Rajiv Gandhi hanmantu
-
పనులెలా జరుగుతున్నాయి ?!
కాజీపేట రూరల్ : గ్రేటర్ వరంగల్ పరిధిలోని కాజీపేట దర్గా సమీపాన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం ద్వారా జరుగుతున్న పనులను కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి బుధవారం తనిఖీ చేశారు. కాజీపేట 36వ డివిజన్ దర్గా రైల్వే గేట్ నుండి అప్జల్ నగర్ కాలనీ వరకు రెండు కి.మీ. మేర నిర్మిస్తున్న బాక్స్ డ్రెయినేజీ పనులను పరిశీలించారు. అలాగే, మూడో రైల్వే ట్రాక్‌కు సంబంధించి కల్వర్టును తనిఖీ చేశారు. అనంతరం అప్జల్‌నగర్ ప్రాంతాన్ని తనిఖీ చేసి డ్రెయినేజీలు, రోడ్ల నిర్మాణ పనులపై ఆరా తీశారు. మలేరియా నివారణ కోసం ఆయిల్ బాల్స్‌ను డ్రెయినేజీలో వేయించిన వారు ద్రావణాలను పిచికారీ చేయించారు. కార్యరంగంలోకి.. గ్రేటర్ వరంగల్ పరిధిలో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుతో కలిసి కమిషనర్ పమేలా సత్పతి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా దర్గా కాజీపేటలో ట్రాక్ వెంట పనులను పరిశీలించిన వారు కాలనీల్లో పర్యటనకు బయలుదేరారు. మార్గమధ్యలో పెద్ద డ్రెయినేజీ రాగా తొలుత కలెక్టర్ దానిపై నుంచి జంప్ చేశారు. ఆ వెంటనే కమిషనర్ సత్పతి సైతం ఎలాంటిజంకు లేకుండా ఇలా జంప్ చేయడం విశేషం. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్‌గాంధీ, కమిషనర్ పమేలా సత్పతి అప్జల్‌నగర్ వాసులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు శుభ్రత పాటించాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. కాగా, ఫాతిమానగర్ నుంచి దర్గాకు వెళ్లే ప్రధాన రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని స్థానికులు కోరగా, స్థానిక సమస్యలపై కార్పొరేటర్ అబూబక్కర్ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఈ సంతోష్, సరిత, ఏఈలు నరేందర్, ముజామిల్, జవాన్ సుధాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. మెరుగైన జీవన ప్రమాణాల కోసమే.. కాజీపేట అర్బన్ : నగర ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే లక్ష్యంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని రూపొందించినట్లు కమిషనర్ పమేలా సత్పతి తెలిపారు. 33వ డివిజన్లోని భట్టుపల్లి, కొత్తపల్లి, 35వ డివిజన్లోని కడిపికొండలో పలు కాలనీలను కమిషనర్ బుధవారం పరిశీలించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ వ్యాధుల బారి నుంచి రక్షించుకోవాలని స్థానికులకు సూచించారు. భట్టుపల్లిలో డ్రెయినేజీలు, కొత్తపల్లిలో రోడ్డు సమస్యను స్థానికులు కమిషనర్‌కు విన్నవించగా నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఆర్ఎఫ్ఓ నారాయణ, ఏఈ ముజామిల్, శానిటరీ ఇన్స్పెక్టర్ కరుణాకర్ పాల్గొన్నారు. -
భద్రాద్రి జిల్లా సమగ్ర స్వరూపం
భద్రాద్రి కలెక్టర్ :రాజీవ్ గాంధీ హన్మంతు ఫోన్: 94909 57005 ఎస్పీ: అంబర్ కిషోర్ ఝా ఫోన్: 94407 95200 ఇతర ముఖ్య అధికారులు జేసీ: ఎం.రామకిషన్(94409 03166) ఓఎస్డీ: శోభన్ కుమార్(94407 95302) డీఆర్డీఏ, డ్వామా పీడీ: జగత్‌కుమార్ రెడ్డి (89781 59494) వైద్య ఆరోగ్య శాఖాధికారి: వెంకటేశ్వరరావు(98499 02522) మండలాలు: 23 (కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, టేకులపల్లి, జూలూరుపాడు, పాల్వంచ, ములకలపల్లి, అశ్వారం, మణుగూరు, పినపాక, కరకగూడెం, గుండాల, ఆళ్లపల్లి, ఇల్లెందు, అశ్వారావుపేట, దమ్మపేట, భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు) మున్సిపాలిటీలు: 4 (కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు) గ్రామ పంచాయతీలు: 205 భారీ పరిశ్రమలు: సింగరేణి బొగ్గు గనులు, కేటీపీఎస్, నవభారత్ ఫెర్రో అల్లాయిస్, ఎన్ఎండీసీ–సిల్, భద్రాచలం పేపర్‌బోర్డ్, మణుగూరు హెవీ వాటర్‌ప్లాంట్, భద్రాద్రి పవర్‌ప్లాంట్ సాగునీటి ప్రాజెక్టులు: కిన్నెరసాని, సీతారాంసాగర్, తాలిపేరు, పెదవాగు, సింగభూపాలెం, మూకమామిడి ఎమ్మెల్యేలు: జలగం వెంకటరావు(కొత్తగూడెం), కోరం కనకయ్య(ఇల్లందు), పాయం వెంకటేశ్వర్లు(పినపాక), తాటి వెంకటేశ్వర్లు(అశ్వారావుపేట), సున్నం రాజయ్య(భద్రాచలం) ఎంపీలు: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(ఖమ్మం), సీతారాంనాయక్(మహబూబాబాద్) ఆలయాలు, పర్యాటకం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం, పర్ణశాల, అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో వెంకటేశ్వరస్వామి దేవాలయం, కిన్నెరసాని అభయారణ్యం, అశ్వారావుపేటలో గుబ్బల మంగమ్మ అటవీ ప్రాంతం జాతీయ రహదారి: విజయవాడ–జగదళ్‌పూర్(ఛత్తీస్‌గఢ్) పనులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్–ఖమ్మం–కొత్తగూడెంలను కలుపుతూ ఛత్తీస్‌గఢ్‌కు మరో హైవే కోసం ప్రతిపాదనలు పంపారు. హైదరాబాద్ నుంచి దూరం: 280 కి.మీ. ఖనిజ వనరులు: బొగ్గు గనులు -
డిసెంబర్ ఆఖరునాటికి అందరికీ ఆధార్
=కార్డుల్లో తప్పులు సరిచేసుకోవచ్చు =బ్యాంకుల అత్యుత్సాహంతో కొన్నిచోట్ల సమస్యలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో 35లక్షల జనాబా ఉండగా ఇప్పటి వరకు 30.11 లక్షల మందికి ఆధార్ కార్డులు జారీ చేశామని జిల్లా కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. నగదు బదిలీ అంశంపై బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ రాయితీ పథకాలు పొందుతున్న వారిలో నకిలీలను గుర్తించేందుకు ప్రవేశ పెట్టిన ఈ కార్యక్రమం చక్కని ఫలితాలు ఇస్తోందని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న యూఐడీఏఐ(యునిక్ ఐడింటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియూ) డిప్యూటీ డెరైక్టర్ జనరల్ ఎంవీఎస్ రెడ్డి మాట్లాడుతూ కోర్ బ్యాంకింగ్ అవకాశం ఉన్న బ్యాంకు ఖాతాదారులకే ఆధార్ ద్వారా నేరుగా ప్రభుత్వ పథకాల లబ్దిని పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆధార్ కార్డుల జారీ విషయంలో ఆలస్యమైనప్పటికీ ప్రభుత్వ పథకాల విషయంలో, బ్యాంకర్లు తప్పనిసరిగా ఈ-ఆధార్‌ను అంగీకరించాలని స్పష్టంచేశారు. ఈ విషయంలో అబ్దిదారులకు అవగాహన కల్పించాలన్నారు. ఆధార్ నమోదు, వివరాల సేకరణ, కార్డుల జారీ తదితర విషయాల్లో కొద్దిపాటి సమస్యలున్నమాట వాస్తమేనని అన్నారు. అయితే వాటిని త్వరలో సరిచేసి పూర్తి స్థాయిలో సేవలందించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కార్డుల్లో పేర్లు, చిరునామా, వయస్సు వంటివి తప్పుగా ఉన్నట్లయితే మార్చుకునే అవకాశం ఉందని, ఈ విషయంలో కార్డులదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆధార్ కేంద్రాలకు వెళ్లి తప్పులను సరిచేసుకోవ చ్చని తెలిపారు. ఫొటోలో పొరపాట్లు, వేలిముద్రల విషయంలో స్పష్టత లేకున్నా మార్పు చేసుకోవచ్చని, అయితే ఇది ఆధార్ నమోదు కేంద్రాల్లో మాత్రమే సాధ్యపడుతుందని చెప్పారు. ముఖ్యంగా 2012 ఏప్రిల్ కన్నా ముందు ఆధార్ కోసం నమోదు చేయిచుకున్నవారు ఇప్పటికీ కార్డు రాకపోతే మళ్లీ కేంద్రానికి వెళ్లి నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఐదేళ్లకోసారి బయోమెట్రిక్ ఎన్‌రోల్‌మెంట్‌ను మార్చుకోవచ్చని తెలిపారు. కార్యక్రమానికి హాజరైన ఎల్పీజీ డీలర్లు ఆధార్ సమస్యలు వివరిస్తూ.. గ్యాస్కనెక్షన్కు అనుసంధానం చేసిన ఆధార్ విషయంలో లబ్దిదారు ఇచ్చిన ఖాతాలో కాకుండా మరెవరి ఖాతాలోనో డబ్బుల జమ అయినట్లు సమాచారం వస్తుందని, దీనివల్ల సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. అయితే ఆధార్ అనుసంధానం విషయంలో కొన్ని బ్యాకులు అత్యుత్సాహంతో ఆధార్ కేంద్రాల నుంచి డాటా తీసుకుని సీడింగ్(లింక్ చేయడం) చేశాయని, ఈ క్రమంలో పొరపాట్లు జరిగాయని, వీటిని గుర్తించి తక్షణ చర్యలకు ఆదేశాలిచ్చామని తెలిపారు. ఇకపై అలాంటి సమ్యలు రాకుండా పక్కాగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కలెక్టర్ పౌసుమి బసు మాట్లాడుతూ ఇలాంటి విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలకు సిఫారసు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న అసిస్టెంట్ డిప్యూటీ జనరల్ మేజేజర్ శ్రీనివాస్ ఆధార్ సీడింగ్, సమస్యలు పరిష్కారాలు, ఇతర ఇబ్బందులపై అధికారులకు, డీలర్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, డీఎస్వో ఉషారాణి, ఎల్డీఎం దత్, బ్యాంకుల ప్రతినిధులు, గ్యాస్‌డీలర్లు, అధికారులు పాల్గొన్నారు.