rajahmumdry
-
తన కారు దాడి ఎలా జరిగిందో లైవ్ లో చూపించిన భరత్
-
అమరావతి యాత్ర ముసుగులో టీడీపీ, జనసేన రౌడీయిజం
-
‘దిశ’ తప్పిన ‘పచ్చ’ రాజకీయం
సాక్షి, మహేంద్రవరం : ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ అనే సామెతను తు.చ. తప్పకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు పై నుంచి కింది స్థాయి వరకూ పాటిస్తున్నట్టుంది. మహిళలకు భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 18 దిశ పోలీసు స్టేషన్లను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు సమాయత్తమైంది. ఇందులో భాగంగా ‘దిశ’ తొలి పోలీసు స్టేషన్‌ను రాజమహేంద్రవరం కేంద్రంగా శనివారం సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రయత్నాన్ని పార్టీలకతీతంగా అన్ని వర్గాలూ స్వాగతించాయి. కానీ ప్రచారం కోసం టీడీపీ రాజకీయ రంగు పులమడాన్ని ఆ పార్టీ శ్రేణులే ఛీ కొడుతున్నాయి. ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గ’న్నట్టుగా రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని సోమవారం ఫిర్యాదు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే భవాని ఫిర్యాదు ఇలా... గత డిసెంబరు 16న అసెంబ్లీలో మద్యం పాలసీపై జరిగిన చర్చలో మద్యం బ్రాండ్ల గురించి ఆమె ప్రస్తావించారు. దీనిపై హేళన చేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అదే నెల 17న స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, తనకు న్యాయం చేసి ‘దిశ’ చట్టంపై ప్రజలకు నమ్మకం కల్పించాలని రాజమహేంద్రవరంలోని ‘దిశ’ పోలీసు స్టేషన్లో డీఎస్పీ శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని సోమవారం ఫిర్యాదు చేశారు. ఇన్నాళ్లూ ఎందుకు మౌనం...? గత ఏడాది డిసెంబరు 17న అసెంబ్లీ స్పీకర్‌కు ఎమ్మెల్యే భవాని ఫిర్యాదు చేశారు. ఇన్నాళ్లూ సైబర్ పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయకుండా మౌనం వహించి ఇప్పుడు ‘దిశ’ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంలో ఔచిత్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. శనివారం దిశ పోలీసు స్టేషన్ ప్రారంభమైతే 48 గంటలు కూడా తిరగకుండానే ఇంత హఠాత్తుగా ఫిర్యాదు చేయడంలో ఆంతర్యమేమిటంటున్నారు. అసెంబ్లీలో ఈ అంశంపై ఎమ్మెల్యే ఫిర్యాదు చేసి 53 రోజులవుతోంది. ఆ చర్యలు ఏ దశలో ఉన్నాయో తెలుసుకోకుండా పార్టీ కార్యకర్తలతో దిశ పోలీసు స్టేషన్‌కు రావడమేమిటని అక్కడున్నవారే విసవిసలాడారు. మహిళా ఎమ్మెల్యేగా గైర్హాజరవుతూ... మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దిశ పోలీసు స్టేషన్‌ను తన నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నప్పుడు నియోజకవర్గ ప్రజాప్రతినిధిగానే కాకుండా ఒక మహిళా ప్రతినిధి అయి ఉండి గైర్హాజరవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోనీ ఎమ్మెల్యేను ఆహ్వానించకుండా ప్రభుత్వం ఏమైనా పార్టీ కోణంలో చూసిందా అంటే అదీ లేదు. పోలీసు శాఖ నుంచి మిగిలిన ప్రజాప్రతినిధులకు పంపించినట్టుగానే ఈ ఎమ్మెల్యేకు కూడా ఆహ్వానం పంపించినా డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదు చేస్తూ...న్యాయం జరిగేలా చూసి... దిశ చట్టంపై మహిళల్లో నమ్మకం కలిగించాలని ఎలా కోరతారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వెనుకబడ్డ రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకూ రాష్ట్ర నలుమూలల నుంచి మహిళా ప్రజాప్రతినిధులు ఈ ప్రతిష్టాత్మక సభకు హాజరయ్యారు. సమావేశానికి హాజరై చట్టంపై తన అభిప్రాయాన్ని తెలియజేసి ఉంటే మరింత హుందాగా ఉండేదంటున్నారు. రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ నాయకులు దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నారు. 53 రోజుల కిందట జరిగిన సంఘటనపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఫిర్యాదు చేశారు. ఇది అసెంబ్లీ సెక్రటేరియట్ పరిధిలో ఉంది. దీనిపై ఎలా చర్యలు తీసుకోవాలో న్యాయ సలహా తీసుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఉండవల్లి అనూష ఆరు నెలలుగా ఫేస్ బుక్‌లో అసభ్యంగా పోస్టులు పెట్టారని ఫిర్యాదు వచ్చింది. పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన మద్దుల రాజేశ్వరి 2018 డిసెంబర్ నుంచి 2019 డిసెంబర్ వరకూ పోస్టింగ్‌లు ఉన్నాయంటున్నారు. ఫేస్ బుక్‌లలో 18 అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెట్టినట్లు ఫిర్యాదు చేశారు. ఏడాది కిందట జరిగిన సంఘటనపై ఒకటి, నెల కిందట జరిగిన సంఘటనపై మరొకటి ఫిర్యాదు చేశారు. ఈ మూడు ఫిర్యాదులు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలోనివి కావు. అయినా న్యాయ సలహా తీసుకొని చర్యలు తీసుకుంటాం. జీరో ఎఫ్ఐఆర్ అనేది అత్యవసర సంఘటనలో మహిళల రక్షణ కోసం తీసుకుంటాం. మూడు సంఘటనలు ఇప్పటికిప్పుడు జరిగినవి కావు. భారత దేశం మొత్తం దిశ చట్టం కోసం అభినందిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఇలా చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు, ప్రజలు, చట్టం అమలు చేసేందుకు పోలీసులకు సహకరించాలి. – లతామాధురి, అదనపు ఎస్పీ, రాజమహేంద్రవరం. -
బీజేపీ రక్తంలోనే దేశభక్తి: అమిత్ షా
సాక్షి, రాజమండ్రి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ జాతీయధ్యక్షుడు అమిత్ షా విరుచుకుపడ్డారు. దేశ ప్రధానిపై విశ్వాసం లేదంటున్న చంద్రబాబు నాయుడు పాకిస్థాన్ ప్రధానిపై విశ్వాసం ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పుల్వామా ఉగ్రదాడిపై కొందరు బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు. నాడు మోదీ ఇమేజ్‌తోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అయిదు నియోజకవర్గాల కార్యకర్తలతో ఆయన గురువారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ...బీజేపీ రక్తంలోనే దేశభక్తి ఉందని అన్నారు. ఈ అయిదేళ్లలో దేశభద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని, అమరజవాన్లకు ఈ వేదిక నుంచి నివాళులు అర్పిస్తానని ఆయన తెలిపారు. భారత సైనికులకు బీజీపీ సర్కార్ అన్నివిధాలా అండగా ఉంటందని స్పష్టం చేశారు. ఏపీ రాష్ట్ర సాంస్కృతిక రాజధాని అయిన రాజమండ్రి రావడం సంతోషంగా ఉందని అమిత్ షా తెలిపారు. అంతకు ముందు ఆయన రాజమండ్రిలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. -
సమన్వయంతో వ్యవహరించాలి
తాడితోట (రాజమహేంద్రవరం సిటీ) : రాష్ట్రంలో 10 లక్షల పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి న్యాయవాదులు, న్యాయమూర్తులు సమన్వయంతో వ్యవహరించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథ¯ŒS అన్నారు. రాజమండ్రి బార్ అసోసియేష¯ŒSలో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యుడు, బార్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు అధ్యక్షతన శనివారం జరిగిన న్యాయవాదుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజమండ్రి బార్ అసోసియేష¯ŒS ఎంతో ప్రఖ్యాతి పొందినదని, అనేకమంది ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, కోకా సుబ్బారావువంటి ఉద్దండులు దీని నుంచే ఆవిర్భవించారని కొనియాడారు. ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా బార్ అసోసియేష¯ŒS సావనీర్‌ను జస్టిస్ రంగనాథ¯ŒSకు ముప్పాళ్ళ సుబ్బారావు అందజేశారు. అలాగే, వివిధ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఆ సమస్యలను పరిశీలించి, పరిష్కారానికి కృషి చేస్తామని జస్టిస్ రంగనాథ¯ŒS హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి తుకారామ్‌జీ, అంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ రాంబాబు, అసోసియేష¯ŒS కార్యదర్శి పీఆర్ఎస్ మిత్రా, సీనియర్ న్యాయవాదులు ఎం.శేషగిరిరావు, నండూరి సూర్యనారాయణమూర్తి, తవ్వల వీరేంద్రనాథ్, సీహెచ్‌వీ ప్రసాద్, రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. యాసిడ్ దాడులు హేయం : జిల్లా జడ్జి తుకారామ్‌జీ యాసిడ్ దాడులు అత్యంత హేయమైనవని జిల్లా జడ్జి ఎ¯ŒS.తుకారామ్‌జీ అన్నారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యాన ‘లీగల్ సర్వీసెస్ టు విక్టిమ్స్ ఆఫ్ యాసిడ్ ఎటాక్స్ స్కీమ్–2016’పై జిల్లా అధికారులకు శనివారం నిర్వహించిన శిక్షణ, అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యాసిడ్ దాడుల నిరోధంపై అందరూ అవగాహన కలిగి ఉండాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. యాసిడ్ దాడులకు ఉపయోగించే పదార్థాలను నియంత్రించాలి : కలెక్టర్ యాసిడ్ దాడులకు ఉపయోగించే పదార్థాలను నియంత్రించాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అన్నారు. ఆ పదార్థాలను బయటి వ్యక్తులకు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దాడులకు పాల్పడినవారిపై కఠినంగా వ్యవహరించాలని అన్నారు. లీగల్, టెక్నికల్ సర్వీసెస్ ఐజీ ఇ.దామోదర్ మాట్లాడుతూ, లక్ష్మీ అగర్వాల్‌పై జరిగిన యాసిడ్ దాడి యావత్ ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. యాసిడ్ దాడులు బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్, కంబోడియా తదితర దేశాల్లో జరుగుతున్నాయని తెలిపారు. బంగ్లాదేశ్‌లో చట్టం ద్వారా కఠిన చర్యలు తీసుకుంటున్నారన్నారు. అదే తరహాలో ఇతర దేశాల్లోనూ చేపట్టాలని సూచించారు. దీనిపై రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారని తెలిపారు. వాటిని పాటిస్తే చాలా వరకూ దాడులను నివారించవచ్చని అన్నారు. పిల్లలు మంచి ప్రవర్తన కలిగి ఉండేవిధంగా తల్లిదండ్రులు పెంచాలని అన్నారు. జిల్లా ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడుతూ, గడచిన పదేళ్లలో 17 యాసిడ్ దాడులకు ప్రయత్నాలు జరిగాయని, వీటిలో ఒక దాడి జరిగిందని, జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని అన్నారు. విశాఖపట్నంలోని దామోదర్ సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.శ్రీదేవి యాసిడ్ దాడుల నివారణపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి ఎల్.వెంకటేశ్వరరావు, సెక్రటరీ పీవీ రాంబాబు, రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లా ఎస్పీ బి.రాజకుమారి, వివిధ విభాగాల న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, న్యాయవాదులు, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.