రాంతానికి శివారున ఉన్న దిమ్మిడిజోల, దీనబందుపురం గ్రామాల వరకు నిరాటంకంగా పర్యటించింది. పెద్దతామరాపల్లి గ్రామంలో ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడుతూ రైతులు సుభిక్షంగా ఉండాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు, విద్యార్థులకు, అన్ని వర్గాల ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టింది రాజశేఖర్‌రెడ్డి మాత్రమే అని, మళ్లీ అవి కొనసాగిస్తూ మరికొన్ని పథకాలు జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే ప్రవేశ పెడతారని భరోసా ఇచ్చారు. టీడీపీ అదినేత చంద్రబాబునాయుడు ఇస్తున్న నెరవేర్చలేని హామీలను ప్రజలు నమ్మవద్దని కోరారు. టెక్కలి సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీ తుడుచుకుపోతుందన్నారు. కర్లపూడి, నౌగాం, కల్లాడ, మదనాపురం, అన్నాపురం, దిమ్మిడిజోల, హర్షబాడ, దీనబందుపురం తదితర గ్రామాల్లో పర్యటించారు. కార్యక్రమంలో కింతల ధర్మారావు, చింతాడ మంజు, యర్రా చక్రవర్తి, పోలాకి మోహన్, తమిరె వివేకానంద, దేవేంద్ర, తమిరె బలరాం, పోలాకి సాంభమూర్తి, చిరంజీవులు, పుష్యా సత్యం, జీరు నానిరెడ్డి, నడుపూరి శ్రీరామ్మూర్తి, కొల్లి శ్రీరాములు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక రెడ్డి శాంతి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే బమ్మిడి నారాయణస్వామితోపాటు రాంపురం గ్రామస్తులు పలువురు పార్టీలో చేరారు. అలాగే గొల్లూరు మాజీ సర్పంచి జీరు నానిరెడ్డి, ప్రస్తుత ఉపసర్పంచ్ రట్టి ఈశ్వరరావుతోపాటు మరికొందు పార్టీలో చేరారు.