తెలంగాణ హోంశాఖ కార్యదర్శికి ఊరట
హైదరాబాద్ : తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదికి హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విజయవాడ కోర్టు తీర్పుపై హైకోర్టు సోమవారం స్టే విధించింది. కాగా కాల్ డేటా వివరాలు సీల్డు కవర్ లో హైకోర్టు వద్ద ఉన్నాయని తెలంగాణ అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వివరాల కోసం విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు (సిఎంఎం) తనకు ఉత్తర్వులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.