Rajat sharma
-
‘ఆ రాజీనామా ఇంకా ఆమోదించలేదు’
న్యూఢిల్లీ: ఢిల్లీ, డిస్ట్రిక్ట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్ష పదవికి సీనియర్ జర్నలిస్టు రజత్ శర్మ ఉన్నపళంగా రాజీనామా చేయడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. అయితే రజత్ శర్మ రాజీనామాను తాము ఇంకా ఆమోదించలేదని డీడీసీఏ డైరెక్టర్ ఆర్పీసింగ్ స్పష్టం చేశారు. రజత్ శర్మ రాజీనామాను తాము వెంటనే ఆమోదించేసినట్లు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఇంకా ఆయన రాజీనామా అంశం చర్చల దశలోనే ఉందన్నారు. రజత్ రాజీనామాపై అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. డీడీసీఏలో అధిక ఒత్తిళ్లు ఎదురవుతున్న కారణంగానే రాజీనామా చేసినట్లు శనివారం తన పదవికి గుడ్‌బై చెప్పిన తర్వాత రజత్ శర్మ తెలిపారు. కొంత మంది క్రికెట్ సమగ్ర అభివృద్ది కోసం కాకుండా స్వార్థ పూరిత విధానాలకు పాల్పడుతున్నారన్నారు. డీడీసీఏలో తారాస్థాయిలో అంతర్యుద్దం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక గత కొద్ది రోజులుగా ముఖ్య కార్యదర్శి వినోద్ తిహారాతో రజత్ శర్మకు పొసగటం లేదు. అరుణ్ జైట్లీ మరణం తర్వాత డీడీసీఏ సభ్యుల మధ్య బేదాభిప్రాయాలు రావడం అంతేకాకుండా రజత్ శర్మపై అన్ని వైపులా ఒత్తిడి పెరిగిపోయింది. ముఖ్యంగా తమ నిర్ణయాలకు అధ్యక్షుడు వ్యతిరేకించడంతో సంఘం సభ్యులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. -
‘రాజీ పడలేక రాజీనామా చేస్తున్నా’
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ, డిస్ట్రిక్ట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్ష పదవికి సీనియర్ జర్నలిస్టు రజత్ శర్మ రాజీనామా చేశారు. అతడి రాజీనామాను డీడీసీఏ సీఈఓ, సీఏసీ కొన్ని గంటల వ్యవధిలోనే ఆమోదముద్ర వేయడం గమనార్హం. దీంతో డీడీసీఏలో తారాస్థాయిలో అంతర్యుద్దం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక గత కొద్ది రోజులుగా ముఖ్య కార్యదర్శి వినోద్ తిహారాతో రజత్ శర్మకు పొసగటం లేదు. అరుణ్ జైట్లీ మరణం తర్వాత డీడీసీఏ సభ్యుల మధ్య బేదాభిప్రాయాలు రావడం అంతేకాకుండా రజత్ శర్మపై అన్ని వైపులా ఒత్తిడి పెరిగిపోయింది. ముఖ్యంగా తమ నిర్ణయాలకు అధ్యక్షుడు వ్యతిరేకించడంతో సంఘం సభ్యులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఇక రజత్ శర్మ రాజీనామా తర్వాత సెలక్షన్ కమిటీ చైర్మన్ అతుల్ వాసన్, కోచ్ కేపీ భాస్కర్ల భవిత్యం ప్రశ్నార్థకంగా మారింది. ‘డీడీసీఏలో అధిక ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. కొంత మంది క్రికెట్ సమగ్ర అభివృద్ది కోసం కాకుండా స్వార్థ పూరిత విధానాలకు పాల్పడుతున్నారు. డీడీసీఏ సమగ్రతను కాపాడుతూ నిజాయితీ, పారదర్శకంగా పనిచేయాలని భావించాను. కానీ డీడీసీఏ అలా ఉండటం సాధ్యపడటం లేదు. అయితే ఆ విషయాల్లో నేను రాజీ పడే ప్రసక్తే లేదు. దీంతో రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నాను’ అని రజత్ శర్మ పేర్కొన్నారు. ఇక రజత్ రాజీనామా అనంతరం వినోద్ తిహారా అధ్యక్షపదవి రేసులో ఉన్నట్లు సమాచారం. అయితే బోర్డు ప్రవర్తనా నియమవాళిని ఉల్లఘించిన నేపథ్యంలో తిహారా సస్పెండ్‌కు గురైన విషయం తెలిసిందే. రజత్ రాజీనామాతో తిహారా సస్పెన్షన్‌పై డిసెంబర్ 1న జరిగే బీసీసీఐ వార్షిక సమావేశంలో పునరాలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
మో‘ఢీ’కి సిద్ధంగానే ఉన్నాం!
* కాశ్మీర్ అంశంపై మోడీ కఠిన వైఖరి అవలంబించాలనుకుంటున్నారు * మేమూ సిద్ధంగానే ఉన్నాం.. ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం * జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు న్యూఢిల్లీ: కాశ్మీర్ సమస్యకు సంబంధించి ప్రధానమంత్రి మోడీ కఠిన వైఖరి అవలంబించాలని నిర్ణయించుకున్నారని.. అయితే, అందుకు తాము సిద్ధంగానే ఉన్నామని జమ్మూ, కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్ఎఫ్) అధినేత యాసిన్ మాలిక్ శనివారం స్పష్టం చేశారు. ‘భారతదేశ ప్రజలు మోడీని ప్రధానిగా ఎన్నుకున్నారు. ఆయన ఇప్పుడు కఠినంగా, మొండిగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. కాశ్మీరీలమైన మేం అందుకు సిద్ధంగానే ఉన్నాం. మా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాం. మోడీ వచ్చాడు.. మాకిప్పుడు పరీక్షా కాలం.. కష్టమైన రోజులు. అయినా, దేవుడి దయతో ఈ పరీక్షలో పాస్ అవుతాం’ అన్నారు. మోడీకి మేమిచ్చే సందేశం ఒకటే.. మీరు సుపరిపాలన ఇస్తారు కావచ్చు.. కానీ కఠిన వైఖరి అవలంబించి ఒక ఉద్యమాన్ని అంతం చేయలేరు’ అని స్పష్టం చేశారు. హిందీ వార్తాచానల్ ఇండియా టీవీలో రజత్ శర్మ వ్యాఖ్యాతగా వ్యవహరించే టీవీ షో ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో యాసిన్ మాలిక్ పాల్గొన్నారు. తమ వల్లనే భారత్, పాక్‌ల మధ్య విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి చర్చలు రద్దు అయ్యాయన్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. అన్ని సంబంధిత వర్గాలు చర్చల్లో పాల్గొనాలని తాము కోరుకుంటున్నామన్నారు. పాక్‌తో చర్చల సందర్భంగా శాంతిపూర్వక వాతావరణం ఏర్పడటం కోసం కాశ్మీర్ వేర్పాటువాద నేతలు పాకిస్థాన్ వెళ్లేందుకు 2000 సంవత్సరంలో అప్పటి ప్రధాని వాజ్‌పేయి అనుమతించిన విషయాన్ని మాలిక్ గుర్తు చేశారు. భారత్, పాకిస్థాన్‌లు మాత్రమే కూర్చుని చర్చలు జరపడానికి కాశ్మీర్ అంశం అనేది సరిహద్దు సమస్య కాదని మాలిక్ తేల్చి చెప్పారు. కాశ్మీర్ భవిష్యత్తును నిర్ణయించే ఏ చర్చల్లోనైనా కాశ్మీరీలను భాగస్వాములను చేయాలని డిమాండ్ చేశారు. మిలిటెంట్ల వద్దకు వెళ్లాలని మన్మోహన్ కోరారు పాకిస్థాన్‌లోని మిలిటెంట్లతో సంప్రదించాల్సిందిగా 2006లో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ తనను కోరారని మాలిక్ చెప్పారు. పాక్‌తో శాంతి ప్రక్రియ ఫలప్రదమయ్యేందుకు అది తోడ్పడుతుందని మన్మోహన్ భావించారన్నారు. మన్మోహన్ సింగ్‌తో సమావేశమైనప్పుడు శాంతి చర్చల్లో తమనూ భాగస్వాము లను చేయాలని తాను కోరిన సందర్భంలో ఆయన పై విధంగా స్పందించారని ఆయన వివరించారు. -
అతడిది తిరుగులేని న్యాయ స్థానం!
ఇంటర్వ్యూ చేయడం ఓ కళ. ఆ కళలో ఆరితేరినవారు రజత్శర్మ. ‘ఆప్కీ అదాలత్’ పేరుతో ఇండియా టీవీలో రజత్శర్మ నిర్వహించే ఇంటర్వ్యూలు సంచలనాలు సృష్టించాయి. ఇరవయ్యేళ్లుగా ఈ షోని నడిపిస్తున్నారు రజత్. దాదాపు ఎనిమిది వందల మంది గొప్ప గొప్ప పర్సనాలిటీస్‌ని తన న్యాయస్థానంలో నిలబెట్టారు. రజత్ వ్యక్తిత్వం గురించి చెప్పమంటే నిజాయతీపరుడు అంటారు ఎవరైనా. ఆయన పనితనం గురించి చెప్పమంటే పట్టు వదలని విక్రమార్కుడు అంటారు. నిజమే, ఆ పట్టు వదలని గుణమే పేదరికంలో పుట్టి పెరిగిన రజత్ని ఈ స్థాయికి చేర్చింది. చిన్నప్పుడు టీవీ చూడ్డానికి పక్కింటికి వెళ్తే, వాళ్లు తలుపు వేసేశారట. బాధపడి ఏడుస్తున్న రజత్తో ఆయన తండ్రి... ‘‘ఈరోజు వాళ్లు నిన్ను టీవీ చూడనివ్వలేదని ఏడవొద్దు. ఏదో ఒకరోజు వాళ్లు నిన్ను టీవీలో చూసేటంత గొప్పవాడిగా ఎదుగు’’ అన్నారట. ఆ మాటే తననింతవాణ్ని చేసిందంటారు రజత్! హుందాయైన స్ఫురద్రూపం, తొణకని స్వరం, సూటిగా మనసులోకి దూసుకెళ్లి లోపలి రహస్యాల్ని బయటకు లాగేంత తీక్షణంగా ఉండే చూపులతో ఉంటారు రజత్. ఆయన ఎప్పుడు ఏ ప్రశ్న అడుగుతారోనని ఇంటర్వ్యూ ఇచ్చే సెలెబ్రిటీ గుండెలు అదురుతూ ఉంటాయి. ఏ ప్రశ్న అడగడానికీ వెరవరు. ఎందుకంటే... ప్రజల మనసుల్లో సందేహాలనే ప్రశ్నలుగా చేసి అడుగుతారా యన. తనకు కావలసిన సమాధానం వచ్చేవరకూ తృప్తి పడరు. చెప్పకుండా అవతలి వ్యక్తిని తప్పించుకోనివ్వరు. అందుకే ఆయన న్యాయస్థానంలో నిలబడిన ప్రతివ్యక్తీ తన అంతరంగాన్ని పూర్తిగా ఆవిష్కరించి తీరతాడు. రహస్యాలను సైతం బట్టబయలు చేస్తాడు. అందుకే మరి... రజత్శర్మలా ఎవరూ ఇంటర్వ్యూ చేయలేరని భారతీయ మీడియాలో చెప్పుకుంటారు. అది నిజమేనని ‘ఆప్కీ అదాలత్’ చూసినవాళ్లంతా ఒప్పుకుని తీరతారు!