Rajasthan Man
-
Rajasthan: జైసల్మేర్‌లో పాక్ గూఢచారి అరెస్ట్
పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్నట్లు ఆరోపణలపై 40 ఏళ్ల జైసల్మేర్ నివాసి పఠాన్ ఖాన్‌ను రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అరెస్ట్ చేసింది. భారత సైన్యం కదలికల సమాచారం పంపినట్లు విచారణలో తేలింది. జైసల్మేర్.. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉండటం వల్ల గూఢచర్యకు కేంద్రంగా మారిందని అధికారులు గుర్తించారు.2022లో ఆపరేషన్ సర్హద్‌లో 36 మంది అనుమానిత గూఢచారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఐఎస్ఐ.. భారత సైనిక కార్యకలాపాల సమాచారం సేకరించేందుకు పదేపదే ప్రయత్నిస్తోందని గుర్తించారు. భారత దేశ జాతీయ భద్రతను దెబ్బతీసేందుకు గూఢచర్యం పాకిస్తాన్‌కు ఒక సాధనంగా మారింది. భారత్-పాకిస్థాన్‌ల భౌగోళిక-రాజకీయ పోరాటంలో భాగంగా ఈ సంఘటనలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. -
రేబిస్‌తో ఉన్మాదిగా మారి చంపి తిన్నాడు!
జైపూర్: రాజస్తాన్‌లో ఒళ్లు జలదరించే ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఉన్మాదిగా మారిన ఓ వ్యక్తి వృద్ధురాలిని చంపి, ఆమె మాంసం తిన్నాడు. ముంబైలో ఉండే సురేంద్ర ఠాకూర్(24) ఇటీవలే తన సొంత పాలి జిల్లా సెండ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని సరధనా గ్రామానికి వచ్చాడు. పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్న అతడు శుక్రవారం పొలంలో పశువులు మేపుకుంటూ ఉన్న శాంతిదేవి(65)ని బండరాయితో మోది చంపేశాడు. అనంతరం ఆమె మాంసం తిన్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు అతడిని అతికష్టమ్మీద పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హత్య, నరమాంసభక్షణ నేరం కింద పోలీసులు కేసు పెట్టారు. ఠాకూర్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. రేబిస్ వ్యాధి(హైడ్రోఫోబియా) బాధితుల్లో వ్యాధి ముదిరితే చివరి దశలో ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయని వైద్యులు తెలిపారు. -
కొండ చిలువతో సెల్ఫీ తీసుకోబోతే..
-
కొండ చిలువతో సెల్ఫీ తీసుకోబోతే..
సెల్ఫీ పిచ్చి ఓ యువకుడి ప్రాణంమీదకు తెచ్చింది. అదృష్టవశాత్తూ కొద్దిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రాజస్థాన్‌లోని మౌంట్ అబు జిల్లా సిరోహిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కొండచిలువ కనిపించింది. ఆస్పత్రి సిబ్బంది సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. అధికారులు కొండచిలువను జాగ్రత్తగా పట్టుకున్నారు. అధికారులు కొండ చిలువను తీసుకెళ్తుండగా ఓ యువకుడు అక్కడికి వచ్చాడు. ఈ దృశ్యాన్ని సెల్ ఫోన్ కెమెరాలో బందిస్తూ, సెల్ఫీ తీసుకోవాలని ఉత్సాహపడ్డాడు. ఆ యువకుడు కొండ చిలువను పట్టుకున్న అధికారుల పక్కన నిలబడి సెల్పీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. కొండ చిలువ తల పక్కనే అతను నిలబడ్డాడు. ఇంతలో ఎవరూ ఊహించనివిధంగా కొండచిలువ అతణ్ని కాటేసేందుకు దాడి చేసింది. ఆ యువకుడు కొద్దిలో దాని బారినుంచి తప్పించుకున్నాడు.