గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం
గుంటూరు: గుంటూరు నగర శివారు ప్రాంతమైన రాజగోపాల్ నగర్లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ సిలిండర్లు పేలటంతో భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. ఈ మంటల్లో ముగ్గురు కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం.
మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. రాగా మంటలును ఆర్పేందుకు ఒక్క ఫైరింజన్ మాత్రమే ఘటనా స్థలానికి చేరుకుంది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.