Rajanth singh
-
పాక్‌కి వెళ్లి మరీ మట్టుపెడతాం: భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని భారత్ సహించబోదని.. అవసరమైతే పాకిస్థాన్ భూభాగంలోకి చొరబడి మరీ ఉగ్రవాదుల్ని మట్టుపెడుతుందని దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. బ్రిటన్ పత్రిక గార్డియన్ తాజాగా భారత్‌పై ఆరోపణలతో కూడిన ఓ కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ స్పందిస్తూ.. పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెరపాలనే భారత్ ఎప్పుడూ కోరుకుంటుంది. కానీ, ఉగ్రవాదుల చర్యలను ప్రతీసారి భారత్ ఉపేక్షించదు. భారత్‌లోకి చొరబడి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం.. ఈ దేశ ఆగ్రహం ఎలా ఉంటుందో వాళ్లు చవిచూడాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్లు(ఉగ్రవాదులు) భారత్‌లో దాడులకు పాల్పడి పాకిస్థాన్‌లోకి గనుక పారిపోతే.. వెంటాడుతాం. ఆ భూభాగంలోకి వెళ్లి మరీ మట్టుపెడతాం. మాకు(భారత సైన్యానికి) ఆ సామర్థ్యం ఉంది. అది చేసి తీరతాం కూడా. పొరుగు దేశం(పాక్) కూడా అది గుర్తిస్తే మంచిది’’ అని కేంద్ర రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్లో వరుసగా ఉగ్రవాద నేతలు చనిపోతున్నారు. అయితే వాళ్లంతా అనుమానాస్పద రీతిలో.. గుర్తు తెలియని దాడుల్లో మృతి చెందడం గమనార్హం. దీంతో.. ఇందులో ఒక ప్లాన్ ప్రకారమే ఈ హత్యలు జరుగుతున్నాయంటూ ప్రపంచవ్యాప్తంగా చర్చ సైతం నడిచింది. ఈ లోపు గార్డియన్ పత్రిక.. ‘‘విదేశాల్లోని ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్‌లో ముష్కరులను భారత ఇంటర్నేషనల్ నిఘా ఏజెన్సీ హత్యలు చేస్తోంది. ఖలిస్థానీలను కూడా టార్గెట్‌గా చేసుకుంది. మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాల్లో ముఖ్యంగా పాకిస్థాన్‌లో భారత వ్యతిరేకులుగా భావిస్తున్న వారిని హతమార్చే కొత్త ధోరణి మొదలైంది. 2020 నుంచి 2023 వరకు దాదాపు 20 మంది ఈ విధంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యలన్నీ భారత గూఢచార సంస్థ ‘రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్’ (రా) పర్యవేక్షణలో జరిగాయి. ఈ మేరకు భారత్, పాకిస్థాన్ నిఘా, గూఢచార సంస్థల అధికారులతో మా (గార్డియన్) ప్రతినిధి మాట్లాడి వివరాలు సేకరించారు’’ అని పెద్ద కథనం ప్రచురించింది ది గార్డియన్. అయితే, ఈ హత్యల్లో తమ ప్రమేయం లేదని, ఇది భారత వ్యతిరేక దుష్ప్రచారమని భారత విదేశాంగశాఖ పేర్కొన్నట్లుగా కూడా గార్డియన్ ప్రస్తావించడం గమనార్హం. -
బాలాకోట్; ‘ఎంత మంది చచ్చారో రేపటికి తెలుస్తుంది’
గువాహటి : బాలాకోట్‌లోని జైషే క్యాంపులపై భారత వైమానిక దళం జరిపిన మెరుపు దాడుల్లో ఎంత మంది ఉగ్రవాదులు చనిపోయారనే విషయంపై రేపటిలోగా స్పష్టత వచ్చే అవకాశం ఉందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అసోంలోని ధుబ్రిలో బీఎఎస్ఎఫ్ ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా బాలకోట్లో ఎంత మంతి ఉగ్రవాదులు హతమయ్యారో చెప్పాలంటూ ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ ఐఏఎఫ్ దాడుల్లో ఎంత మంది చనిపోయారో చెప్పాలని కొంత మంది నేతలు, ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు ఈరోజు లేదా రేపటిలోగా సమాధానం లభిస్తుంది. పాకిస్తాన్ నాయకుల హృదయానికి మాత్రమే ఎంత మంది ఉగ్రవాదులు హతమయ్యారనే విషయం తెలుస్తుంది. ఎంత మంది చచ్చారు అంటూ మనవాళ్లు పదే పదే అడగటం చూస్తుంటే.. మెరుపు దాడుల తర్వాత వైమానిక దళమే అక్కడికి వెళ్లి శవాలను లెక్కించాలని డిమాండ్ చేసేలా కనిపిస్తోంది’ అని ఎద్దేవా చేశారు.(దాడికి ముందు యాక్టివ్‌గా 300 మొబైల్ కనెక్షన్లు!!) అధికారిక సంస్థ చెప్పినా నమ్మరా? సర్జికల్ స్ట్రైక్స్‌కు ముందు బాలాకోట్‌లో 300 మొబైల్ కనెక్షన్లు యాక్టివ్‌గా ఉన్నాయని జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ(ఎన్టీఆర్ఓ) చెప్పిన వివరాలను ప్రస్తావించిన రాజ్‌నాథ్ సింగ్.. ‘ అధికారిక సంస్థ చెప్పినా కొంత మంది వ్యక్తులు నమ్మడం లేదు. చెట్లు కూలాయా అని ప్రశ్నిస్తున్నారు. చెట్లు మొబైల్ ఫోన్లు వాడతాయో లేదో నాకైతే తెలియదు. ఒకవేళ ఎన్టీఆర్ఓ చెబుతుంది అబద్ధం అనిపిస్తే నా కాంగ్రెస్ స్నేహితులు పాకిస్తాన్‌కు వెళ్లవచ్చు. మన వైమానిక దళం ఎంతమందిని అంతమొందించారో అక్కడి వాళ్లను అడిగి.. వారే శవాలను లెక్కించవచ్చు’ అని విమర్శలు గుప్పించారు.(300 మంది చనిపోయారా? లేక చెట్లు కూలాయా?) #WATCH Home Minister Rajnath Singh in Dhubri,Assam: Some people are asking how many were killed? India's respected and authentic NTRO surveillance system has said 300 mobile phones were active there(JeM terror camp in Balakot) when IAF jets dropped bombs pic.twitter.com/7jvploUBYK — ANI (@ANI) March 5, 2019 -
జీవితకాలం నిషేధం విధించాలి
మోదుగుల, లగడపాటిపై క్రిమినల్ కేసులు పెట్టాలని టీ ఎంపీల డిమాండ్ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణబిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకునేందుకు సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు వ్యవహరించిన తీరు దేశం పరువుతీసేలా ఉందని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ధ్వజమెత్తారు. ఎంపీలు లగడపాటి రాజగోపాల్, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిలు గాడ్సేకి ప్రతినిధుల్లా వ్యవహరించారని దుయ్యబట్టారు. వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం నిషేధం విధించాలని, ఉగ్రవాద చట్టాల కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీ బిల్లు విషయంలో బీజేపీ సీనియర్ నాయకులు అద్వానీ, సుష్మాస్వరాజ్, పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ తలోమాట చెబుతూ తెలంగాణ ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నారన్నారు. బీజేపీ ద్వంద్వ వైఖరిని మానుకుని తెలంగాణ బిల్లు ఉభయసభల్లో పాస్ అయ్యేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఢిల్లీలో ఎంపీ పొన్నం ప్రభాకర్ నివాసంలో టీ కాంగ్రెస్ ఎంపీలు గుత్తాసుఖేందర్‌రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్, సురేశ్ షెట్కార్, మధుయాష్కీగౌడ్, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తానుకూడా ఆత్మరక్షణ కోసమంటూ సభలోకి తుపాకీ తెచ్చి నలుగురిని కాల్చివేస్తే సరైన చర్య అవుతుందా? అని ఎంపీ పొన్నం ప్రశ్నించారు. లగడపాటి చర్యను లోక్‌సత్తా నేత జయప్రకాశ్‌నారాయణ, టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు ఖండించడం లేదన్నారు. లోక్‌సభలో హోంమంత్రి తెలంగాణ బిల్లు ప్రవేశపెడుతున్నట్టు స్పష్టంగా చెప్పారన్నారు. ఎవరు ఎవరిపై దాడిచేశారో లోక్‌సభ టీవీ ఫుటేజీలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల వరకు తెలంగాణ బిల్లును అడ్డుకుంటే ఇరు ప్రాంతాల్లో 20 ఎంపీ స్థానాలు గెలుచుకోవచ్చని చంద్రబాబు బీజేపీ నేతలకు చెబుతున్నారని ఎంపీ గుత్తా ఆరోపించారు. సభలో జరిగిన విషయాన్ని సీమాంధ్రకాంగ్రెస్ ఎంపీలు గోరంతను కొండంతలు చేసి చెప్పుకుంటున్నారని అంజయ్‌కుమార్ యాదవ్ దుయ్యబట్టారు. చంద్రబాబు అసలు సమన్యాయం అంటే ఏంటో చెప్పాలని సురేశ్‌షెట్కార్ అన్నారు.