=కార్డుల్లో తప్పులు సరిచేసుకోవచ్చు
=బ్యాంకుల అత్యుత్సాహంతో కొన్నిచోట్ల సమస్యలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో 35లక్షల జనాబా ఉండగా ఇప్పటి వరకు 30.11 లక్షల మందికి ఆధార్ కార్డులు జారీ చేశామని జిల్లా కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. నగదు బదిలీ అంశంపై బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ రాయితీ పథకాలు పొందుతున్న వారిలో నకిలీలను గుర్తించేందుకు ప్రవేశ పెట్టిన ఈ కార్యక్రమం చక్కని ఫలితాలు ఇస్తోందని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న యూఐడీఏఐ(యునిక్ ఐడింటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియూ) డిప్యూటీ డెరైక్టర్ జనరల్ ఎంవీఎస్ రెడ్డి మాట్లాడుతూ కోర్ బ్యాంకింగ్ అవకాశం ఉన్న బ్యాంకు ఖాతాదారులకే ఆధార్ ద్వారా నేరుగా ప్రభుత్వ పథకాల లబ్దిని పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆధార్ కార్డుల జారీ విషయంలో ఆలస్యమైనప్పటికీ ప్రభుత్వ పథకాల విషయంలో, బ్యాంకర్లు తప్పనిసరిగా ఈ-ఆధార్‌ను అంగీకరించాలని స్పష్టంచేశారు. ఈ విషయంలో అబ్దిదారులకు అవగాహన కల్పించాలన్నారు.
ఆధార్ నమోదు, వివరాల సేకరణ, కార్డుల జారీ తదితర విషయాల్లో కొద్దిపాటి సమస్యలున్నమాట వాస్తమేనని అన్నారు. అయితే వాటిని త్వరలో సరిచేసి పూర్తి స్థాయిలో సేవలందించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కార్డుల్లో పేర్లు, చిరునామా, వయస్సు వంటివి తప్పుగా ఉన్నట్లయితే మార్చుకునే అవకాశం ఉందని, ఈ విషయంలో కార్డులదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆధార్ కేంద్రాలకు వెళ్లి తప్పులను సరిచేసుకోవ చ్చని తెలిపారు.
ఫొటోలో పొరపాట్లు, వేలిముద్రల విషయంలో స్పష్టత లేకున్నా మార్పు చేసుకోవచ్చని, అయితే ఇది ఆధార్ నమోదు కేంద్రాల్లో మాత్రమే సాధ్యపడుతుందని చెప్పారు. ముఖ్యంగా 2012 ఏప్రిల్ కన్నా ముందు ఆధార్ కోసం నమోదు చేయిచుకున్నవారు ఇప్పటికీ కార్డు రాకపోతే మళ్లీ కేంద్రానికి వెళ్లి నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఐదేళ్లకోసారి బయోమెట్రిక్ ఎన్‌రోల్‌మెంట్‌ను మార్చుకోవచ్చని తెలిపారు. కార్యక్రమానికి హాజరైన ఎల్పీజీ డీలర్లు ఆధార్ సమస్యలు వివరిస్తూ..
గ్యాస్‌కనెక్షన్‌కు అనుసంధానం చేసిన ఆధార్ విషయంలో లబ్దిదారు ఇచ్చిన ఖాతాలో కాకుండా మరెవరి ఖాతాలోనో డబ్బుల జమ అయినట్లు సమాచారం వస్తుందని, దీనివల్ల సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. అయితే ఆధార్ అనుసంధానం విషయంలో కొన్ని బ్యాకులు అత్యుత్సాహంతో ఆధార్ కేంద్రాల నుంచి డాటా తీసుకుని సీడింగ్(లింక్ చేయడం) చేశాయని, ఈ క్రమంలో పొరపాట్లు జరిగాయని, వీటిని గుర్తించి తక్షణ చర్యలకు ఆదేశాలిచ్చామని తెలిపారు. ఇకపై అలాంటి సమ్యలు రాకుండా పక్కాగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
కలెక్టర్ పౌసుమి బసు మాట్లాడుతూ ఇలాంటి విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలకు సిఫారసు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న అసిస్టెంట్ డిప్యూటీ జనరల్ మేజేజర్ శ్రీనివాస్ ఆధార్ సీడింగ్, సమస్యలు పరిష్కారాలు, ఇతర ఇబ్బందులపై అధికారులకు, డీలర్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, డీఎస్‌వో ఉషారాణి, ఎల్డీఎం దత్, బ్యాంకుల ప్రతినిధులు, గ్యాస్‌డీలర్లు, అధికారులు పాల్గొన్నారు.
డిసెంబర్ ఆఖరునాటికి అందరికీ ఆధార్
Published Thu, Nov 21 2013 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM
Advertisement
Advertisement