సుప్రీంలో జయలలితకు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రాజీవ్ హత్యకేసు దోషులను విడిచిపెట్టి తమిళ తంబీల ఓట్లను గంపగుత్తగా కొట్టేయాలన్న పురచ్చి తలైవి ప్రయత్నానికి కోర్టులో చుక్కెదురైంది. రాజీవ్ హంతకుల్లో నలుగురిని విడిచిపెడుతూ జయలలిత సర్కారు తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు మార్చి 6వ తేదీ వరకూ స్టే విధించింది.
జయ సర్కారు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం... హంతకుల విడుదలను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాజీవ్ హంతకుల విడుదల విషయంలో తమిళనాడు ప్రభుత్వం సంయమనం పాటించాలని నోటీసులు ఇచ్చింది