Rajeev gandhi murder case
-
సుప్రీం కోర్టుని ఆశ్రయించిన నళిని
న్యూఢిల్లీ: రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషి నళిని తనను విడుదల చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇదే కేసుల దోషిగా ఉన్న ఏజీ పేరారివాలన్ విడుల చేయాలని సుప్రీం కోర్టు ఆశ్రయించిన నెలరోజుల తర్వాత నళిని తనకు కూడా ఈ కేసు నుంచి ఉపశమనం కావాలంటు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు. ఈ మేరుకు మే 18న పెరారివాలన్‌కి సుప్రీం కోర్టు విడుదల మంజూరు చేయడంతో ఈ కేసు నుంచి కాస్త ఉపశమనం పొందాడు. దీంతో ఇదే హత్య కేసులో నిందితులుగా ఉన్న నళిని, రవిచంద్రన్‌లు తమకు కూడా ఉపశమనం కావాలంటూ సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు. పైగా నళిని 31 ఏళ్లు పైగా జైలు జీవితాన్ని అనుభవించానని కాబట్లి ఇక తనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ పిటిషన్ పెట్టుకున్నారు. ఐతే 2015 నుంచి తమిళనాడు గవర్నర్ వద్దే పెండింగ్‌లో ఉంది. ఈ మేరకు నళిని తరుపు న్యాయవాది మాట్లాడుతూ...నళిని తనను విడుదల చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో తాము దీన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్ల పేర్కొన్నారు. పైగా 2018లోనే తమిళనాడు మంత్రి మండలి రాజీవ్ గాంధీ కేసులో దోషులను విడుదల చేయాలని గవర్నర్‌కి సిఫార్సు చేసిందని చెప్పారు. కానీ గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా ఆ సిఫార్సును రాష్ట్రపతికి పంపించారని అన్నారు. ఐతే పెరారివాలన్‌కి సుప్రీం కోర్టు విడుదల మంజూరు చేసినప్పడూ నళిని, రవిచంద్రన్‌లు కూడా అతని తోపాటు సమానంగా ఈ కేసు నుంచి ఉపశమనం ఇవ్వాలని నళిని తరుఫు న్యాయవాది అన్నారు. వాస్తవానికి ఇదే కేసులోని మిగిలిన దోషులు నళిని, మురుగన్, సంతన్, రవిచంద్రన్, జయకుమార్, రాబర్ట్ పాయస్ల కేసును పరిశీలిస్తామని తమిళనాడు ప్రభుత్వం మే నెలలో పేర్కొంది. కానీ ఇంతవరకు ఆ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి, నళిని, రవిచంద్రన్‌లు మాత్రమే విడుదల కోసం సుప్రీం కోర్టుకి విజ్ఞప్తి చేసుకున్నారు. అయితే పెరారివాలన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ పై నిర్ణయం తీసుకోవడంలో గవర్నర్ ఆలస్యం చేయడంతో సుప్రీం కోర్టు అతని కేసుని పరిగణలోకి తీసుకుంది. పైగా మంత్రిమండలి సిఫార్సుకి కట్టుబడి ఉంటామంటూ, ఆర్టికల్ 142 కింద ప్రత్యేక అధికారాన్ని వినియోగించి ధర్మాసనం పెరారివాలన్‌ని విడుదల చేసింది కాని ఇదే విధానం మిగతా దోషులకు వర్తించకపోవచ్చు. (చదవండి: నళినికి నెల రోజుల పెరోల్) -
నళినికి నెల రోజుల పెరోల్
సాక్షి, చెన్నై: రాజీవ్‌హత్య కేసులో దోషి నళినికి నెల రోజులు పెరోల్ మంజూరైంది. ఈ కేసులో యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న ఏడుగురిలో నళిని ఒకరు. వీరిని ముందస్తుగా విడుదల చేయాలని తమిళనాడు కేబినెట్ 2018లో గవర్నర్‌కు సిఫారసు చేసినా రాజ్‌భవన్ నుంచి నిర్ణయం వెలువడలేదు. దాంతో గవర్నర్ అనుమతి లేకుండా తనను ముందస్తుగా విడుదల చేయాలని నళిని తదితరులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. అవి ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నళిని తరఫున తల్లి పద్మ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఆరోగ్యం సరిగాలేదని, ఈ దశలో కూతురు తనతో ఉండాలని కోరుకుంటున్నానని, పెరోల్ మంజూరు చేయాలని హైకోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ గురువారం న్యాయమూర్తులు వీఎన్ ప్రకాష్, ఆర్. హేమలత బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. నళినికి నెల రోజులు పెరోల్ ఇవ్వడానికి తమిళనాడు సర్కారు నిర్ణయించినట్టు ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నళినికి పెరోల్ మంజూరైంది. -
Tamil Nadu: ‘ఆ ఏడుగురి విడుదలకు వ్యతిరేకం’
సాక్షి ప్రతినిధి, చెన్నై : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురికి క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రపతికి లేఖ రాయడం తమకు ఎంత మాత్రం ఆ మోదం కాదని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్షుడు కేఎస్ అళగిరి తెలిపారు. నేరస్తులకు శిక్ష వేయడం న్యాయస్థానాల పరిధిలోని వ్యవహారమని, ఇందులో రాజకీయ జోక్యం, వత్తిళ్లు తగదని పేర్కొన్నారు. జైళ్లలో ఏడుగురే కాదు.. వందమందికి పైగా తమిళులు ఉన్నారని వ్యాఖ్యానించారు. 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న రాజీవ్‌గాంధీ హంతకులను విడుదల చేయాలని కోరుతూ 2018లో రాష్ట్ర మంత్రి మండలి చేసిన తీర్మానాన్ని పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రపతికి ఈనెల 20వ తేదీన లేఖ రాసిన విషయం తెలిసిందే. రాజీవ్‌గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం చెన్నై సైదాపేటలోని ఆయన నిలువెత్తు విగ్రహానికి టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి తదితర కాంగ్రెస్ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతికి రాసిన లేఖపై స్పందించారు. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే 21వ శతాబ్దాన్ని పురస్కరించుకుని అనేక పథకాలు అమలుచేశారని తెలిపారు. అవి యువతకు ఎంతో ఉపకరించాయన్నారు. సమాచార వ్యవస్థ సైతం కొంతపుంతలు తొక్కిందని పేర్కొన్నారు. నేడు ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఫోన్లు ఉన్నాయంటే రాజీవ్‌గాంధీ తీసుకున్న నిర్ణయాలే కారణమని వివరించారు. పారిశ్రామిక రంగాన్ని సైతం పరుగులు పెట్టించి తమిళుల అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. అలాంటి నేతను హత్య చేసిన ఏడుగురు తమిళ ఖైదీలను విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతికి లేఖ రాయడం తమకు సమ్మతం కాదన్నారు. రాష్ట్రంలోని జైళ్లలో వంద మందికి పైగా తమిళ ఖైదీలు 20 ఏళ్లకు పైగా శిక్ష అనుభవిస్తున్నారని తెలిపారు. తమిళులు అనే భావనతో ఏడుగురిని మాత్రమే విడుదల చేయాలని కోరడం సబబుకాదన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏడుగురు తమిళుల విడుదల అంశాన్ని డీఎంకే తన మేనిపెస్టోలో పొందుపరిచిందని, ఆ విషయౖమై డీఎంకేను కాంగ్రెస్ ఎలాంటి వత్తిడి చేయలేదని ఆయన వివరించారు. చదవండి: రాజీవ్ హత్య కేసులో దోషులను విడుదల చేయండి: సీఎం స్టాలిన్ -
ఇంకెంత కాలం జాప్యం..!
సాక్షి, చెన్నై: ఇంకెంత కాలం జాప్యం చేస్తారు..? తీర్మానంపై నిర్ణయం వెలువడేదెప్పుడో? అని రాజీవ్ హత్యకేసు నిందితుల విడుదల వ్యవహారంలో రాజ్‌భవన్ తీరుపై మద్రాసు హైకోర్టు అసంతప్తిని వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ తీర్మానంపై ఎలాంటి నిర్ణయం అన్నది తీసుకోకుండా రాష్ట్రగవర్నర్ చేస్తున్న జాప్యంపై హైకోర్టు బుధవారం స్పందించడం గమనార్హం. రాజీవ్ హత్యకేసులో నిందితులుగా ఉన్న నళిని, మురుగన్, శాంతన్, పేరరివాలన్‌తో సహా ఏడుగురి ఉరి శిక్ష యావజ్జీవంగా మారిన విషయం తెలిసిందే. ఆ శిక్షా కాలం ముగిసినా తాము జైలుకే పరిమితం కావడంతో విడుదల చేయాలని కోరుతూ నింథితులు కోర్టుల్ని ఆశ్రయిస్తూ వస్తున్నా ఫలితం శూన్యం. వీరి విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసినా, అది రాజ్ భవన్‌కే పరిమితం అయింది. దీంతో తమను విడుదల చేసే రీతిలో గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వాలని మళ్లీ కోర్టు తలుపులు తట్టినా ప్రయోజనం శూన్యం. చివరకు బంతి రాజ్ భవన్ కోర్టులో పడింది. ఈ వ్యవహారంలో గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ ఇచ్చే నివేదిక మీద విడుదల ఆధార పడి ఉన్నది. అదే సమయంలో శిక్షాకాలం ముగిసినా, జైలులోనే జీవితాలు మగ్గుతున్నాయంటూ నళిని దాఖలు చేసుకున్న పిటిషన్ విచారణ సమయంలో అదనపు సొలిసిటర్ జనరల్ రాజగోపాల్ కోర్టుకు ఇచ్చిన వివరణ సర్వత్రా షాక్‌కు గురి చేసింది. తమిళనాడు ప్రభుత్వ తీర్మానాన్ని కేంద్రం ఎప్పుడో తిరస్కరించినట్టు వివరిస్తూ, దీని విలువను ‘సున్న’ గా పరిగణించాలని వాదించడం చర్చకు దారి తీసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమ తీర్మానం గురించి నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌కు పలు మార్లు సిఫారసు చేస్తూ వస్తున్నా, స్పందన అన్నది కరువే. ఈ తీర్మానం చేసి రెండేళ్లు కావస్తున్నా, ఇంత వరకు రాజ్ భవన్ నుంచి తీర్మానం ఆమోదం లేదా తిరస్కరణ అన్న నిర్ణయం కూడా వెలువడ లేదు. మనస్తానికి లోనైన నళిని జైలులో ఆత్మహత్యాయత్నం కూడా చేయక తప్పలేదు. ఈ పరిస్థితుల్లో జాప్యంపై హైకోర్టు సైతం అసంతప్తిని వ్యక్తం చేయడం గమనార్హం. జాప్యంపై అసంతప్తి.. రాజీవ్ కేసు నిందితుల్లో ఒకడైన పేరరివాలన్‌కు 90 రోజులు పరోల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తల్లి అర్బుదమ్మాల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ బుధవారం న్యాయమూర్తులు కపాకరణ్, వేలుమణి బెంచ్‌ముందు విచారణకు వచ్చింది. ఇప్పటికే 2017, 2019లో పేరరివాలన్‌కు పెరల్ మంజూరు చేసి ఉన్నట్టు, ప్రస్తుతం చేసుకున్న విజ్ఞప్తి పరిశీలనలో ఉన్నట్టు ప్రభుత్వం తరపున వాదన కోర్టుకు చేరింది. ఈసందర్భంగా న్యాయమూర్తులు స్పందిస్తూ, రాజీవ్ కేసు నింథితుల విడుదల తీర్మానం ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ తీర్మానం మీద నిర్ణయంలో జాప్యం ఎందుకో అని ప్రశ్నించారు. ఇంకెంత కాలం జాప్యం చేస్తారోనని పేర్కొంటూ, అసంతప్తిని న్యాయమూర్తులు వ్యక్తం చేశారు. ఈ తీర్మానం మీద ఎలాంటి నిర్ణయం అన్నది తీసుకోకుండా తుంగలో తొక్కి పెట్టి ఉండటం మీద అసహనం వ్యక్తంచేస్తున్నట్టు పేర్కొన్నారు.ప్రభుత్వం, మంత్రి వర్గం తీర్మానం మీద ఏదో ఒక నిర్ణయం ప్రకటించడంలో ఇంకెంత కాలం జాప్యం చేస్తారో? అని ప్రశ్నించారు. రాజకీయ శాసనాల మేరకు కీలక పదవిలో ఉన్న వారి మీద ఉన్న నమ్మకంతో నిర్ణయానికి గడువు అన్నది విధించ లేదని, దీనిని ఆసరగా చేసుకుని జాప్యం చేయడం శోచనీయమని అసంతప్తిని వ్యక్తం చేశారు. ఆ తీర్మానం ఎంత వరకు వచ్చిందో అన్న అంశంతో పాటుగా పెరోల్ విషయంగా వారంలోపు వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 29వ తేదికి వాయిదా వేశారు. కాగా, హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వ తీర్మానం ఆమోదం లేదా, తిరస్కరణ విషయంలో గవర్నర్ స్పందించేనా, రాజ్ భవన్ నుంచి ఎలాంటి నిర్ణయం వచ్చేనో అన్న ఎదురు చూపులు పెరిగాయి. -
రాజీవ్ హంతకురాలు నళినికి పెరోల్
సాక్షి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని శ్రీహరన్‌కి మద్రాస్ హైకోర్టు 30 రోజుల పెరోల్ మంజూరు చేసింది. గత 28 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న నళిని, సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపిన మహిళగా కూడా గుర్తింపు పొందారు. తన కూమార్తె వివాహానికి ఆరు నెలలు పెరోల్ కావాలని, తాను స్వయంగా వాదించుకుంటానని మద్రాస్ హైకోర్టును ఆమె ఏప్రిల్‌లో కోరింది. కోర్టు అనుమతి మేరకు కోర్టులో స్వయంగా వాదనలు వినిపించింది. అయితే నళినికి ఆరు నెలలు ఇవ్వలేమనీ, ఇతర సాధారణ ఖైదీల్లాగే 30 రోజుల పెరోల్‌ను కోర్టు మంజూరు చేసింది. 1991, మే నెలలో ఎన్నికల ప్రచారం నిమిత్తం వైజాగ్ నుంచి తమిళనాడులోని శ్రీ పెరుంబుదూర్‌కి వెళ్లిన ఆనాటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ ఆత్మాహుతి దళ సభ్యులు బాంబు పేల్చి హతమార్చారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేయగా, అందులో నళిని ఒకరు. -
సవాల్
సుప్రీం కోర్టులో రాష్ర్ట ప్రభుత్వం రిట్ ఆ ఏడుగురి విడుదలకు వినతి కేంద్రం అనుమతి అవసరం లేదు రాజీవ్ హత్య కేసు వ్యవహారంలో జయ సర్కారు సాక్షి, చెన్నై: రాజీవ్ హత్య కేసు నిందితుల విడుదల వ్యవహారంలో కేంద్రం పిటిషన్‌ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో మంగళవారం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. తాము తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకునే అధికారం కేంద్రానికి లేదని ఆ పిటిషన్లో వివరించారు. సంప్రదాయం మేరకు గౌరవ సూచకంగా వారికి తెలియజేయాల్సిన అవసరం మాత్రమే ఉందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును విన్నవించారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో పేరరివాలన్, శాంతన్, మురుగన్ ఉరి శిక్ష , నళిని, రాబర్ట్, రవి, జయకుమార్ యావజ్జీవ శిక్ష ఎదుర్కొంటూ వచ్చిన విషయం తెలిసిందే. క్షమాభిక్షల పిటిషన్లలో జాప్యంతో సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం మేరకు ఇటీవల సంచలనాత్మక తీర్పు వెలువడింది. ఉరి శిక్షను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో శాంతన్, పేరరివాలన్, మురుగన్‌కు విముక్తి కలిగినట్టు అయింది. అదే సమయంలో ఏళ్ల తరబడి వేలూరు జైల్లో మగ్గుతూ వస్తున్న నింధితులకు స్వేచ్చాయుత జీవితాన్ని ప్రసాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉరి శిక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన సుప్రీం కోర్టు విడుదల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ కోర్టులోకి నెట్టడం ఓ వరంగా మారింది. రానున్న లోక్‌సభ ఎన్నికలను అస్త్రంగా చేసుకుని తమిళాభిమానాన్ని చూరగొనే రీతిలో ఆ ఏడుగురిని విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నివేదికను కేంద్రం దృష్టికి పంపింది. పిటిషన్లు : రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కేంద్రం మోకాలొడ్డింది. ప్రభుత్వ నివేదికకు సమాధానం ఇవ్వకుండా, ఏకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఆ ఏడుగురిని విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ వాదన విన్పించడంతో విడుదలకు బ్రేక్ పడింది. సుప్రీం కోర్టు స్టే కారణంగా ఆ ఏడుగురు జైళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ఆందోళనలు మొదలయ్యూయి. దీన్ని తనకు అనుకూలంగా మలచుకోవడంతో పాటుగా కేంద్రంతో ఢీ కొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయింది. కేంద్రం పిటిషన్‌ను సవాల్ చేస్తూ మంగళవారం ఉదయం సుప్రీం కోర్టులో రిట్పిటిషన్ను రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసింది. రిట్ పిటిషన్: రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సుబ్రమణ్య ప్రసాద్ సుప్రీం కోర్టులో ఈ రిట్‌పిటిషన్ దాఖలు చేశారు. ఉరి శిక్షను రద్దు చేసిన సుప్రీం కోర్టు, విడుదల అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిందని గుర్తు చేశారు. ఆ మేరకు ఆ ఏడుగురి విడుదలకు తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. తమ నిర్ణయాన్ని పరిశీలించి వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారని వివరించారు. తమ నివేదికకు వివరణ ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం, ఆ విషయాన్ని మరచి నేరుగా కోర్టును ఆశ్రయించిందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ ఏడుగురిని విడుదల చేసే అధికారం తమిళనాడు ప్రభుత్వానికి ఉందని, కేంద్రంతో సంప్రదాయ బద్ధంగా, గౌరవ సూచకంగా మాత్రమే వివరణ కోరాల్సి ఉందన్నారు. ఆ ఏడుగురిని విడుదల చే యడానికి లేదా బంధించడానికి కేంద్రానికి ఎలాంటి అధికారాలు లేవని వివరించారు. భార త రాజ్యంగంలోని సెక్షన్ 432, 432ఎ ప్రకారం వారిని విడుదల చేసే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. చట్ట నిబంధనలకు లోబడి వారిని విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటే, కోర్టు ద్వారా దాన్ని అడ్డుకునేందుకు కేంద్రం ప్రయత్నించడం విచారకరంగా పేర్కొన్నారు. కేంద్రం తీరును తాము అంగీకరించబోమని, వారు దాఖలు చేసిన పిటిషన్ విచారణ యోగ్యం కాదని, దానిని తోసి పుచ్చాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రిట్ దాఖలు చేయడంతో ఈలం మద్దతు తమిళ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి సదాశివం నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన మొదటి బెంచ్ గురువారం విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ విచారణ అదే రోజు జరుగనుండడంతో, రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను అదే రోజు విచారణకు సుప్రీం కోర్టు ప్రధాన బెంచ్ స్వీకరించబోతున్నదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. వినతి: ఇక రాష్ట్రంలోని జైళ్లల్లో మగ్గుతున్న మైనారిటీలను విడుదల చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఉదయం ఇండియ దేశీయ లీగ్ నేతృత్వంలో ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున సచివాలయూనికి తరలి వచ్చారు. సీఎం జయలలితకు వినతి పత్రం సమర్పించారు. రాజీవ్ హత్యకేసు నిందితుల విడుదలకు చర్యలు తీసుకున్నట్టుగానే, తమ వాళ్ల విడుదలకు సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలో మైనారిటీలను గతంలో అనుమానం పేరుతో, కుట్రల పేరుతో పట్టుకెళ్లి జైళ్లలో బంధించారని వివరించారు. ఆ కుటుంబాలు తీవ్ర శోక సంద్రంలో ఉన్నాయని పేర్కొన్నారు. 16 ఏళ్లకు పైగా జైళ్లల్లో మగ్గుతున్న వారందరినీ విడుదల చేయాలని, ఆ కుటుంబాల్లో ఆనందం నింపాలని విన్నవించారు. -
రాజీవ్ హంతకుల విడుదలపై స్టే
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్య కేసులో జయలలిత ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో దోషులుగా తమిళనాడు జైలులో ఉన్న మరో నలుగురి విడుదలపై కూడా సుప్రీంకోర్టు స్టే విధించింది. రాజీవ్ హత్య కేసులో మురుగన్, శంతన్, అరివుల మరణశిక్షను జీవితఖైదుగా మారుస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు అనంతరం వీరి ముగ్గురితో పాటు ఇదే కేసులో శిక్ష అనుభవిస్తున్న నళిని, రాబర్డ్ పయస్, జయకుమార్, రవిచంద్రన్‌లను విడుదల చేయాలని తమిళనాడు సర్కా రు నిర్ణయించింది. దీనిపై కేంద్రం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ధర్మాసనం గురువారం స్టే విధించింది. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తామంటూ విచారణను మార్చి 6కు వాయిదా వేసింది. -
‘యావజ్జీవ’ వివాదం!
సంపాదకీయం: అన్నీ అయినట్టుగానే తమిళనాడులో రాజీవ్ హత్యకేసు దోషుల విడుదల అంశం కూడా అత్యంత వివాదాస్పదంగా మారింది. ఈ కేసులోని ఏడుగురు దోషులూ గత 23 ఏళ్లనుంచి జైళ్లలో ఉన్నారు. వీరిలో ముగ్గురికి పడిన ఉరిశిక్షపై కేంద్ర ప్రభుత్వం గత పదకొండేళ్లుగా ఏమీ తేల్చిచెప్పనందున మానవతా దృక్పథంతో ఆ ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఎన్నడో 2000 సంవత్సరంలో తమిళనాడు గవర్నర్ తమ క్షమాభిక్ష పిటిషన్లను తోసిపుచ్చిన తర్వాత ఈ ముగ్గురూ రాష్ట్రపతికి విన్నవించుకున్నారు. ఆ పిటిషన్లు కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్రపతికి చేరడానికి మరో అయిదేళ్లు పట్టింది. ఆ పిటిషన్లను పరిశీలించి తిరస్కరించడానికి రాష్ట్రపతికి మరో ఆరేళ్లుపట్టింది. ఇంత అహేతుకమైన జాప్యం జరిగిన నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయం ఏరకంగా చూసినా సబబే. కానీ, ఆ తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే తమిళనాడు రాజకీయాలు పెను వేగంతో కదిలాయి. రాష్ట్ర కేబినెట్ సమావేశమై ఆ ఏడుగురు దోషుల్నీ విడుదలచేయాలని తీర్మానించింది. మూడురోజుల్లోగా అందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది కూడా. ఈ చర్య ద్వారా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన రాజకీయ ప్రత్యర్థి డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిపై ఆధిక్యత సంపాదించే ప్రయత్నం చేశారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అనుకున్నట్టే కరుణానిధి ఈ చర్యను అభినందించడంతోపాటు...2011లో వీరి ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని కేంద్రాన్ని కోరినప్పుడు జయలలిత తప్పుబట్టిన సంగతిని గుర్తుచేశారు. మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్నందున తమిళ జాతీయవాద పరిరక్షకులుగా కనబడేందుకు అన్నా డీఎంకే, డీఎంకేలు తహతహలాడటంలో వింతేమీ లేదు. కానీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ వివాదంలో తలదూర్చి చేసిన వ్యాఖ్యానాలు ఆసక్తికరమైనవి. ఎల్టీటీఈ పొట్టన బెట్టుకున్న రాజీవ్‌గాంధీ కుమారుడు గనుక జయలలిత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన వ్యతిరేకత వ్యక్తంచేయడం తప్పేమీ కాదు. అయితే, ఈ దేశంలో మాజీ ప్రధానికే న్యాయం జరగకపోతే...ఆయనను చంపినవారినే స్వేచ్ఛగా వదిలేస్తే ఇక సామాన్యుడికి న్యాయం ఎక్కడుంటుందని రాహుల్ ప్రశ్నించారు. అలా అనేముందు ఇందులో తమ బాధ్యత ఎంతో రాహుల్ ఆత్మ విమర్శ చేసుకుని ఉంటే బాగుండేది. రాజీవ్‌గాంధీ దోషులు ముగ్గురూ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్లు దాఖలుచేసిన నాలుగేళ్లకు యూపీఏ ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. కానీ, ఆ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి దానికి ఏడేళ్లుపట్టింది. రాహుల్ అన్నట్టు ‘మాజీ ప్రధానికే న్యాయం జరగకపోతే...’ ఎలా అని యూపీఏ సర్కారు భావిస్తే ఏదో ఒక నిర్ణయాన్ని వేగిరం తీసుకొని ఉండేది. వారి పిటిషన్లను తిరస్కరించి ఉరిశిక్షలను అమలుచేయడమో లేక ఉరిశిక్షలపై రాహుల్గాంధీకున్న అభిప్రాయాన్ని గౌరవించి ఆ శిక్షలను యావజ్జీవ శిక్షలుగా మర్చడమో చేసేది. దేశాన్ని పట్టిపీడిస్తున్న అనేకానేక కీలక సమస్యలపై నిర్ణయాలను నాన్చి... కేవలం తనకు ఎన్నికల ప్రయోజనాలు చేకూర్చగలవాటినే పరిగణనలోకి తీసుకోవడం అలవాటైన యూపీఏ సర్కారు ఎందుకనో రాజీవ్‌గాంధీ హత్య కేసు విషయంలో కూడా సాచివేత ధోరణినే అవలంబించింది. అందువల్ల ‘మాజీ ప్రధానికే న్యాయం జరగకపోవడం’ అనేది తప్పయితే, ఆ తప్పు చేసింది యూపీఏ ప్రభుత్వమేనన్న సంగతి మరవరాదు. ఇప్పుడు ఆ దోషులను వదలాలని నిర్ణయించడం మాత్రమే తప్పని రాహుల్ చెబితే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. రాజీవ్ కేసు దోషుల్లో మురుగన్, శంతన్, పెరారివళన్, నళినిలకు 1999లో ఉరిశిక్ష విధించినప్పుడు బెంచ్‌లోని జస్టిస్ కేటీ థామస్ మెజారిటీ తీర్పుతో విభేదించారు. మురుగన్, నళినిలు దంపతులు గనుక వారిని ఉరితీస్తే వారిద్దరి కుమార్తె అనాథ అవుతుందని చెబుతూ నళిని ఈ కుట్రలో తెలియకుండానే భాగస్వామి అయిందని అభిప్రాయ పడ్డారు. ఆమెకు యావజ్జీవ శిక్ష సరిపోతుందని తీర్పునిచ్చారు. అనం తరకాలంలో సోనియాగాంధీ జోక్యంతో నళినికి విధించిన మరణశిక్ష 2007లో యావజ్జీవ శిక్షగా మారింది. ఉరిశిక్ష పడిన ముగ్గురూ దాని సం గతి తేలకుండానే 23ఏళ్లనుంచి జైల్లో ఉన్నారు గనుక...యావజ్జీవ శిక్ష పడివుంటే రెమిషన్లన్నీ కలిసొచ్చి వీరంతా ఎప్పుడో విడుదలయ్యేవారు గనుక వారి విడుదల సబబేనని జస్టిస్ థామస్ నిరుడు వ్యాఖ్యానించారు. ఆ రకంగా చూస్తే జయలలిత సర్కారు ఇప్పుడు తీసుకున్న నిర్ణయంలో తొందరపాటు ఉండొచ్చు... రాజకీయ ప్రయోజ నాలుంటే ఉండొచ్చుగానీ అది పూర్తిగా అహేతుకమని చెప్పలేం. అయితే, యావజ్జీవ శిక్ష పడిన ఖైదీల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ముందు అనుసరించాల్సిన నియమాలను తమిళనాడు ప్రభుత్వం ఉల్లంఘించిందన్నది వాస్తవం. నేర విచారణ స్మృతి ప్రకారం ఆరుగురు సభ్యులుండే సలహా బోర్డు సిఫార్సు అనంతరం మాత్రమే రాష్ట్ర కే బినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా తమిళనాడు ప్రభుత్వం దాన్ని పాటించలేదు. కనుకనే ఏడుగురి విడుదలకూ సుప్రీంకోర్టు గురువారం బ్రేక్ వేసింది. ఇదంతా సరేగానీ...1984లో ఇందిరాగాంధీని కొందరు దుండగులు పొట్టనబెట్టుకున్న తర్వాత జరిగిన సిక్కుల ఊచకోతలో మరణించినవారికి కూడా ఇంతవరకూ న్యాయం జరగలేదు. బాధిత కుటుంబాలు దోషులుగా ఆరోపిస్తున్నవారంతా అధికారం అండతో స్వేచ్ఛగా జీవనం కొనసాగిస్తున్నారు. సామాన్యులు దాన్ని కూడా ప్రశ్నిస్తారని, ఇన్ని దశాబ్దాలు గడిచినా న్యాయం జరగలేదని భావిస్తారని రాహుల్ గ్రహించాలి. -
జయ ఆశలపై సుప్రీం నీళ్లు
రాజీవ్ హంతకుల విడుదలకు బ్రేక్ న్యూఢిల్లీ: రాజీవ్‌గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషుల తక్షణ విడుదలకు సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో బ్రేక్ పడింది. దోషుల విడుదలకు తమిళనాడు ప్రభుత్వం అనుసరించిన విధానపరమైన లోపాలను ఎత్తిచూపిన చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. తాము శిక్ష తగ్గించిన ముగ్గురు దోషులు మురుగన్, శంతన్, పెరారి వాలన్ విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వంతో పాటు జైలు ఉన్నతాధికారులు, ఇతరులకు ఉత్తర్వులు జారీ చేసింది. రాజీవ్ హత్య కేసులో ముగ్గురు దోషులకు పడిన మరణశిక్షను జీవితఖైదుకు తగ్గిస్తూ సుప్రీం తీర్పు వెలువరించిన 24 గంటల్లోగానే ఈ కేసుకు సంబంధించిన మొత్తం ఏడుగురు దోషులను జైలు నుంచి విడుదల చేయూలని జయలలిత సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనిపై స్టే కోరుతూ కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టును ఆశ్రరుుంచింది. ఈ నేపథ్యంలో స్టే మంజూరు చేసిన బెంచ్ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్లో కేవలం ముగ్గురు పేర్లను మాత్రమే పేర్కొన్నందున శిక్ష మాఫీ పొందిన మిగతా న లుగురి విషయంలో తాజాగా మరో పిటిషన్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి అనుమతినిచ్చింది. దీంతో మొత్తం ఏడుగురు దోషుల విడుదలకు బ్రేక్ పడినట్టరుుంది. తదుపరి విచారణను మార్చి 6కు వారుుదా వేసింది. సుప్రీం తీర్పు వెలువడిన తర్వాత ఒక్కరోజులోనే తమిళనాడు ప్రభుత్వం విధానపరమైన చర్యలన్నిటినీ ఎలా పూర్తి చేయగలిగిందని న్యాయమూర్తులు రంజన్ గొగోయ్, ఎన్.వి.రమణలతో కూడిన బెంచ్ విస్మయం వ్యక్తం చేసింది. దేశ అంతరాత్మపై దాడి: ప్రధాని రాజీవ్ హత్య భారతదేశ అంతరాత్మపై జరిగిన దాడిగా ప్రధాని మన్మో హన్‌సింగ్ అభివర్ణించారు. రాజీవ్ హంతకుల విడుదల అన్ని న్యాయ సూత్రాలకూ విరుద్ధమన్నారు. న్యాయపరంగా సమర్థనీయం కాని విషయంలో ముందుకువెళ్లరాదని తమిళనాడు ప్రభుత్వానికి స్పష్టం చేశారు.