11ఏళ్ల తర్వాత మాజీ ఎంపీ విడుదల
బెంగళూరు : మాజీ ఆర్జేడీ ఎంపీ మొహమ్మద్ షహబుద్దీన్ 11 ఏళ్ల అనంతరం జైలు నుంచి బయటికొచ్చారు. రాజీవ్ రోషన్, ఇద్దరు సోదరుల మర్డర్ కేసులో యావజ్జీవ శిక్ష పడిన ఆర్జేడీ ఎంపీకి పట్నా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శనివారం ఆయన విడుదలయ్యారు. 2004లో గిరీశ్ రాజ్, సతీష్ రాజ్ అనే సోదరులను అపహరించుకుపోయి, యాసిడ్ పోసి మరీ హత్య చేశారనే నిర్థారణతో షహబుద్దీన్‌కు జైలు శిక్ష పడింది. ఈ ఘటనపై మృతుల తల్లి కళావతి దేవీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు విచారణలో షహబుద్దీన్‌కు సోదరుల అపహరణతో సంబంధం ఉందని తేలడంతో ప్రత్యేక న్యాయస్థానం ఈ శిక్ష విధించింది. బెయిల్‌పై బయటికి వచ్చిన షషబుద్దీన్ మీడియాతో మాట్లాడారు.
తనను కావాలనే ఇరికించినట్టు ప్రతిఒక్కరికీ తెలిసని, జైలు శిక్ష విధించిన కోర్టే, తనను విడుదల చేసిందని పేర్కొన్నారు. రాజకీయ కుట్రలతో తననేమి చేయలేరని, న్యాయస్థానాలకు తనకంటూ సొంత విధానాలు ఉంటాయని వెల్లడించారు. రాజకీయ కుట్రలకు తానెప్పుడూ పాల్పడలేదని చెప్పారు. 13 ఏళ్ల అనంతరం తన గ్రామానికి వెళ్తున్నట్టు, 26 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు తనతో ఎలా మెలిగారో అలానే ఇప్పుడు కూడా ప్రజలు తనని అంగీకరిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. గత పదేళ్లుగా తను ఎవరిని కలవలేకపోవడంపై విచారణ వ్యక్తంచేశారు. 2004 ఆగస్టు పదహారో తేదీన గిరీశ్, సతీష్, రాజీవ్ అనే ముగ్గురు సోదరులు కిడ్నాప్‌కు గురయ్యారు. అనంతరం గిరీశ్, సతీష్‌లు హత్యకు గురవ్వగా రాజీవ్ రోషన్ కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్నాడు. సోదరుల హత్య కేసుకు రాజీవ్ రోషన్ సాక్ష్యం చెప్పాడు. అనంతరం రాజీవ్ రోషన్‌ను కూడా షహబుద్దీన్ కుమారుడు ఓసామా హత్య చేశారు.