Raju Gaari Gadhi 2
-
మరోసారి.. నాగ్ సినిమాలో సమంత?
అక్కినేని వారి కోడలు సమంత మరోసారి మామ నాగార్జున తో కలిసి నటించేందుకు రెడీ అవుతోందట. ఇప్పటికే మనం, రాజుగారి గది 2 లాంటి సినిమాల్లో ఈ ఇద్దరు కలిసి నటించారు. ఇప్పుడు మరోసారి ఓ డిఫరెంట్ సినిమా కోసం స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్న నాగ్, ఈ నెల 24 నుంచి మరో సినిమాను ప్రారంభించనున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాలో నాగార్జున తోపాటు నాని మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో నానికి జోడిగా సమంత నటించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా కన్నడ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ నటించనుంది. ఈ కాంబినేషన్‌పై ఇంతవరకు అధికారిక ప్రకటన లేకపోయినా.. అక్కినేని అభిమానులు మాత్రం ఈ వార్తలతో పండగ చేసుకుంటున్నారు. -
నాపై నేనే పెద్ద బాధ్యత పెట్టుకున్నా : సమంత
హైదరాబాద్ : 'ఇప్పుడు నేను అక్కినేని సమంతను.. నాపై పెద్ద బాధ్యత ఉంది' అని ప్రముఖ నటి అక్కినేని కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన సమంత అన్నారు. గురువారం రాజుగారి గది 2 చిత్రానికి సంబంధించి నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆమె మాట్లాడారు. భవిష్యత్‌లో అన్నపూర్ణ స్టూడియో తరుపున నిర్మాణ రంగంలోకి అడుగుపెడతారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. 'అక్కినేని వారింట్లో లింగబేధం ఉండదు. అమ్మాయిలను అబ్బాయిలను సమానంగా చూస్తారు. అమలగారు, సుప్రియగారు చాలా స్ట్రాంగ్ ఇండిపెండెంట్.. అదే నాకు పెద్ద బ్లెస్సింగ్స్ అనిపిస్తుంది. నా నుంచి ఆ కుటుంబం ఏం ఆశించడం లేదు, నన్ను ఏమి అడగడం లేదు. కానీ, నేనిప్పుడు అక్కినేని సమంతని. నాపై నేనే పెద్ద బాధ్యత పెట్టుకున్నాను' అంటూ అక్కినేని కుటుంబంలోకి అడుగుపెట్టడం ఎంత సంతోషంగా ఉందో తెలిపారు. ఇక సినిమా గురించి మాట్లాడుతూ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఉంటానని, కానీ, నా క్యారెక్టర్ ఎందుకు ఉంటుందో ఇప్పటికీ తానే చెప్పలేనని అన్నారు. ఒక సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా వన్ వీక్‌లో మర్చిపోతారని, అది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదని అన్నారు. అయితే, ఆరు నెలలు ఒక పెద్ద పాజిటివ్ టీంతో కలిసి పనిచేశానని, అన్నారు. ఇలాంటి టీమ్‌తో కలిసి రాజుగారి గది 2 చిత్రంలో పనిచేయడం తనకు చాలా సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఈ ప్రమోషన్ కార్యక్రమంలో హీరో నాగార్జున, చిత్ర దర్శకుడు ఓంకార్, ఇతర చిత్ర యూనిట్ పాల్గొన్నారు. -
కింగ్‌తో మరోసారి..!
సెకండ్ ఇన్నింగ్స్‌లో జెట్ స్పీడుతో దూసుకుపోతోంది చెన్నై చంద్రం త్రిష. పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోవటంతో తిరిగి సినిమాల మీద దృష్టి పెట్టిన ఈ బ్యూటి ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు గ్లామర్ రోల్స్ లోనూ అలరిస్తోంది. ఎక్కువగా కోలీవుడ్ సినిమాలు మాత్రమే చేస్తున్న త్రిష, త్వరలో ఓ సీనియర్ స్టార్ హీరో సరసన తెలుగు సినిమా చేసేందుకు అంగీకరించింది. ప్రయోగాత్మక చిత్రాలకు ఎప్పుడూ ముందుండే సీనియర్ స్టార్ నాగార్జున హీరోగా తెరకెక్కనున్న సినిమా రాజుగారి గది 2. ఓంకార్ దర్శకత్వంలో పీవీపీ సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగ్‌కు జోడిగా త్రిష అలరించనుంది. గతంలో కింగ్ సినిమాలో కలిసి నటించిన ఈ జోడి మరోసారి తెర ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో సీరత్ కపూర్ మరో హీరోయిన్గా నటిస్తుండగా.. సమంత కీలక పాత్రలో కనిపించనుందన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే హీరోయిన్ల ఎంపికపై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.