rajaprasad reddy
-
ఐఎన్ఎస్ ప్రెసిడెంట్‌గా మోహిత్ జైన్
సాక్షి, న్యూఢిల్లీ: ది ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) ప్రెసిడెంట్‌గా ఎకనమిక్ టైమ్స్‌కు చెందిన మోహిత్ జైన్ ఎన్నికయ్యారు. ఐఎన్ఎస్ డిప్యూటీ ప్రెసిడెంట్‌గా ‘సాక్షి’ దినపత్రిక అడ్వర్టయిజింగ్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ కె.రాజప్రసాద్ రెడ్డి ఎన్నికయ్యారు. శుక్రవారం వర్చువల్ విధానంలో జరిగిన సొసైటీ 82వ వార్షిక సాధారణ సమావేశంలో 2021–22 సంవత్సరానికి ఐఎన్ఎస్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా కొనసాగిన ‘హెల్త్ అండ్ యాంటిసెప్టిక్’కు చెందిన ఎల్.ఆదిమూలం నుంచి మోహిత్ జైన్ బాధ్యతలు స్వీకరించారు. రాకేష్ శర్మ (ఆజ్ సమాజ్)ను వైస్ ప్రెసిడెంట్‌గా, తన్మయ్ మహేశ్వరి (అమర్ ఉజాలా)ని గౌరవ కోశాధికారిగా ఎన్నుకున్నట్లు సొసైటీ సెక్రటరీ జనరల్ మేరీ పాల్ తెలిపారు. కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా ఎన్నికైన 41 మందిలో ‘అన్నదాత’.. ఐ. వెంకట్ ఉన్నారు. -
ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా సోమేశ్ శర్మ
బెంగళూరు: భారత వార్తాపత్రికల సంఘం(ఐఎన్ఎస్) ప్రెసిడెంట్‌గా సోమేశ్ శర్మ (రాష్ట్రదూత్ సప్తాహిక్) ఎన్నికయ్యారు. శుక్రవారం బెంగళూరులో జరిగిన 77వ వార్షిక సమావేశంలో 2016–17కు గాను ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. డిప్యూటీ ప్రెసిండెంట్‌గా అల్కా ఉరంకార్(బిజినెస్ స్టాండర్డ్), వైస్ ప్రెసిడెంట్‌గా కె.బాలాజీ(ది హిందూ) ఎన్నికయ్యారు. గౌరవ కోశాధికారిగా శరద్ సక్సేనా ( హిందుస్ధాన్ టైమ్స్) ఎన్నికయ్యారు. సొసైటీ సెక్రటరీ జనరల్ గా వి. శంకరన్ వ్యవహరిస్తారు. కార్యవర్గ సభ్యుడిగా ‘సాక్షి’ తెలుగు దినపత్రిక కు చెందిన కె. రాజప్రసాద్ రెడ్డి ఎన్నికయ్యారు. అలాగే సిహెచ్.కిరణ్ ( విపుల,అన్నదాత) కార్యవర్గ సభ్యుడిగా ఎన్నిక అయ్యారు. కాగా ఇప్పటివరకు పీవీ చంద్రన్ (గృహలక్ష్మి–మాతృభూమి గ్రూప్) ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు.