Rajiv gandhi killers
-
రాజకీయ చట్రంలో ‘రాజీవ్’ హంతకుల విడుదల
చెన్నై : రాజీవ్ హత్య కేసు నిందితుల వ్యవహారం రాజకీయ చట్రంలో కొట్టుమిట్టాడుతోంది. మరోమారు వీరి విడుదల తెర మీదకు రావడంతో చర్చ బయలు దేరింది. చిత్తశుద్ది లేక కేంద్రం కోర్టులోకి బంతిని రాష్ట్ర ప్రభుత్వం నెట్టిందని ప్రతి పక్షాలు విమర్శించే పనిలో పడ్డాయి. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో నిందితులు నళిని, మురుగన్, శాంతన్,పేరరివాలన్, జయశంకర్, రవిచంద్రన్, రాబర్ట్‌లకు ఉరి శిక్ష పడడం, తదుపరి యావజ్జీవంగా మారడం గురించి తెలిసిందే. 24 ఏళ్లుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్న వీరిని, ఇక నైనా విడుదల చేయాలంటూ తమిళాభిమాన సంఘాలు, ఈలం మద్ద తు రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. అయితే, పాలకులు చెవిన ఆ గళం పడలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయం ఆసన్నం అవుతుండడంతో రాజకీయ చట్రంలోకి మళ్లీ రాజీవ్ హత్యకేసు నింధితుల విడుదల వ్యవహారం చేరి ఉన్నది. ఇన్నాళ్లు మౌన ముద్ర అనుసరించిన పాలకులు తాజాగా, విడుదల నినాదాన్ని అందుకుని ఉండటం చర్చకు దారి తీసి ఉన్నది. రాజీవ్ హత్య కేసు నిందితుల విడుదల వ్యవహారంలో కేంద్రం అభిప్రాయాన్ని కోరుతూ లేఖాస్త్రం సంధించి ఉండడం గమనార్హం. ఇది వరకు ఏ చిన్న విషయమైనా సరే సీఎం జయలలిత జోక్యం చేసుకుని కేంద్రానికి లేఖాస్త్రం సందించడం జరుగుతూ వచ్చింది. అయితే, ఈ సారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞాన దేశికన్ గళాన్ని అందుకుని, కేంద్రానికి లేఖ పంపించి ఉండటంతో రాజకీయ చదరంగంలోకి మరో మారు విడుదల వ్యవహారాన్ని చేర్చి ఉన్నారన్న విమర్శలు బయలు దేరి ఉన్నది. ఇన్నాళ్లు మౌనం అనుసరించి, ఎన్నికల నోటిఫికేషన్ రోజుల వ్యవధిలో విడుదల కాబోతున్న సమయంలో ఈ నినాదాన్ని ప్రభుత్వం అందుకుని ఉండటం కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మాత్రమేనన్న విమర్శలు, ఆరోపణలు బయలు దేరి ఉన్నాయి. ప్రభుత్వానికి చిత్త శుద్ది లేక పోగా, తామేదో చిత్తశుద్ధితో ఉన్నట్టు చాటుకునే యత్నంలో భాగంగానే తాజాగా విడుదల వ్యవహారాన్ని తెర మీదకు తెచ్చి ఉన్నారని మండి పడే వాళ్లే ఎక్కువ. ఈ విషయంగా ఎండీఎంకే నేత వైగో పేర్కొంటూ, ఇది ఎన్నికల నాటకంగా వ్యాఖ్యానించారు. విడుదల చేసి ఉంటే, ఎప్పడో చేసి ఉండాలని, ఇప్పుడే కపట నాటకంతో రక్తికట్టించేందుకు సీఎం జయలలిత సిద్ధం అయ్యారని మండి పడ్డారు. బీజేపీ నాయకురాలు వానతీ శ్రీనివాసన్ పేర్కొంటూ, చట్టపరం చిక్కుల్లో ఇరుక్కుని ఉన్న ఈ కేసును కేంద్రం నెత్తిన రుద్ది, లబ్ధిపొందే యత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుందని మండిపడ్డారు. స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే సీఎం జయలలిత, ఇప్పుడు కొత్త బాణిలో ప్రధాన కార్యదర్శి ద్వారా లేఖాస్త్రం పంపించి ఉండటం గమనించాల్సిన విషయంగా పేర్కొన్నారు. విడుదలలో చిత్త శుద్ది లేక, ఎన్నికల్లో లబ్ధికి ఈ కొత్త నాటకం ఎందుకో అని ప్రశ్నించారు. పీఎంకే నేత రాందాసు పేర్కొంటూ, రాజకీయ శాసనాల చట్టం 161 ఉపయోగించి వారిని విడుదల చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నా, దాన్ని ప్రయోగించకుండా కొత్త నాటకం రచించి ఉన్న అన్నాడీఎంకేకు ప్రజలు గుణపాఠం నేర్పేందుకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఇక, ఈ విడుదల వ్యవహారం లోక్ సభను సైతం తాకి ఉండడం గమనార్హం. అయితే, రాష్ర్ట ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీలు వ్యవహరించడంతో, ఇక్కడున్న కాంగ్రెస్ వాదులు ఇరకాటంలో పడే పరిస్థితి. అదే సమయంలో కాంగ్రెస్‌ను అక్కున చేర్చుకున్నందుకుగాను, విడుదల వ్యవహారం డీఎంకేను సంక్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టినట్టు అయింది. ఇక, రాష్ట్ర ప్రభుత్వం తమ కోర్టులోకి విసిరిన బంతిని చాకచక్యంగా ఎదుర్కొనేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నట్టున్నారు. అందుకే కాబోలు ఆ లేఖ పరిశీలనలో ఉన్నట్టు ప్రకటించి కాలం నెట్టుకువచ్చే పనిలో పడ్డట్టున్నారన్న చర్చ రాష్ట్రంలో బయలు దేరి ఉన్నది. ఇంతకీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని స్పష్టం చేయాలని, తనకు ఉన్న అధికారంతో వారిని విడుదల చేసి చిత్తశుద్దిని నిరూపించుకోవాలని తమిళాభిమాన సంఘాలు, ఈలం మద్దతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
రాజీవ్ హంతకులకు సుప్రీంలో చుక్కెదురు
న్యూఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హంతకుల విడుదలపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేనిదే వారి విడుదలపై నిర్ణయం తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ వారిని విడుదల చేయరాదని న్యాయస్థానం ఆదేశించింది. రాజీవ్ హంతకుల విడుదల విషయంలో తమిళనాడు ప్రభుత్వం సంయమనం పాటించాలని కోరింది. తమకు విధించిన శిక్షను మాఫీ చేయాలంటూ వాళ్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజీవ్‌గాంధీ హంతకుల మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినా ఈ వివాదం నడుస్తోంది. గతంలో వారిని విడుదల చేయడానికి తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నపుడు యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజీవ్ గాంధీ హత్య అనేది భారతదేశం మీద జరిగిన దాడి అని, ఆ హంతకులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయొద్దని కోరింది. ఆ సందర్భంగా కూడా సుప్రీం ఇదేలా స్పందిస్తూ దోషుల విడుదలపై స్టే విధించింది. మరోవైపు రాజీవ్ హత్యకేసులో దోషులు నళిని, మురుగన్ల కుమార్తె హరిత్ర రాహుల్ గాంధీని క్షమాపణ కోరింది. చేసిన నేరానికి తన తల్లిదండ్రులు శిక్ష అనుభవించటంతో పాటు, పశ్చాత్తాపం చెందారని, వారిని క్షమించి వదిలేయాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. -
రాజీవ్ హంతకులకు క్షమాభిక్ష పెట్టిన తమిళనాడు
-
సుప్రీంలో జయలలితకు ఎదురుదెబ్బ
-
సుప్రీంలో జయలలితకు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రాజీవ్ హత్యకేసు దోషులను విడిచిపెట్టి తమిళ తంబీల ఓట్లను గంపగుత్తగా కొట్టేయాలన్న పురచ్చి తలైవి ప్రయత్నానికి కోర్టులో చుక్కెదురైంది. రాజీవ్ హంతకుల్లో నలుగురిని విడిచిపెడుతూ జయలలిత సర్కారు తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు మార్చి 6వ తేదీ వరకూ స్టే విధించింది. జయ సర్కారు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం... హంతకుల విడుదలను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాజీవ్ హంతకుల విడుదల విషయంలో తమిళనాడు ప్రభుత్వం సంయమనం పాటించాలని నోటీసులు ఇచ్చింది -
రాజీవ్ హంతకుల విడుదలపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హంతకుల విడుదలపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ వారిని విడుదల చేయరాదని న్యాయస్థానం ఆదేశించింది. రాజీవ్ హంతకుల విడుదల విషయంలో తమిళనాడు ప్రభుత్వం సంయమనం పాటించాలని నోటీసులు జారీ చేసింది. రాజీవ్‌గాంధీ హంతకుల మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన మరుసటి రోజే వారిని విడుదల చేయడానికి తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తమిళనాడు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదే విషయంపై రాజీవ్ గాంధీ హత్య అనేది భారతదేశం మీద జరిగిన దాడి అని, ఆ హంతకులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయొద్దని తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సూచించారు. మరోవైపు రాజీవ్ హత్యకేసులో దోషులు నళిని, మురుగన్ల కుమార్తె హరిత్ర రాహుల్ గాంధీని క్షమాపణ కోరింది. చేసిన నేరానికి తన తల్లిదండ్రులు శిక్ష అనుభవించటంతో పాటు, పశ్చాత్తాపం చెందారని వారిని క్షమించి వదిలేయాలని పేర్కొంది. -
రాజీవ్ హంతకులను వదలొద్దు: మన్మోహన్ సింగ్
రాజీవ్ గాంధీ హత్య అనేది భారతదేశం మీద జరిగిన దాడి అని, ఆ హంతకులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయొద్దని తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సూచించారు. వాళ్లను విడుదల చేయడం అన్ని రకాల సిద్ధాంతాలకు వ్యతిరేకమని, ఒకవేళ తమిళనాడు సర్కారు అలాంటి నిర్ణయం ఏమైనా తీసుకున్నా అది న్యాయపరంగా ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ అయినా కూడా ఉగ్రవాదంపై పోరు విషయంలో మెతకగా ఉండకూడదని ప్రధాని ఓ ప్రకటనలో అన్నారు. రాజీవ్ హంతకులకు విధించిన మరణ శిక్షను సుప్రీంకోర్టు యావజ్జీవ ఖైదుగా మార్చిన నేపథ్యంలో మొత్తం ఏడుగురు దోషులను విడుదల చేయాలని తమిళనాడులోని జయ సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో ఆయనీ విధంగా తెలిపారు. అంతకుముందే ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఓ రివ్యూ పిటిషన్ కూడా దాఖలుచేసింది. దేశ మాజీ ప్రధానమంత్రితో పాటు పలువురు నిర్దోషులను కూడా చంపిన హంతకులను విడిచిపెట్టడం అన్నిరకాల న్యాయసూత్రాలకు విరుద్ధమని ప్రధాని స్పష్టం చేశారు. అందువల్ల తమిళనాడు సర్కారు వాళ్లను విడిచిపెట్టకూడదని తెలిపారు.